చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం
శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి
మనిషికి పుట్టగానే డబ్బు సంపాదన యావ ఉండటం సహజం .ధనాన్ని ఎన్ని రకాల వీలైతే అన్ని రకాల సాధించి ,అష్టైశ్వర్యాలతో తుల తూగాలని కాంక్ష ఉంటుంది .దాన్ని సార్ధకం చేసుకోన్న్న వారెందరో మనకు తెలుసు .ఆ డబ్బును కొందరు సంఘ ప్రయోజనాల కోసం ధారాళం గా ఖర్చు ఠా అలాంటి అరుదైన మనిషి -మనీషిగా ఎదిగిన వారు బ్రాహ్మణులు అయిన శ్రీ చిలుకూరు వెంకటేశ్వర్లు .గారు.
శ్రీ చిలుకూరు వెంకటేశ్వర్లు గారు మా ఉయ్యూరు దగ్గర తోట్ల వల్లూరు లో నోరి వారింట జన్మించారు .తర్వాత చిలుకూరు వారికీ దత్తత వెళ్లారు .మద్రాస్ చేరి పెయింట్ వ్యాపారం లో, ,ఫైనాన్స్ లో ,రియల్ ఎస్టేట్ లో పిచ్చగా సంపాదించారు .అరవైఏళ్ళ దాకా ధన యావ తప్ప రెండోది ఆయనకు తెలీదు .అప్పుడు ఆయన జ్ఞాన నేత్రం తెరుచుకోంది..జీవిత గమ్యాన్ని మార్చుకోవాలన్న ఆలోచన కలిగింది .తన డబ్బు ,సంపదా అంతా కొడుకులకు, వారికి దక్క వలసినది అంతా న్యాయం గా పంచేసి , ,తనకు వచ్చిన దానిలో చెన్నై లోని శ్రీరామ కృష్ణా మ ఠంకు చాలా భాగం రాసిచ్చి , ,అక్కడే తపోవనం లో సాధారణ జీవితాన్ని ,ధ్యాన దీక్ష ,సాహిత్య రచన తో గడుపుతూ శ్రీ రామ కృష్ణ పరమ హంస వారి దివ్య బోధా ప్రచారం కోసం పుస్తకాలను రాసి ప్రచురిస్తున్నారు .భాగవతాన్ని వచనం గా సరళ శైలిలో రాశారు .భగవద్గీత ను పదవ తర గతి విద్యార్ధులను దృష్టిలో ఉంచుకొని ,వారికి అర్ధమై,అందే తీరులో శ్రీ పరమ హంస గారు చెప్పిన కధలను జోడిచి ,మనస్సుకు హత్తుకొనే రీతిగా రాసి ,విద్యార్ధులకు రామ కృష్ణ మిషన్ ద్వారా ఉచితం గా అంద జేశారు .తరువాత విద్యా రన్యస్వామి రచించిన శ్రీ శంకర విజయాన్ని అతి సుందర సుస్పష్ట తెలుగు వచనం గా అనువదించి ఇనుప గుగ్గేల్లను తీపి మిఠాయి చేసి అందించి ఏ కొద్ది మంది మాత్రమే బాగా సంస్కృత ప్రావే న్యం ఉన్న వారికి మాత్రమె అర్ధమయ్యే విద్యారణ్య బోధనలను ,జన సామాన్య్లకు చేరువ చేసి సంచలనం సృష్టించారు ., , మంచి పేరూ పొందారు .వాల్మీకి రచించిన శ్రీ మద్రామాయణాన్ని అత్యంత మెలకువ తో సులభ శిలిలోవచనం గా రెండు భాగాలుగా అనువదించి ,మహర్షికి గొప్ప నీరాజనం ఇచ్చారు .ఎప్పుడో డెబ్భై ,ఎనభై ఏళ్ళ క్రితంమహా పండితులు ,మంత్ర ద్రష్ట ,అనేక ఆద్యాత్మిక గ్రంధ రచయిత అయిన స్వర్గీయ జన మంచి శేషాద్రి శర్మ గారు రచించిన ‘’శ్రీ రామావతార తత్త్వం ‘’ను మళ్ళీ ఎవరు పునర్ముద్రించని కారణం గా వెంకటేశ్వర్లు గారు-శ్రీ శర్మ గారి విధానం లోనే ఇంకా సులభ గ్రాహ్యం గాఅనేక విశేషాలతో ,పూర్వా పరాలతో గొప్ప సమన్వయ ద్రుక్పధంత్తో రాసి ఆస్తిక జనానికి మహాద్భాగ్యాన్ని కల్గించారు .మా రెండో కోడలు ఇందిరకు ఆయన తాత గారు .నా అడ్రెస్ వారు సంపాదించి వారు ప్రచురించిన పుస్తకాలన్నీ పోస్ట్ లో పంపారు .అన్నీ చదివి ,వారికి వివరం గా నా అభిప్రాయాలను లేఖ ద్వారా తెలియ జేశాను .అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడే వారు మన సరసభారతి ప్రచురించిన పుస్తకాలన్నీ వారికి పంపాను .చదివి స్పందించేవారు .ఇలా మా సాహిత్య బాంధవ్యం ఏర్పడింది .ఇప్పుడు నేను 7-4-2011 నవారికి రాసిన వారి వచన రామాయణ విశేషాలను మీ అందరికి అంద జేస్తున్నాను .About the Author Sri Venkateswarlu
శ్రీ మద్రామాయణం
వాల్మీకి కృత రామాయణానికి శ్రీ చిలుకూరు వెంక తెశ్వార్లు గారు చేసిన అను వాదం సరళం గా ,సహజం గా ,స్న్దరం గా ,నిసర్గ రమణీయం గా ఉంది .మంచి ముద్రణా ,అందమైన ముఖ చిత్రం తో సర్వాంగ సుందరం గా పుస్తకం హస్త భూషణం గా ఉంది .మొత్తం మీద ఒకే ఒక అచ్చు తప్పు కానీ పించింది అంటే ముద్రణ విషయం లో ఎంత జాగ్రత్త తీసుకొన్నారో అర్ధమవుతుంది ‘’మరి ఎలా రామాయణమ్మన్నచో ‘’అనుకొన్న విశ్వ నాద సత్య నారాయణ గారి మార్గం లోనే వీరూ ఆలోచించారు .ఆయన అనుభవ సారాన్ని ఇమిడ్చి రచించటం హర్షనీయం ,ఆనంద దాయకం .దగ్గర కూర్చో పెట్టుకొని ,ఆప్యాయం గా చక్కగా చిక్కగా కదా చెప్పి విని పించి నట్లు గా,హాయిగా ఉండటం విశేషం ..కధా గమనానికి అవసర మయాన వాటినే గ్రహిస్తూ ,అతిగా ఉండే వర్ణనల జోలికి పోకుండా ,ప్రతి వాక్యం చదవాలి చదివి అందులోని సారాన్ని తెలుసు కోవాలన్న ధ్యేయం తో సాగిన రచన .సాంప్రదాయ రచనగా ,ఆర్ష ధర్మ వ్యాప్తి గా రాశారు .శ్రీ పరమహంస ల అవ్యాజ కరుణా రసం వీరిపై సంపూర్ణం గా ఉంది .అందుకే రచన హృద్యమైంది .ఎక్కడా సందిగ్ధత లేదు .సారళ్యం సర్వదా కానీ పిస్తుంది .మహర్షి వాల్మీకి రామాయణాన్ని హృద్గతం చేసుకొన్నారు కనుక ,ఆ భావ వ్యాప్తి అంత సులభ తార మైంది వెంకటేశ్వర్లు గారికి .మనసారా అందరు అభి నందిన్చాల్సిన ప్రయత్నం .
అగ్ని శర్మ అత్రి మహర్షి ప్రేరణ చేత తపస్సు చేసి ,వాల్మీకి మహర్షిగా అవత రించటం,ఆది కవి అయి ,ఆది కావ్య మైనశ్రీ మద్రామాయణాన్ని రాయటం మనసుకు హత్తుకొనే రీతిలో రాశారు .ఈ నాడు విప్ల వాత్మకం గా భావించే ‘’Fraternity of mankind ,world citizenship,human dignity concern for society ,nationalism ‘’అన్నభావాలను రామాయణం లో అడుగడుగునా దర్శన మిస్తాయని చిలుకూరు వారు తమ ప్రస్తావన లోపెర్కొనటం సముచితం చక్కని ప్రాతి పదిక కూడా.ఈ మొత్తం భావ వ్యాప్తియే రామాయణం.రాముని మార్గమే కాదు సీత మార్గమే కాదు మానవాళి ప్రయాణ మార్గాన్ని సూచించాడు మహర్షి వాల్మీకి కవి .అలాగే రాముడు మానవ మాత్రుడి గానే వ్యవహరించటానికి తన ‘’మాయ ‘’ఏ తనను ఆవహించాలని కోరుకోవటం వల్లనే అన్న విషయం సరిగ్గా సరిపోతాయి .యుద్ధ కాండ చివరలో దేవత లంతా శ్రీ రాముడిని శ్రీ మహా విష్ణువే అని ప్రస్తు తిన్చితే రాముడు మాత్రం తాను దశరధ పుత్రుడినే అనటం ,రామాయణ ఆత్మను ప్రదర్శింప జేయట మే..మానవుడు అనుకొంటే అన్నీ సాధించగలడు అని స్పష్టం గా తెలియ జేయట మే ఈ మాటల్లోని పరమార్ధం.అందుకే ‘’మనుష్యుడిల మాహాను బావుడే ‘’అన్నాడు ఆధునిక కవి .
సశేషం
About the Author Sri Venkateswarlu
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –3-1-13—కాంప్—హైదరాబాద్