సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -5
ఒక వైపు చెవుడు ,ఇంకో వైపు విఫల ప్రేమ .అయినా బీథోవెన్ సంగీత కచేరీలకు, సాధనకు ,ప్రయోగాలకు ఇబ్బందేమీ కలుగలేదు ముందుకే దూసుకు పోయాడు .1801 మార్చి లో బాలేప్రదర్శన కోసం a set of string quarters and string quintet ను చేశాడు .దీని పేరు ‘’ఆరో మేతియాస్ ‘’బెర్గ్ ధియేటర్ లో ప్రదర్శించాడు దీనిని .తర్వాత స్ప్రింగ్ అండ్ సుమ్మేర్ ను హీలిజన్ స్తాద్ట్ అనే పల్లె టూరిలో రాశాడు .ఈ వూరు వియన్నాకు వెలుపల ఉంది ఆరోగ్యం బాగు పడుతుందని ఇక్కడికి వచ్చాడు .నిత్యం నడకా ,అడవిలోని ప్రకృతి దృశ్యాలు ,డాన్యూబ్ నడి అందాలు ,కార్పాతియాన్ పర్వతాల సోయగం ఆయనకు పరమ మనోహరం అని పించాయి .ఇంకో సింఫనీ పూర్తి చేశాడు .మూడు వయోలిన్ సోనాటాలు ,రెండు పియానో సోనాటాలు ,చిన్న చిన్న పియానో స్వరాలు కూర్చాడు అయితే చెవి పరిస్థితి లో ఏమీ మార్పు రాలేదు .ఇక్కడ ఒంటరితనం విప రీతం గా బాధించింది .ఈ పరిస్తితిని భరించలేక తమ్ముళ్ళకు జాబు రాశాడు .ఈ ఉత్తరం బీథోవెన్ మరణించిన తర్వాత బయట పడింది .అందులోని సారాంశం .’’మానవ సమాజం లో నాకు ఆనందం లేదు .చక్కని సంభాషణ కు నోచుకో లేదు నేను .పరస్పరనమ్మకాలు కరువయ్యాయి ..వెలి వేయ బడ్డ వాడిలా నా పరిస్థితి ఉంది .దూరపు వేణు నాదం ,గొల్ల వారి పాటలు ,ఏదీ వినలేక పోతున్నాను .నిరాశ నిలువునా ఆవహించింది .నా జీవితాన్ని సమాప్తం చేసుకోవాలను కొంటున్నాను .భగవంతుడు నాతో చేయించ దలచుకొన్న దాన్ని పూర్తి చెయ్యకుండానే చని పోతానేమో నని దిగులు గా ఉంది .ఓపిక ఒక్కటే (పేషన్స్ ) నాకు దారి చూపాలి .భగవాన్ !ఒక్క రోజైనా మంచి జీవితాన్ని ఇవ్వు .దీన్ని చాలా కాలం నాకు దూరం చేశావు .నిరాశ లో నిలువెత్తు లోతుకు కూరుకు పోయాను .’’.దీన్ని 1802 లో రాశాడు .పాపం ఎంత మానసిక క్షోభ అనుభ విన్చాడో ఆ మహాను భావుడు ?
మళ్ళీ ధైర్యం తెచ్చుకొన్నాడు .వియాన్నకు చేరాడు .తాను అనుకొన్నది సాధించే ప్రయత్నాలు తీవ్రతరం చేయటం ప్రారంభించాడు .విపత్కర పరిస్తితుల్లోను ధైర్యం గా ముందుకు సాగాలని ద్రుఢం గా సంకల్పించుకొన్నాడు బీథోవెన్ .కుంగి పోతే అందరు వెక్కి రిస్తారే తప్ప ప్రోత్స హించరని గ్రహించాడు .
వీరోచిత పోరాటం
బీథోవెన్ చేసిన కచేరీలన్నీ బహుళ ప్రాచుర్యం పొందాయి .దిన దిన ప్రవర్ధ మానం గా అతని సంగీతం భాసించింది .యువరాజు నెల జీతం బాగానే అంద జేస్తున్నాడు .వియన్నాలో మంచి ధియేటర్ కోసం ఒక ఒపేరా రాయమని కోరాడు దానిలో తన కచేరీ ఏర్పాటు చేసుకోవ టానికి అవకాశం కల్పించాడు .1803 ఏప్రిల్ అయిదున బీథోవెన్ కొత్త Oratorio –‘’christ on the mount of Olvis ‘’అనే దాన్ని ‘’ధియేటర్ ఆండర్వీన్‘’లో రెండు గంటల ప్రదర్శన గా నిర్వహించాడు .ఇందులో ఒక గంట ఒరాశియో నుంచి కొన్ని భాగాలు ఉన్నాయి .దీనిలో మొదటి రెండవది అయిన సిమ్ఫనీలు ,కొన్ని గాత్ర స్వరాలు ,ఒక కొత్త పియానో కచేరీ ఉన్నాయి .ఉదయం ఎనిమిది గంటలకు రిహార్సల్ ప్రారంభమై సుదీర్ఘం గా సాగింది .అసలు కచేరీ సాయంత్రం ఆరు గంటలకు మొదలైంది .బీథోవెన్ అదృష్టం –ఆ రోజుల్లో ముజీషియన్ యూనియన్ లేదు .బీథోవెన్ కు పియానో భాగం రాసే తీరికే దొరకలేదు .జ్ఞాపకం ఉన్న మేరకు తంటాలు పడ్డాడు అందులో తప్పులూ చేశాడు .1800 ఫ్లారిన్స్అంటే 6000 డాలర్ల డబ్బు వచ్చింది . .ఇది ఆనాడు చాల భారీ ధన సంపాదనే .విన్న వారు కొందరు చాలా సుదీర్ఘం గా ,బోరింగ్ గా ఉంది అన్నారు .అంత గొప్ప కచేరీ అని అని పించుకోలేదు .డబ్బు వచ్చినా మెప్పు రాలేదు .
ఒక నెల తర్వాత ఒక ‘’half black violinist ‘’అయిన జార్జి బీ రిద్జిటవర్ తో కలిసి గొప్ప వయోలిన్ సొనాటా ఇచ్చాడు .దీని పేరు Kreutzer .ఇది ఫ్రెంచ్ వయోలనిస్ట్ అయిన రోడాఫ్ క్రద్జేర్ పేరు .ఆ యనకే అంకితమిచ్చాడు బీథోవెన్ .న్యాయం గా బ్రిడ్జి టవర్ కే అన్కితమిస్తాడు అనుకొన్నారు అందరు .కాని వీరిద్దరికి మనస్పర్ధలు రావటం తో బీథోవెన్ ఆయనకు అన్కితమిచ్చానని చెప్పాడు .
మళ్ళీ బీథోవెన్ కు పల్లె టూరి మీద ధ్యాస మళ్ళింది .వియన్నా దగ్గరున్న obedoblingఅనే పల్లెటూరుకు చేరి కొంతకాలం గడిపాడు .కొత్త సింఫనీ రాయటం ప్రారంభించాడు .దీనికి Bonaparte అని నెపోలియన్ పేరు పెట్టాడు .నెపోలియన్ ఫ్రాన్సు రక్షకుడని భావించి ఆరాధించాడు .అందుకే ఆ పేరు పెట్టాడు .1804 లో నెపోలియన్ తానే ఫ్రాన్సు చక్ర వర్తిని అని ప్రకటించుకొన్నాడు .అంతే ఒక్క సారిగా బీథోవెన్ తన అభిప్రాయాన్ని మార్చేసుకొన్నాడు టైటిల్ పేజీని రెండు ముక్కలుగా చించి పారేశాడు .1806 లో దీనినే ప్రచురించి యువరాజుకు అంకితమిచ్చాడు .అర్ధ వంతం గా ‘’to celebrate the memory of a great man ‘’అని నెపోలియన్ పేరు లేకుండా నే అతన్ని కీర్తించాడు .దీనికి ‘’Erocia ‘’అని కొత్త పేరు పెట్టాడు .ఇందులో ఉన్నది వీర గాధా వృత్తాంతం .ఇప్పటి దాకా వచ్చిన సిమ్ఫనీలలో సుదీర్ఘ మైనది .సరిగ్గా చెప్పాలంటే మోజేర్ట్ రాసిన వాటికి రెట్టింపు పెద్దది .చాలా పెద్ద ఆర్కెస్ట్రా కావాలి దీన్నినిర్వ హించటానికి .మూడు హారన్ లు కావాలి .మామూలు గా రెండు సరిపోతాయి .రెండో మొమేంట్ చాలా శక్తి వంతమైనది .అది యూరప్ ఆశలకు మరణ సంకేతం .అంతేకాక భవిష్యత్తు లో ఇంకా మెరుగైన పరిస్తితులకోసం ఆశా భావం కన్పిస్తుంది ,మొదటి సారిగా దీన్ని ప్రదర్శించినపుడు దీనిలోని అంతరార్ధమేమిటో చాల మందికి అసలు తెలియనే తెలియ లేదు .అయితేనేం‘’strtling and beautiful passages ‘’అన్నారు .కొందరు మరీ సాగాదీశాడన్నారు .దీన్ని ఎక్కడ ఆపేయాలో బీథోవెన్ కు తెలీలేదు .ఒక శ్రోత లేచి ‘’I will pay another kruetzer if only the wretched piece would finish ‘’అని తీవ్రం గా అనటం విని పించింది .అయితే ఇది బానే పండింది ఈ హీరోయిక్ మూడ్ ను కొంతకాలం ఇలానే కోన సాగించాడు బీథోవెన్ .
సశేషం
రిపబ్లిక్ దిన శుభాకాంక్షలతో
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –26-1-13-ఉయ్యూరు