సింఫనీ మాంత్రికుడు బీథోవెన్
జర్మనీ సంగీతానికి అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలు తెచ్చిన వాడు సింఫనీ విజార్డ్ (మాంత్రికుడు )అని పించుకొన్న వాడు లుడ్విగ్ వాన్ బీథోవెన్ .సంగీత కుటుంబం లో 16-12-1770 లో జన్మించాడు .తండ్రికి పుట్టిన అనేక మంది సంతానం లో చివరికి మిగిలిన వాడు ఈ పెద్ద కొడుకు ఒక్కడే .మోజేర్ట్ అనే సంగీత విద్వామ్శుడి జీవితం లాగానే బీథోవెన్ చిన్నతనమూ గడిచింది .బీథోవెన్ జన్మించిన నాలుగేళ్ళకు కాస్పార్ కారల్ ,ఆరేళ్లకు నికోలాస్ జోహాన్న్ అనే సంగీత విద్వాంశులు జర్మనీ లో పుట్టారు .బీథోవెన్ తాత ఆర్చి బిషప్ ఎలేక్టార్ఆఫ్ కోలేన్ వద్ద సంగీత దర్శకుడు .(కాపిల్ మినిస్టర్ )ఈయన దర్బారు రైన్ నదీ తీరం లో ఉన్న బాన్ గ్రామం లో ఉంది . .ఇది చాలా చిన్న మురికి కూపం .అయితేనేం చాలా ప్రాముఖ్యం సంత రించు కొన్న గ్రామం .ఆర్చి బిషప్ చాలా శక్తి వంతుడు .300 మంది రాజ ప్రముఖులకు అంటే జర్మనీ మొత్తానికి అధికారి .ఆయన కోర్టు చాలా విలాస వంతం గా ఉండేది .ఇతర అరిస్టోక్రాట్స్ లాగా,ఈయనా స్వంత ఆర్కెస్ట్రా ను పోషించాడు .ఎప్పుడూ ఎవరో ఒకరు అతిధి గా ఉండే సంస్థానం అది .
బీథోవెన్ తండ్రి ఈ బిషప్ కొలువు లోనే పాటగాడు .వాద్య అసంగీతం లో నిపుణుడని పించుకోలేక పోయాడు .1767లో మేరియా మాగ్దలీనా అనే విధవ రాలిని వివాహం చేసుకొని Rhein gasse అనే చోట ఒక అద్దె కొంప లో ఉండే వాడు .తండ్రి బీథోవెన్ ను మొజార్ట్ మార్గం లో ప్రయాణం చేయమని చిన్నప్పటి నుంచి ఒత్తిడి చేసే వాడు .బీథోవెన్ కూడా మొజార్ట్ లాగానే‘’బాల మేధావి ‘’.చాలా చిన్నతనం లోనే కొడుక్కి పియానో ,విడేన్ వాయిద్యాలు వాయించటం నేర్పాడు .గంటల కొద్దీ సాధన చేయించే వాడు .అలసట చెంది బీథోవెన్ సోమ్మసిలి పడి పోయి ఎడ్చేసే వాడు .అయినా తండ్రికి కనికరం ఉండేది కాదు .ఎడేల్లకే కొడుకు తో మొదటి సంగీత ప్రదర్శన నిప్పించాడు తండ్రి ..బీథోవెన్ స్థానిక ప్రాధమిక పా ఠశాలలో మూడేళ్ళు మాత్రమె చదివాడు .అందుకే అతని రాతల్లో స్పెల్లింగ్ మిస్టేకులు చాలా ఉండేవి .విరమ చిహ్నాలుసరిగ్గా వాడటం రాలేదు .లెక్కలు కూడా చెయ్యటం వచ్చేది కాదు .పెద్ద వాడైనా ఇదే పరిస్తితి .అందరితో కలిసి ఉండే వాడు కాదు .అతన్ని చూసి అందరు ‘’how dirty you look ?’’అని ఈస డించే వారట .ఈ విషయాన్ని గుర్తుంచుకొని బీథోవెన్ ‘’నేను పెద్ద మనిషిగా చేలా మణి అవుతున్నప్పుడు ఏమి తేడా కని పిస్తోంది నా ఆకారం లో ?దీన్ని ఎవరు గుర్తించటం లేదు ‘’అని బాధ పడే వాడు .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –22-1-13-ఉయ్యూరు