షహజాన్ పూర్ శ్రీ రామ చంద్ర మహా రాజ్ – 2(చివరి భాగం )
పద హారేళ్ళవయసులోనే జాన్ స్టువార్ట్ మిల్ల రాసిన ‘’యుటిలిటేరినిజం ‘’పుస్తకం చదివి అర్ధం చేసుకొన్నాడు .అందులోని విషయాలు నచ్చి తన స్వంత ఫిలాసఫీ ని తయారు చేసుకొన్నాడు రామ చంద్ర .నమ్మకం అనేది సాధనకు ముఖ్యం అని ప్రవచించాడు .పనిలో నిజాయితీ తపనా ఉండాలన్నాడు .గురువు శిష్యుడికి తన వద్ద ఉన్న జనాన్ని అంతటిని దాచుకోకుండా సోదరునికి అందించి నట్లు అందజేయాలని తెలియ జేశాడు .ఒక సారి తోటి ఉద్యోగస్తుడు అదే కులానికి చెందిన వాడే అయినా రామ చంద్ర కు పనిలో మేలకువలు నేర్పకుండా చాలా హింసించి సాధించే వాడు .ఈ విషయాన్ని మున్సిఫ్ కు చెప్పి రాజీనామా చేస్తానన్నాడు .వద్దని వారించి ,ఆయనే మెళకువలు నేర్పాడు .రామ చంద్ర కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు మరణించటం ప్రారంభించారు రామచంద్ర తనకుమారుడికి అక్కడే ఉద్యోగం ఇప్పించుకొన్నాడు .అతనూ మరణించి తీవ్ర దుఖాన్ని కలిగించాడు .
ఈ ఆందోళనలతో ,కోర్టు ఉద్యోగం లో బిజీ గా ఉన్నా ధ్యానాన్ని, యోగాన్ని మాత్రం వదలలేదు .సాధనలో ఉన్నప్పుడు అంతటా కాంతిని దర్శించే వాడు .మరో ఆరు నెలలకు హృదయం లో ఓంకారం విని పించింది .ఇదే ‘’అజపా ‘’.ఇదంతా తన గురువు అనుగ్రహం అని భావించాడు .గురువు పట్ల పూర్తీ విశ్వాసం ఉంటె ఆయన ఎక్కడ ఉన్నా ఇష్టసిద్ధి కల్గిస్తాడనితెలుసుకొన్నాడు.రామ చంద్ర పేకాట ఆడే వాడు .ఇది తన ధ్యానానికి ఇబ్బంది కలిగిస్తుందని గురువు చెప్పగానే మానేశాడు .అజపా జపాన్ని నిర్విఘ్నం గా కోన సాగించాడు .1924 లో ఒక గొప్ప వింత అనుభవం కలిగింది .సకల చరా చర సృష్టిలో అనిర్వచనీయమైన సర్వ వ్యాపక శక్తి ఉందని తెలి సింది ..పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఆ దివ్య తేజస్సు ను దర్శించాడు .పగలు కూడా దృగ్గోచర మయ్యేది .ఇది ఇలా ఉండగా భార్య తెంపరితనం ఇంకా బాధిస్తూనే ఉంది .తట్టుకోలేక గురువుకు చెప్పుకొన్నాడు .క్రోధాన్ని నియంత్రిన్చుకోమని గురువు సలహా ఇచ్చాడు .
ధ్యానానికి ప్రశాంతత కావాలి .గురువు పర్య వేక్షణ లో ధ్యానం కొనసాగించాడు .కంఠచక్రం వద్దకు ఆలోచన రాగానే కల వస్తున్నట్లు గమనించాడు .ఈకలు పగలు కూడా వస్తున్నాయి .అవదూతలకు ఇది సహజమే ..ఆయన 1928 ఏప్రిల్ లో పిండాడం లో బ్రహ్మాండ దర్సనం చేశారు . 1931 ఆగస్ట్ పది హీనున ఆయనకు లోపలా బయట గురువు అనుగ్రహం వల్ల అద్భుత కాంతి గోచరించింది ఆగస్ట్ 14 న గురు బ్రహ్మ మహాసమాధి చెందారు .అంటే గురువు శిష్యునిలో ఐక్యమై పోయి నట్లు .1932 అక్టోబర్ పన్నెండు న గురువు కలో కన్పించి మార్గ దర్శనం చేశారు .రెండు సార్లు పెద్ద శక్తి పాతాన్ని పొందారు రామ చంద్ర .తండ్రి మరణం తర్వాతా బాబాయి ఎస్టేట్ ను కుటిలోపాయాలతో ఆక్రమించుకోవాలని ప్రయత్నించాడు .ఈయనా తమ్ముడు వ్యతి రేకించారు .వీలైనప్పుడల్లా రామచంద్రకు ఆయన ద్రోహం చేస్తూనే ఉన్నాడు చని పోయేదాకా .ఎన్ని ఆటంకాలు ఎదురైనా కోర్టుకు ఈడ్చే ప్రయత్నం బాబాయి చేసినా ,అన్నిటినీ తట్టుకొని ,ఆత్మ స్తైర్యం తో ,ధ్యానానికి, సహనానికి భంగం కలుగ కుండా తన శాంత మార్గం లో సాగిపోయారు రామచంద్ర గురు .
1944 ఏప్రిల్ లో గురువును తనకు దివ్య మార్గాన్ని దర్శింప జేయ మని వేడుకొన్నారు శ్రీ రామ చంద్ర మహా రాజ్ .గురువు అనుగ్రహించారు .రామ చంద్ర శ్రీ కృష్ణుని తనకు అర్జునికి చూపించి నట్లే విశ్వ రూప దర్శనాన్ని అనుగ్రహించ మని కోరారు .1914 లో తనలో ఒక శూన్యం ఏర్పడిందని సకల విశ్వం తనలో ఇమిడి పోతున్న ఒక దివ్య అను భూతి కలిగింది .తనది అవతారం కాని అవతారం అని భావించాడు .ఆయనను అందరు రుషి గా భావించారు భారత సేవక సమాజ్ వారు ఆయన్ను గొప్ప మహాత్ముడిగా అభి వర్ణించారు .గృహస్త జీవితం సవ్యం గానే సాగి పోతోంది భార్య భగవతి మరణిం చతమే మే కాక మగపిల్లలిద్దరు చనిపోయారు అన్నిటిని దిగ మింగి తన ధ్యానాన్ని కోన సాగిస్తూనే ఉన్నారు .
1945 మార్చి 31 న ‘’శ్రీ రామ చంద్ర మిషన్ ‘’ను గురువు గారి గౌరవార్ధం ఏర్పాటు చేశారు రామ చంద్ర .రాజయోగాన్ని అనేక మార్పులు చేసి కొత్త విధా నాన్ని లోకం లో ప్రచారం చేశారు .’’దశాదేశములు ‘’(టెన్ కమాండ్ మెంట్స్ )ను ప్రవచించి వ్యాప్తిలోకి తెచ్చారు .రామ చంద్ర గారి దేవుడికి ఆకారం, పేరు,మెదడు,మనసు ఉండవు .దేశం లోని మారు మూల ప్రాంతాలతో సహా దేశమంతా పర్య టించారు .ఇది భగవాన్ శ్రీ కృష్ణ పరమాత్మ ఆదేశం అన్నారు .1974 లో శి ష్యుల కోరిక పై ఆత్మకధ రాశారు .అనేక గ్రంధాలను రచించి తన భావాలను నిక్షిప్తం చేశారు .దేశం లోని అనేక మంది విద్యా వేత్తలు మేధావులు శ్రీ రామ చంద్ర ను కలిసి అనుభూతి ని పొంది శిష్యులై వారి భావ వ్యాప్తికి తోడ్పడ్డారు .1965 లో సహజ మార్గ రిసెర్చ్ సెంటర్ ఏర్పడింది .దీనికి శ్రీ కే.సి.వి.వరదా చారి డైరెక్టర్ గా వ్యవహరించారు .తాను భౌతికం గా లేక పోయినా అందరికి మార్గ దర్శనం చేస్తానని ఆయన శిష్యులకు చెప్పారు .1983 ఏప్రిల్ 19 న ఎనభై నాలుగవ ఏట శ్రీ రామ చంద్ర జీ మహా రాజ్ మహా సమాధి చెందారు .ఆయన స్తాపించిన శ్రీ రామ చంద్ర మిషన్ దేశ వ్యాప్తం గా అనేక హాస్పిటల్స్ ను విద్యాలయాలయాలను ,సేవా సంస్థలను నిర్వహిస్తూ ప్రజలకు అతి చేరువ అయింది .ఎక్కడ సంకల్ప బలం ఉంటుందో అక్కడ విజయం ఉంటుందని వీరి చరిత్ర తెలియ జేస్తోంది .
సంపూర్ణం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30-1-13 ఉయ్యూరు