జెనెటిక్ కోడ్ వల్ల ఆధునిక ప్రయోజనాలు
ఒక శరీర భాగం లో నుంచి జీన్స్ ను వేరు చేసి వేరొక దాని లోకి మార్చటాన్ని జెనెటిక్ ఇంజినీరింగ్ అంటారు .బదిలీ అయిన జీన్ ను ట్రాన్స్ జీన్ ఆర్గానిజం అని ,గ్రహించిన జీన్ ను ట్రాన్స్ జేనిక్ ఆర్గానిజం అని పిలుస్తారు .సాదా రణం గా ఏ.విటమిన్ ఆరోగ్యానికి ,కంటికి చాలా అవసరం.ఇది ఆహారం లో లోపిస్తే గుడ్డి తనం వస్తుంది .అందుకని శాస్త్రజ్ఞులు ‘’ట్రాన్స్ జేనిక్ రైస్ ‘’ అంటే ‘’గోల్డెన్ రైస్ ‘’తయారు చేశారు .దీనిలో బీటా కరోటీన్ ఎక్కువ గా ఉండటం వల్ల ఏ విటమిన్ స్థానాన్ని పొంది ఉపయోగ పడుతుంది .అంటే ఏ విటమిన్ సప్లిమెంట్ చేన్స్తోందన్న మాట .ఇందులో రెండు ట్రాన్స్ జీన్లుంటాయి .ఒక జీన్ సాయిల్ బాక్టీరియం నుండి ,రెండో దాన్ని డాఫోడిల్ లేక పోతే మొక్క జొన్న నుంచి గ్రహిస్తారు .ట్రాన్స్ జీన్లు ఎంజైములను ఎన్కోడ్ చేస్తాయి .దాని వల్ల అవి రెండు కలిసి పని చేసి ,బీటా కరోటీన్ లు తయారు చేస్తాయి .దీనికి ఉన్న పసుపు పచ్చని నారింజ రంగు వల్లమామూలు బియ్యం కంటే ప్రత్యేకం గా ఉండి‘’బంగారు బియ్యం ‘’అని పించుకొన్నది ..
అమెరికా లోని ఫిలడెల్ఫియా లో ఉన్న టెంపుల్ టన్ యూని వేర్సిటివారు ట్రాన్స్ జీన్ ను ఈస్ట్ కు ,ప్రేలుడు పదార్ధాలను గుర్తించటానికి ఉప యోగించారు .ట్రాన్స్ జీన్స్ ను ఎన్కోడ్ చేయగల జెల్లీ ఫిష్ నుంచి ఆకు పచ్చని ఫ్లో రోసేంట్ ప్రోటీన్ ను ,ఎలుకలకు ఉన్న వాసన పట్టే సహజ గుణం కలిగిన ప్రోటీన్లను కలిపి ఒక సజీవ డిటెక్టర్ ను తయారు చేశారు .ఇందులో ఎలుక ప్రోటీన్లు జే.యెన్.టి.ని చూసి ప్రతి స్పందిస్తాయి .దీనితో ఈస్ట్ సెలల్స్ అల్ట్రా వయొలెట్ కాంతిలో స్పష్టం గా కనీ పించే ఆకు పచ్చని ఫ్లోరోసెంట్ ప్రోటీన్ ను తయారు చేయిస్తాయి .ఇంకా కొద్ది రిజుల్లో ఈ పరిశోధనా ఫలితాల వల్ల బాంబ్ డిటెక్టింగ్ ట్రాన్స్ జీనిక్ ఈస్ట్ ను కూడా శాస్త్ర వేత్తలు తయారు చేసే అవకాశాలెక్కువ గా ఉన్నాయి .అప్పుడున్న బాంబ్ డిటెక్టింగ్ స్క్వాడ్ ల తో అవసరం ఉండక పోవచ్చు .
ఇంకో అడుగు ముందుకు వేశారు సింగ పూర్ లో ఉన్న నేషనల్ యూని వెర్సిటి వారు .ట్రాన్స్ జేనిక్ జీబ్రా ఫిష్ ను నీటి కాలుష్యాన్ని గుర్తించటానికి కనీ పెట్టారు .ఇవి నీటిలోని కొన్ని రకాల కాలుష్యాలకు ఫ్లోరసేంట్ వెలుగు ను ప్రసరింప జేసి, గుర్తిస్తాయి .జీబ్రా ఫిష్ సాధారణం గా నల్లగా ను వెండి రంగులో ను ఉంటాయి కాని ట్రాన్స్ జేనిక్ జీబ్రా ఫిష్ .కు ఉన్న జీన్లు ఫ్లోరసేన్స్ ను ఉత్పాదం దం చేసే ప్రోటీన్లను డీ కోడ్ చేయ గలవు .మొదటి ట్రాన్స్ జేనేటిక్ ఫిష్ –జెల్లీ ఫిష్ నుంచి వేరు చేయ బడిన జీన్స్ ను వీటి లోపల ప్రవేశ పెట్టి నందు వల్ల,ఎరుపు ,లేక ఆకు పచ్చ రంగులను రేడియెట్ చేస్తాయి .ఈ పద్ధతి లో శాస్త్రజ్ఞులు అయిదు రకాల జీబ్రా ఫిష్ ను ఇప్పటికి తయారు చేశారు –కాదు కాదు సృష్టించారు .ఇవి ఒక్కొక్కటి ఒక్కో రంగులో నీటిలో ఉన్న కాలుష్య భేదాలను బట్టి ప్రకాశిస్తాయి .ఇప్పటికి గ్లోఫీష్ ,ఫ్లోరోసెంట్ ఫిష్ లు ఎరుపు ,ఆరంజ్ ,పసుపు ,ఆకుపచ్చ రంగుల్లో లభిస్తున్నాయి .తెల్లని కాంతి లో వీటి రంగుల ప్రకాశం బాగా ఎక్కువ గా ఉంటుంది .చీకటి లో వెలుతురు సప్లై చేస్తే ప్రకాశిస్తాయి .
జెనెటిక్స్ ను ఉపయోగించి ప్రియాన్స్ అనే విపరీత భయంకర ప్రోటీన్ లను తయారు చేస్తున్నారు .ప్రోటీ నేశషియాస్ ఇంఫెక్షస్ పార్టికల్ నే ప్రియాన్ అంటారు .దీన్ని కాలి ఫోర్నియా లోని స్తాన్స్లీ బి.ప్రూషినర్ శాస్త్రజ్ఞుడు 1982లో తయారు చేశాడు ..మొదట్లో అందరు దీన్ని అంతా బూటకం ‘’అబ్సర్డ్ ‘’అని కొట్టి పారేశారు .జంతువు లన్నిటిలో ప్రియాన్ ప్రోటీన్లు అంటే prpc పార్టికల్స్ (ప్రియాన్ ప్రోటీన్ సేల్లులర్ )ఉంటాయి .ఇవి మెదడు నరాల్లో ఉంటాయి .కణాల విధిని నిర్వహిస్తాయి .కాని కొన్ని క్రిటికల్ prpc ప్రోటాన్లు కార్క్ బిరడా తీసే స్క్రూ ఆకారం లో ఉంటాయి .అవి చదరం గా మారి నప్పుడు వాటిని ఆ సెల్ లో నుంచి బయటికి తీస్తారు .అసాధారణం గా ,భిన్నం గా ఉన్న ప్రియాన్ ను prpscఅంటే ‘’ప్రియాన్ ప్రోటీన్ స్క్రేపర్ ‘’లను .ఒక సారి సెల్ లో నుంచి తొలగించు కో లేక పోతే వీటి సంఖ్య గణ నీయం గా పెరిగి (లార్జ్ మాస్ )నాడీ కణాలను దెబ్బ తీస్తాయి .దాని వల్లబుర్ర పాడైపోతుంది అందే మెదడు దెబ్బతిన్తుందన్న మాట .prpsc పెరిగితే కండరాల పై నియంత్రణ సాధ్యం కాదు .ప్రియాన్ వ్యాధులోచ్చి చస్తారు .దీనికి ఉదాహరణే ఆ మధ్య ఇంగ్లాండ్ దేశం లో వచ్చిన ‘’mad cow ‘’జబ్బు .దీన్ని శత్రువులు తయారు చేసి వదిలితే ఖండాలకు ఖండాలే సఫా .వేరే బాంబులు ,యుద్ధాలు అక్కర్లేదు .సైన్సు ఎంత ప్రగతి సాదిస్తోందో అంతే విష సంస్కృతీ పెరిగి పోతోందని బుర్ర ఉన్న వాళ్ళందరూ గోల పెట్టడం దీనికే .
Rna ను వ్యాధుల చికిత్స లో బానే ఉప యోగిస్తున్నారు సియాటిల్ లోని విస్కాన్సిస్ యూని వెర్సిటికి చెందినమహిళా శాస్త్ర వేత్త’’ షరాన్ డోతీ’’భూమి లోని విష పూరిత (టాక్సిక్ )సంయోగ పదార్ధాన్ని తొల గించే శక్తి కల పోప్లార్ ట్రీ ప్లాంట్స్’’ ను సృష్టించింది ..ఈ మొక్కల లోని కుందేలు జీన్స్ కాలేయం లో ఉన్న ఎంజైమ్ ను ఎన్కోడ్ చేసే శక్తి కలిగి ఉన్నాయట .ఇదీ జెనెటిక్ కోడ్ సాధిస్తున్న ఆధునిక ప్రగతి,అందిస్తున్న ప్రయోజనాలు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 7-2-13-ఉయ్యూరు