సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -11

 

  సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -11

బీథోవెన్ చేసిన తొమ్మిదవ సింఫనీ ని ఆ తర్వాతి సంగీత కర్తలు శిఖరాయమానం అన్నారు .ద్వోరాక్ ,బ్రక్నేర్ ,సిబిలియాస్ వాన్  విలియమ్స్ మొదలైన వారు సంభ్రమాశ్చర్యాలకు లోనై  ఆ సృజనకు నీరాజనాలు పల్కారు .వారందరూ తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ఫనీలు చేయ లేక పోయారు బీథోవెన్ చేసిన తొమ్మిదో సింఫనీ లో నాలుగు గతులున్నాయి ,దానితో పాటు శక్తి వంత మైన స్కేర్జ్ అంటే జోక్ ను మిళితం చేసి రెండవ స్తానం లో చేర్చటం చివరి స్వర గతి’’ న భూతో న భవిష్యతి ‘’అని ఆ స్వర  మాంత్రి కునికి ప్రశంసాభి షెకమే చేశారు .

   ‘’not only is the orchestra boosted by a choir in the glorious rendering of the ‘’odeto joy ‘’with its ecstatic vision of all men as brothers ,but Beethoven suddenly interrupts it with  a  jaunty little Turkish  march accompanied by oriental sounding percussion instruments ‘’అని విశ్లేషకులు , ,అభిమానులు బ్రహ్మానందాన్ని అనుభవించారు .ఆ సృజన అనితర సాధ్యమన్నారు .ఇన్నేళ్ళు గడిచినా అతడే ఇప్పటికీ సిమ్ఫనీకు మకుటం లేని మహా రాజు అంటారు .

             తన సంగీతం ద్వారా బీథోవెన్ వియన్నా ప్రజలు ,సకల దేశాల వారికి స్నేహ హస్తాలు సాచి ఆహ్వానం పలుకుతున్నట్లు ,అందులో తమకుసంప్రాదాయ  శత్రు దేశమైన టర్కీ ని కూడా స్నేహితులు గా భావించటం వారి హృదయ వైశాల్యాని చాటు తోందని చెప్పకనే చెప్పాడు అదీ దేశ భక్తీ అని రుజువు చేశాడు ..బీథోవెన్ చేసిన ఈ సింఫనీ తర్వాత నుంచిబెర్లిన్ గోడను 1889లో కూల్చి వేసినప్పటి నుండి ఈ సింఫనీ  తూర్పు ,పశ్చిమ యూరప్ ల మధ్య  పునరాలోచన కల్గించిందని అందరు అంటారు .

           చివరి మూడేళ్లలో బీథోవెన్ జనాలకు దూరం గా ఉంది పోయాడు .ఎప్పుడో నడకకు బయటికి రావటం తప్ప అసలు ఇంట్లోంచి కదలటమే లేదు .మద్య పానం బాగా ఎక్కువై పోయింది .తిండీ ఎక్కువ గా తింటున్నాడు .కాఫీ అంటే మహా ప్రాణం బీథోవెన్ కు .వినికిడి పూర్తిగా పోయేసరికి టెంపర్  పెరిగి పోయింది .అసహనం ఎక్కువైంది .సంఘంలోని జనం తో ఆనందాన్ని పంచుకోలేని దురదృష్ట వంతుడై పోయాడు ..నివాసాన్ని చేంబర్ మ్యూజిక్ కు మార్చాడు .ఆయన చివరి రచనలైన ‘’స్ట్రింగ్ క్వార్టర్స్ ‘ఆ నాటి జనానికి మహా ఇష్టమై పోయాయి .ఆరాధనతో పరవశించే వారు అభిమానులు .దాదాపు పద్నాలుగేళ్ళ నుండి కొత్తగా ఏదీ రాయలేక పోయాడు .1822  లో కొత్త పెట్రాన్ అయిన రష్యా యువ రాజు నికోలాయ్ గోలిస్తీన్ తన కోసం మూడు క్వార్టర్స్ రాయమని కోరాడు .మొదటిది ఎట్లాగో ‘’ఈ.ఫ్లాట్ ‘’లో పూర్తీ చేశాడు .ఇది జనం లో అంతగా పేల లేదు .రెండోది ‘’ఏ –మైనర్ ‘’లో రాశాడు జబ్బులో ఉం డికూడా .(1825 ).ఇది చాలా నెమ్మది మీదుండే గతి లో రాశాడు .దీనికి ‘’Hymn of thanks giving to the divinity from a convalescent ‘’అని సార్ధక నామం పెట్టాడు .మూడవది o.p..130 ని బి ఫ్లాట్ లో చేశాడు .సుదీర్ఘమైనది .దీనిలో ఆరు గతులుంటాయి .అందులో చివరిది ‘’grosse fuge ‘’(grand fuge )అంటే మహా నిష్క్రమణ .వీడ్కోలు –అస్తిరం ఇక సెలవ్ .చివర రాసిన క్వార్టర్ లన్ని పాడే వారికి ,వాయించే చాలా కష్ట మైనవే .అయితే వాళ్ళు పూర్తీ సహకారం అందించ లేక పోయారు న్యాయం చేయ లేక పోయారు .దీన్ని కొంచెం మార్చి రాయ మని పబ్లిషర్ కోరితే అలానే చేస్తే , ముద్రింపబడింది .

            బీథోవెన్ చివరి రోజులు మరీ దారుణం గా గడిచాయి . .తమ్ముడి కొడుకుకారల్  ఇంట్లోంచి పారి పోయి ఆత్మ హత్య చేసుకొన్నాడు .ఇది ఆశని పాతం అయింది బీథోవెన్ కు .ఇతనే బీథోవెన్ కుటుంబం లో చివరి వాడు .అంటే బీథోవెన్ వంశం బీథోవెన్ తో అంతమైందన్న మాట .దురదృష్టం .ఆ మహా ను భావుని వంశం వారసులు లేకుండా పోవటం బాదే .అందరికి .

       1826 లో జోహాన్ దగ్గర పల్లె టూరిలో ఉన్నాడు బీథోవెన్ .ఉండలేక వియన్నా కు తిరిగి వచ్చేశాడు .జబ్బు తీవ్రమైంది .ఒళ్లంతా నీరు పట్టింది ..కాళ్ళు కదిలించ లేక పోతున్నాడు .లివర్ పూర్తిగా దెబ్బతిని పోయింది .లోపలి కి గొట్టాలు పంపి నీరు తోడారు .ఈయన దీన స్తితి చూసిన లండన్ లోని ‘’ఫిల్ హార్మానిక్ సోసైటీ’’సాయంగా 160 పౌండ్లు పంపింది .ఒక పబ్లిషర్ బీథోవెన్ కు ఇష్టమైన ‘’రై నిక్ వైన్ ‘’ఒక కేసు పంపించాడు .శుభ్రం గా తాగి ఆనందించాడు .నాలుగు నెలలు తీవ్రం గా బాధ పడ్డాడు .1827 లో తన చుట్టూ ఉన్న వారిని చూసి ‘’Applaud my friends ‘’అని లాటిన్ భాష లో అన్నాడు .’’The comedy is finished ‘’అని వీడ్కోలు చెప్పాడు .మర్నాడంతా కోమా లో ఉండి పోయాడు .ఆరోజు సాయంత్రం ఆరు గంటలకు పెద్ద భయంకర మంచు తుఫాను ప్రారంభ మైంది .పెద్ద మెరుపు వచ్చింది .కళ్ళు తెరచి చూశాడు చివరి సరిగా బీథోవెన్ .కుడి చెయ్యి పైకి ఎత్తాడు .అంతే తల వాల్చేశాడు .అప్పటికే తన కున్న యావదాస్తి, నగదు అన్నీ తమ్ముడి కొడుకు కారల్ కు రాశేశాడు .అప్పటికి బాంక్ బాలన్స్ 7,441 ఫ్రాన్కులున్నాయి .తాను చేసిన బాకీ లన్నీ  ఈ డబ్బు తీర్చేయమని విల్లు లో రాశాడు .

                        మహా ప్రస్తానం

            జర్మన్ బాల సంగీత మేధావి అని పించుకొన్న మహా సంగీత విద్వంషుడు  మొజార్ట్ మరణిస్తే స్మశానకి పట్టు పని పది మందికూడా వెంట వెళ్ళ లేదు .అదే బీథోవెన్ పార్ధివ దేహాన్ని స్మశానికి తర లిస్తుంటే 20 ,000 మంది అభిమానజనం వెంట వెళ్లటం మహా నివాళి అని పించుకోంది ..రోడ్లన్నీ జనాలతో కిక్కిరిశాయి .ఆ సింఫనీ మాంత్రికుని కడ సారి దర్శనం కోసం .అదీ అభిమానం అంటే .తామేమిటో వియన్నా ప్రజలకు తెలియ జెప్పిన గొప్ప దేశ భక్తుడైన సంగీత సృష్టికర్త బీథోవెన్ .సెయింట్ స్టీఫెన్స్ కాతేద్రిల్ జన సముద్రమే అయింది .బీథోవెన్ ను wahring church ‘’లో సమాధి చేశారు .ఆ నాటి విషాదాంత నటుడు ‘’Henrich Anschutz ‘’ స్మశాన వాటిక లో సందేశం ఇస్తూ ‘’franz Grill Parzer ‘’అనే మహా కవి రాసిన కవితా భావాన్ని తన ప్రసంగం గా చెప్పాడు ‘’we ,the representatives of an entire nation ,come ,to mourn the passing of the gracious mouth by which music spoke ,the man who inherited and enriched the  immortal fame of Handel and Bach ,of Hyden ,and Mozart .He was an artist ,and who shall stand beside him ?because he shut himself off from the world ,they called him hostile and callous .He with drew from his fellow men after he had given them every thing and received nothing in return .But until his death ,he preserved a father’s heart for man kind..Thus he was ,thus he died ,thus he will live for the end of time ‘’అంటు బీథోవెన్ దేశానికి ఇచ్చిన దానికి ఏమీ ఇచ్చి  ఋణం తీర్చుకోలేమని, ఆయనకు దేశం ఇచ్చింది శూన్యమ అని ఆయన సంగీతం అజరామరం అని గోప్పగాశ్లాఘించాడు .ఆ తర్వాత వియన్నా లో బీథోవెన్ కు గొప్ప స్మృతి చిహ్నాన్ని నిర్మించి తమ కృతజ్ఞత చాటు కొన్నారు ..57 ఏళ్ళు మాత్రమె జీవించిన బీథోవెన్ ప్రపంచ సంగీతం లో అందులోను ముఖ్యం గా సింఫనీ లో చిరంజీవి .

                           సశేషం –

                  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –1-2-13-ఉయ్యూరు

        

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

1 Response to సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -11

  1. manchi visheshaalu chepparu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.