హోసూర్ తెలుగుల ఉసురు పోసుకోకండి

 హోసూర్ తెలుగుల ఉసురు పోసుకోకండి

 

తెలుగు సభలు శ్రీనివాసుని పాదాల వద్ద జరుగుతున్న నేపధ్యం లో మన సోదరులై, తమ తెలుగుని రక్షించుకొంటు సంస్కృతిని కాపాడు కొంటూ ,తమని ఎవరూ పట్టించుకోలేదని బాధ పడుతూ, ప్రతి వేదిక పైనా వారి వేదనను వెలి బుచ్చుతూ, తమిళ్ నాడు లో బల వంతం గా చేర్చ బడ్డ తెలుగు వారి ఘోష విని వారికి న్యాయం చేసి ,వారి ఉసురు తగల కుండా చూసుకో వలసిన బాధ్యత నిర్వాహకు లైన ఆంద్ర ప్రభుత్వం మీద ఉంది .ఆ బాధ్యత ను ఈ సభలు సక్రమం గా నిర్వ హించే ఆలోచన చేయక పోతే వారి ని ఓదార్చటం కష్టం .వారికి న్యాయంకల్గించక పోతే తెలుగుకే కాదు తెలుగు ప్రజలకు తెలుగు సంస్కృతికి తీరని అన్యాయం చేసి నట్లే .కనుక సభలు వారికి బాసట గా నిలవాలి .వారికి కావలసిన వన్నీ నెర వేర్చాలి .క్రితం ఏడాది నేను హోసూర్ వెళ్లి అక్కడి తెలుగు భాషోద్యమ నాయకులైన శ్రీ నంద్యాల నారాయణ రెడ్డి ,యెన్.ఏం.కృష్ణప్ప ,డాక్టర్ శ్రీ వసంత్ ,శ్రీ కే.మునిరాజ్ శ్రీ ఆర్ .రఘునాధ రెడ్డి గార్లను కలిసి వారి ఘోష విన్నాను .చలించి పోయాను .వారి పోరాట పటిమకు ధన్యవాదాలు అందించాను .మాత్రు భాష పట్ల వారికి ఉన్న మమకారం అర్ధం చేసుకొని అభి నందించాను .అందులో నారాయణ రెడ్డి గారి పాత్ర గణనీయం ..వారితో రెండు గంటలకు పైగా జరిపిన సంభాషణ లో మీ అందరికోసం కొన్ని విషయాలన్దిస్తున్నాను .

  .  1970 వరకు సేలం వరకు తెలుగు బోధనా ఉండేది .డి.ఏం.కే.అది కారానికి వచ్చిన తర్వాత తమిళాన్ని నెత్తిన రుద్దాడు కరుణానిధి ముఖ్య మంత్రి .తమిళ భాష దెబ్బతింటుందని హిందీ వ్యతి రేకోద్యమాన్ని నిర్వహించిన ఆ పార్టి తెలుగును కాల రాచటానికి చెయ్యని ప్రయత్నం లేదు .’’తెలుగు ఒళిగ’’అంటే ‘’క్విట్ తెలుగు ‘’ఉద్యమం చేపట్టింది ఆపార్టీ.తెలుగు స్కూళ్ళు అప్పటి వరకు వందకు పైగా ఉండేవి .జనాభా ఒక లక్ష .జనాభాలో తెలుగు వారి శాతం 60%ఉండేది .ఇప్పటికి అంతే కాని విద్యాలయాలు తీసేశారు .హోసూర్ కర్నాటకకు సరి హద్దు కు ఎనిమిది కిలోమీటర్లలో  ఉంది .అయితే తమిళ నాడులో ఉన్నది .పూర్వం దీన్ని ‘’హసవూర్ ‘’అనే వారు .హోయసల రాజుల కాలం లో ఉన్న నగరం .1956 లో సర్వే  చేసిన పటాస్కర్  కమిటీ ఇచ్చ్చిన నివేదిక ప్రకారం హోసూర్ వాళ్ళ ఇష్టప్రకారం యే రాష్ట్రం లో నైనా చేర వచ్చు అన్నాడు . .తెలుగు రాష్ట్రం సాధించే టప్పుడు అందరు హోసూర్ ను మర్చి పోయారు ..వారి ఘోష విని పించుకో కుండా నిర్ణయాలు తీసుకొన్నారు .

         తమిళం ముందు చాప కింద నీరు లా చేరిపోయింది .ఇక్కడ తెలుగు సంఘం యాభై ఏళ్ళ పై నుంచే పని చేస్తోంది .తన భావాలను విష్పస్తం గా చెబుతూనే ఉంది .తెలుగు వాడే అయిన కోదండ రామయ్య గారు ఏం .ఎల్.సి.గా ఉండి పోరాటం చేశారు తమిళ నాడు లో తెలుగు భాషోద్యమాన్ని నిర్వహించారు .’’జై తెలుగు తల్లి ‘’నినాదం తో దేశం అంతా దద్దరిల్ల జేశారు .ఇక్కడి‘’మిత్ర బృందం ‘’బోస్ బజార లో మొదటి సారిగా ఉద్యమాన్ని చే బట్టింది .ఘంటసాల మిత్ర బృందం ఉగాది వేడుకలు ఘంటసాల పాటలు నిర్వహిస్తారు ..’’నడుస్తున్న చరిత్ర ‘’సంపాదకులు శ్రీ సామల రమేష్ బాబు వీరికి గొప్ప ప్రేరణ .వీరితో కలిసి పని చేస్తూ ప్రోత్సహిస్తున్న వారు ప్రముఖ కధకులు ,సామాజిక కార్య కర్త శ్రీ సా.వేం.రమేష్ అంటే వీరందరి దైవ సమానం .స్వర్గీయ కైవారం తాతయ్య ఆధ్యాత్మిక ఆశ్రమం ఎంతో ప్రోత్సహిస్తుంది తాతయ్య గారి ని ,వారి సేవలను నిత్యం వీరు స్మరిస్తారు . తాతయ్య గారు‘’దూషించు వారి –నయ భాషించి ప్రేమతో భూషించవ మనసా ‘’అని ఉద్బోధించే వారు . .

        కృష్ణ గిరి జిల్లా తెలుగు రచయితల సంఘం 2001లో ఏర్పడింది .ప్రతి నెల మొదటి ఆది వారంకోదండ రామయ్య ఆంద్ర సాంస్కృతిక సంఘం భవనం లో  సమావేశమైకవితలు రచనలు చదివి విని పిస్తారు నెలలో మిగిలిన వారాలలో సభ్యులు ప్రాంతాలన్నీ తిరిగి సమస్యలను తెలుసు కొంటారు .తెలుగు బడుల్లో విద్యార్ధులను చేరుస్తున్నారు .మూడేళ్ళు గా కొంత అభి వృద్ధి సాధించారు తమిళ బడులు తెలుగు బడులు గా మారుస్తున్నారు .ప్రతి ఫిబ్రవరి ఇరవై  ఒక్కటి రోజున ‘’మాత్రు భాషా దినోత్సవం ‘’నిర్వహిస్తున్నారు .మే నెలలో గిడుగు జయంతిని ,ఉగాది కవి సమ్మేళనాలను నిర్వహించి కవితలను పుస్తక రూపం లో తెస్తున్నారు .బ్రౌన్ ,వేమన జయన్తులను జరుపుతారు . 2004 లో ‘’తెలుగు వాణి ‘’స్తాపించి తెలుగు బోధనా పై శ్రద్ధ చూపుతున్నారు . .’’తల్లి భాష ‘’మాస పత్రిక ఏర్పరచి మంచి సాహితీ సేవ చేస్తున్నారు . రాయ వెల్లూర్ నుండి తెలుగు నేర్చుకోవటానికి హోసూర్ వస్తున్నారు .అజంతా వాచకం తయారు చేసుకొన్నారు కుప్పం వర్సిటి లో రిసోర్సు పెర్సన్ లకు శిక్షణ నిప్పిస్తున్నారు .శిక్షణ నిచ్చిన వారిలో శ్రీ పరిమి రామ నరసింహం గారు గొప్ప కృషి చేస్తున్నారు నూట ఇరవై గ్రామాల నుండి గ్రామానికి సుమారు యాభై మంది దాకా వచ్చి నేర్చుకొన్నారు .స్రీలు కూడా చాలా ఉత్సాహం గా పాల్గొనటం విశేషం .

       ఆ ప్రేరణ తో తమిళ విద్యార్ధులు కూడా తెలుగు లో కవిత్వాలు రాశారు .హోసూర్ లో ‘’పల్లె కళల పరస (పండుగ )2007లో రెండు రోజులు నిర్వహించారు .శ్రీ ఆర్ వి .ఎస్ సుందరం ,శ్రీమతి నాయని కృష్ణ కుమారి ,దేవ పుత్రా మొదలగు హేమా హేమీలందరూ వచ్చారు .తెలుగు కధలపై ‘’వర్క్ షాప్ ‘’నిర్వ హించారు .సా.వేం .రమేష్ ఆధ్వర్యం లో ‘’తిరుచి ‘’లో 2008 లో అయిదు రాష్ట్రాల ‘’పల్లె కళల పరస ‘’నిర్వహించి గొప్ప ప్రేరణ కల్పించారు .అక్కడ ఉన్న పద్నాలుగు తెలుగు జాతుల వారిని ఏకం చేశారు .తిరుచి లో అందరు దాదాపు రెడ్లె వాసవీ మహల్ లో తిరుచి కోట ఆకారం లో వేదిక ఏర్పరచి అక్కడ సభు నిర్వహించారు .కేంద్ర ,రాష్ట్ర మంత్రులంతా హాజరయ్యారు .’’దక్షిణ భారత పల్లె కళల పండుగ ‘’అనే బాన్నర్ కట్టుకొన్నారు ‘’మా తెలుగు తల్లికి ‘’పాటతో సభలు ప్రారంభించారు .వచ్చిన అతిధులు అంతా తెలుగు అభి వృద్ధికి హామీ లిచ్చారు .అక్కడ అందరు తెలుగు వారే తర్వాత తమిలులయారు .ఇప్పుడు హోసూర్ ఏం .ఎల్.యే.శ్రీ గోపీనాద్ తెలుగు వాడే మంచి తెలుగు మాట్లాడుతాడు .కూచి పూడి నాట్యం చూసి అంతా అప్రతిభులైనారు .’’తెలుగు ఇంత మధురమా ,తెలుగుకు ఇంత ప్రమాదం వచ్చిందా ‘’అని అందరు ఆశ్చర్య పోయారు .నాలుగు వందల మంది కలా కారులు రెండు రోజులు నిర్వహంచిన వివిధ కార్యక్రమాలను అందరి మనస్సుల్ని ఆకర్షించాయి .తల్లి భాష తెలుగు పట్ల అందరికి పూజ్య భావం ఏర్పడింది .ఇదంతా రమేష్ గారి చలువే అంటారు వీరు .ఈ స్పూర్తితో ప్రతి జిల్లా వారు తామూ ఇలా నిర్వహిస్తామని ముందుకొచ్చి నిర్వహిస్తున్నారు

                 కరుణా నిది అది కారానికి వచ్చిన తర్వాతా తెలుగు వారిని తమిళులు గా’’ జన గణన ‘’లో మార్చి రాసి ద్రోహం చేస్తున్నారు ..తెలుగు అనేది ఇక నుంచి విని పించ రాదనీ కరుణానిధి కూతురు కని మొలి చెప్పి,తండ్రికంటే నాలుగాకులేక్కువే చదివానని పించింది .దీనితో నిరసన పెరిగింది .ఆందోళనలు ఉద్యమాలు చేశారు .మద్రాస్ నగర వీధుల్లో తెలుగు వాణిని వినిపించారు .ఒత్తిడి పెరిగి కరుణ నిర్బంధ తమిళ చట్టాన్ని రద్దు చేసుకొన్నాడు .అసలు ‘’ఎంగుం తమిళం ఎడియం తమిళం‘’అంటే ఎక్కడైనా, ఎందులో నైనా తమిళం అనేది కరుణ నినాదం కాని వెనక్కి తగ్గాడు .ఓటర్ల లిస్టు లో తెలుగు పేర్లుంటాయి ఊరి పేర్లు మాత్రం తమిళం లో ఉంటాయి .ఆ నాటి ముఖ్య మంత్రులు ఎడ్యూరప్ప ,అచ్యుతా నందన్,రోశయ్య  కరుణ ను బానే హెచ్చ రించారు .బెంగళూర్ లో వేలాది మంది నిరసన స్వరం అట్టిగా విని పించారు .తెలుగు కన్నడ సంఘాలుకలిసి కట్టు గా పని చేసి జన జాగృతి చేశాఇ . .ఈ బాధ భరించలేక ఎన్నికల ముందు నిది గారు విధి గా తమిళం నేర్చుకోవాలి అన్న పట్టుదల సవరించుకొని ‘’ఎవరి భాష వాళ్ళు నేర్చుకో వచ్చు’’అని ప్రకటింఛి ఉత్తర్వు ను ఇచ్చాడు .అప్పటికే ఆలస్యం జరిగి తెలుగు వారంతా కరుణా నిది పార్టీకి వ్యతి రేకం గా ఓటేసి మట్టి కరిపించి జయ లలితకు పట్టం కట్టారు .ఇప్పటికీ తెలుగు అంటే ఈ ప్రాంతం లోనీ వారికి ప్రాణం .దాన్ని నిల బెట్టుకోవా టానికి యే త్యాగానికైనా సిద్ధమే .దేనికీ భయ పడే తత్త్వం లేని నిజాయితీ పరులు .మన రాష్ట్ర ప్రభుత్వం వీరికి ఆసరా గా నిలబాది తమిళ నాడు ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపి న్యాయం చే కూర్చాలి ఇప్పటికీ ఈప్రాంత గ్రామాల్లో తమిళం మాట్లాడితే ‘’దిగువ సీమ వాళ్ళు వచ్చారు ‘’ అని ఈసడించుకొంటారు .దిగువ  జాతుల వారే తమిళం మాట్లాడే వారట ..

 ఇదీ హోసూర్ ముఖ చిత్రం .కనుక వారికి అన్ని కోణాల్లోనూ న్యాయం జరిపించాల్సిన బాధ్యత తెలుగు సభలు జరిపే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మీద ప్రముఖం గా ఉంది .తెలుగు ప్రజల మీదా ఉన్నాడని మర్చి పోరాదు అని గుర్తు చేయటానికే ఇదంతా రాశాను .వారి ఘోష మనకు ఉసురు కాకూడదు ..వారి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు .మన వెన్ను దన్ను కూడా అవసరం .ఇప్పటి దాకా తాత్సారం చేసిన ప్రభుత్వం ఇక అలానే ఉపేక్ష  గా ఉంటె తెలుగు వారు సహించరు అనేది గమనించాలి .హోసూర్ తెలుగు సోదర సోదరీ మణులకు మనం అందరం అండ గా నిలవాలి .జై తెలుగు జై జై తెలుగు తల్లి .

                నాల్గవ తెలుగు ప్రపంచ సభల సందర్భం గా అందరికి శుభా కాంక్షలు

         మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26-12-12- ఉయ్యూరు

    

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.