మురళీ కృష్ణ హారర్ కధల్లో కొత్తదనపు కస్తూరి గుబాళింపు -4(చివరి భాగం )
మూడవ కధ ‘’కల కానిదీ ‘’.పీడ కలలతో విసిగెత్తి పోయిన శరత్ కుమార్ , డాక్టర్ అయిన యిన రచయిత దగ్గరకు వచ్చాడు .అతనికి కలలో దెయ్యం సెవెన్ సీటర్ కని పిస్తోందన్నాడు భార్య సహా ఉద్యోగే నని ,వారి పెద్దలకు ఈ పెళ్ళి నచ్చ లేదని అయినా పెళ్ళి చేసుకోన్నామని ,ఒక నెల బానే జరిగింది .తల్లికి సుస్తీ చేసి సీరియస్ గా ఉందని తెలిసి భార్య చూడ టానికి వెల్తానంది ..తననూ రమ్మంటే రాలేనన్నాడు . .చూసి రమ్మన్నాడు .ఆమెకు సెవెన్ సీటర్ ఎక్కడం భయం .అయినా ఏదీ దొరక్క ఎక్కించాడు .తాను స్కూటర్ స్టార్ట్ చేసే లోపు ఒక లారీ సెవెన్ సీటర్ ని గుద్దేసింది .భార్య ఈతని చేతుల్లోనే మర ణిస్తూ తనకు’’ అప్పుడే చావాలని లేదన్నది’’ . .అని చెప్పాడు .
ఇది జరిగి ఎన్ని రోజు లయిందని అడిగాడు తాను .మూడు వారాలని చెప్పాడు శరత్ .సంఘటన ఒక వారం రోజులు తనకు నిద్ర పట్ట లేదని కన్ను మూయ గానే భయం తో ఒణికి పోయే వాడు సెవెన్ సీటర్ కని పించి భయం కల్గేది .అది శవ వాహనం లా అని పించేది .ఒక సారి భయం లేకుండా సెవెన్ సీటర్ఎక్కి చూడమని సలహా ఇచ్చాడు .రెండు రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు శరత్ .సెవెన్ సీటర్ ఎక్కారా అని అడిగితే ఎక్కే లోపే వెళ్ళి పోయిందని చెప్పాడు .చివరికి ఒక దాన్ని ఎక్కానని ఒక పిల్లాడు డబ్బు అడిగాడని జేబు లోంచి డబ్బు తీస్తూ వాడి వైపు చూశానని కెవ్వు మని కేక వేశానని, మెలకువ వచ్చి చూస్తె వెంట్రుకలు నిక్క బోడుచుకోన్నట్లు గమనించానని డాక్టర్ కి చూపించాడు .అతడు భ్రాన్తికీ నిజానికి మధ్య తేడా తెలుసుకో లేక పోతున్నాడని భావించాడు రచయిత ,.మన మనసు లోని తీరని కోరికలు ,భయాలను మనస్సు కలల రూపం లో వెళ్ళ గ్రక్కుతుంది .శరత్ గిల్టీ ఫీలింగ్ తో బాధ పడుతున్నాడని అర్ధమయింది
బలహీనం గా ఉన్నప్పుడే ఇలాంటి భయాలు పీడిస్తాయని ధైర్యం గా ఉండమని మళ్ళీ ఓ సలహా పారేశాడు .ఒక వారం తర్వాత శరత్ వచ్చి కలలో భార్య కని పించిందని, తాను సెవెన్ సీటర్ ఎక్కానని ,ఎక్కినప్పుడు ఖాళీ గానే ఉందని ,కాసేపటికి చూస్తె జనం కని పించారని వారంతా శావాల్లా కన్పించారని అప్పుడు తాను శవ వాహనం లో ఎక్కి నట్లు తెలిసిందని అన్నాడు .రోజుకో నిద్ర మాత్ర వేసుకోమని రాసిచ్చి పంపాడు .మళ్ళీ రెండు రోజులకే వచ్చాడు శరత్ .సెవెన్ సీటర్ లోంచి దిగాలన్నా దిగ లేక పోతున్నానని ఏడి చాడు .నెమ్మదిగా విషయం రా బట్టాడు .భార్య తన వైపు చూసి రమ్మంది .తాను కదలాననుకొన్నా కదల లేక పోయాడట .భార్య లో భయం స్పష్టం గా కని పించింది అట .లారీ వేగం గా వస్తోందని ,అది సెవెన్ సీటర్ ని ఢీ కొట్టి భార్య గాల్లోకి ఎగి రిందని మెలకువ వచ్చే సరికి తాను రోడ్డు మీదే ఉన్నట్లు ,బ్రతికే ఉన్నట్లు సెవెన్ సీటర్ లోనే ఉన్నట్లు చెప్పాడు .శరత్ లో రోజు రోజుకీ భయం పెరిగి పోతోందని గ్రహించాడు .
రెండు రోజుల తర్వాత ప్రోఫెసర్ నుంచి ఫోన్ వచ్చింది రచయిత పంపిన పేషెంట్ ఏడీ అని అడిగాడు .ఇంతలో తలుపు తట్టి ఇన్స్పెక్టర్ లోపలి వచ్చి శరత్ తనకు తెలుసా అని అడిగాడు తన పెషంటేనని,మానసిక రోగి అని చెప్పాడు .అతడు నిన్ననే మరణించాడని చెప్పాడు ఇన్స్పెక్టర్ .ఎలా అని సందేహం వెలి బుచ్చితే అతన్ని ఎవరో కసి తీరా బల మైన ఆయుధం తో కొట్టి నుజ్జు నుజ్జుచేసి నట్లు కన్పించిదన్నాడు .నిద్ర మాత్రల వల్ల మరణించాడని తెలిసిందని ,మరణించిన వాడిని కొట్టి చంపాల్సిన అవసర మేమిటో అర్ధం కాలేదని ఇన్స్పెక్టర్ చెప్పాడు .శరత్ భార్య చని పోయినప్పటి నుంచి చాలా ‘’డిస్టర్ బెడ్ గా’’ ఉన్నాడని రచయిత చెప్పాడు కాసేపట్లో ఇన్స్పెక్టర్ వెళ్ళి పోయాడు .
డాక్టర్ రచయిత ఎదురు గా ఉన్న సీటు వైపుకు చూశాడు .సీట్లో శరత్ కుమార్ కూర్చుని ఉండటం ఆశ్చర్యమేసింది .అతని పక్కన ఒక అమ్మాయి కూడా కని పించింది .ఇద్దరు రచయిత ను చూసి పలకరింపు గా నవ్వారు .రచయిత డాక్టర్ కుర్చీ లోంచి లేచి భయం తో పరి గేత్తాలను కొన్నాడు .కానీ తాను ఉన్నది తన ఆఫీసులో కాదువేగం గా పరి గెత్తు తున్న సెవెన్ సీటర్‌లో .
ఈ కధ ‘’మాజిక్ రియలిజం ‘’ద్వారా సృష్టించిన హారర్ కధ అని కస్తూరి మురళీ కృష్ణ చెప్పారు .
ఇలా మొత్తం పది హేను కధలున్నాయి .ఏదో వాచవి కి రుచి చూపించాను .అందులోని కొత్తదనపు కస్తూరి గుబాళింపు నీ ఆఘ్రాణింప జేశాను .ఇక మీరే మిగిలినవి చదివి భయ పడతారో,భయ పడి పారి పోతారో ,ఔరా !అని ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్య పోతారో ,అద్భుతః ,ఆదరహా అనుకొంటారో ,ఆ సృజన లో లీనమై పరవశిస్తారో మీ ఇష్టానికే వదిలి పెడుతున్నాను .
హారర్ కదల పరిచయం ఇంతటితో సమాప్తం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –21-1-13-ఉయ్యూరు