మురళీకృష్ణ హారర్ కధల్లో కొత్తదనపు కస్తూరి గుబాళింపు–2
శ్రీ కస్తూరి మురళీ కృష్ణ రాసిన భయానక కధా సంపుటి లోని మొదటి కధే ‘’ఆ అరగంట చాలు ‘’.ఇందులో బుధ గ్రహ వాసి‘’బ్రహ్మ బుద్ ‘’ భూలోక సందర్శనానికి రచయిత ఇంటికి వస్తాడు .వచ్చిన వాడు చాలా ముభావం గా ,అనీజీ గా ఉండి రచయిత తో తప్ప ఎవరి తోను మాట్లాడ టానికి ఇష్ట పడడు .మీట నొక్క గానే తెరపై వచ్చే నృత్యాలు సంగీతాల సృష్టించే కంప్యుటర్ తో వాటి ప్రదర్శన పెట్టాడు కాని బుధుడికి ఏమీ నచ్చలేదు .ముళ్ళ మీద ఉన్నట్లే కూర్చున్నాడు .అతని ప్రవర్తన వింత గా అని పించింది .బుధుడు వారం రోజులు ఇక్కడ గడపటానికి వచ్చాడు .ఏమి బుద్ధి పుట్టిందో కాని మర్నాడే వెళ్ళి పోతున్నట్లు తెలియ జేశాడు .
పూల తోటకు తీసుకొని వెళ్ళాడు .పూల అందాన్నీ అనుభావిన్చ లేదు బుద్ .యే శబ్దమూ లోపల చేరని వాహనమైన ఏవా -400లో మాత్రం స్తిమితం గా కూర్చున్నాడు .భూలోకం ఏమీ నచ్చ లేదా అని అడిగితే నవ్వే సమాధానం .మండి పోయింది మన రచయితకి .బుధ గ్రహ వాసులు కళాతృష్ణ లేని వారని ,సున్నత మనస్తత్వం లేని వారని ,కలుగుల్లో ఎలుకల్లా జీవంచే వారిక ‘’కలా పోసాన ‘’తెలీదని ఎద్దేవా చేశాడు .ఆకాశం లో సూర్యుడు ,రంగులు ,పక్షుల కిల కిలా రావాలు చూడ మన్నాడు .వేవీ పట్టించుకో లేదు ‘’బుద్ మాలోకం ‘’.త్వరగా ఇంటికి పోదామని తొందర చేశాడు .ఇద్దరు ఇంటికి చేరారు .
ఎట్టకేలకు నోరు విప్పాడు బుద్ ‘’మీ ప్రకృతి అందం బాగుంది .ప్రకృతిలో ప్రతిదీ అద్భుతమే .అయితే దాన్ని ఆస్వాదించే తీరికా ,ఓపికా మీ భూలోక వాసులకు లేవు .ఏదో మొక్కు బడి గా హడా విడి గా చూసి వెళ్ళి పోవటం మీ నైజం .మా బుధలోక వాసులు మీకన్నా సున్నిత మనస్కులు .మీరు చూడలేనివి మేము చూడ గలం .సూక్ష్మ శబ్దాలను విన గలం ..మీ నాగరకత అభి వృద్ధి చెందని కాలం లో అనాగారక ప్రదేశాలకు మీరు నేరస్తులను శిక్ష గా పంపేవారట కదా .మా వాళ్ళు ఇక్కడ శిక్షకు అను కూలం గా ఉందొ లేదో చూసి రమ్మని నన్ను పంపారు ‘’అన్నాడు బ్ర,బు.ఈ మాటలు రచయితకు కోపం తెప్పించి భూలోక వాసుల్ని అనాగారకుల్ని చేసి మాట్లాడి నందుకు ఉద్రేక పడి ‘’మా భూగోళం శిక్షా స్థలమా ?’’అని సూటిగా ప్రశ్నించాడు .’’మీరు చూడ లేనివి, వినలేనివి మాకు అనుభవమవుతాయని ముందే చెప్పాను మా శక్తి మీకు లేదు ‘’అన్నాడు తాపీగా .ఆ శక్తుఏమిటో తనకు చూప మన్నాడు రచయిత .చూప లేను కాని ‘’ ఆ శక్తులను ఒక అర గంట ‘’అందిస్తాను ‘’అన్నాడు .
ఇంటికి చేరారు కళ్ళు మూసుకో మంటే మూసుకున్నాడు రచయిత .కాసేపట్లో వేడి పానీయం ‘’ప్తీకా ‘’తయారు చేసి తెచ్చి టేబుల్ మీద ఉంచాడు .రచయిత కప్పు అందుకో బోయి ఒళ్ళు జలదరించి ఆగి పోయాడు .కప్పులోని పానీయం అణువులు విచిత్రం గా కొట్టు కుంటున్నాయి .సజీవ దహనం చేస్తుంటే ప్రాణులు ఎలా విల విల లాడుతారో అలా విల విల లాడుతున్నాయి .కేకలు పెడుతున్నాయి .కాసేపట్లో బుద్ వచ్చి బయటికి తీసుకెళ్ళాడు రచయితను .అప్పటి దాకా అందం గా కని పించిన చెట్లు భయంకరం గా కొట్టు కొంటున్నాయి,తిట్టు కొంటూ’’ దాహం దాహం ‘’అని అరుస్తున్నాయి .తోటమాలిని బూతులు తిడుతున్నాయి .నీళ్ళ పంపు తిప్పితే గుటకలేస్తూ పంపు నీళ్ళు ఆబగా తాగేస్తున్నాయి .నీళ్లన్నీ ముందున్న చెట్లకే అందుతున్నాయని వెనక చెట్లు ఫిర్యాదు చేస్తున్నాయి .భయం తో కంపించి పోతున్నాడు కాళ్ళ కింద కీటకాలు పడి నలిగి హాహా రావాలు చేస్తున్నాయి .
ఒణికి పోతున్నాడు భయంకరం గా కేక వేశాడు .కడుపు తిప్పి వాంతి అయింది పైన చర్మం లేని మాంసం ముద్దా ,లోపల ప్రేగులు ,రక్త ప్రసరణ ,ఆహరం జీర్నమయే ప్రక్రియ అంతా స్పష్టం గా కని పిస్తున్నాయి .స్పృహ తప్ప పడిపోతే బ్రహ్మ బుద్ ఇంట్లోక్ చేర్చాడు రచయితను .దేని మీదా ధ్యాస నిలవటం లేడు బుధ లోకుల్ని భూమ్మీదికి రానిస్తే మానవజాతిని నాశనం చేస్తారని గోణుగుతున్నాడు .ఇదంతా రాసి వణుకు తున్న చేతులతో ఓ సారి చదువుదామని చూశాడు రచయిత .కాగితం మీద ఏమీ కని పించలేదు .అక్షరాలను తరంగాలుగా మార్చే కంప్యూటర్ నుండి తన ఆలోచనలను మాయం చేశాడు బుద్ అని గ్రహించాడు.ఈ విషయం అందరిక్ తెలపాలని పిచ్చి పట్టిన వాడిలా బయటికి పరిగెత్తాడు .బ్రబు తనను ప్రయోగం కోసం వాడుకోన్నాడని అర్ధమయిందికిరణ్ కుమార్ కు బ్రహ్మ బుద్ వెళ్ళి న దగ్గర్నుంచి పిచ్చి గా ప్రవర్తించ సాగాడు కరణ్ .అతనేం మాట్లాడుతున్నాడో ఎవరికి తెలీయటం లేడు .కరణ్ ని ‘’మెదడు చికిత్స ‘’శిబిరానికి పంపారు .అక్కడ వెర్రికేకలు పెట్టి తల తలుపుల కేసి బాదుకొని కిరణ్ చచ్చి పోయాడు .అతను పెట్టిన కేకల్లో ‘’ఆ అర గంట చాలు ‘’అన్న ఒక్క పదం మాత్రమె అర్ధ మయింది .’’ఇది ఇంకో పిచ్చి కేసు’’ అని తేల్చ ఫైల్ల్ మూసేశాడు వైద్య కమిటీ అధ్యక్షుడు
సశేషం
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –19-1-13-ఉయ్యూరు