తెన్నేరు సమావేశం –సమీక్ష

 తెన్నేరు సమావేశం –సమీక్ష

  2011 డిసెంబర్ 13 వ తేదీ మంగళ వారం మచిలీ పట్నం లో శ్రీ కోసూరు ఆదినారాయణ ఇంట్లో విశ్రాంత ప్రధానోపాధ్యాయులం ఇరవై మంది మొదటి సారిగా సమావేశామైనాం .కృష్ణా జిల్లాలోను ,రాష్ట్రం లోను విద్యా వికాస దీప్తికి మనవంతు సహాయం సేవలను అందించాలని నిర్ణ యించాం .ఈ వేదికకు ‘’విద్యా వికాస పరిషత్ ‘’అని పేరు పెడితే బాగుంటుంది అన్న నా సూచనను అందరూ ఆమోదించి ఖాయం చేశారు .ఈ సంస్థ అటు ప్రభుత్వానికి ,ప్రజలకు విద్యార్ధులకు ,తలిదండ్రులకు వారధి గా పని చేయాలని భావించాం .అప్పటి నుండి మళ్ళీ కలిసి మాట్లాడుకొందామని అనుకొన్నా దాదాపు సంవత్సర కాలం ఇట్టే కదలి వెళ్ళింది .

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

 

            కృష్ణా జిల్లా తెన్నేరు వాస్తవ్యులు ,సాంఘిక సేవాభిలాషులు విద్యా వ్యాసంగం పై అపార మైఉన అభి రుచి ఉన్నవారు గొప్ప సాహితీ ప్రియులు అయిన శ్రీ దేవి నేని మధుసూదన రావు గారి పూనికతో  మాజీ ప్రధానో పాద్యాయులు పూర్వపు ప్రధానో పాధ్యాయ సంఘానికి కార్య దర్శి శ్రీ కోసూరు ఆది నారాయణ రావు చేదోడుతో మళ్ళీ మధుసూదన రావు గారింట్లో రెండవ సమావేశం ఈ నెల ఇరవై రెండవ తేదీ మంగళ వారం జరిపాము .మా అందరికి కురు పితామహులు అని భావించే కవి, కధా రచయితా ,విశ్లేషకులు ,మాజీ ప్రధానోపాధ్యాయులు ఎనభై ఏళ్ళ జ్ఞాన వయో వృద్దు శ్రీ సోమంచి రామం గారు మాకందరికీ ఆదర్శం .ఆయన కూడా రెండు సమావేశాల్లో సింహ భాగపు పాత్ర నిర్వహించారు .,నేను మొదటి సారిగా సైన్స్ మేస్టర్ గా పని చేసిన మోపిదేవి హైస్కూల్ లో నా మొదటి ఎస్.ఎస్.ఎల్.సి విద్యార్ధిని ,మాజీ ప్రధానోపాధ్యాయిని శ్రీ మతి కొల్లి భారతీ దేవి ,పటమట హైస్కూల్ మాజీ ప్రధానోపాధ్యాయిని ,కామన్ ఎక్సామినేషన్  మాజీ సెక్రెటరి ,విద్యా లయ నిర్వహణలో అందరి ఆదర్శ ప్రాయులు అయిన శ్రీ మతి ప్రమీలా రాణి ,అంగ లూర్ మాజీ ప్రధానోపాధ్యాయులు శ్రీ రాజేంద్ర ప్రసాద్, భార్య శ్రీమతి సుగుణ కుమారి ,పటమట మాజీ ప్రధానో పాద్యాయులు శ్రీ సీతా రామయ్య , విజయవాడ మాజీ ప్రధానోపాధ్యాయులు శ్రీ కామేశ్వర రావు ,కాజ మాజీ శ్రీ శర్మ ,మాజే హెచ్.ఏం.శ్రీ విశ్వం ,మచిలీ పట్నం హైనీ స్కూల్ మాజీ శ్రీ మోసెస్ ,గోదావరి జిల్లా నుంచి రాజు గారు, ఆదినారాయణ భార్య ,మధుసూదన రావు గారి భార్య శ్రీమతి జయశ్రీ ,అడ్డాడడ మాజీ అయిన నేను మొత్తం పదారుమందితో బాటు శ్రీ సాయి రమేష్ అనే స్వతంత్ర భారతి నిర్వాహకులు ,మానేడు మాక ఎలిమెంటరి ఉపాధ్యాయులు శ్రీ డేవిడ్ రాజు పాల్గొన్నారు .

            మొదటగా అందరికి ‘’చక్రాల్లాంటి గుండ్రటి మినీ వడలు  ‘’టిఫిన్ పెట్టి తెన్నేరు స్పెషల్ అయిన లెమన్ తేనీరు (పాలు కలప కుండా )ఇచ్చారు రావు దంపతులు .ఆ తర్వాత ఎజెండా లోని విషయాలను చర్చించాం .మొదట గా మధు సూదన రావు గారు సిద్ది పేట దగ్గర ఉన్న ఇబ్రహీం పూర్ ప్రాధమిక ప్రైవేట్ విద్యాలయం లో ఆడుతూ పాడుతూ తెలుగు ను ఎలా నేర్పుతున్నారో తాను వెళ్ళి తెలుసుకొని ఆనందిమ్చానని వివరం గా వారక్కడ చేసిన కృషి ని తెలియ జేశారు  .ఆటలే పా ఠాలుగా నేర్పే విదానం ,అక్షర కల్ప వృక్షం ప్రయోగాలను చూసి ముచ్చట పడ్డానని తన అనుభవాలను పూస గుచ్చి చెప్పారు .

                తెలుగు భాషాసామర్ధ్యాన్ని పెంపొందించటానికి ఏమి చేయాలి అన్న విషయం పై అందరు స్పందించి తమ అభి ప్రాయాలను వెలి బుచ్చారు ఇంటిలో తలిదండ్రులు తప్పక పిల్లలతో తెలుగు లోనే మాట్లాడాలని ,బంధుత్వాలను పిల్లకు తెలియ జేయాలని వినికిడి వల్ల భాష బాగా వస్తుందని ,పద్యాలు ,పాటలతో వారిని ఆకర్షించాలనే అభిప్రాయం అందరిది నేను మాట్లాడుతూ కొన్ని నెలల క్రితం బాంకాక్ లో జరిగిన ప్రపంచ భాషల లిపుల పై జరిగిన సమావేశం లో కొరియా భాష మొదటి స్థానం లోను ,తెలుగు భాష రెండవస్థానం లోఉందని నిపుణులు తేల్చారని చెప్పాను 

        స్కూళ్ళల్లో ఆంగ్ల బోధనను మెరుగు పరచే విధానం మీద జరిగిన చర్చలో ప్రభుత్వం ఆంగ్ల పా ఠ.శాలలను స్వయం గా నిర్వహించి ఆదర్శ ప్రాయం కావాలని సూచించాం .ఉపాధ్యాయుల బోధనా సామర్ధ్యాన్ని పెంచటం ఎలా అన్న దానిపై స్కూల్ కాంప్లెక్సులు ఉత్తేజ వంతం గా నిర్వహించి ఉపాధ్యాయుల బోధనా పాటవాన్ని పెంపొందించాలని ‘’విద్యా వికాస పరిషత్ ‘’సేవలను మండల ,జిల్లా స్థాయి లో విని యోగించుకోవాలని తెలియ జేశాం .

      పాఠశాల ప్రణాళిక లను తయారు చేయటానికి గ్రామం లోని విద్యాలయాలనన్నిటిని ఒకే యూనిట్ గా చేస్తే ఫలితాలు ఉంటా యని చెప్పాం .విద్యార్ధులు విద్య నేర్వటానికి అనేక సృజనాత్మక పద్ధతులను అవలంబించాలని వారిని ఉన్ముఖులను చేయటం ఇష్టం తో తెలుగు నేర్పాలని  ఇది చాల ముఖ్యమని భావించాం .

          పదవ తరగతి తర్వాత ఏమి చెయ్యాలి ,యే కోర్సు తీసుకోవాలి అన్న విషయం పై చర్చిస్తూ తొమ్మిదో తరగతి లోనే కెరీర్ గైడెన్స్ ఇవ్వాలని దీనికి తలిదండ్రులను కూడా ఆహ్వానించి వారికి కూడా అవగాహన కల్పించాలని సూచించాం .

   నాట్యా చార్య ,ప్రయోక్త ,పాత్రికేయులు ,ఆకాశ వాణి వార్తా పా ఠకులు ,సాంస్కృతిక చైతన్య వేదిక నిర్వాహకులు శ్రీ సూరవరపు సాయి రమేష్ తాము చేస్తున్న కృషిని అందరికి వివరించి చెప్పారు .అంకిత భావం తో పని చేస్తే తక్షణ ఫలితాలు రావటం ఖాయం అనే ధృఢ విశ్వాసాన్ని కల్గించారు .

          తేన్నేరుకు ఆరు కిలో మీటర్ల దూరం లో ఉన్న మానేడు మాక ప్రాధమికోన్నత విద్యాలయం ఉపాధ్యాయులు శ్రీ డేవిడ్ రాజు తమ విద్యార్ధులను తీసుకొని వచ్చి ఆంగ్ల పద్యాలను ,కమ్మని తెలుగు పద్యాలను విద్యార్ధులతో పాడించి అందరి అభిమానాన్ని పొందారు .విద్యార్ధినీ విద్యార్ధినులు ఉచ్చారణ దోషాలు లేకుండా పాడటం బాగుంది ఆంగ్ల పద్యాలను చక్కని రైమింగ్ లో పాడి ముచ్చట గోలిపారు .ఈ సమావేశం లో పాల్గొన్న వారందరికి ,,విద్యార్ధులకు ,మొత్తం ఇరవై  నలుగురికి సరస భారతి ముద్రించిన ‘’శ్రీ హనుమ కధా నిది ‘’మరియు ‘’ఆదిత్య హృదయం‘’పుస్తకాలను కానుక గా అంద జేశాను .ఇప్పటికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది .అందరికి జయశ్రీ దంపతులు భోజనాలు ఏర్పాటు చేసి స్వయం గా  వడ్డించి ,కొ సరి కొసరి తిని పించి, ఆత్మీయతను ,ఆతిధి మర్యాదను చూ పించారు.పదార్ధాలన్నీ మధుసూదన రావు గారి పెరటి లో పండిన కాయ గూరలతోనే చేయటం వారి చేలో పండిన దాన్యాన్నే ఒంటి పట్టు బియ్యం తో అన్నం వండి వడ్డించటం బాగుంది రుచికరం గా ఉన్నాయి అన్నీ .ముద్దపప్పు ,దొండ వేపుడు ,కాకర వేపుడు ,అరటికాయ కూర మిరపఖారం ,నల్లేరు ఆకు పచ్చడి ,అప్పడాలు వడియాలు ,ముక్కల పులుసు రసం ,కారట్ ,ఉల్లి కలిపిన పెరుగన్నం ,గడ్డ పెరుగు ,స్వచ్చమైన ఖమ్మాని నెయ్యి తో అందరం కడుపు నిండా లాగించాం .ఒంటి పట్టు బియ్యం అన్నాన్ని చూసి ఆతిధేయ దంపతులతో ‘’పంచదార లేని సత్య నారాయణ ప్రసాదం‘’లాగా ఉందని జోకాను .నవ్వారు .సమావేశం లోను ఆ తర్వాత విశ్వం మధ్య మధ్యలో తెలుగు పద్యాల సౌరు వినిపించి అనుభూతి కల్గించాడు .కలకత్తా రస గుల్లా స్వీట్ గా వడ్డించి తినిపించి దొడ్డిలో ని తమలపాకులతో,  కొన్న వక్క పొడితో ,తాంబూల చర్వణం చేయించారు దంపతులు .జయశ్రీ గారి మిత్రురాలు కూడా సరదాగా మాతో పాటు పాల్గొని ఆమెకు సాయం చేశారు .

              భోజన విరామ సమయం తర్వాత అదే హాలులో అందరం మళ్ళీ సమావేశమయ్యాం .మిగిలిన విషయాలపై చర్చించాం .పద్య పఠనాన్ని బాగా ప్రోత్స హించాలని ,నేర్పిన ఉపాధ్యాయులకు పాడిన విద్యార్ధుల పాటవాలను గుర్తించి ప్రోత్సాహకాలను మనం అంద జేయాలని , సిద్ది పేట దగ్గరి ఇబ్రహీం పూర్ విద్యాలయాన్ని మన జిల్లా అధికారుల దృష్టికి తెచ్చి ,ఆ విద్యార్ధులను ,ఆ ఉపాధ్యాయులను ఇక్కడికి రప్పించి కనీసం కొన్ని స్కూళ్ళలో నైనా విద్యార్ధులకు ప్రేరణ కల్పించాలి అని నేను చెప్పిన దాన్ని అందరు ఆమోదించారు .బయో మెట్రిక్ అటెండెన్స్ వల్ల పెద్ద గా ప్రయోజనం ఉండదని ఏకాభిప్రాయం గా తెలిపాం .మధ్యాహ్న భోజనం ను ఉపాధ్యాయుల పై రుద్ద రాదనీ వాటికోసం కట్టే బిల్డింగులు నాణ్యత లేనివని డబ్బు మంచి నీళ్ళు గా ఖర్చు చేస్తున్నా పౌష్టికా హారాన్ని విద్యార్ధులకు అందివ్వలేక పోతున్నారని అభిప్రాయ పడ్డాం .కనుక స్వచ్చంద సంస్థల సాయం తీసుకొని మండలం లో ఏదో ఒక చోట వండే ఏర్పాటు చేయించి ప్రతి పాఠ శాలకు ఆటోలలోనో వెహికల్స్ లోనో చేర వేసి భోజనం పెడితే బాగుంటుందని సూచించాం .విద్యార్ధులచేత అధికం గా ఇంపోజిషన్ రాయించే పద్ధతికి స్వస్తి చెప్పాలని కోరాం .ప్రాధమిక విద్యాలయాలలో గ్రేడింగ్ ను ప్రతి అంశం మీదా చేయటం అనేది ఉపాధ్యాయుని పై పని భారం పెంచటమే కాక ,విద్య నేర్పించటం తగ్గి పోతుందని పాఠాలు చెప్పటానికి తగినంత శ్రద్ధ చూపటానికి సమయం చాలటం లేదని ఆ భారం తగ్గించాలని ఇతర దేశాలో చూసిన పద్ధతులను ఇక్కడ అమలు బరచటం పులిని చూసి నక్క వాత పెట్టుకోవటమే నని డేవిడ్ రాజు గారు చెప్పిన దానితో అందరం ఏకీ భావించాం .మధ్యాహం మూడున్నరకు అందరికీ తేనీరు –ఈ సారి మామూలు టీఇచ్చి కొంత అలసట పోగొట్టారు. నాలుగింటికి సమావేశం ముగిసింది .ముగింపు మాటలు మాట్లాడుతూ నేను ‘’ఈ సమావేశం సరిగ్గా ఏడాది నలభై రోజుల తర్వాత మళ్ళీ జరిగిందని ,ఈ రోజు వ్యావహారిక భాషోద్యమ నాయకులు స్వర్గీయ గిడుగు రామ మూర్తి గారి వర్ధంతి కావటం మరీ విశేష ప్రాముఖ్యం అనీ , చాలా కాలానికి ప్రమీలా రాణి గారు రావటం అందరికి సంతోషం గా ఉందని, యే జిల్లాలోను మాజీ ప్రధానోపాధ్యాయులు ఇలా ముందుకు వచ్చి విద్యా భి వృద్ధికి సామూహికం గా కృషి చేస్తున్న దాఖలాలు లేవని ,మన కృష్ణా జిల్లాలోనే ఇలా జరగటం హర్షణీయమని ,గర్వించ దగిందని చర్చలో అందరు పాల్గొని విలువైన సూచనలు చేశారని, శ్రీ మధు సూదన రావు దంపతులు తీసుకొన్న ప్రత్యెక శ్రద్ధ కు ధన్యవాదాలని ఇలాగే మళ్ళీ త్వరలోనే సమావేశం నిర్వహించుకోవాలని ,ఈ సమావేశ వివరాలు జిల్లా విద్యా శాఖాధి కారి గారికి ,జిల్లా పరిషత్ విద్యా ధి కారిగారికి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని ,ఈ వేదిక ప్రభుత్వం చేసే అన్ని రకాల విద్యాభి వృద్ధికి మన తోడ్పాటు గా ఉంటుందని వారికి  తెలియ జేయాలని ,శ్రీ రమేష్ గారి సేవలను విద్యా ,భాషా సాంస్కృతిక వృద్ధికి ఉపయోగించుకోవాలని ,శ్రీ మధు సూదన రావు గారు చేసే అన్ని రకాల ‘’ఆపరేషన్ మధు ‘’కార్య క్రమాలు   మన’’విద్యా వికాస పరిషత్ ‘’ చేస్తున్న కార్య క్రమాలుగానే భావిద్దామని ,వారికి మన పూర్తి సహాయ సహకారాలను అందిద్దామని చెప్పాను .మధు సూదన రావు దంపతులకు అందరం కలిసి జ్ఞాపికను, స్వీట్ లను అందించి, కృతజ్ఞతలు తెలియ జేసుకోన్నాం .కమ్మని జ్ఞాపకాలతో ,అనుభూతి తో ,ఆత్మీయతతో ఇంటికి బయల్దేరాం .విశ్వం కారులో నేనూ ఆదినారాయణ  భార్య ఉయ్యూరు వచ్చాం ఇంటికి ఆహ్వానించి కాఫీ ఇచ్చి ఫోటోలు దిగి వారికి వీడ్కోలు పలికాము మా దంపతులం

                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23-1-13-

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సభలు సమావేశాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.