చెరగని ధైర్యమే’’ చేగువేరా’’ చిరునామా

  చెరగని ధైర్యమే’’ చేగువేరా’’ చిరునామా

 1967 అక్టోబర్ తొమ్మిదిన చేగువేరా ను బొలీవియా లో అమెరికా సి.ఐ.ఏ .కాల్చి చంపింది .దీన్ని గర్హిస్తూ జీన్ పాల్ సాత్రే ‘’Che was the most complete human being of our age ‘’ అన్నాడు .క్యూబా లో కమ్యూనిస్ట్ పాలన ఫిడేల్ కాస్ట్రో నాయకత్వాన ఆవిర్భ వించ టానికి కారణ మైన విప్ల వీరుడు చేగువేరా .గెరిల్లా యుద్ధానికి ఆద్యుడైన వాడు .మిలిటరీ యుద్ధ వ్యూహ నిపుణుడు,సైన్యాధి పతి మీదు మిక్కిలి డాక్టరు, గొప్ప రచయితా.కూడా ..వందలాది పత్రికలకు పుంఖాను పున్ఖం గా వ్యాసాలూ రాశాడు జన చైతన్యం తెచ్చాడు .నిద్ర పోతున్న జాతిని జాగృతం చేశాడు .మంచి కవిత్వం రాసిన విప్లవ కవి .జీవిత కాలం లోనే చాలా పుస్తకాలు రాసి ప్రచురించాడు చేగువేరా .అతను గెరిల్లా యుద్ధ తంత్రం మీద రాసిన పుస్తకాన్ని మిలిటరీ ఎక్స్ పర్త్స్అధ్యనయనం చేస్తుంటారు ఇప్పటికీ . దీనికి తోడు అతను ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ..లాటిన్ అమెరికా దేశాలకు న్యూస్ రిపోర్టులు రాసి పంపేవాడు .తిరుగు లేని కమ్యూనిస్ట్ .కమ్యూనిజం నరా నరానా జీర్ణించుకొన్న వాడు .నిజం గా చెప్పా లంటే గొప్ప సోష ఫిలాసఫర్ .ఆయన్ను హేస్పానిక్ హీరో అని ,విప్లవ నాయకుడని చెప్పుకొని గర్విస్తారు అనుచరులు .

 

     క్యూబా ప్రభుత్వం లో ఉండి పూర్తీ కొత్త పాలనా విధాన్ని ప్రవేశ పెట్టిన ఆలోచనా పరుడు అమలు చేసిన వాడు .లాటిన్ అమెరికా ప్రజల ఆశా జ్యోతి చేగువేరా .చేగువేరా చాలా ఇష్టపడి చదివిన పుస్తకం సేర్వాన్ టేస్స్ రాసిన ‘’డాన్ క్విక్సోట్ ‘’నవల .క్విక్సోట్ స్పెయిన్ దేశమంతా బక్క చిక్కిన’’ రోసి నంటి’’అనే గుర్రాన్ని ఎక్కి తిరిగి అన్యాయాన్ని అక్రమాలనుంచి ప్రజల్ని రక్షించాలని పగటి కలలు కనే వాడు .తన బల్లెం రోసి నంటి కంటే బల మైంది అన్నాడు .       

 

 

    చేగువేరా 1928 జూన్ పద్నాలుగున అర్జెంటిన లోని రోసారియో లో జన్మించాడు .అసలు పేరు ‘’Ernesto Guvera de la serna ‘’హిస్పియానిక్ సంప్రదాయం లో తల్లి పేరు ను చివర పెట్టుకొని గౌరవించే విధానం  ఉంటుంది .తండ్రి ఎర్నేస్తో .తల్లి సెర్నా .సంపన్న కుటుంబమే వారిది .తండ్రి రియల్ ఎస్టేట్ చేసే వాడు బానే సంపాదించాడు .చిన్నప్పటి నుంచి చేగువేరా కు ఉబ్బసం జబ్బు ఉంది .చిన్న నాటి నుంచే విపరీతం గా పుస్తకాలు చదివేసే వాడు .అందులో సాహస గాధ లంటే చెవులు కోసుకొనే వాడు .ఇంజన్ అమర్చిన సైకిల్ మీద అర్జెంటీనా అంతా 2,680 మైళ్ళు ప్రయాణం చేసిన సాహసి ..హైస్కూల్ లోనే విప్లవ భావాలు అంకురించాయి .ఉబ్బసం ,కేన్సర్ వంటి వ్యాధుల పై రిసెర్చ్ చెయ్యాలనే ఆలోచన బలం గా ఉండేది .డాక్టర్ పాసైనాడు .

           ఎలేర్జి ఇన్స్తి institute  లో మేల్ నర్సు గా పని చేశాడు ముందుగా .ఎన్నో వ్యాపారాలు చేయాలనాను కొన్నాడు .బొద్దింకలను చంపే ‘’లోకష్టు ‘’తయారు చేయాలని ఆలోచించాడు .తన మోటారు సైకిల్ ను la ponderosaఅంటే శక్తి వంత మైంది అని పిల్చుకొన్నాడు .తొమ్మిది సార్లు సంచార యాత్ర దిగ్విజయం గా చేశాడు .ప్రజల పరిస్తితులను గమనించే వాడు .ఎక్కువ పని గంటలు ,పారి శుధ్యం లేని జీవితాలు ,కారు చీకట్లో నివాసాలు తో బతుకు దుర్భరం గా ఈడుస్తున్న కార్మికుల, సామాన్య ప్రజల ను చూసి కలత చెందాడు .డాక్టర్ డిగ్రీ చేతికి రాగానే మళ్ళీ రైల్ లో మళ్ళీ యాత్ర చేశాడు .గ్వాటి మాలా వెళ్లి ‘’విజ్ఞాన సర్వస్వాలు ‘’అమ్మాడు .దాని ప్రెసిడెంట్ జాకబ్ ఆర్బెంజ్ అంటే విపరీత మైన మోజేర్పడింది .

         ఇంతకీ చే అంటే వాళ్ళ భాషలో ‘’బుడ్డాడు ‘’అని అర్ధం తలిదండ్రులు పిల్లల్ని పిలుచుకొనే ఆప్యాయపు పిలుపు అది .ఫిడేల్ కాస్ట్రో ఆ పేరు నే ఖాయం చేశాడు ..1950 లో చేగువేరా కాష్ట్రో ని కలిశాడు .ఆ మరుసటేడాది ప్రేమించిన హీల్డా గాదియా ను పెళ్ళాడాడు .బొద్దు గా లావుగా ఉన్న శరీరాన్ని తగ్గించుకోవ టానికి బ్రెడ్ ,పాస్త ,స్ట్రీక్ లు తినటం మనే శాడు .కాస్ట్రో అతన్ని చాల్కో ట్రైనింగ్ కు నాయకుడిని చేశాడు .అతనొక్కడే క్యూబా దేశానికి చెందినా వాడు కాదు అంటే నాన్ క్యూబన్ .ఆ తర్వాత మెడికల్ ఆఫీసర్ ని చేశాడు .అది అప్పుడు లెఫ్టి నెంట్ రాంక్ ..1956 లో నవంబర్ ఇరవై అయిదవ తేదీన గువేరా, కాస్ట్రో మరో 81 మంది యోధులు మెక్సికో నుంచి క్యూబా కు చేరారు .చేను ఆర్మీ కామ్బాట్ చేయ వద్దకని వారించాడు కాస్ట్రో .     

         1963 లో ‘’గెరిల్లా వార్ ఫేర్ ‘’అనే క్లాసిక్ పుస్తకాన్ని రాశాడు చేగువేరా .అప్పటి క్యూబా అధ్యక్షుడు బాటిస్థా క్రూర విధానాలతో ప్రజలు విసుగెత్తి పోయారు .1958 లో డిసెంబర్ ముప్ఫై న క్యూబా ను వశం చేసుకొన్నారు విప్లవ వీరులు .విజయం లభించిన తర్వాతా ‘’no-we have not  won the war .the revolution begins now ‘’అన్నాడు చేగువేరా .క్యూబా లో కమ్యూనిష్ట్ ప్రభుత్వం రావాలి అని కాష్ట్రో కు చెప్పాడు .1959 జనవరి రెండు న కాస్ట్రో గువేరా ను మిలిటరీ కమాండర్ ను చేశాడు .చీఫ్ ఎక్సి క్యూషనర్ అయిన కాష్ట్రో కు కమ్యూనిజాన్ని బోధించాడు .సైనికులకు చదువు చెప్పాడు .1959 ఫిబ్రవరి ఏడున కాష్ట్రో చేగువేరా కు పౌరసత్వం ప్రదానం చేశాడు .అంతే కాదు director of the national institute of agrarian reforms అనే పదవి నిచ్చాడు .ఆ తర్వాతా క్యూబా జాతీయ బాంక్ కు అధ్యక్షుడిని చేశాడు .వెంటనే తన మంత్రి వర్గం లో పరిశ్రమల మంత్రి గా తీసుకొన్నాడు .దీనితో బాటు క్యూబా ఆర్ధిక శాఖ కు ఇంచార్జి నీ చేశాడు .    

         క్యూబా లో చెరుకు బాగా పండుతుంది క్యూబా ను ‘’షుగర్ బౌల్ ‘’అంటారు .చెరకు మీదే క్యూబా ఆర్ధికం గా ఆధార పడింది .ఇది అదను గా చేసుకొని అమెరికా పెత్తనం చేస్తోండి .దేశం లో అమెరికా ధనంనం ఎక్కు వై ప్రభావం చూపిస్తోంది .అందుకని రష్యాతో ఒప్పందం కుదిర్చి రష్యాకు పంచ దార ను ఎగుమతి చేయించాడు .వాళ్ళ పెత్తనమూ ఎక్కు వై పోయింది .1959 జూన్ లో చేగువేరా చైనా కు డిప్లొమాటిక్ యాత్ర చేశాడు  ఆధికారికం గా .ఆసియా యూరప్ ,ఆఫ్రికా దేశాలలో పర్య టీంచాడు .1965 మార్చి పద్నాలుగున క్యూబా చేరి చాలా నెలలు జనానికి కనీ పించ కుండా అజ్ఞాత వాసం లో గడి పాడు ..

       క్యూబా వదిలి పెట్టి ఆఫ్రికా కు చేరాడు .అక్కడి విప్ల వానికి తన అవసరం ఉందని సాయం చేద్దామని అను కొన్నాడు .కాంగో లో అనుకూల పరిస్తితులేమీ చేగువేరా కు కంపించ లేదు .భార్య తో విడాకులు  పొందాడు .అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకొన్నాడు .బొలీవియా లో విప్ల వానికి సాయం చేద్దామని ఉవ్విళ్ళూరి బొలీవియా వెళ్ళాడు .అక్కడి జనం ఇంకా విప్లవానికి సిద్ధం గా లేరని తెలుసు కొన్నాడు .అమెరికా అక్కడి పాలకులకు అండగా ఉంది .అనేక వేషాలు మార్చి అక్కడికి చేరుకొన్నాడు పాపం .

              1967 అక్టోబర్ లో కాల్పుల్లో దెబ్బ తిన్నాడు .ఒడి పోయాడు .ఒక గార్డు అతని పై ఉమ్మేశాడు .మళ్ళీ ఎదురు తిరిగి ఉమ్మేశాడు చేగువేరా .కట్టేశారు .’’I am thinking about the immortality of the revolution –so feared by those you serve ‘’అన్నాడు .చేగువేరా ను చంప వద్దని పై ఆధికారులు ఆదేశించినా  కింది వారి పెత్తనం, అమెరికా ఒత్తిడి తో ఉదయం ఒంటి గంటకు అమెరికన్ అధికారులు అక్కడికి చేరారు .అతని విప్లవం గురించి ప్రశ్నించాలని అనుకొన్నారు .కాని బోలీవియన్ అధికారులు ఒప్పు కో లేదు .మధ్యాహ్నం ఒకటి పది కి ఒక స్కూల్ లో బంధింప బడిన అతన్ని ,గాయాలతో విపరీతం గ బాధ పడుతున్న వాడిని ‘’టేరాన్’’అనే వాడు కాల్చి చంపేశాడు .39ఏళ్ళకే ఆ విప్ల వజ్యోతి ఆరి పోయింది .’’I know that you are here to kill me .Shot coward.you are only killing a man ‘’అని తనను చంపినా విప్లవం ఆగి పోదని ధైర్యం గా చెప్పాడు .

       1997  లో అక్టోబర్ 17 న గువేరాను క్యూబా శాంతా క్లారా లో మళ్ళీ గౌరవం  గా సమాధి చేశారు  ఆ సందర్భం గా కాస్ట్రో మాట్లాడుతూ  .’’Che is fighting and winning more battles than ever ..thank you Che for your birth ,your life ,and your example .thank you for coming to re inforce us in difficult struggle in which  we are engaged to day to preserve the ideas for which you fought so hard ‘’అని ప్రశంసిం చాడు  కాస్ట్రో ‘అదీ ఆ విప్ల వీరుని త్యాగం, బుద్ధి కుశలత,ప్రజా భ్యుదయం ,సేవ

            మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 5-2-13-ఉయ్యూరు .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.