శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని– 2
దౌహిత్రుని తాపత్రయం
సంజీవ రాయ కవి కవి కధకులు రితైరేడ్ రేడియో ఇంజినీర్ స్వర్గీయ శ్రీ గంధం వేంకాస్వామి శర్మగారి మాతా మహా స్తానం లోనీ వారు .ఆరు తరాల ముందటి వారు .సాధారణం గా దౌహిత్రుడు తాత గారి ఆస్తి కి వారసుడౌతాడు అనేది లోక రీతి .శర్మ గారు ఆరోతరానికి చెందినా వారు కనుక సాహితీ వారసత్వపు హక్కు లభించింది .అది తన తాత ,ముత్తాతల నే కాక ముందు తరాల వారికీ ఋణం తీర్చు కొనే హక్కు ,బాధ్యతగా భావించి తాను పది హేనవ ఏట చూసిన సంజీవ రాయ కృత రుక్మిణీ పరిణయ కావ్యం లోనీ చిత్రాలను సేకరించే ప్రయత్నం లో ఉన్నారు .ఇప్పుడీ కావ్యాన్ని పరి శుద్ధ పరచి తానే‘’ప్రకాశకులు ‘’అయి ,దాన్ని సాహితీ ప్రకాశ మానం చేస్తూ తర తరాలరుణాన్ని సభక్తికం గా తీర్చుకొన్నారు .ఎందరికో ఆదర్శమాను లయారు .ఇలా ప్రచు రించటం లో అమితానందాన్ని పొంది ,ఆ ఆనందపు అను భూతిని సాహితీ ప్రియులకు అందజేసి ధన్యులవుతున్నారు .,ప్రశంశ నీయులయారు .తప్పులు జల్లెడ పట్టి ,అభిప్రాయం రాయమని నన్ను ఆదేశించారు .వారి పై ఆదరాభిమానాలతో ఔదల దాల్చాను .కావ్యం చదువుతూంటే ,చెమ కూర వేంకటకవి ,రామ రాజభూషణ కవి,పోతన కవి ల కవిత్వాలు కలిపి ‘’మిక్సీ పడితే’’ ఎలాంటి కవిత్వం వస్తుందో అలాంటి కవిత్వం ఈ కవి రాశారని అని పించింది .మంచి పండితునితో అర్ధ తాత్పర్యాలను విశేషాలను వ్రాయిస్తే మరీ శోభ తో కావ్యం ప్రకాశిస్తుందని శర్మ గారికి సూచించాను .వారు వెంటనే ‘’మంచి సూచన చేశారు ప్రసాద్ గారూ ,నేను ఆ ప్రయత్నం చేసి మీరు చెప్పింది త్వరలోనే ఆచరణ లోకి తెస్తాను .అర్ధ తాత్పర్యాలు విశేషాల తో మళ్ళీ ఈ పుస్తకాన్ని ముద్రిస్తాను.మీ వ్యాఖ్యానాన్ని అక్షరం వదల కుండా అందులో ముద్రిస్తాను ‘’అని చెప్పారు .ఆ ప్రయత్నం తీవ్రం గా నే చేశారు .రాసే వారు దొరికారని ,పని జరుగుతోందని త్వరలోనే పూర్తీ అవుతుందని కని పించినప్పుడల్లా చెప్పే వారు .అయితే అకస్మాత్తు గా శ్రీ శర్మ గారు ఈ ఏడాది మే నెలలో ఆ పని పూర్తీ కాకుండానే మరణించటం సాహితీ ప్రియులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది .శర్మ గారు సమర్ధులైన కధా రచయిత .గొప్ప సంస్కారి .’’అమృత హస్తాలు‘’,’’నాయనమ్మ కధలు ‘’మొదలైన అద్భుత సంకలాను తెచ్చారు .ఇప్పుడు కావ్య విశిష్టత ను తెలుసు కొందాం
కావ్య విశిష్టత
శ్రీ రుక్మిణీ పరిణయ కావ్యం అనేక ప్రయోగాలకు నిలయం కావ్యానికి కావలసిన సకల హంగులూ ఉన్నాయి .తన ఇష్ట దైవం సంజీవ పర్వతోద్ధారి అయిన శ్రీ ఆంజనేయ స్వామి కలలో కన్పించి ,కొండపల్లి మండలం లో కృష్ణా నదికి ఉత్తరాన గల కోడూరు లో తాను వెలసి ఉన్నానని ,అక్కడ మదన గోపాలుని ఆలయాన్ని నిర్మించి ,స్వామిని ప్రతిష్టించి ,రుక్మిణీ పరిణయ కావ్యం రాసి ధన్యుడైనాడు .జన్మ సార్ధకత చేసుకొన్నాడు .అలానే చిత్తాను వృత్తిగా ప్రవర్తించి ,కావ్యం రాసి సార్ధకత పొందాడు .ఈ కావ్యానికి ‘’మదన గోపాల చరిత్ర ‘’అనే పేరూ వచ్చింది .అయిదు ఆశ్వాసాల కావ్యం ఇది .
శ్రీ మద్భాగవత దశమ స్కంధం లోనీ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని పఠించిన కన్యకలకు వివాహం త్వరలోనే జరుగుతుందని మన దేశం లో నమ్మకం బాగా ఉంది .అలాచేసి సఫలీ కృతు లైన వారెందరో ఉన్నారు .ఆ కధకే కాయ కల్ప చికిత్స చేశారు సంజీవ రాయ కవి .తనకు ముందు తరాల వారైన పోతన ,భట్టు మూర్తి ,చేమకూర వెంకట కవుల బాణిని ,వాణిని స్వంతం చేసుకొన్నాడు .వారు పోయిన ఫక్కీ లన్ని అనుసరించాడు .,అనుక రించాడు కూడా .ముఖ్యం గా కధా వివరణ లో పోతన గారు ఏయే సందర్భాలలో ఎలా పద్యాలు చెప్పి పారాయణ చేయటానికి రాశారో అలానే ఈ కవీ పద్యాలు రాశాడు .అయితే అంత తాదాత్మ్యకత చూపలేక ,కల్పించలేక పోయారు .వర్ణనల విషయం లో యమకాలు ,చమక్కులు ,బంధ కవిత్వాలతో మిగిలిన ఇద్దర్నీ అనుసరించారు .కావ్య స్తితికి కావలసిన మసాలా అంతా దట్టించాడు .
కధ అంతా తెలుగు లోగిళ్ళు లోనే జరిగి నట్లు చేయటం తమాషా గా ఉంది .రుక్మిణి తెలుగింటి ఆడపడుచు లాగ కన్పిస్తుంది .ఆమె తల్లి గర్భవతి అయినప్పుడు జరిగే సీమంతం ,రుక్మిణి బాలసార ,ఆట ,పాట అన్నీ తెలుగు వారు జరుపుకొనే రీతి లోనే చూపారు .కవిత్వం చాలా చక్కగా ,వయ్యారం గా నడుస్తుంది .’’పద్మేశు కధలు –మధు మాధురీ నాద స్తిత కున్మేలై ,కాగిన మీగడ పాలై విన ,గ్రొత్త సేయు ‘’రీతిగా ఉంతాయట. .రుక్మిణి తల్లికి కలలో లక్ష్మీ దేవి కన్పించటం ఆమె అందాన్ని ,లావణ్య దీదితిని చూసి ముచ్చట పడి తనకు కూతురు గా జన్మించమని కోరటం కవి చేసిన భలే కల్పన .ఆ సందర్భం లో‘’పుష్ప వత్సవ మహా రాజ భాగమునకు రాజు వెంచేసే నొక రేయి రాజసమున ‘’అని శ్లేషను ప్రయోగించి సందర్భ శుద్ధి గా చెప్పాడు .ఆమె గర్భవతి గా ఉన్నప్పుడు ,శారీరకం గా వచ్చిన మార్పులను సాంప్రదాయ పద్ధతులలో వర్ణించి చెప్పాడు .రుక్మిణి జన్మించింది ..పీటలపై దంపతులు కూర్చుని ,స్వస్తి పుణ్యః వాచనం చేసి’’ బాలికా మణి దేహ శోభా విభూతి రుక్మ కాంతి (బంగారు కాంతి )విలాసైక రూఢిదగుట వల్ల ‘’రుక్మిణి అని పేరు పెట్టారట .అద్భుతం అని పిస్తుంది .ఆమెను చూడ టానికి వచ్చిన పురజనులు రుక్మిణి తన పిన తల్లి పోలిక అని ఒకరంటే ,తల్లి పోలిక అని ఇంకోరు ,అమ్మమ్మ పోలిక అని వేరొకరు అనటం లో మన తెలుగింటి అమ్మలక్కల తీరు ప్రతి బిమ్బిస్తుంది .చివరకు ‘’అగన్య పుణ్య జన నిశ్శేష భువన పోషణ ,సువత్సతల విభూషిన్మతల్లి యైన బాలికా మణి ‘’అని సాక్షాత్తు లక్ష్మీ దేవి యే ఆమె అని నిర్ధారించింది ఒక పేరంటాలు .రుక్మిణి దిన దిన ప్రవర్ధ మానమవుతూ ఉంది .ఆమెను ఉయ్యాల్లో వేశారు .ముత్తైదువులు ‘’ఉయ్యాలో జంపాలో ‘’అని తెలుగింట్లో లాగా ఉయ్యాలా లూపారు .బాల రుక్మిణి తల్లి పాలు తాగే విధానమూ వర్ణించాడు కవి .మనోహరం గా .’’ఒక చన్నా నుచు ,నొక చన్ను బుడుకుచు ,మార్చి మార్చి ‘’పాలు కుడుస్తోందిట .ఇది అందరు పిల్లలు చేసే విధానమే .బొమ్మ కట్టి మన ముందుంచాడు .బాలిక కు బేసి నెలలో అన్న ప్రాసనా చేయటం మన రివాజు .రుక్మిణికి అయిదవ నెలలో ‘’అయిదవదౌ నెల యందు నైదువల్ ‘’చేశారని వర్ణించాడు .తోటి పిల్లలతో ఆమె ఆటలాడింది .’’జగదుద్ధారర మోహనా కార వర్తి యై ‘’విల సిల్లు తోంది .’’చలువ జాజిగి మించు చలువ వలువలు ధరించింది ‘’రవిక లోపల రవిక తోడిగిందట .అని చమత్కారం గా చెప్పాడు కవి .అంటే ఇప్పుడు స్త్రీలు వేసే ‘’బాడీ ‘’వేసిందన్న మాట ఆనాడే రుక్మిణి .ఇంతకూ రుక్మిణి తండ్రి పాలించిన విష్ణు కుండిన నగరం మన కొండ వీడు దగ్గరే నని చరిత్ర కారులు చెబుతారు .ఆది దృష్టిలో పెట్టుకొని కవి ఇంతటి తెలుగు వాతావరణాన్ని తెలుగింటి శోభను తెచ్చాడని పిస్తుంది .
సశేషం
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –24-12-12-ఉయ్యూరు