భ.కా.రా.మేస్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -5

   భ.కా.రా.మేస్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -5

     ఆంధ్ర విశ్వ విద్యాలయాన్ని ఎక్కడ పెట్టాలి అనే దాని మీద ఆనాడు పెద్ద మనుష్యులు బుర్రలు పగల కొట్టు కొన్నారు .పట్టు దలలు జోరుగా సాగాయి .ఇంగితం గూడా మరిచి ,వాదు లాడుకొన్నారు .పేపర్ల కెక్కి పరువు తీసుకొన్నారు .వీరందరి అంత రంగాన్ని మేష్టారు దూది యేకి నట్టు యే కి పారేశారు .బాణం లాగా ఆయువు పట్లు చేదించారు .మనుష్యులలోని సంకుచితత్వం ఎలా వెర్రి వేషాలేసిందో భ.కా.రా.గారు హాస్యం మిళాయించి బజాయించారు .’’ఏమండీ !మా నూతి దగ్గర ఖాళీ ఉంది .పోనీ ఆంధ్రా యూని వేర్సిటి అక్కడ పెట్ట కూడదా ?నిక్షేపం గా చాపా అదీ వేస్తాను ‘’అన్నాడట ఒకడు .వనరులు లేని చోట పెట్టి ఏం బావుకుం టారని సూటి విమర్శ ఇది .

         ‘’ప్రతి ఆంధ్రుడు ఆంధ్రా యూని వేర్సిటిపుణ్య క్షేత్రానికి వెళ్ళి ,ఓ కొబ్బరి కాయ కొట్టి నైవేద్యం పెట్టి ,తనకి సహం చెక్క ఇస్తారట .ఇవ్వక బోతే ,దెబ్బలాడి పుచ్చుకో వచ్చు .’’అని మెహర్బానీ కొందరిలో .’’ఇంగ్లీషు మేస్టేర్లకి ముట్టు తున్న జీతాలు ,తెలుగు మేస్టేర్లకీ ,తెలుగు మేస్తర్లకి ముట్టె జీతాలు ఇంగ్లీష్ వాళ్ళకూ ‘’అని అసలు పంతుళ్ళు ఆంద్ర లోనే చెబుతారా ?అరవం లొ చెబితే పోలా ‘’?అనే వ్యంగ్యం లొ కొంత మందీ ఈస డించుకొన్న కాలం అది .అంత సిద్ధాంత రాద్ధాంతాలు జరిగాయి .పట్టింపులకు పోయారు ఉచ్చ నీచాలు వదిలేశారు .దక్క కూడనిదేదో దక్కి పోతున్నట్లు బాధ పడ్డ్డారు కొందరు మహనీయులు .ఇలా అందర్నీ విశ్లేషించి మన ముందు నిల బెట్టారు హాస్య బ్రహ్మ .

          విద్య యొక్క అసలు పరమార్ధాన్ని చాలా సున్నితం గా చెప్పారు కామేశ్వర రావు మేష్టారు .’’విద్య దైవికం .కనుక విద్యార్ధికి నైర్మల్యం ఉండాలి .విద్య పవిత్రం కనుక విద్యార్ధికి దయ ఉండాలి .ఇవి లేక పోతే విద్యార్ధి పైన దేవుడికీ ,మధ్య తనకీ ,చుట్టూ సంఘానికీ ద్రోహి ‘’అంటారు నిష్కర్షగా .వ్యంగ్యం లొ నుంచి వచ్చిన వైభోగం ఇది .అక్షర లక్షలు చేసే పసిడి పలుకులు .’’విద్య ముందు మోహ మాటంపడ కూడదు .డబ్బు ,దర్జా ,సత్తా ,ఇవన్నీ విద్య తర్వాతే .విద్య ఉంటె డబ్బు లాక్కు రా గలదు .కాని డబ్బున్డటం అనేది ఒక విద్య కాదు ‘’అన్నారు మేష్టారు .’’యూని వేర్సిటి పెట్టె దక్షత పెంచుకోవాలి కాని ,దక్షత ఉంది కదా అని యూని వేర్సిటి పెట్టరు ‘’అని ఖచ్చితం గా చెప్పారు .యూని వేర్సిటి దేనికోసం అంటే –ఆయన మాటల్లోనే ‘’లోకానికి దీని యందు అను రక్తి ,సాను భూతి ,అనేకుల అప్రయత్న సమ్మేళనం ,విద్య అంటే అపార మైన తృష్ణ ,విద్య సాధించాలనే కసీ ఇవే యూని వేర్సిటి జీవం ‘’దీన్ని నిల బెట్టడం ప్రతి ఆంధ్రుడి మీద ఉన్న తక్షణ కర్తవ్యం .ఆ నాటి మాట ఏనాడూ నిజమే .

                 తమ్ముడు పెళ్ళికి తరలి వెళ్లటం

          అనే హాస్య రచన మరీ మరీ కడు పు చెక్క లయ్యేట్టు నవ్విస్తుంది .హడా విడి గా పెళ్ళి కుదిరింది .దానికి అంతా తరలి వెళ్ళాలి .ఆ కంగారు ,హడా విడి సెల్యులాయిడ్ పై కి ఎక్కించి నట్లు చెప్పుకొస్తారు మేష్టారు .మనం కూడా వారితో ప్రయాణం చేస్తున్నట్లు గానే ఫీల వుతాం .అదీ మేస్టారి గొప్ప తనం .ఆయన మనతో పాటు నడుస్తూ ,మాట్లాడుతూ న్నట్లే రాయటం మేస్టారి ప్రత్యేకత .అంత సహజం గా రాయటం ,హాస్యం మిళాయించడం ధనుతేగిరి పోయేలా వాయించడం ఆయనకే తగు .

      ‘’రైలు ఆ!నేను వెళ్ళను –అన్నట్టు కొంత హరామీ చేసి వెనక్కి కదలటం మొదలెట్టింది .ఆ పలం గా రైలు వాడు‘’ఏడిశావు .నడుద్దూ నీ ఇష్టం ఏముందీ ?అన్నట్లు చెవులు గిన్గిర్లేట్టే లాగు రయ్యిమని ఓ కూత కూసి ‘’ఓటేసి (పాస్ పోసి )రైల్ని నషాలం అంటే ట్టు  ‘’ఒక్క టేశాడు’’ .దాంతో పాపం రైలు ‘’నెమళ్ళు కక్కు కుంటూ ‘’పరిగెత్తడం మొదలెట్టింది’’.అదీ రైలు బయల్దేరటానికి చేసిన హాంగామా సహజం గా చిందించిన హాస్యపు జల్లు .ఏదో కొంచెం రుచి చూపించాను .మిగతాది చదివి అనుభవిస్తేనే మజా .

            మేస్త్రీ ఉద్యోగం గొప్పది అనే భావం పూటు గా ఉన్న వారు కామేశ్వర రావు మేష్టారు .’’మేస్త్రీ ఉ ద్యోగామో కాదో తెలీదు కాని ,ఉద్యోగు లంతా మేస్టారు సృజనే’’ .అన్న నిజాన్ని బాగా చెప్పారు .మేస్టారు అంటే ,ఎవడో కర్ర తో కొట్టి నట్లు జ్ఞాన నేత్రాన్ని తేరి పిస్తారాయన .’’ఇంత మంది ఉద్యోగుల్ని తయారు చేస్తున్నాను కదా ఇహ సౌఖ్యం ప్రధాన మైన ఉద్యోగం అందుకే నేను వదిలేస్తాను అనే వాడే మేస్టారు ‘’.’’ఇంకోడు బాగు పడితే ,తనూ బాగు పడ్డట్టే అనుకో గలిగిన వాడు మేస్టారు .అంటే ‘’మేస్టారికి భావానా శక్తి భూమికీ ఆకాశానికి తాళం’’అన్నంత ఉండాలి .హిందువులు వేదాంతులు .వారిలో మేస్టార్లు అగ్ర స్థానం అలంకరించాలి .’’-‘’ఇండియా లొ పూర్వం కర్త ,కర్మా ,క్రియా ఎక్కడ బడితే అక్కడ దొరికేవి .క్రమేపీ కర్త ,క్రియల్ని ఇతరులు అపహరించారు .కర్మ ఒక్కటే మిగి లింది .భుక్తి ఎల్లానూ ఇంతే –అని ముక్తి ,మోక్షాల కోసం దేవుల్లాడి పని చేయాలి .’’అని అందర్ని చితక బాది ధర్మ సూక్ష్మాన్ని తెలిపే పెంకి ఘటం భకారా మేష్టారు

               యే ఉద్యోగమైనా ఉదార పోషనకేగా ?కోటి విద్యలూ అందుకేగా ?అయితే భమిడి పాటి మేస్టారికి’’మేస్ట్రీకూడా ఒక ఉద్యోగామేనా ‘’అని సందేహం వచ్చింది .ఇక చేతి నిండా పనే .బరికి పారేశారు .ఎవరో ఆయన్ను అడిగారట .’’ఇన్నాళ్ళు చదివీ చివరికి మేస్ట్రీ చేరాడేమిట్రా ?ఆడదీ కాకుండా ,మొగాడు కాకుం డానూ  ‘’అదే ఆ రోజుల్లో పంతులు ఉద్యగం పై అందరికి ఉన్న చులకన భావం .’’మేస్టరీచాలా ఉన్నత మైనదీ ,విశిష్ట మైనదీ అని దారుణ స్తోత్రం చేసే వారు తమకి దీని యందు ఎంత అభి ప్రాయం ఉన్నా ,తమరు ఉండ కూడదట మేస్తార్లు గా ‘’అని చెంప చేదేల్ మనిపిస్తారు .అంటే మేష్టారు కావాలి కాని తాను మాత్రం మేస్టేరీ ఉద్యోగం చెయ్యరాదు అనే భావం ఉన్న వాళ్ళను ఉతికి ఆరేశారన్న మాట .

         ‘’ఉద్యోగం అంటే కొంత డబ్బూ ,దర్పం ఉండాలి .బిళ్ళ బంట్రోతు ఉండాలిట..డవాలూ అదీ అపసవ్యం గా తొడుక్కొని ,’’అస్మత్ పితుహ్ ,ప్రాచీనా వీతి ‘’అన్నట్టు ‘’అని డవాలు బంట్రోతు ఉన్న ఆఫీసర్ని వెక్కిరిస్తారు భకరా గారు .లంచాలు తిని ,పై వాడికి పెట్టె వాడే మొన గాడు ఆనాడు .ఈనాడు అంతే ననుకోండి .దానికి ముద్దుగా ‘’బల్లకింద చెయ్యి, చెయ్యి తడి ,రశ్మి ‘’అని మేష్టారు పేర్లు పెట్టారు ఆమ్యామ్యామ్యా అని తర్వాతా స్తిర పడింది ముళ్ళ పూడి వారి దయ వల్ల .దేనికైనా పిలిస్తే ‘’సెలవు దొరక లేదు .రాలేదు ‘’అని చెప్పేదే ఉద్యోగం అనీ ,అని అందరు అనుకుం టారట .ఏదీ దొరక్క మేస్టేరీ చేస్తారు చాలా మంది .’’ఎందుకు ట్రైనింగు అయ్యావు ‘’?అని అడిగితే గడుసుగా ‘’ఏమిటో నండీ .circumstances permit ‘’చెయ్యలేదు .’’some thing is better than nothing ‘’ట్రైనింగ్ అయి ఉండడం ఎందుకేనా మంచిది ‘’అంటా రట..’’కడం వాటికి చేతిలో చిలుం వదుల్తుంది .దీని కైతే ఏదో కొంత ‘’మనో వర్తి ‘’(స్టై ఫండ్డ్ )పారేస్తారుగా .’’అని కొందరంటారట .దేన్నీ బట్టి చూసినా ఉద్యోగానికి ఉండవలసిన లక్షణాల్లో మేస్టేరీకి ఒక్క లక్షణం కూడా లేదు‘’అంటారాయన .అదీ ఆ నాటి పరిస్తితి .ఇప్పుడు పూర్తిగా భిన్నం గా ఉంది కడుపు లొ చల్ల కదలని ఉద్యోగం .

       ‘’వెధవ్వాల్లకు తీర్ధపు రాచిప్పల మీద ,దోమలకు చెవుల మీదా ,దారిద్యానికి మేస్టేరీ మీద ఆపేక్ష ఎక్కువ ‘’అని చమత్కరిస్తారు .ఏదో మేస్టేరీ చేస్తూ ఇన్ని ప్రైవేట్లు చెప్పుకొని గడపచ్చు కదా నని అనుకొంటే ,దానికీ తిప్పలే నట .’’ట్యూషన్ అనగా బోధనా వ్యభి చారం .’’అని ముద్ర వేస్తారు ఒక వేళ చేసినా ,ఎలా లాగుతున్నాడో దరఖాస్తు పెట్టు గోవాలిట .’’అని వాయిన్చేస్తారు హాస్యపు కొరడా తో .ఎంత జీతం ఇచ్చినా పని చేసే వాళ్ళున్నారని అంటు ‘’యే మిచ్చినా సరే ,బోధనా వర్షం కురి పించక మానం ‘’అంటారా ట వారు .అన్నిటికీ ఓర్చు కొంటేనే మేస్తారట .జ్ఞానికి ఉన్న లక్షణాలన్నీ మేస్టారికి ఉండాలిట..

  ‘’తిట్టి కొట్టి రేని తిరిగి మాటాడక –అట్టు ఇట్టు చూసి అదిరి పడక

     తను గాని యట్టు తత్తర పడ కున్న –నట్టివాడు బ్రహ్మ మౌను వేమా ‘’అన్న దాంట్లో’’ మేస్ట రౌను వేమా “’అని మారిస్తే సరి పోతుందని వ్యంగ్యం గా అంటారు .

            చెప్పిందే చెప్పటం మేస్టారు పని .అలా చెప్పిందే చెప్పి తెగ డ్రిల్లు చేయాలి .సర్వజ్ఞుడు కావాలి .డబ్బు సంగతి తెస్తే ‘’అపవిత్రం ‘’ట అని చేన్నాకోలుచ్చుకొని సంఘాన్ని వాయిన్చేస్తారు .అసలు ఎడ్యుకేషన్ ఎవరి చేతుల్లో ఉందొ తెలీని కాలం .’’గవర్న మెంటు వారిని గ్రాంటు కోరకుండా ఉంటె చాలు .వారికి ఎడ్యుకేషన్ ఎల్లా ఉన్నా సరే .ఇనస్పెక్టర్ గారికి కొత్త పద్ధతులు ,పాఠాల లిస్టులూ ఉంటె చాలు ఎడ్యుకేషన్ ఎలా ఉన్నా పర్లేదు .అదే రకం గా ఒకటో తారీఖు కు జీతం వస్తే చాలు ,విద్యార్ధికి మార్కులు వేస్తె చాలు ,తండ్రికి ప్యాసైతే చాలు ఎడ్యుకేషన్ ఎలా ఉన్నా ‘’అని అందర్ని దులిపి వదిలారు భకారా మేస్తారు .

              సశేషం –

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-1-13-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.