మిధునం పై మధనం

మిధునం పై మధనం

   సాహితీ బంధువులకు నమస్సులు .తెలుగు కదానికలలో మణి పూస అని పించుకొన్న శ్రీ శ్రీ రమణ కధ ”మిధునం ”అని అందరు ఏకీ భావిస్తారు .ఆ కధ చలన చిత్రం గా రూపు దాల్చింది .ప్రయోగాలకు నిలయమైన భరణి దర్శకత్వం వహించి  ,నిర్మాత సాహసం తొ పెట్టు బడి పెట్టిన డబ్బు తొ  తీసిన సినిమా ఇది .పత్రికలలో మంచి ప్రకటనల తొ ”మన అమ్మా నాన్నల కధ ” అన్నటాగ్ తొ వచ్చింది .నాకు శ్రీ మధు సూదన రావు గారు A.B.N ఆంద్ర జ్యోతి వారి ఇంటర్వ్యు ను పంపారు (క్రింద లింక్ క్లిక్ చెయ్యండి )   .చూశాను .దానిలో ప్రేక్షకులు సినిమా చూసి కన్నీరు కారుస్తూ బయటికి వచ్చారు అని బాలు అంటే ,”దర్శకుడి నైన నేను నిర్మాత కూడా కన్నీళ్ళ తొ నేబయటికివచ్చాం ”అని ముక్తా ఇంపు నిచ్చాడు భరణి .అంటే సినిమా నిర్మాతకు నష్టాన్ని దర్శకుడికి నిరాశను మిగిల్చింది అని తెలిసింది .ఇరవై మంది మిత్రుల తొ తాము సినిమా ని చూశామని కధ చదివిన వారికి నిరాశే కలిగిసిన్చిందని ,చదవ కుండా చూసిన వారికి నచ్చ వచ్చు అని అన్నారుమధు సూదన రావు గారు . .కధలో చాలా మార్పులు చేశారని దానితో చాలా నిరుత్సాహ పడ్డామని రాశారు .అంతే కాక ”two long hours ”అనే మాట ను వారు వాడారు .అంటే కొంత బోర్ కొట్టిందని తెలుస్తోంది .నేను ఇవాళ ఆంద్ర జ్యోతి చానెల్ లో ఇంటర్ వ్యూ చూశా నని ముందే చెప్పాను కదా.అందులో కొన్ని సీన్లు చూపించారు .దాన్ని బట్టి నాకు అర్ధం అయింది ఏమి టంటే అందులో మిధునం గా ఉన్న బాలు ,లక్ష్మి ల ను చూస్తె బాలు కంటే లక్ష్మి ఆ పాత్రకు మాత్రం వెయ్యి రెట్ల న్యాయం చేసిందని పించింది .అచ్చ తెలుగు వృద్ధ మహిళ అని పించింది జేజేలు కొట్టిన్చుకోనేట్లు ఉందని పించింది .కాని బాలు మాత్రం ”తమిళ ముసలాయన” అని పించాడని అనుకొన్నాను .కళ్ళల్లో భావాలు బాగా అతి అని పించించాయి . .ఆ పాత్ర కు న్యాయం లేశమైనా చేశాడా అని అనిపించింది .ఇవి కొన్ని సీన్లుమాత్రమె  చూస్తె కలిగిన భావన.జేసు దాసు పాటలు చాలా అర్ధ వంతం గా ఉన్నాయని తోచింది పాడే విధానం, రచనా కూడా .భరణి విషయం లో అసలు సందేహించాల్సిన అవసరం ఉండదు .ఎందుకంటె అతను గొప్ప వ్యూహం తో ఎఫెక్ట్ ను దృష్టిలో పెట్టు కొని తీసే చాలెంజి దర్శకుడు .శ్రీ రమణ కధకు భరణి చాలా సరైన దర్శకుడు అని అభి ప్రాయం .ముసలాయన పాత్రకు” మిశ్రో ”అయితే అద్భుతం గా ఉండేదని నా భావన . సాత్వికత జీవం పోసుకో వాల్సిన పాత్ర .మాట మెత్తన చూపు గొప్పదనం ఉండాలి .అవి లేవేమో నని నేను అనుకొంటున్నాను .మా ఉయ్యూరు దియేటర్ కు ఆ సినిమా వచ్చి ఆడే అవకాశాలు ఉన్నాయో లేవో తెలీదు కనుక ఇప్పటికే ఆ మిధునం చూసిన వారు ఇదే వేదిక గా స్పందించండి ..తెలుగు సభల లో చలన చిత్రాల ప్రదర్శన  మిధునం సినిమా తో ప్రారంభం అవుతోందని భరణి చెప్పాడు .చాలా ఆనందించ దగిన ,అభి నందించ దగిన విషయం . .తెలుగు వారు గర్వించ దగిన విషయం కూడా .కనుక సాహితీ బంధువులు ”మిధునం పై మధనం ”లో మీ పాత్రను నిర్వహించి మరింత వెలుగు ను మిధునం పై ప్రసరింప జేయ వలసినది గా ప్రార్ధన .
                         మీ –గబ్బిట  దుర్గా ప్రసాద్ –22-12-12-ఉయ్యూరు
From: Madhusudana Rao Devineni <mdevineni@gmail.com>
Date: Sat, Dec 22, 2012 at 6:43 AM
Subject: SP Balu & Thanikella Bharani On MidhunamThanks Ramakoteswara Rao Garu for Forwarding ABN interview with SP Balu and Tanikella Bharani.Last night we went to Movie with 20 people together, all are in their 60s and above. Dr Chowdary  and his wife Aruna was also there with us.  Most of the audiences are senior citizens and they all enjoyed like all young like the first day movie of their favorite young Hero.  It is great experience.

Though lot of changes are made from the original story, which you might have read, but main theme of the movie about the relations of the couple is maintained. If we compare with original story, we get disappointed. People seeing this Movie without reading the original story they may lime it. Though it is two long hours, it is all fun and emotional.

I hope you will have the opportunity of seeing this movie in Chicago.

Kind Regards

Madhusudana Rao

Sent from my iPad

On Dec 22, 2012, at 3:49 AM, Ramakoteswara Rao Katragadda <ramkraok@hotmail.com> wrote:

http://www.youtube.com/watch?list=UU_2irx_BQR7RsBKmUV9fePQ&feature=endscreen&v=IpsPHP5MxfU&NR=1

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

4 Responses to మిధునం పై మధనం

 1. vanajavanamali says:

  ధన్యవాదములు. చిత్రం ని తప్పకుండా చూస్తాను. చూసేటప్పుడు,చూసిన తర్వాత మీ సమీక్ష ని దృష్టిలో ఉంచుకుని మరింత అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.

 2. Narasimha rao says:

  మిధునం చూసాను చాల బాగుంది .ప్రతి ఫ్రేమ్ లో ను భరణి కనిపించాడు .
  బాలు ని అంత గడ్డం పెంచి మేకప్ లేకుండా చూపించాల్సిన అవసరం లేదు.
  లక్ష్మి కి చెయ్యాల్సిన మేకప్ కంటే ఎక్కువే చేసారు.
  వీణాపాణి సంగీతం అత్బుతః .
  జొన్నవిత్తుల కాఫీ దండకం బావుంది. ఆయనే పాడడం చండాలంగా ఉంది ఇంకెవరు పాడిన బాగుండేదేమో.
  మీరు చూడండి మీకు తెలిసిన అందరిని చూడమనండి భరణి + నిర్మాత కు కోటి కోటి కృతఙ్ఞతలు.
  22 ఏళ్ళ తరువాత మా అమ్మ (74) ను సినిమా కు తీసుకెళ్ళాను . నాకు చాల తృప్తిగా ఉంది.

  నరసింహారావు
  9346774294

  • gdurgaprasad says:

   ”మిధునం పై మధనం ”లో శ్రీ నరసింహా రావు గారు మంచి విషయాలే చెప్పారు .అందులో కాఫీ దండకం బాగుందని అయితే పాడిన తీరే చండాలం అని అన్నారు .ఇక్కడ నాకొక విషయం జ్ఞాపకానికి వచ్చి ,మీకు తెలియ జేస్తున్నాను .దాదాపు పది, పది హేనేల్ల క్రితం జొన్న విత్తుల వారు ఆంద్ర ప్రభ సాహితీ గవాక్షం లో కాఫీ దండకం తో ప్రారంభించి డబ్బు మీదా మిగిలిన చాలా విషయాలపై దండకాలు రాసి దండ గా గుచ్చారు .బెజవాడ లో యే సాహిత్య సభ ,రేడియో కవి సమ్మేలనమైనా ,ఏదో ఒక దండకాన్ని పాడే వారు .అక్కడి సభలకు నేనూ వెళ్ళుతూ ఉండటం ఆయన మా ఉయ్యురుకు రెండు కిలో మీటర్ల దూరం లో ఉన్న శాయపురం అగ్రహారానికి చెందినా వారు అవటం తో పరిచయం బానే ఉండేది .ఆయన పక్క సీటు నాకు ఇచ్చి కూర్చోమనే వారు .ఈ దండకాలు చదివి ,చదివి ,విని ,విని ,ఒక సారి ఆయనతో ”అయ్యా ఇక దండకాలకు స్వస్తి పలకండి .మీ లో గొప్ప కవితా దారా, శక్తీ ఉన్నాయి .వాటిని ఇంకో మెట్టు పైన ఉన్న ప్రక్రియ ల మీద కేంద్రీక రించి సాహిత్య సృష్టి చేయండి .ఇక దండగ మారి దండకాల జోలికి పోకండి .ఇప్పటికి రాసింది చాలు ”అని చెప్పాను .ముసి ముసి నవ్వులు నవ్వుతు సరే అన్నారు .బహుశా ఆనాటి నుండి దండకాల పైకి దండ యాత్ర చేయటం తగ్గించారని పించింది .కనుక మిధునం సినిమా లో ని కాఫీ దండకం కొత్తది కాదు బాగా పాతదే అని చెప్పటమే నాఉద్దేశ్యం . .పాడటం అన్నారా -అది దర్శకుడు ,సంగీత కర్త ల బాధ్యత .ఎందుకు అలా చేశారో తెలీదు .మొహమాటానికి పోతే ఏదో అయిన్దన్నట్లుంది నరసింహా రావు గారు చెప్పింది .ఆయన గొంతు మంచిదే .కాని సినిమాకు పనికి రావాలి కదా .అలా మోల్ద్ చేయ లేకపోవటం లో అందరి తప్పు ఉండి ఉంటుందని నేను అనుకొంటున్నాను .నేనింకా ఆ సినిమా చూడలేదు -సాహితీ బంధువులు మంచి అవగాహన తో స్పందిస్తున్నందుకు ధన్య వాదాలు .మరింత వెలుగును మిధునం పై కుమ్మరించండి –దుర్గా ప్రసాద్

 3. గోపి says:

  కేవలం రెండే పాత్రలతో ఇంత మంచి సినిమా తియ్యటం అద్భుతం

Leave a Reply to gdurgaprasad Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.