ఐరిష్ అస్తిత్వ రచయిత్రి మేరియా ఎడ్జివర్త్
గొప్ప వంశం లో జన్మించి తండ్రి సంస్థానానికి వారసురాలై ఐరిష్ దేశ ఉత్కృష్టతను ,అందులోని లోపాలను తెలియ జేసి బాల సాహిత్యాన్నిసృష్టించి , ,స్త్రీ ల అభ్యున్నతికోసం రచనలు చేసి నవలా సాహిత్యానికి ఊపిరి లూదిన కొద్ది మంది తొలి తరం ఐరిష్ రచయితలలో ఒకరుగా నిల్చి ఇంగ్లాండ్ కు ఐరిష్ దేశం దేనిలోనూ తీసి పోదని నిరూపించి ,ఆ దేశ సాహిత్య సంస్కృతులను పరిపుష్టం చేసి ,రైతు ,బీద జన పక్ష పాతియై న పద్దెనిమిదో శతాబ్దపు ఐరిష్ రచయిత్రి మేరియాఎడ్జి వర్త్.
మేరియా1768 జనవరి ఒకటి న ఐర్లాండ్ లో ఆక్స్ ఫర్డ్ షైన్ లోని బ్లాక్ బోర్టాన్ లో జన్మించింది .తండ్రి రిచార్డ్ లోవేల్ ఎడ్జివర్త్ .తల్లి మేరియా .చిన్నతనం లో అయిదవ ఏటనే తల్లిని కోల్పోయిన అభాగ్యురాలు . బాల్యాన్ని అమ్మమ్మ గారింట్లో ఇంగ్లాండ్లో గడిపింది .తండ్రి రెండో పెళ్ళి చేసుకొన్నాడు . అప్పుడు మళ్ళీ తండ్రి ఎస్టేట్ ఎడ్జి వర్త్ టౌన్ కు తిరిగి వచ్చింది ..1775 లో ఐర్ లాండ్ లోని డర్బిన్ స్కూల్ లో చేరి చదివింది .మారుటి తల్లి కూడా మరణిస్తే ,ఆమె చెల్లినే తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకొన్నాడు .తర్వాత లండన్ లో చదువు కొంది .తండ్రి ఈమె పై శ్రద్ధ బానే తీసుకొన్నాడు .ఈమె కన్ను ఇన్ఫెక్షన్ కు గురై చూపు మందగించింది .తండ్రి వెంట ఉండి అన్నీ తానై వ్యవహరించాడు . ఉపాధ్యాయులను నియమించి ఇంట్లోనే అన్నీ చెప్పించాడు .ఆర్ధిక ,రాజకీయ ,విజ్ఞాన శాస్త్రాలను ,సాహిత్యాన్ని క్షుణ్ణం గా నేర్చింది .తండ్రి అన్నిటిని స్వయం గా ఆమెకు బోధించి మెరుగులు దిద్దాడు .తండ్రి గారి లూనార్ సొసైటీ పెద్ద మనుషులు ఇంటికి వచ్చేవారు .వారితో పరిచయాలు పెంచుకొని తనను తాను మలచు కొంది .
తండ్రి కి ఉన్న ఎస్టేట్ వ్యవహారాల్లో సాయ పాడేది. ఎడ్జి వర్త్.అక్కడే రాస్తూ ఉండేది .నౌకర్లు ,చాకర్లు బోలెడు సిబ్బంది .అందరి ఆలనా పాలనా స్వయం గా పర్య వేక్షించేది .ఎస్టేట్ ప్రజల నిత్య జీవిత వ్యవహారాలను పరి శీలించి గ్రంధస్థం చేసింది .ఇవి తరువాత ఆమె రచించిన నవలకు ఎంత గానో తోడ్పడ్డాయి .ఆంగ్లో ఐరిష్ వారితో సాన్నిహిత్యం పెంచుకొన్నది అందులో ముఖ్యం గా మొదటి డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ తో గొప్ప పరిచయమేర్పడటం ఆమెకు వరమైంది .బాల్యం అంతా ఇంగ్లాండ్ లో గడపటం వల్ల భాష ,సంస్కృతి,ఆలోచన విషయాలలో ఆమె పై ప్రభావం చూపాయి .వివాదాస్పద విషయాల పై ఆమె తన భావాలను విస్పష్టం గా ప్రకటించి కొంత అసౌకర్యానికి గురైంది .తన అభి ప్రాయాలను ‘castle rackrent ,హార్రిన్గ్టన్’ నవలల లో రాసింది .
ఐరిష్ ఫ్యూడల్ వ్యవస్థ లోనీ లోపాలను ఎండ గట్టింది .ఐరిష్ వారు ఇంగ్లాండ్ వారికి దేనిలోనూ తీసి పోరనే విషయాలను ఆమె తన రచనలలో విస్పష్టం గా తెలియబరచి,ఐరిష్ అస్తిత్వ వాదానికి మూల స్తంభం గా నిల బడింది . వారిని జాగృతం చేసి వారి అభి మానాన్ని సంపాదించింది .రెండు దేశాల భాష లో ఉన్న భేదాలను సోపత్తికం గా చూపింది …ఆంగ్లో ఐరిష్ కాస్మాపాలిటిక్స్ ను వివరిస్తు మొదటి ఫిక్షన్ కధలు రాసింది .ఐరిష్ జాతీయ అస్తిత్వాన్ని,జాతీయ శీల స్వభావాన్ని వాటిలో ప్రతిబింబింప జేసింది .ఆమెకు కొన్ని స్పష్టమైన భావాలున్నాయి .మగ వారితో సమానం గా ఆడ వారు ఉండాలని ,ముఖ్యం గా భర్తల విషయం లో వారు ఏమాత్రం న్యూన భావం తొ ఉండ రాదనీ చెప్పింది .ఆమె భావాల పై రూసో ప్రభావం బాగా ఉండేది .అంతే కాదు స్త్రీల విషయం లో అవగాహన ఉన్న వారినే భర్తలను గా స్వీక రించాలని మహిళలకు హితవు చెప్పింది .
ఆమె రాసిన ‘’లివియన్ ‘’,ఫాషనబుల్ లైఫ్ అండ్ పాట్రో నేజ్ ‘’ లలో18 వ శతాబ్దపు ఐరిష్ విగ్ ప్రభుత్వాల అవినీతి ,ప్రాతినిధ్యాలను ఎత్తి చూపింది .’’హెలెన్ ‘’లో స్త్రీలు బాగా సంస్కృతీ కరణం చెందాలని ,మహిళలు రాజకీయాల్లో కి రావాలని ,స్త్రీలు ఆలోచనా ,వివేకం కలవారని చెప్పింది .కేథలిక్కు ల పై సాను భూతిని ప్రకటించింది .ఆమె రాసిన తొలి కధల్లో మెలో డ్రామా బాగా ఉండేది .వాస్తవికత ఉండేది కాదు .బాల సాహిత్యాన్ని విస్తృతం గా రాసింది .వారి కోసం ఎన్నో నీతి కధలు రాసింది .ఒక కధలో మనిషి శవం చర్మం తో మాస్క్ వేసుకొని ఒక విద్యార్ధి మాట్లాడి నట్లు చూపింది .ఆమె letters for literary ladies మొదటగా ప్రచురించినపుస్తకం . An essay on the noble science of self justification లో స్త్రీ శక్తిని గుర్తింప జేసి ,,మగవారి , అందునా భర్త ల దాష్టీకాన్ని సహించ వద్దని హెచ్చరించింది ‘’.parents assistance ‘’పుస్తకం రాసింది .బాలల విద్యకు ప్రోత్సాహమిచ్చింది .
మేరియా తండ్రి మంచి ముందు చూపున్న వాడు .గొప్ప ఇన్వెంటర్ అని పేరొందిన వాడు .కూతురి అభి వృద్ధికి అన్ని రకాలా తోడ్పడ్డాడు .ప్రఖ్యాత వేదాంతులు లాకె, రూసో ల ప్రభావం తొ ‘’praactical education ‘’ను విద్య కోసం రాసింది. అందరితో కలిసి మెలసి ఉండే తత్త్వం విద్యార్ధుల్లో ఉండాలని కోరింది .1800 లో మొదటి నవల-castle racknet తండ్రికి తెలియ కుండానే రాసి గొప్ప విజయం సాధించింది .ఇది ఆంగ్లో ఐరిష్ భూస్వాములపై సంధించిన వ్యంగ్యాస్త్రం .I rish land lording familiesలో నాలుగు తరాల వారి చరిత్ర ను పొందు పరిచింది . 1801 లో మూడు భాగాల’’ Belinda ‘’నవలను లండన్ లో ప్రచురించింది .ఇందు లో ప్రేమా ,ఆరాధన ,వివాహం ,సంఘర్షణ ల ను పొందు పరిచి పూర్తి విస్తృత స్తాయి నవల గా రాసింది .ఇందులో అంతర్జాతీయ వివాహాన్ని ప్రోత్సహించి,.ఆఫ్రికన్ బానిసకు ఇంగ్లిష్ భూస్వామ్య అమ్మాయితో వివాహాన్ని చేయించి సంచలనం సృష్టించింది .ఇది ఆ కాలానికి చాలా ముందడుగే .1809 లో tales of fashionable life ను చిన్న కధలను .స్త్రీల గురించి, వారికోసమే రాసింది .సమకాలీన నవలా రచయితలలో అగ్రశ్రేణి రచయిత గా గుర్తింపు పొందింది .ఒక నవలలో యూదులను కించ పరిచే విధం గా రాసిందని అమెరికన్ మహిళా రచయిత్రి విమర్శిస్తే ,వారికి క్షమాపణ చెబుతూ 1817 లోhamington రాసింది .ఆమెలో క్రమం గా పరివర్తన వచ్చింది ..నైతిక నిర్ణయాదికారాన్ని ,సాంఘిక అస్తిత్వాన్ని సాధించి ఆమె అందరికి ఆదర్శ ప్రాయ మైంది . ఆమె రచనల్లో వ్యంగ్యానికి పెద్ద పీటవేసింది .
ఫ్రాన్సిస్ బీ ఫోర్ట్ ను వివాహమాడింది .దంపతులు ఇంగ్లాండ్ అంతటా పర్యటించారు .అక్కడ కవి లార్డ్ బైరన్ తో సమావేశ మైంది .కాని బైరన్ అభిప్రాయాలతో ఏకీ భవించలేదు .హంఫ్రీ డేవి .ప్రముఖ నవలా కారుడు సర్ వాల్టర్ స్కాట్ లతో ఉత్తర ప్రత్యుత్త రాలు జరిపింది .తండ్రి మరణం తర్వాత ఎస్టేట్ కు వారసు రాలైంది .1845-49 లలో’’ ఐరిష్ పొటాటో ఫామిన్ ‘’వచ్చింది .అపుడు రైతులకు అండ గా నిలిచి వాళ్ల బాధా నివారణ కోసం oriandino రాసింది .క్వేకర్ ఉద్యమ నాయకుల సాయం కోసం రిలీఫ్ ఫండ్ వసూలు చేసి అందించింది .అమెరికా నుండి వారికి కానుకల రూపం లో సహాయం రా బట్టింది .తన సంస్థానం లోని రైతుల రుణాల మాఫీ చేసింది
రాయల్ ఐరిష్ అకాడెమీ కి విలియం రావన్ హామిల్టన్ ఎన్నికయిన తర్వాత ఆయనకు ముఖ్య సలహాదారు అయింది .ఐర్లాండ్ సాహిత్య విషయం లో ఆమె ఎన్నో సూచనలు చేసి అమలు పరచేట్లు చేసింది .అకాడెమి లో స్త్రీలు భాగా స్వామ్యులు కావాలని తీర్మానించి ,వారిని చేర్పించి చురుగ్గా పని చేసేట్లు చేయ గలిగింది .హామిల్టన్ మేరియా కు గౌరవ సభ్యత్వం ఇచ్చి అపూర్వ గౌరవం కలిగించాడు .ఎనభై ఒక్క ఏళ్ళు నిండుగా ,గౌరవం గా జీవించి, స్త్రీల అభివృద్ధి కి , ,బాలల విద్యాభి వృద్ధికి , ఐరిష్ భాషా సంస్కృతి ,అస్తిత్వాలకు కృషి చేసి,ముప్ఫైకి పైగా పుస్తకాలను రచించిన మేరియా ఎడ్జి వర్త్ 22-5-1849 లో ఎడ్జి వర్త్ టౌన్ లో గుండె పోటు తో మరణించింది .
– గబ్బిట దుర్గా ప్రసాద్
Like this:
Like Loading...
Related
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D