సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ –7

  సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ –7

 జన బాహుళ్యం కొసం’’ సి.’’లో మొదటి ప్రదర్శన ను రాజ సౌధం దగ్గర ఉన్న ఈసేన్ వీధి  చర్చి లో 1807సెప్టెంబర్ 13న చేశాడు .అయితే అంత సంతృప్తి నివ్వ లేదు ..తన పేట్రన్ లు దూషిస్తే సహించే గుణం మొజార్ట్ కూ లేదు బీథోవెన్ కు కూడా లేదు .వారు తమను సమాన హోదాలో చూడాలి అన్నదే ఇద్దరి అభిప్రాయం .సంగీత కారుల్ని సేవకుల్లాగా చూసే సంప్రదాయానికి ఇద్దరు వ్యతి రేకులే ..ఈ విషయం లో రాజు గారికి కోపం వచ్చి బీథోవెన్ ను రాజ ప్రాసాదాన్నించి ఖాళీ చేయించాడు .ఒక చీకటి గదిలో మిగిలిన వారితో ఉండేట్లు చేశాడు .కచేరీ అయిన తర్వాత యువరాజు జోక్ చేస్తూ ‘’నీ కచేరీ లో యేమేడ్చింది ?’’అన్నాడు .అది నిజమే .అందరు కూడా  భరింపరాని ,చెత్త ప్రోగ్రాం‘’అన్నారు .బీథోవెన్ కి విపరీతమైన కోపం వచ్చింది .అప్పటికే మత సంగీతం బాగా ప్రాచుర్యాన్ని కోల్పోయి ‘’ఔట్ ఆఫ్ ఫాషన్ ‘’అయింది .కాని బీథోవెన్ కు తన సామర్ధ్యం మీద గొప్ప నమ్మకం .తాను చేసిన కచేరి ‘’out standingly good ‘’అని పించింది .తరువాత అదే లాటిన్ నుంచి ,జెర్మని భాష లోకి అనువాదం పొంది గొప్ప పేరు పొందింది .జన రంజక మయింది .

           1808 క్రిస్మస్ ముందు వియన్నా ప్రజలు బీథోవెన్ చేసిన మరో అపూర్వ కచేరీ విన్నారు .ఇందులో రెండు కొత్త సిమ్ఫనీలు –నంబర్ 5 ,6 లనుf లో  పాష్టరల్ లో చేశాడు .ఇది చాలదన్నట్లు తన నాలుగవ పియానో కచేరీ కూడా చేశాడు .దీన్ని new choral Fantasia అని అన్నాడు .ఇందులో పియానో కోరస్ ,ఆర్కెస్ట్రా ఉన్నాయి .ఇవి కాక చిన్న చిన్న బిట్లున్నాయి .దీనికి అను బంధం గా సి సెక్షన్ లోని కొన్ని భాగాలనూ కూర్చాడు .అంతా కలిపి నాలుగు గంటల సుదీర్ఘ కచేరీ .విపరీత మైన చలి కాలం .అవగాహన లేని, సరిగ్గా ప్రాక్టీస్ చేయని ఆర్కెస్ట్రా తో పాడటానికి గాయకులకు కష్టమైనా రీతి లో దీన్ని చేశాడు .మిశ్రమ స్పందన వచ్చింది .బీథోవెన్ ఏది చేసినా ఆయనకు ఇష్టమైన ప్రాచుర్యంపొందిన అయిదవదైన సింఫనీ ఉండాల్సిందే .’’It carries the listener away irresistibly into wondrous spirit  world of infinite ‘’అని జెర్మనీ దేశపు మహా రచయితా, విశ్లేషకుడు E.T.A.Hoffman అన్నాడు .’’It is conceived with genius ,exilated with great thoughtfulness and express the romantic spirit in music in the highest degree ‘’అని ఆయనే కితాబిచ్చాడు . .

             బీథోవెన్ చేసిన అయిదవ సింఫనీ చాలా విప్ల వాత్మక మైంది .దీని నిర్మాణం ,ఆకృతి బహుదా ప్రశంశ నీయమైంది .ఆనాడు వాడుక లో ఉన్న పాత పద్ధతులకు స్వస్తి చెప్పి కొత్త ఊహల్ని ,కొత్త స్వరాలను సృష్టించి దానికి ఒక చారిత్రాత్మక రూ పాన్ని తెచ్చి చిర స్తాయి తెచ్చాడు .అందుకే బీథోవెన్ అంటే సింఫనీ –సింఫనీ అంటే బీథోవెన్ అని పించుకోన్నాడు .ఇది విషాద స్వరం తో(సి మేజర్ ) ప్రారంభ మవుతుంది ,అంటే చీకటి నుండి వెలుగు లోనికి ప్రయాణానికి సంకేతం .అంతే కాదు ఈ సింఫనీ బీథోవెన్ ఓటమి ,నిరాశ లపై స్వీయ పోరాటాన్ని సూచిస్తుంది .ప్రసిద్ధ మైన four note motiff of the opening లో ‘’fate knocking on the door ‘’అని ఉంటుంది .ఇది ఇంకో రకం గా చెప్పాలి అంటే ఆనాడు మొర్సు శాస్త్రజ్ఞుడు కని పెట్టిన టెలిగ్రాఫ్ లోని’’ v’’కు సంకేతం అంటే విజయానికి గుర్తు .అని ఒక విశ్లేషకుడు అద్భుతం గా వ్యాఖ్యానించాడు .ఈ సంకేతాన్ని మొదటి ప్రపంచ యుద్ధం లో allied forces విజయానికి సంకేతం గావాడారు .ఆతర్వాత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్ర బాబు రెండు వేళ్ళు చూపించి ఆనాడు వాడాడు .ఇప్పుడు అందరు దీన్నే వాడుతున్నారు విజయ చిహ్నం గా .

           ‘’పాష్టరల్ సింఫనీ ‘’చాలా విభిన్న మైంది .ఇందులో బీథోవెన్ సంగీత భాషను  అందులోను ముఖ్యం గా పల్లె టూరి సౌందర్యాన్ని ,ఉదయ ప్రశాంతతను ,పంట చేల అందాలను ,సెలయేళ్ళ మధుర నాదాన్ని ,పల్లె జనుల పండుగ ఉత్సాహాన్ని (మధ్యలో ఉరుము ,మెరుపు,తుఫానుల  ధ్వనుల అంత రాయాన్ని) కలబోసి ,చివరకు ,పశువుల కాపరుల అవ్యక్త మధుర సంగీతాన్ని ,వారి జానపద గీతాలను విని పిస్తాడు .తుఫాను తర్వాత ప్రశాంతత కు కృతజ్ఞత తో కూడిన అభి నందనలు విని పిస్తాడు .ఈ సిమ్ఫనీతో సంగీతం లో రొమాంటిక్ యుగం ప్రారంభమైంది .ఈ రొమాంటిక్ భావాలనే చిత్ర కళ లో ,లాండ్ అస్కేపులలో ,కధల్లో సంగీతంద్వారా ప్రచారం చేశారు .

          ఇలాంటి విప్లవాత్మక మైన ఆలోచనలు భావాలు మీకు ఎలా వస్తాయి? అని బీథోవెన్ ను ప్రశ్నిస్తే ‘’I can not tell you exactly I could grab them in my hands ,out in the open air ,in the woods ,out wlaking ,late at night ,early in the morning ,brought on my moods which the poet can put into words and I into sounds which whirl round me until I can get them down as notes on paper ‘’అని ‘’కాదేదీ సంగీతానికి అనర్హం’’ అంటు కవితాత్మకం గా వివరించాడు .

            ఈ భావాత్మక విప్లవం తో బీథోవెన్ సంగీతత్వం పియానో కచేరీలు చేసే వాడిగా పూర్తీ అయి పోయింది .ఇక ఈ ఆర్కెస్ట్రా తో వేగ లేనను కొన్నాడు .వాళ్ళు కూడా ఈ చెవిటి ఆయన తో భరించ లేక పోతున్నారు .వియన్నాను వదిలి పెట్టి వెళ్ళి పోవాలనే ఆలోచనలో ఉన్నాడు .ఇది తెలిసిన అతని అరిష్తోక్రాటిక్ స్నేహితులు ఆర్చ్ డ్యూక్ రుడాల్ఫ్ ,ప్రిన్స్ లోబోస్కిన్ ,ప్రిన్స్ ఫెర్డినాండ్ కిన్స్లి ,లు బీథోవెన్ ను వియన్నాలోనే ఉంచే ప్రయత్నాలు తీవ్రం చేశారు .ఒక కాంట్రాక్ట్ ను మంచి ఆదాయం వచ్చే ఏర్పాటుతో కుదుర్చుకొన్నారు .ఏడాదికి నాలుగు వేల ఫ్రాన్క్లిన్లు అందజేసే కాంట్రాక్ట్ అది .సరే నన్నాడు .వీన్  ధియేటర్ ను ఏడాదికో సారి ఉచితం గా ఉపయోగించుకొనే అవకాశమూ కల్పించారు  తాత్కాలికం గా ఆర్ధిక సమస్య పరిష్కారమైంది .మళ్ళీ పని ప్రారంభించాడు బీథోవెన్ .కొత్త పియానో కచేరి నంబర్ అయిదు ‘’the emperor ‘’.చేశాడు .

                   సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28-1-13-ఉయ్యూరు 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.