భ.కా.రా.మేష్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -4
స్కూల్ లొ తనికీ ప్రారంభ మయింది .అక్కడ ఉన్నవి ఎన్ని క్లాసులు అని అడిగాడు అధికారి .సమాధానం గా ‘’అందరికీ ఏక మొత్తం గా గట్టి గా చెప్పటమే గాని ,క్లాసులంటూ ,భేషజం నేనెరుగను .ఆ ముగ్గురు పై క్లాసు ,ఈ కడం కింది క్లాసు ‘’అన్నాడు అయ్యవార్లు .అదీ అక్కడి చదువు .,చెప్పే రీతీ .’’ముని అనే మాటకు అర్ధం అడిగాడు అధికారి .మనిషి అన్నాడు ఒకడు .’’మరి నేను ముని నేనా ?’’అని ప్రశ్నించాడు మళ్ళీ .కాదన్నాడింకోడు.కారణం అడిగితే ‘’ముని అంటే మంచి మనిషి ‘’అని దెబ్బ కొట్టాడా కుర్రాడు ‘’ధణుతెరిగి పోయింది’’ అందరికి
ఇప్పుడు మేష్టార్ని పాఠంచెప్పమన్నాడు .సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడని చెప్పాడు పంతులు .’’అబద్ధం ‘’అన్నాడు అధికారి .’’మీరు చెప్పండి .-ఇందాకట్నించి విన్నాగా నేను ‘’అని బరి తెగించాడు మేష్టారు .తను పిల్లలు గల వాడి నని మొత్తు కొన్నాడు .చివరికి ‘’అల్లా అయితే బాలు లారా !భూమేట సూర్యుడి చుట్టూ తిరుగు తుందట ‘’విన్నారా ?గిర గిరా ‘’అన్నాడు చివరికి .ఇంతట్లోకే నమ్మకం ఎలా మారిందని ఆశ్చర్య పడ్డాడు తల పాగా ఆయన .సమాధానం గా పంతులు గారు ‘’అయ్యా !నా జీతం రాళ్ళు నాలుగూ ,గిర గిరా తిరిగి వస్తుంటే చాలు .దేని చుట్టూ ఏది తిరిగితే పోయే దేముంది ?’’అన్నాడు గుక్క తిప్పు కొ కుండా .
తాను ఇది వరకే రాసిఉంచిన తనికీ పత్రం తీసి చదవటం ప్రారంభించాడు అధికారి .ఎలా సాగిందో తిలకిద్దాం–‘’మనో గణితం –మోతాదు .లెక్కలు –సుమారు .తెలుగు –జబ్బు .స్కూలు లొ –స్వేచ్చ.దేశాయి కసరత్తు –సున్నా .అందరికి తెలిసిన విషయం గురించి –రమా రమి . ఒక మాదిరి పా ఠమిస్తిని .పిల్లలు పద్యములు అర్ధ మగు నట్లు చదువ కూడదు .గొంతెత్తి పాడవలెను .’’తల తిరిగి పోయింది వెంకటాయికి ..’’తమరు చదివిన వాటిల్లో చాలా ఇప్పుడు జరగనే లేదే ‘’?అని బోల్డు ఆశ్చర్య పోయాడు ‘’నా ఉద్దేశ్యం లొ –ఒక వేళ అవి కూడా జరిగి ఉంటె వాటి విమర్శ ఇల్లా ,ఇల్లా ఉంటుంది సుమా –ఖబడ్ దార్ జాగ్రత్త .’’అని సమాధానం ఇచ్చాడు .ప్యాసు చేసి వెళ్ళ మన్నాడు మేస్టారు .’’పెద్ద క్లాస్ అందరు ప్యాస్ .చిన్న క్లాసులో టీకాలు లేని వాణ్ణి తప్పిస్తున్నాను ‘’అని వివరం చెప్పాడు .
రాత్రి స్కూల్ కూడా వెంకటాయ దే నిర్వాకం .అదీ చూడాలన్నాడు అధికారి .ఈ సారి చూస్తానని తప్పించు కొన్నాడు .’’పడక అరణ్య మెంటు ‘’జరిగి పోయింది .రాత్రికి రాత్రి ఇద్దరూ ,చెప్పా పెట్ట కుండా ఉడాయించారు .అర్ధం కాలేదు వెంకటాయి కి .మర్నాడు టపాలో నాల్గు రోజుల్లో స్కూలు తనిఖీ తంతు జరుగు తుందని సిద్ధం గా ఉండమని అసలు అది కారి నుండి ఉత్తరం వచ్చింది .అంటే వచ్చి మేసి వెళ్ళిన వాడు డూప్లికేట్, నకిలీ అన్న మాట .ఇలా ఆద్యంతం రక్తి కట్టించి నవ్వుల పాలు చేస్తారు భాకారా మేష్టారు కొసమెరుపు లొ ఆ నాటి తనిఖీ తంతు ప్రహసనం కళ్ళకు కట్టినట్లు చేస్తూ ,ప్రతి మాటలో హాస్యం మిళితం చేసి పండించారు హాస్య బ్రహ్మ భమిడి పాటి వారు .
అలాగే రాజ మండ్రి లొ కొత్తగా విమానం వచ్చింది .అంతా సరదాగా ఎక్కి చిన్న బలా దూర్లు కొట్టి వస్తున్నారు .ఆ విషయాలు రాస్తూ చూసిన వారు ఎలా బడాయీలు పోతున్నారో చాలా బాగా వర్ణించారు భ.కా.రా.మేష్టారు .విమానం చూడ గానే అందరికీ ఊర్ధ్వ దృష్టీ ,ఊర్ధ్వ శ్వాశా బయల్దేరి నాయని చేళుకులు .ఒక ఊల్లో తద్దినం జరుగు తోంది .విమానం ఆకాశం లొ ఎగురు తోంది .ఆ సన్ని వేశాన్ని అత్యద్భుతం గా హాస్యం మేళవించి తిని పిస్తున్నారు చూడండి .
‘’భోక్తలు భక్ష్యాలు విరుస్తున్నారు .కర్త పారణ కలుపుతున్నాడు .విమానం హోరుకు యజమాని వీధి లోకి ఎగడి,పక్షి వతు గా యెగిరి పోతున్న విమానాన్ని చూసి ,పితృ స్తానం లొ కూర్చున్న గోపాలాన్ని రెక్క లంకించు కొని ,నడివీధి లోకి ఈడుస్తూ మొర్రో మొర్రో అంటూండగా చేతి లొ గారే పళం గాయెగిరి రాకా ?తద్దినం మళ్ళీ వచ్చేదే .’’అని కసురు కున్నాడట . ఇది అశాస్త్రీయం అయినా ఏం ఉపద్రవామో అని మాత్రం చెప్పే ఆయన .’’ఇక్కడికి మీ నాన్న గారి ఆత్మ కి విమాన దర్శనం చేయించారు .ఏమి పితృ భక్తీ ?’’అని మెచ్చు కొన్నాట్ట .శ్రద్ధ గా పెట్టాల్సిన తంతు ఎలా విన్తకీ ,చోద్యానికి గురైందో ,దాని ప్రభావం ఎంత ఉందొ చెప్పటమే కాదు యజ మానికి కోపం రాకుండా మాటలు ఫిరాయించే మంత్ర గాళ్ళ మనో భావం కూడా బాగా బయట పెట్టారు .
విమానం లోంచి చూస్తుంటే కింద అంతా ఎలా కని పిస్తుందో జనం గోలగా చెప్పు కొంటున్నారు .అందులో కొన్ని చమక్కులు ‘’ఇది వరకు నేను ఏరి గున్న బ్రాహ్మలూ,అబ్రాహ్మలూ ,హిందువులు ,ముస్లిములు ,పునిస్త్రీలు ,వెధవ ముండలు ,వీళ్ళ వయినం కన్పించకుండా కన్పించింది .పైకి వెళ్ళి కిందకి చూసే టప్పటికి భూమి మీద మానవులు పెట్టు గోనే తేడాలు .నా చర్మ చక్షువులే అంత రించాయి .విమానం చూస్తున్నప్పుడు మానవుడి ఆఖండత్వం –కిందికి చూస్తున్నప్పుడు మానవుడి అల్పత్వం కని పించాయి ‘’.ఇందులో ఎంత వేదాంత భావన ఇమిడ్చారు మేష్టారు .మనో నేత్రం విచ్చు కోవటానికి హాస్యం ఎంత పకడ్బందీగా విని యోగా పడిందో చూడండి .అల్పత్వం వదిలించుకొని జీవించమని హెచ్చరిక కూడా ఇందులో జోడించారు మేష్టారు .కాంతా సమ్మితంఅంటే ఇదేనేమో నని పిస్తుంది .
కనుమ శుభా కాంక్షలతో
సశేషం ‘—మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –15-1-13-ఉయ్యూరు