శ్రీ నెట్టి కంటి ఆంజనేయ స్వామి దేవాలయం
సాహితీ బంధువులకు కనుమ పండుగ శుభా కాంక్షలు .దర్శనీయ దేవాలయాలు శీర్షిక లొ సుమారు నేల క్రితం రెండు దేవాలయాల గురించి రాశాను .ఇప్పుడు మూడవ దేవాలయం ఈ శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంతో కొనసాగిస్తున్నాను .ముందుగా ఆంజనేయ స్వామి ఆలయాలు గురించి రాసి తరువాత మిగతా దేవాలయాల గురించి రాయాలన్నది నా సంకల్పం .వీటిలో నేను రాసిన విషయాలు సమగ్రం కాక పోవచ్చు .మీ దగ్గర అదనపు సమాచారం ,ఫోటోలు ఉంటె సరస భారతికి తెలియ జేసి మీరూ భాగా స్వాములై సమగ్రతకు సహకరించ వలసిన ది గా కోరుతున్నాను .
నెట్టి కంటి అంటే ఒకే ఒక కన్ను గల వాడు అని అర్ధం .ఈ దేవాలయం అత్యంత ప్రాచీన మైనది .దీనికొక చరిత్ర ఉంది .క్రీ.శ.1521లొ హంపీ క్షేత్రం లొ శ్రీ వ్యాస రాయల వారు తుంగ భద్రా నదీ తీరం లొ నిత్య కర్మాను స్టానం చేస్తున్నారు .తాను ఒంటికి పూసు కొనే మంచి గంధం తో ,తన ఎదురుగా ఉన్న ఒక శిల మీద శ్రీ ఆంజనేయ స్వామి రూపం చిత్రించారట .అది నిజ రూపం ధరించి నడవటం ప్రారంభించిందట .వ్యాస రాయల వారు పట్టిన పట్టు విడవ కుండా అయిదారు సార్లు అలాగే చిత్రాన్ని రచించటం ,అది నడుస్తూ వెళ్ళి పోవటం జరి గిందట. .చివరికి వ్యాస రాయల వారు శ్రీ ఆంజనేయ స్వామివారి ద్వాదశ నామాల బీజాక్ష రాలతో ఒక యంత్రం తయారు చేసి ,దానిలో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజ రూపాన్ని చిత్రించారట .అప్పుడు స్వామి ఆ యంత్రం లొ బంధింప బడి అందులో స్థిరం గా ఉండి పోయారట .ఒక నాటి రాత్రి స్వామి వారు వ్యాస రాయల కలలో దర్శనమిచ్చి ‘’నన్ను కీర్తించి పూజిస్తే చాలదు .నాకొక ఆలయాన్ని నిర్మించు .అందులో నా విగ్రహం అత్యంత భక్తీ శ్రద్ధల తో ప్రతిష్టాపన చెయ్యి .’’అని చెప్పారట .
వ్యాస రాయల వారు ఎంతో శ్రమించి ,అందరి సాయం తో ఆ ప్రాంతాననే 732 శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ట చేశారట .ఈ నాడు మనకు కని పించే ‘’చిప్ప గిరి ‘’గ్రామం లొ శ్రీ భోగేశ్వర స్వామి వారి దేవాలయం లొ వ్యాస రాయల వారు నిద్రిస్తుండగా శ్రీనేట్టి కంటి ఆంజనేయ స్వామి వారు కలలో కన్పించి తాను ఆ ప్రాంతం నుండి దక్షిణ దిశ గా ఉన్న ప్రాంతం లొ అతి చిన్న రూపం లొ భూమిలో ఉన్నానని తనను బయటికి తీసి మరలా ఆగమ సంప్రదాయాల నను సరించి ప్రతిష్ట చేయమని ఆనతిచ్చారట .ఆ ప్రదేశం ఎక్కడ ఉన్నదో తమకు మార్గ దర్శనం చేయమని వ్యాస రాయల వారు కోరగా స్వామియే ఒక ఎండిన వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గరకు వెళ్ళమని అక్కడికి చేర గానే అది చిగురిస్తుందని అక్కడే భూమిలో తాను ఉంటానని చెప్పారట .
వ్యాస రాయల వారు కలలో స్వామి చెప్పినట్లే మర్నాడు బయల్దేరి నడిచి వెళ్ళి కొంత దూరం లొ ఎండిన వేప చెట్టును కను గొన్నారు .రాయల వారు దాని సమీపానికి రాగానే ఆ వేప చెట్టు తక్షణమే ఆకు పచ్చ గా చిగురించిందట .ఆశ్చర్య పడిన వ్యాస రాయల వారు అక్కడ భూమిని త్రవ్విన్చారట .అక్కడ దొరికిన ఒంటి కంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు .దేవాలయాన్ని నిర్మించారు . ఈ ఆలయం కసాపురం .గ్రామానికి అతి దగ్గర లొ ఉండటం వల్ల శ్రీ ఆంజనేయ స్వామిని కసా పురం ఆంజనేయ స్వామి అని కూడా అంటారు .నెట్టి కల్లు లొ ఆవిర్భా వించాడు కనుక స్వామిని శ్రీ నెట్టి కంటి ఆంజనేయ స్వామి అనీ భక్తులు ఆప్యాయం గా పిలుచు కొంటారు .
శ్రీ నెట్టి కంటి ఆంజనేయ స్వామికి ఒక విచక్షణ లక్షణం ఉంది .స్వామి కి కుడి కన్ను మాత్రమె ఉంటుంది .ఆ కంటి తోనే భక్తులను కృపా కటాక్షాల తో వీక్షిస్తూ ,వారి మనో భీష్టాలను నేర వేరుస్తారని ప్రతీతి .భక్తుల బాధలను స్వామి వారికి విన్న వించు కొంటె, కలలో కన్పించి నివారణ మార్గాలను సూచిస్తారట .స్వామి విగ్రహానికి అపూర్వ తేజస్సు ,సాటి లేని ఆకర్షణా ఉండి,ముగ్ధుల్ని చేస్తుంది . .అందుకే అశేష భక్త జనం స్వామి వారల నుదర్శించి ,స్వామి వారి అనుగ్రహం తో తమ జీవితాలను తీర్చి దిద్దు కొంటున్నారు .స్వామి విగ్రహం తూర్పు ముఖమై ,దక్షిణ దిశ ను చూస్తూ ,,భక్త జనుల మొరలు విని పించు కొంటూ ,బాధలను తీరుస్తూ ,ఉన్నట్లు గా అని పిస్తుంది .స్వామి నిజ రూప దర్శనంను ఆ సుందర దివ్య సుందర విగ్రహానికి అభిషేక సమయం లొ కన్నుల పండువు గా దర్శించి ,తరించ వచ్చు.
కసాపురం అనంత పురం జిల్లాలో గుంతకల్లు రైల్వే జంక్షన్ కు అయిదు కిలో మీటర్ల దూరం లొ ఉంది.బస మార్గం లొ గుత్తి కి 35కి.మీ .దూరం లొ ఉంది.. ప్రతి ఏడాది ఒక చర్మ కారుడు ఏక భుక్తం ఉంటూ ,బ్రహ్మ చర్యాన్ని పాటిస్తూ శ్రీ ఆంజనేయ స్వామికి ఒక చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు మర్నాడు వచ్చి చూస్తె అది అరిగి పోయి నట్లు చిరిగి పోయి నట్లు కని పించటం విశేషం .స్వామి ఆ చెప్పులు ధరించి రాత్రి పూట వాహ్యాళి వెళ్ళి వస్తూంటాడని భక్తుల నమ్మకానికిది నిదర్శనం . ప్రతి ఏటా వైశాఖ ,శ్రావణ ,కార్తీక ,మాఘ మాసాలలో శని వారం నాడు అసంఖ్యాకం గా భక్తులు స్వామిని సందర్శించి తమ మనో భీష్టాలను నేర వేర్చుకొంటారు .చైత్ర మాసం లొ పౌర్ణమి రోజున ఈ ఆలయం లొ శ్రీ హనుమద్ జయంతి జరపటం ప్రత్యేకత ..
ఇప్పుడు వ్యాస రాయల (వ్యాస తీర్థులు) వారి గురించి కొంత తెలుసు కొందాం .
వ్యాస రాయల వారు బ్రహ్మ లోక నివాసి .బ్రహ్మ దేవునికి అత్యంత శ్రద్ధా భక్తులతో సేవ చేస్తూ ఆయన పూజ కు కావలసిన వన్నీ సమకూరుస్తూ ఉండే వారు .ఒక రోజున ఏదో ఏమరు పాటుగా ఉంది సకాలానికి బ్రాహ్మ గారి పూజకు సామాను సిద్ధం చెయ్య లేక పోయారట .బ్రహ్మ కు విపరీతం గా కోపం వచ్చి భూలోకం లొ జన్మించమని శపించాడు .ఆ శాప వశం గా ఆయనే కృత యుగం లొ రాక్షస రాజు అయిన హిరణ్య కషిపునికి శ్రీ హరి భక్తు డైన ప్రహ్లాదుని గా జన్మించారు .ద్వాపర యుగం లొ బాహ్లికుడు గా జన్మించి కురు క్షేత్ర సంగ్రామం లొ కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు .కలియుగం లొ పద్నాలుగవ శతాబ్దం లొ విజయ నగర సామ్రాజ్యం లొ శ్రీ కృష్ణ దేవ రాయల కాలం లొ వ్యాస రాయలుగా జన్మించారు .ఆ తర్వాతా జన్మ లొ వారే మంత్రాలయం శ్రీ రాఘ వేంద్ర స్వామి గాఆవిర్భవించారు .శ్రీ వ్యాస రాయలు కర్నూలు జిల్లా శిల్ప గిరి –అదే నేటి చిప్ప గిరి కి వారి గురువు గారు విజయ దాస తీర్ధ స్వామి దర్శనానికి వచ్చి నప్పుడు శ్రీ మిట్ట కంటి ఆంజనేయ స్వామి వారు కలలో కన్పించి తన ఉనికిని చెప్పి ఆలయాన్ని నిర్మించమని కోరారు .
. మరో ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం .
సశేషం-మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –15-1-13-ఉయ్యూరు