ఊసుల్లో ఉయ్యూరు -46 మా పద్మావతక్క (త్త )య్య

 ఊసుల్లో ఉయ్యూరు -46

          మా పద్మావతక్క (త్త )య్య

  పద్మావతక్కయ్య అంటే నాకు సాక్షాత్తు అత్త గారే .అంటే మా ఆవిడ ప్రభావతికి తల్లి ..అంతే కాదు మా అమ్మ భవానమ్మ గారికి చెల్లెలి కూతురు .అంటే మా శ్రీ మతి మా అమ్మకు స్వయానా చెల్లెలయిన వెంకాయమ్మ  గారి మనుమ రాలన్న మాట .తండ్రి పేరు వెంకటప్పయ్య గారు ఎలిమెంటరి స్కూల్ మేస్టారు అక్కయ్య మూడేళ్ళ వయసు లో లోనే తల్లిని కోల్పోయిన దురదృష్ట వంతురాలు .ఆవిడను తమ్ముడు పూర్ణా నందం లను పిన తండ్రి సదా శివ మూర్తి దంపతులే పెంచి పెద్ద వాళ్ళను చేశారు .సదాశివ మూర్తి గారు కృష్ణా జిల్లా బోర్డు హైస్కూల్ హెడ్ మాస్టర్ ..వేళ్ళ మీద లెక్కింప దగ్గ గొప్ప హెడ్ మాస్తార్లలో ఒకరు .అక్కయ్యా వాళ్ళదిఏలూర్ దగ్గర వేల్పు చర్ల గ్రామం .కృష్ణా జిల్లానే .అయితే మా బావ తూటు పల్లి ప్రకాశ శాస్త్రిగారు  ప్లీడర్ గుమాస్తాగా బెజవాడ లో చాలా కాలం పని చేశాడు .ఆయన పొట్టిగా ఎర్రగా ఉంటె అక్కయ్య నల్లగా నక్కకు నాగలోకానికి అన్నట్లు  కొంచెం పొడుగ్గానే ఉండేది .వెడల్పు

చేతి లో ప్రబావతి తో మా పద్మవతక్కయ్య

చేతి లో ప్రబావతి తో మా పద్మవతక్కయ్య

నవ్వు ముఖం .పెద్ద బొట్టు తో లక్ష్మీ దేవిలా ఉండేది .పూర్వతరం వాళ్ళు కట్టినట్లు చీర ను కాశా  పోశి గా  కట్టేది .మా బావ ముఖం ఇంట్లో మాడు ముఖం బైట చిద్విలాసం .అయితే బంధువులతో బాగా ఉండే వాడు .ప్లీడర్ గుమాస్తాగా బానే సంపాదించే వాడట..అయితే ప్లీడర్ కే లా పాయింట్లు తెలిపే నేర్పున్న వాడు .అందుకని యే ప్లీడర్ దగ్గరా ఎక్కువ కాలం పని చెయ్య లేక పోయాడని అంటారు లీగల్ బుర్ర ఆయనది .లా సూక్ష్మాలన్ని కొట్టిన పిండే .ఎప్పుడూ ఏదో కేసు వేస్తూ గెలుస్తూ  కోర్టు గుమ్మాలలోనే తరచు దర్శనం ఇస్తుండేవాడు . హైకోర్టు సుప్రీం కోర్టు లలో కేసులు కూడా గెలిచే వాడు ప్రభుత్వం పై కేసులు వేసి హక్కులు సంపాదించిన బుర్ర అది .  .బెజ వాడ లో ఉన్న కారణం గా మేము వాల్ల ఇంటికే వెళ్ళే వాళ్ళం .మా అక్కయ్య మమ్మల్ని సినిమాలకు తీసుకొని వెళ్ళేది అవి దాదాపు రాత్రి రెండో ఆటలే ..మైరావణ చంద్ర లేఖ సినిమాలు అక్కడ  చూసి నట్లు నాకు జ్ఞాపకం .అప్పుడు మా ఆవిడ తో పరిచయం లేదు .వాళ్లకు అయిదుగురు ఆడ సంతానం .మా ఆవిడా మూడో ఆడ పిల్ల .చివరికి మగ సంతానం వంశోద్దారకుడు బ్రహ్మా నంద శాస్త్రి అనే ఆనంద్ పుట్టాడు .అందుకని అక్కలకు వాడంటే వల్ల మాలిన అభిమానం .వాడికీ అక్క లంటే వీరాభి మానం .

                padmavathamma gaaru with koothuru prabhaavathi and othersనాకు మా మేన మామ గుండు గంగాధర శాస్త్రి గారు తన కూతురుదుర్గ ను ఇచ్చి పెళ్ళి చేయాలను కొన్నాడు .  కాని ఆ అమ్మాయి చిన్న తనం లోనే తేలు కుట్టి చని పోయింది . తర్వాత ఆ అమ్మాయి చెల్లెలు లక్ష్మీ నరుసు అనే  ‘’పాపి ‘’నిచ్చి చేయాలను కొన్నాడు మామయ్యా ..ఆయన ఏమి చెప్పితే అదే చేయటానికి నేను అప్పుడు సిద్ధం .కాని ఈ అమ్మాయికి తీవ్ర అనారోగ్యం కలిగింది .ఎంతో వైద్య సహాయం ఇచ్చినా కోలుకో లేదు .మామయ్యకు నేనంటే ప్రాణం .అలాంటి జబ్బు పిల్లను నాకు అంట కట్టటం న్యాయం కాదని ఆయనే భావించాడు .నేను  ఆయన వాళ్ళమ్మాయిని చేసుకో మని అంటే చేసుకోవటానికి సిద్ధమే కారణం మామయ్యా మా కుటుంబానికి చేసిన ,చేస్తున్న సహాయం మద్దతు .కాని ఆయనే ఆ పని చేయ లేక మా అమ్మతో చెప్పేశాడు ‘’అక్కయ్యా !నా పిల్లను ఈ పరిస్తితుల్లో దుర్గా పతికి ఇవ్వటం నాకే మాత్రం ఇష్టం లేదు చూస్తూ చూస్తూ వాడి గొంత కోయ లేను .మీరు వేరే ఏదైనా ప్రయత్నాలు చేసుకోండి ‘’అన్నాడు .అమ్మ అవాక్కే అయింది  ‘’ఒరె గంగయ్యా !ఇందులో నేను చేయ గలిగిందేమీ లేదు .మీ బావ పోయి రెండేల్లవుతోంది నువ్వే మంచి సంబంధం వెతికి నీ చేతి మీ దే పెళ్ళి జరిపించు వాడికి ‘’అంది .పాపం ఇంత బాధ లోను మామయ్యతన కర్తవ్యాన్ని వదల్లేదు .ఆలోచనలో పడ్డాడు ఎప్పుడో ఒక సారి మా పద్మా వతక్కయ్య ‘’మామయ్యా !మా ప్రభావతికి ఏదైనా మంచి సంబంధం ఉంటె చూడు ‘’అని చెప్పిందిట .ఇంకేం ఎవరో ఎందుకు దాన్నే ఇచ్చి చేస్తే బాగుంటుందని మా అమ్మకు చెప్పాడు .మా అమ్మ నన్ను అడిగింది మీ ఇష్టం అన్నాను .సరే ఆయనే మంచి రోజు చూసి నన్ను ,మా బావ వివే కా నందం గారిని  వేల్పు చర్ల తీసుకొని వెళ్లాడు పెళ్ళి చూపులకు .అప్పుడు మా ప్రకాశశాస్త్రి గారు జంప్ జిలానీ .ఎక్కడికో వెళ్లాడు .ఆ ఊరు దారి ఎవరికీ సరిగ్గా తెలీదు .కొప్పాక దిగి లెఫ్ట్ ,రైట్ కొట్టు కొంటూ యెర్ర మట్టిలో కొండలు దాటుతూ చేరుకున్నాం .మా వివేకానందం బావ సణుగుతూనే ఉన్నాడు .సరే ఇంటికి చేరాం .వాళ్ళ నాన్నను వెతుక్కు రమ్మని మా కా బోయే మరదలు దుర్గ  ని పంపారు .ఆ అమ్మాయి వెతికి ఆయన్ను పట్టుకొని వచ్చింది .ఆ నాడు కమ్యూనికేషన్ సౌకర్యం లేదు ఫోన్లు లేవు .ఉత్తరం రాస్తే అందిందో లేదో ?/సరే ఏదో టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చారు .పెళ్ళి చూపులు జరిగాయి .అదే నేను ప్రభావతిని చూడటం .అంతకు ముందు చూసి ఉన్నా నాకు జ్ఞాపకం ఏమీ లేదు .ఏదో పాట పాడింది .పాటా అమ్మాయి రెండు బానే ఉన్నాయి సరే అభిప్రాయం అడగను లేదు నేను చెప్పనూ లేదు .బావ మాత్రం ‘’గంగయ్యా ! రెండు కుటుంబాలని కలిపే బాధ్యత నీదే ‘’అన్నట్లు జ్ఞాపకం .

           రాత్రికి ముగ్గురం ఉయ్యూరు వచ్చాం .మా అమ్మకు ఏమి చెప్పాడో మామయ్యా .నా అభి ప్రాయం అడిగింది నాకు నచ్చింది అని చెప్పాను .మామయ్యే కధ నడి పించాడు .జాతకాలు చూశాడు బాగా కుదిరాయి అన్నాడు .శాస్త్రి గారి తో మాట్లాడి ఖాయం చేశాడు .అప్పుడు మా దగ్గరా డబ్బు పెద్ద గాలేదు వాల్ల పరిస్తితి అంతే .మామయ్యే అన్నీ ఇద్దరికీ .నేను అప్పటికే బి ఇ.డి.ట్రైనింగ్ పూర్తీ చేసి మోపిదేవి జిల్లా పరిషత్హైస్కూల్  లో సైన్స్ మేస్టేర్ గా పని చేస్తున్నాను .1964 ఫిబ్రవరి ఇరవై ఒకటి న నాకు ఛి సౌ .ప్రభావతికి వేల్పు చర్ల లో వివాహం అయింది .అప్పటి నుంచి పద్మావతక్కయ్య అత్తయ్య అయింది .అప్పటి దాకా నన్ను  ‘’తమ్ముడూ అనీ లేక దుర్గా పతీ ‘’అని పిలిచే ఆవిడ ‘’దుర్గా ప్రసాదూ ‘’అనటం మొదలు పెట్టింది .నేనూ ‘’అక్కయ్యా అక్కయ్యా ‘’అని వెంట పడి తిరుగుతూ మాట్లాడే వాడిని ఈ కొత్త  బంధుత్వం తోకొంచెం ఇబ్బంది పడి అంత చనువు గా ఉండ లేక పోయాను .ఎందుకో ఏమో నేను ఆలోచిస్తుంటే నాకే ఆశ్చర్యం వేసేది ఇప్పటికి .

             309644_147175352039622_4518353_n   మా ‘’అక్కయ్యత్త్తయ్య ‘’నన్ను చాలా మర్యాద గా చూసేది .యే లోటు రాకుండా చూసేది .అత్త గారి మర్యాదలేకీమీ లోపం లేదు అయితే మా మామ గారికి  మాత్రం కొంపా గోడు పట్టేది కాదు అన్నీ ఈవిడే చూసుకోవాల్సి వచ్చింది .ఇప్పటికే ముగ్గురు అల్లుళ్ళు .యే అల్లుడు ఇంటికి వచ్చినా అందరికి మర్యాద లు బానే చేసేది .నన్ను  అంత చొరవగా పలకరించక పోయినా ఆవిడ అంటే లోపల లోపల ఆ ఆప్యాయతా అక్కయ్యదనం మర్చి పోలేదు .ఎందుకు ఏర్పడిందో  ఒక సరి హద్దు ఏర్పడింది నాకు మర్యాద నివ్వటానికి అయి ఉంటుంది . అక్కయ్య మా అమ్మను ‘’అమ్మక్కయ్యా ‘’అని ప్రేమగా పిల్చేది 294047_147175375372953_4992943_nఅమ్మకూడా చెల్లెలి కూతురని చాలా ఆప్యాయం గా ఉండేది .తరచు ఉయ్యూరు వస్తుండే వాళ్ళు పద్మా వతక్కయ్యకు ఒక తమ్ముడు ఉండే వాడు పేరు పూర్ణానందం .వేల్పు చర్ల కు దగ్గర ఎర్రం పల్లి లో ఉండే వాడు పోస్ట్ మాస్టారు కం ఆర్ ఏం .పి .వైద్యం అక్కడ వాళ్ళ నాన్నవెంకటప్పయ్య  వేసిన ఇరవై ఎకరాల మామిడి తోట ఉండేది .అక్కయ్య పద్మావతమ్మ అంటే అభిమానమే .ఆయన అన్నా మాకు అందరికి భలే ఇష్టం. సరదా గా మాట్లాడే వాడు నవ్వుతు ఉండే వాడు .బానే సంపాదించాడు .పూర్ణానందం అన్నయ్యా అంటూ వెంబడి పడే వాళ్ళం .

             300539_147175478706276_6361597_n వాళ్ళ ఇంటి పరిస్తితి ఇక్కడ చెప్పాలి .పచ్చి కట్టెలు తెచ్చి పడేసే వాడు మా మామగారైన బావ గారు .అవి మండేవి కాదు కట్టెల పొయ్యి మీదే వంట ఆ నాడు అందరిల్లల్లోను అదే పరిస్తితి ..అన్నీ యదా విధి గా జరగాల్సిందే .పొయ్యి ఊదలేక ఆవిడ కాళ్ళ నిండా ధూళి పోగతో చూస్తె చాలా బాధ గా ఉండేది .నూతి నీళ్ళే అన్నిటికి గతి నీళ్ళు చాలా లోతుగా ఉండేవి తోడాలంటే రెక్కలు పడి పోయేవి .316955_147175442039613_2195835_nపాపం అన్ని పనులు ఆవిడే చేసుకో వాలి. .కావలసిన సరుకులు తెచ్చే వాడు కాదు ఆయన .వాటికీ ఈవిడే బాధ పడాలి గేదె పాలు పాలు తీసుకోవటం గచ్చుఇల్లు పెంకుల  కప్పు .ఒకే గది .318716_147175465372944_205913_nఎప్పటిదో డెబ్భై ఏళ్ళ నాటి మంచం పరుపు .అల్లుడు వస్తే ఆ గదిలోనే ఒక్క అల్లుడికే చాన్సు మిగతా వాళ్ళు హాల్లోనే . .311862_147178775372613_3936762_n

       321587_147175425372948_7555621_n  మా మామ గారు ముప్ఫై ఏళ్ళ కిందట చని పోయాడు .తెలిసీ తెలియని వయస్సులో తండ్రి కర్మ కాన్దలన్నీ యదా విధి గా నేర వేర్చాడు ..ఆ తండ్రికి కొడుకంటే వల్ల మాలిన ప్రేమ కొడుకు చేతుల్లోనే ఆయన ప్సంత్రుప్తిగా ప్రాణం వదిలాడు అప్పటికి మా బామ్మర్ది ఆనంద్ సుమారు ఇరవై ఏళ్ళు .కొంత పొలం ఉంది మామిడి తోట ఉంది మాగాణి కూడా కొంచెం ఉండేది . .వాడివిషయం లో నాకు బాధ్యత అప్పగించాడని చని పోయే ముందు చెప్పాడని అన్నారు పోయిన తర్వాతే మే ము వెళ్ళాం .మేము వాళ్లకు చేసిన సాయం ఏమీ లేదు .ఇచ్చిన చేయూతా ఏమీ లేదు .ఆనంద్ స్వంతం గా స్వయం సిద్దుడుగా తనను తాను తీర్చి దిద్దు కొన్నాడు .డిగ్రీ చదివి బాంక్ పరీక్షలు రాసి స్టేట్ బాంక్ లో ఉద్యోగం  సంపాదించాడు .పొలం నుజాగ్రత్త చేసుకొన్నాడు .తండ్రి చేసిన అప్పులు తీర్చేశాడు .అప్పటికే అక్కల పెళ్ళిళ్ళు అయి బాధ్యత లేమీ లేవు ..స్పందన అనే ఆడ పిల్ల ,వంశీ అనే కొడుకు .భార్య రుక్మిణి అతని రెండో అక్కయ్య కూతురే .పిల్లలిద్దరికీ బి.టేక్ .చెప్పించాడు పల్లె టూరి లో చదువు కష్టం అని హైదరా బాద్ లో స్థలం కొని డాబా వేసి కుటుంబాన్ని అక్కడికి మార్చాడు .పిల్లల చదువులు నిర్విఘ్నం గా సాగాయి .మా పద్మావతి అక్కయ్య అనారోగ్యానికి గురైంది .ఆమె కోసం ప్రొమోషన్ వదులు కొన్నాడు .ఆవిడ కు సేవ చేశాడు భార్య ,పిల్లలతో చేయించాడు .ఆవిడకూ వీల్లందరంటే విప రీత మైన ప్రేమ .కొడుకు ప్రయోజకుడైనాడని ఆమె ఆనందం .బంధువు లందరికి ఆనంద్ అంటే మహా భి మానం .వాడికి అందరితో బందుత్వాన్ని నిలుపు కోవాలనే ఆరాటం ..వాళ్ళమ్మ మంచం పట్టి లేవ లేక పోతే దగ్గరలో ఉండే బ్రాంచికి బదిలీ చేయించుకొని సేవ చేశాడు .ఆవిడ కూడా వీడి ని అంత గా ఆద రించేది .తిట్టి అయినా చేయించేది .ఆ తిట్టు ప్రేమ తోనే .padmavathamma gaaru with muni manumadu aashtoshజన్మ జన్మా లకు వాడే కొడుకు ,తానే తల్లి అనేది .కూతుల్లందరితో బాగా ఉండేది .ఏ కూతురైనా కొంచెం మితి మీరితేమాటల  చురకలు వేసేది .నేను నా భార్య వీలైనప్పుడల్లా వెళ్లి చూసి వస్తుండేవాళ్ళం .మనవడు వంశీ ఒడుగు చెయ్యమని బల వంతం చేసేది కొడుకుని .అలాగే చేసి ఆవిడ కోరిక తీర్చాడు .ఎంతో సంతోషించింది .అప్పటికి ఆవిడ వయస్సు దాదాపు తొంభై .ఆ వడుగు లోనే ఆమె తొంభై వ జన్మ దినోత్స వాన్ని చేశారు అందరు కలిసి .ఆమె జ్ఞాపక శక్తి అప్పటికీ అమోఘం పాత చరిత్ర 100_4997అంతాపూసగుచ్చి నట్లు చెప్పేది ఎక్కడా లింకు తెగేది కాదు .ఎవరెవరు ఎవరిపిల్లలో వాళ్ళ పేర్లు వాళ్ళ సంతానం అంతా ఆవిడకు గుర్తే .అందర్ని గుర్తు పట్టి మాట్లాడేది ..కదలలేక పోయినా అన్నీ కావాల్సినవి చేయించుకోవటం గొప్ప విషయం .అను క్షణం రామనామం తో గడిపేది .వచ్చిన వారిని నామ జపం చేయ్యమనేది శ్వాస విడిచే దాకా పూర్తీ స్పృహ లోనే ఉంది  .’’నారాయణా నారాయణా ‘’అంటూ నామం జపిస్తూ నే మరణించింది .మా బావ మరది ఆనంద్ ఈ కాలం లో చెప్పుకో దగిన వాడు .ఆ సేవ అనితర సాధ్యం అని పించాడు .ఆమె కర్మ లను అత్యంత శ్రద్ధ గా నిర్వహించాడు .ఏడవ మాసికాన్ని కాశీలో పెట్టి అక్కడే అస్తికలను కలిపి ప్రయాగ లో కూడా పితృ విధి నిర్వ హించాడు .మా ఇద్దరినీ వాళ్ళ కుటుంబం తో పాటు తీసుకొని వెళ్లాడు .

             పద్మావతక్కయ్య రెండేళ్ళ క్రితం మరణించింది .ఆమె మరణం తర్వాత ఆనంద్ కూతురు స్పందన వివాహం కూడా చేసి ఆ పుణ్యాన్నీ వాళ్ళమ్మకు కల్గించాడు ..జీవితం లో ఎంతో కష్టపడ్డ అక్కయ్య చివరికాలం లోకొడుకు కల్పించిన అన్ని సుఖాలుఅనుభవించి చని పోయింది .534108_250430848394195_538046333_nఆవిడను వాడు ‘’పువ్వుల్లో పెట్టి పూజించి నట్లు ‘’సేవ లందించటం ఈతరం కొడుకులకు గొప్ప ఆదర్స్ధం .తల్లి సేవలో ధన్యుడయాడు .ఆ తల్లి వాడి సేవలో సంతృప్తి పొందింది

          సశేషం

         మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29-12-12-ఉయ్యూరు 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.