సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -6

  సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -6

   బీథోవెన్ హీరోయిక్ మూడ్ లో చేల రేగి ముందడుగు వేస్తూనే ఉన్నాడు .పియానో ,వయోలిన్ ,సెల్లో లకు రాసిన ట్రిపుల్ కాన్సేర్ట్ లో రెండు పెద్ద పియానో సోనాటాలు ,తన స్వంత ఒపేరా ఫిడేలియో కూడా చేశాడు .ఫిడేలియో ప్లాట్ ను ఫ్రెంచ్ నాటకం నుండి గ్రహించాడు .అది రివల్యూషన్ కాలపు కధ .ఒక భార్య వీరోచిత గాధ .భర్తను రక్షించుకోవటానికి ఆమె పడిన తీవ్ర మనో వ్యధ ,సాహసంకన్పిస్తాయి .కధ గొప్ప పేరు పొందింది .దానితో చాలా మంది ఇప్పటికే ఒపెరాలు చేశారు .రాజకీయ పరిస్తితులకు అనుగుణం గా (అప్పటికే ఫ్రెంచ్ సైన్యం వియన్నాను కబళించటానికి వచ్చేస్తోంది ). బీథోవెన్ రివల్యూషనరీ ఫ్రాన్సు నుంచి కధను పదహారవ శతాబ్దపు స్పెయిన్  దేశానికి మార్చాడు .ఇందులో హీరో ఒక ఫ్రీడం ఫైటర్ .అధికారులు సహించలేక జైలు లో పెట్టారు .భార్య లేనోర్ ప్రమాదం లో ఉంది .భర్తను రక్షించుకోవటానికి తీవ్ర ప్రయత్నం చేస్తోంది .మగ వాడి వేషం వేసుకొని జైలర్ కి అసిస్టంట్ గా చేరింది .పిజారో అనే దుష్ట జైలు గవర్నర్ జైల్లో ఉన్న ఫ్లారేస్తాన్ ను చంపేయాలని పన్నాగం పన్నాడు .చివరికి లేనోర్ అతడి నుంచి భర్తను కాపాడుకోంది.అప్పుడే మినిస్టర్ వస్తున్నట్లు ట్రంపెట్లు మోగాయి .ఆయన జైలు తనిఖీ కి వస్తున్నాడు .అసలు విషయం తెలిసిన మినిస్టర్ పిజారో ను అరెస్ట్ చేసి ఖైదీలను విడి పించాడు .భార్య ,భర్త మళ్ళీ కలుసుకొన్నారు .ఇదే బీథోవెన్ ‘’ideal woman brave and loyal ‘’.బీథోవెన్ మొజార్ట్ చేసిన ‘’cosi fan tutee ‘’నచ్చలేదు .ఇందులో మొజార్ట్ చంచల స్వభావం గల ఇద్దరు ఆడపిల్లలను పాత్రలను చేసి ఒపేరా రాశాడు ..ఆ భావమే నచ్చలేదు బీథోవెన్ కు .అదీ వీరిద్దరి మధ్యా ఉన్న ఆయాలోచనా సరళి కి ఉన్న అంతరం .

            1805 లో వియన్న ప్రజలు భయ విహ్వలు లయ్యారు .నెపోలియన్ సైన్యాలు సాల్జ్ బర్గ్ చేరాయి .అరిష్టాక్రసి అంతా కలిసి తుపాకులన్నిటిని నావలల్లో ఎక్కించి అందనంత దూరం పారి పోయారు .నెపోలియన్ నవంబర్ పద మూడున వియన్నాలో కాలు మోపాడు .కొన్ని వారాలు చాలా నిశ్శబ్దం గా గడిచాయి .తర్వాత ఫ్రెంచి సైన్యం ,ఆఫీసర్లతో రోడ్లన్నీ నిండి పోయాయి .ఫ్రెంచి ఆఫీసర్లు ఆర్మీ ,ఇళ్లల్లోనే ఉండి పోయారు .ధియేటర్లు అన్నీ ఖాళీ .ఒక వారం తర్వాత ‘’ఫిడేలియో ‘’ను బీథోవెన్ ప్రదర్శించాడు .దాదాపు హాలు అంతా ఖాళీ .ఫ్రెంచి ఆఫీసర్లు మాత్రమె చూశారు .మూడు ప్రదర్శనల తర్వాతా బోర్డు తిప్పేశాడు .ఈ సమయం లో 30,000 మంది ఆస్ట్రియా సైనికులు చని పోయారు .ది బాటిల్ ఆఫ్ ఆస్టర్ లిజట్  లో ‘’I made a mistake with that Bastard .’’అన్నాడు బీథోవెన్ .ఆస్ట్రియా చక్ర వర్తి నెపోలియన్ తో శాంతి ఒడంబడిక చేసుకొనటం తో వియన్నా లో మళ్ళీ ప్రజాజీవితం యధా ప్రకారం గా సాగింది .

                                   కీర్తి ప్రతిష్టలు

           చెవుడు తన ప్రగతికి అవరోధం కాదని భావించాడు బీథోవెన్ .ఫిడేలియో తో ఆగకుండా రెండు కామ్పోజిషన్స్స్ చేశాడు .అందులో మొదటిది ‘’A group of 3 un usual string quarters very long and difficult ‘’ చేశాడు .రష్యన్ రాయ బారి రేజోవిస్కి కి దీన్ని అంకితమిచ్చాడు .దీన్ని పాడుతుంటే బీథోవెన్ జోకేదో చేస్తున్నాడేమో నను కొన్నారు ప్రేక్షకులు .ఇది’’ క్రేజీ మూజిక్’’ అని పించుకోంది కాని రెండేళ్ళ తరువాత వీటికే బ్రహ్మ రధం పట్టారు సంగీత ప్రియులు .దీన్ని 1808 లో ముద్రించాడు .

            1806 .లో వేసవి కాలమంతా ప్రిన్స్ లిక్నోవిస్కీ తో ఆయన అంతఃపురం లోనే గడిపాడు .ఆయన ఈయనకు అయిదు వందల ఫ్లారిన్స్ అంటే 1680 డాలర్లిచ్చాడు .నంబర్ నాలుగు బి.ఫ్లాట్ సింఫనీ ని సమ కూర్చాడు .చిన్నదే అయినా గొప్ప ప్రభావం కల్గించింది .ఇది తన గురువు హేడెన్ కు పరోక్ష గురు దక్షిణ .ఆయేడాది చివరికి బీథోవెన్ తన అద్భుత వయోలిన్ కాన్సేర్ట్ రాసి క్రిస్మస్ ముందు వియన్నా లో ప్రదర్శించాడు .ఆ రోజుల్లో ఉన్న ఆచారాలలో క్లిమేంట్ మొదటి మొవ్ మెంట్ ను మొదటి అరగంట లో వాయించాలి .మిగిలిన రెండు కొన్ని తమాషా ticks తో రెండో సగం మధ్యలో వాయించాలి .అయితే ప్రజలకు వాటి విలువ తెలియక ఆదరించలేక పోయారు .కాని బీథోవెన్ దానినే ‘’the greatest violin concerts of all time ‘’అని పించుకొన్నాడు అదీ అతని ప్రతిభ.

              మార్చి నెలలో మళ్ళీ రెండు స్వంత కచేరీలను రాజ ప్రాసాదం లోనే ఉండి రాశాడు ..అందులో తన నాలుగు సిమ్ఫనీలు చేశాడు (జి మైనర్ –నంబర్ ఫోర్ )తో బాటు ‘’new overture to the popular play –Coriolin ‘’చేశాడు .ఇది ఒక త్యాగి కధ .రోమన్ హీరో కోరిలియానాస్ విషాద గాధ .చాలా పేరొచ్చింది దీనికి .తర్వాత లండన్ పబ్లిషర్ తో తన రచనల ప్రచురణ కు ఒప్పందం కుదుర్చుకొన్నాడు బీథోవెన్ .త్యాగ పురుషుల, ధీర వనితల  కధలు ఎన్నుకోవటం బీథోవెన్ ప్రత్యేకత .దేశం కోసం ఆలోచించే గొప్ప మన్స్తస్తత్వం .ప్రజల్ని చైతన్యం చేయటం జాగృతి చేయటం ఆయన అభిమతం .అందుకే సంగీతాన్ని గొప్ప సాధనం గా విని యోగించుకొన్నాడు

            సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –27-1-13-ఉయ్యూరు 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.