చెనై – త్రిచి-తంజావూర్-తిరువయ్యార్–పళని-శ్రీరంగం – త్యాగయ్య- బాల(మురళి)య్య దర్సనం

      సాహితీ బంధువులకు -శుభ కామనలు –
                మేమిద్దరమ్ ఎనిమిది రాత్రి మెయిల్ లో బయల్దేరి తొమ్మిది ఉదయం చెన్నై చేరాం మా మేన కోడలి గారింట్లో ఉన్నాం .మా తోడల్లుడు శంకరం గారి అమ్మాయి ప్రతిభ ,భర్త వచ్చి కొడం బాకం లో ఉన్న వాళ్ళింటికి తీసుకొని వెళ్లి భోజనం పెట్టి మా ఇద్దరికీ బట్టలు పెట్టి సాయంత్రం తీసుకొని వచ్చి దింపి వెళ్ళారు .తొమ్మిది రాత్రికి బస్ లో బయాల్దేరి సుమారు మూడు వందల కిలో మీటర్ల దూరం లో ఉన్న తిరుచి రాపల్లి అంటే తిరుచి ఉదయం నాలుగు గంటలకు చేరాం .అక్కడ మా వాళ్ళు అంతకు ముందే బుక్ చేసిన ”రమ్యాస్ హోటల్” లో దిగాం .త్రిచికి నలభై కిలో మీటర్ల దూరం లో sastra university లో బి.టెక్.మూడవ సంవత్సరం చదువుతున్న మా మనుమడు సంకల్ప్ వచ్చి కలిశాడు .స్నానం పూజా సంధ్య అయిన తర్వాతా ముగ్గురమ్ హోటల్ వాడు ఇచ్చిన” కాంప్లి మెంట రి బ్రేక్ ఫాస్ట్ ” ను తిన్నాం .అనేక వెరైటీలు ఉన్నాయి తిన్న వాడికి తన్నంత .జ్యూసులు కాఫీ ,పళ్ళ ముక్కలతో సహా .
         త్రిచి లో ఏ.సి.కార్ ను మా వాళ్ళు బుక్ చేశారు .దానిలో ఎనిమిదింటికి బయల్దేరాం .అక్కడ శ్రీ కుమ్భోదర స్వామి ని దర్శించాం .కుంభం అంటే కుండ కోణం అంటే వంపు .గరుత్మంతుడు అమృత భాం డా న్ని  తెస్తుంటే ఇక్కడ అందులోంచి ఒక అమృత బిందువు జారి కింద పడితే శి వుడు తానే  ఇసుక తో ఒక కుండ చేసి దాన్ని జాగ్రత్త చేసి అందులో ఉండి  పోయాడట .ఆ కుండ పైన ఎడమ వైపుకు వంగి ఉంటుంది .అందుకని కుంభ కోణం అని దేవుడిని కుమ్భోదర శివ లింగం అనీ అంటారు .ఈ ఆలయానికి ఎదురుగా కొద్ది దూరం లో రెండు వేల ఏళ్ళ క్రిందట షాజీ మహారాజు కట్టిన సారంగ పాణి దేవాలయం లో స్వామిని దర్శించాం  .ఇక్క డ స్వామి వెనకాల శేష తల్పం పై శ్రీ మహా విష్ణువు శయనించి ఉన్నట్లు గా కన్పిస్తాడు వట వృక్షం కూడా ఉంటుంది .
           అక్కడి నుండి దారాశురం అనే దేవాలయం లో” ఐరా వతేంద్ర  శివుడిని ”దర్శించాం .ఈ దేవుడు సంతాన ప్రదాత అని ప్రసిద్ధి .అక్కడి నుండి స్వామి మలై చేరాం .అక్కడ శ్రీ సుందరేశ్వార మీనాక్షి అమ్మవార్లను సందర్శించి ,అక్కడే అరవై అడుగుల ఎత్తు  న ఉన్న శ్రీ సుబ్రహ్మన్యే శ్వర స్వామిని మెట్లెక్కి చూశాం .ఇవి పూర్తీ ఆయె సరికి మధ్యాహ్నం పన్నెండు .తమిళ నాడు లో దేవాలయా లన్నీ పన్నెండు గంటలకు మూసి ,నాలుగింటికి తెరుస్తారు .
         ఇక్కడికి సుమారు తొంభై కిలో మీటర్ల దూరం లో ఉన్న తంజావూర్ చేరాం .అక్కడ హోటల్ లో భోజనం చేసి ,అనే ప్రాచీన అపూర్వ గ్రంధాల దేవాలయం అయిన సరస్వతీ మహల్ చూశి మ్యూజియం లోని శిల్పాలను దర్శింకాం .నాలుగింటికి శ్రీ బృహదీశ్వరాలయం సందర్శించి ,పులకిన్చాం .ఆ శిల్ప శోభ ,అక్కడి బృహత్ నంది ని చూసి  ఆనందం తో  తన్మయం చెందాం .పెద్ద ప్రాకారం .అమ్మవారు పెరియమ్మాళ్ .
         ఎన్నో ఏళ్ళుగాచూడాలని  కల గన్న తిరువయ్యార్ వెళ్లాం .ఇక్కడే పుష్య బహుళ  పంచమి నాడు దేశం లోని    స్వామి పంచ రత్న కీర్తనలు అత్యంత భక్తీ యుతం గా గానం చేసే దివ్య క్షేత్రం .ఇక్కడే సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి సమాధి చెందారు .స్వర్గీయ బెంగళూర్ నాగ రత్నమ్మ గారుఅనే సంగెత విదుషీ మణి ఇక్కడ భవన నిర్మాణం చేసి స్వామిసమాధి చెందినచోట శిల్పాన్ని చెక్కించి బృందావనం ను స్మృతి చిహ్నం గా నిర్మించింది .గోడలకు త్యాగరాజ కేర్తనలు చెక్కిన పాల రాతి ఫలకాలను అమర్చింది .ఆమె పూనుకోక పోతే ఇక్కడ త్యాగయ్య ను జ్ఞాపకం చేసుకొనే వారే ఉండే వారు కాదు .తెలుగు జాతి ,సంగీత జాతి ఆమె కు ఎంతో రుణ పడి ఉంది .అక్కడి అర్చక స్వాములు తెలుగు వారే .ఇక్కడి నుండి సరాసరి త్రిచికి బయల్దేరాం .దారిలో శాస్త్ర వర్సిటి వద్ద మా మనవడిని  దింపి మేము  తిరుచ్చి రాత్రి ఎనిమిదింటికి చేరాం .అంటే పన్నెండు గంటలు నాన్ స్టాప్ ప్రయాణం .టిఫిన్ చేసి పడుకోన్నాం .ఈ రోజు అరుదైన ”మౌని అమావాస్య ”అవటం ,ఆ పవిత్ర మైన రోజున ఇన్ని దేవాలయాలను సందర్శించటం మేము చేసుకొన్నపుణ్యం .
         పదకొండవ తేది సోమ వారం మాఘ మాసం ప్రారంభం .ఉదయమే లేచి స్నానం సంధ్యా పూజా చేసి ”అరుణ పారాయణ ”చేసి టిఫిన్ తిని ఏడు గంటలకే మేమిద్దరం కార్ లో బయల్దేరి 160ki.mee. ఉన్న ”పళ ని ”కి చేరాం అక్కడ ”వించి కార్ ” లో యాభై రూపాయల టికెట్ ల తో కిలో మీటర్ ఎత్తున్న కొండ పైకి పావుగంటలో చేరాం .అక్కడ శ్రీ సుబ్ర హ్మన్యే  శ్వర స్వామిని సందర్శించి ,దేవస్థానం ఏర్పాటు చేసిన కమ్మటి ఉచిత భోజనం చేసి ”రోప్ వె ”ద్వారా యాభయి రూపాయల టికెట్ తో కిందికి దిగాం .వెంటనే బయాల్దేరి సాయంత్రం నాలుగున్నరకు తిరుచ్చిచేరాం .హోటల్ టిఫిన్ చేసి రాత్రి పడుకోన్నాం .మనుమడు సంకల్ప్ రాత్రి పదింటికి మా దగ్గర కొచ్చి పడుకొన్నాడు .
             పన్నేండవ తేది మంగళ వారం మామూలు నిత్య పూజాదికాలు అరుణ పారాయణ చేసి ఉదయం ఎనిమిది గంటలకు పన్నెండు కిలో మీటర్ల లో ఉన్న శ్రీ రంగం క్షేత్రం  చేరి యాభై రూపాయల టికెట్ తో శ్రీ రంగ నాదుడిని దర్శించాం .ఎన్నో ఏళ్ళ నుండి ఉన్న కోరిక తీరింది .భగవద్ రామానుజా  చార్యుల వారు, విష్ణు చిత్తుల వారు, గోదా దేవి,విప్రనారాయణ అనే తొందరిప్పోడి  రాల్వార్  తిరుగాడిన పవిత్ర క్షేత్రంఅపర వై కుం థం ” ఇక్కడి కావేరి నదియ విరజా నది అని అంటారు .ఆ నీరు బావిలో కనీ పిస్తుంది .గోదా దేవి ఆలయం ,శ్రీ లక్మీ దేవి ఆలయం సుదర్శన చక్రాలయాలు చూశాం .పెద్ద ప్రాకారం లోపల కార్ లో ఉచితం గా తిప్పి అన్నీ చూపిస్తారు .కన్నులారా రంగనాధ దర్శన  మయింది . కల్యాణానికి పనికి వచ్చే రంగ నాద ,గోదాదేవుల విగ్రహాలను మా ఆంజనేయ స్వామి దేవాలయం లో ఉంచటానికి కొన్నాం .ధనుర్మాసం లో వీరి కల్యాణం చేస్తాం కనుక బాగా ఉంటాయని .అక్కడి నుండి జంబు కేశ్వ రం  లో మారేడు చెట్టు మొదట్లో స్వయంభు లింగం జంబుకేశ్వర శివ లింగాన్ని దర్శించాం  .ఇక్కడ చిన్న గుహలో లింగం ఉంటుంది గంగా జలం అంటే కావేరి అక్కడ ఊరుతూ ఉంటుంది .అమ్మ వారు అమ్మాన్   దేవి .అక్కడ నుండి సమయా పురం లో ఉన్న కాళికా మ్మ వారి ని చూసి ,రాకే ఫోర్ట్ దగ్గరకు వెళ్లాం .ఇక్కడి కొండ పై దేవాలయం, కోటా ఉన్నాయి దూరం నుంచి చూస్తె అది ఒక శివ లింగం లాగా  కనీ పిస్తుంది .ఈ కొండ3800milian సంవత్స రాలది అంటే హిమాలయాల కంటే అతి ప్రాతీన మైనది .ఈ కోట వల్లనే దీనికి తిరుచి రా పల్లి అనే పేరు వచ్చింది రాబర్ట్ క్లైవ్ ఇక్కడి నుంచే పాలించాడు .హోటల్ భోజనం చేసి సాయంత్రం నాలుగింటికి రూం చేరాం .రాత్రి తొమ్మిది బస్ లో మమ్మల్ని ఎక్కించి సంకల్ప్ యూ ని వేర్సిటి కి బస్ ఎక్కి వెళ్ళాడు .రెండు రోజులు సంకల్ప మా తో ఉంది మాకు చాలా సహకరించాడు .వాడు మాతో ఉండటం మాకు చాలా ఆనందం గా ఉంది .
            పద మూడవ తేది ఉదయం నాలుగింటికి మద్రాస్ చేరాం మేనల్లుడు శ్రీనివాస్ మమ్మల్ని అంజి కరరై  లో మా మేన కోడలు కళా వాళ్ళు బుక్ చేసిన హోటల్ రూం లో దింపాడు .ఉదయం ఎనిమిది గంటలకు  మా తమ్ముడు వాళ్ళు వచ్చారు పొద్దున్నే కార్య క్రమాలు అరుణ పారాయణ చేసి శినాయ్ నగర్ లో ఉన్న కళా వాళ్ళింటికి వెళ్లాం అక్కడవాళ్ళ కుమారుడు ఛి అరుణ్ బాలాజీ కి మర్నాడు జరుగ బోయే ఉపనయననికి నాంది .వీళ్ళ భాషలో   ”పూర్వాంగం ”లో పాల్గొన్నాం .ఆగ్ని  హోత్రం ,పూజలు అయిదుగురు స్త్రీలకూ పూజలు అందులో ఒక కన్నె పిల్లా ఒక విధవ మిగిలిన వారు పునిస్త్రీలు .వీరికి మడి  వంట భోజనాలు . ముగ్గు రు బ్రాహ్మణులకు కూడా .భోజనం తర్వాతరూం కు వెళ్లాం .రాత్రి మళ్ళీ వచ్చి టిఫిన్ చేసి వెళ్లాం .ముందుగా మా దంపతులకు సభా గౌరవం ఇచ్చి నూతన వస్త్రాలు సమర్పించి కళ దంపతులు ఆశేర్వాదం తీ సుకొన్నారు .ఇది మేము ఊహించనిది .
              14 వ తేదీ గురువారం బాలాజీ ఉపనయనం .ఏదో తంతు తప్ప మంత్రం లేదు అయ్యో అని పించింది ఈ రెండు రోజులకు గాను పురోహితుని కాంట్రాక్ట్ సాక్షాత్తు” ముప్ఫై ఒక్క వేలు” ..నాకు కళ్ళు తిరిగి పోయాయి .చేసిందేమీ లేదు అంతా ”భుశం భుశం   ” మా అన్నయ్య గారమ్మాయి వేద వల్లి దంపతులు కూడా వచ్చారు గరివిడి నుండి .కళ  భర్త చంద్ర శేఖర్ తరుఫున వాళ్ళు యాభై మంది వచ్చారు .వాళ్ళంతా కలుపుగోలు గా అన్ని పనులులు చేసి సాయం చేశారు .భోజనాలు చేశాం .చాలా పదార్ధాలు చేశారు కానీ ఏవీ సోక్క  లేదు .వచ్చిన అందరికిమాతో బాటు  కళ దంపతులు బట్టలు పెట్టారు . చంద్ర శేఖర్ అక్క గారు ,అమ్మగారు అన్నీ దగ్గరుండి చూసుకొన్నారు ముహూర్తం పౌరోహిత్యం కేటరింగు అన్నీ వాళ్ళు కుదిర్చినవే .కళ భర్త చంద్ర శేఖర్ బంధు ప్రేమ ,అతని నెట్ వర్క్ ,అతని తల్లి తరఫున ఉన్న చుట్టాలందరూ రావటం అతని పై వారందరికీ ఉన్న ప్రేమ ఇవ్కన్నీ చూసి నేను చలించి పోయి అతన్నిదగ్గరకు తీసుకొని  కావ లించుకొని నా అభి నందనాలు తెలియ జేద్దామంటే నోట మాట రాక ఆనంద బాష్పాలు ధారా పాతం గా కరి పోయి గొంతు బొంగురు పోయింది. నాకేదో అయిందని వాళ్ళిద్దరూ కంగారు పడ్డారు .ఇది సంతోషం అని చెప్పాను అప్పుడు చంద్ర శేఖర్ ”ఏ మండీ  మీరు ఉపనయనం రమ్మని మేము ఫోన్ చెయ్యగానే మీరిద్దరూ తప్పకుండా వస్తాం కళ ఇప్పుడు మా ఆడపడుచు స్థానం లో ఉంది కనుక రావటం మా విధి ”అన్నారు అది మా కెంతో ఆనందాన్నిచ్చింది ”అన్నాడు ఆనందం తానూ పట్టలేక .అక్కడే ఉన్న కళ చెల్లెలు జయ ”మీ రిద్దరు మా కళ్యాన్ పెళ్లి కూడా దగ్గరుండి జరిపించాలి మామయ్యా అత్తయ్యా ”అంది  రూం కు చేరి కాసేపు విశ్ర మించాం .
          ఎప్పటి నుండో శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ గారిని వారింటి వద్ద కలిసి మాట్లాడాలని కోరిక .నిన్న సాయంత్రం ఫోన్ చేస్తే రేపు తనకు వీలు అని ఏ సమయం లో నైనా రావచ్చని చెప్పారు మధ్యాహ్నం మూడింటికిమేమిద్దరం ,మా అన్నయ్య గారి అబ్బాయి రామనాధ్ ,మా తోడల్లుడు శంకరం గారమ్మాయి ప్రతిభ కాల్ టాక్సీ లో వెళ్లాం .ఎంతో ఆదరం గా ఆహ్వానించారు ఈల శివ ప్రసాద్ గారు తన గురువు బాల మురళి గారి గురించి చెప్పిన వన్నీ గుర్తు చేశాను .చిరు నవ్వే సమాధానం .సరస భారతి ప్రచురించిన శ్రీ హనుమద్ కదా నిధి ,ఆదిత్య హృదయం పుస్తకాలను వారికి అందించి ఫోటోలు తీసుకొన్నాం .నేను ”మొన్న తిరువయ్యార్ ”లో త్యాగ రాజ స్వామి సమాధి దర్శించి పులకిన్చాం ఈ రో జు వాగ్గేయ కారు లైన అపర త్యాగయ్య ను ప్రత్యక్షం గా చూస్తున్నాం .మహాదానందసం గా ఉంది .”అన్నాను .సంబర పడ్డారు .వారింటి పేరు ”మారుతి ”.నేను మళ్ళీ ”మీకూ  మాకు సంబంధం ఉంది .మీరు మారుతి భక్తులు .మేము ఆ మారుతీ సేవకులం మాకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం ఉంది ”అని చెప్పి మన పుస్తకాలు వారికి అంద జేశాను .మేము కొంచెం భయం భయం గా దూరం గా ఉంటె ఎంతో సౌ జన్యం తో మమ్మల్ని దగ్గరకు తీసుకొని మీద చెయ్యి వేసి ఫోటోలు దిగారు మా వివరాలు అడిగి తెలుసు కొన్నారు .నేను ‘మిమ్మల్ని యాభై ఏళ్ళ క్రితం బందరులో అమ్ముల విశ్వ నాధ భాగవతార్ గారి అమ్మాయి వివాహ సందర్భం గా వారింటి వద్ద కచేరి చేస్తుండ  గా చూశాను .ఆ తర్వాత చాలా సార్లు సభల్లో చూసాను ఇవాళ మీతో ముఖా ముఖి కావాలనే ఒక పది నిమిషాలు మీ సన్నిధి లో గడపాలని వచ్చాం ”అన్నాను.’ప్రతిభ ”మే లాంటి వారి దగ్గరకు రావటం మీతో మాట్లాడటం కల గా అని పిస్తోంది ”అన్నది .ఆయన నవ్వుతు ”అమ్మా !అలాంటిదేమీ లేదు. నేను మీ లాంటి మనిషినే .మీకెంతో నాకూ అంతే తెలుసు .అంతకంటే గొప్ప ఏమీ లేదు .కాని వేదిక ఎక్కి పాడటం మొదలు పెడితే నేను నేను కాను .ఒక అపూర్వ శక్తి నన్ను ఆవహించి నన్ను నడి  పిస్తుంది .అప్పుడు నాకు సంగీతం తప్ప వేరేదీ తెలియదు .వేదిక దిగ గానే నేను మళ్ళీ మామూలే వేదిక ఎక్కే దాకా ఎవ్వరైనా ఏదైనా నాతో మాట్లాడవచ్చు దిగిన తర్వాత కూడా అంతే ”ఆన్నారు ..”మీ దగ్గిరకు రావటం ఇంత సులభం అను కోలేదు ”అన్నాం  ”ఆయన ”మేరేవ్వరైనా ఎప్పుడైనా రావచ్చు .వచ్చే ముందు ఫోన్ చేయండి .మద్రాస్ లోనే ఉండే దానివి కనుక అమ్మా నువ్వు ఎప్పుడు వీలైతే అప్పుడు రావచ్చమ్మా -ఆఖరికి నేను పోయిన తర్వాత కూడా ”అన్నారు ”దయచేసి ఆ మాట అనకండి కల కాలం మీ స్వరం సప్త స్వరాలు పలుకుతూ ఉండాలి ”అన్నాను .డెబ్భై ఏళ్ళ నుంచి పాడుతూనే ఉన్నానని ,అతి చిన్న వయసులో ఈ సంగీత జ్ఞానం కలిగిందని సంగీతం అంతా శ్రీ ఆంజనేయ స్వామి దే నని అన్నారు ”నాకు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం లభించిన్దండీ ”అన్నారు ”ఎక్కడ ”?అని అడిగాను .”విజయవాడ లో మా ఇంట్లో ”అన్నారు .ఆ మాటకు మా కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలిపోయాయి .వారి ఇంటి ముందు ”తమల పాకు చెట్టు ”దాదాపు అర అడుగు వెడల్పు కాండం తో భలేగా ఉంది .పందిరి మీద లతను పాకించారు .దాదాపు అయిదు అంగుళాల మన్దమ్ లో తీగలు అల్లుకు పోయి కన్నుల నిన్దుగాఉంది .ఆకులు నవ నవ లాడుతున్నాయి .ఆ మాట చెప్పి,మా  ఆంజనేయ స్వామి దేవాలయం లో మంగళ శని వారాల్లో వందలాది కట్టలతో తమల పాకు పూజ ఉంటుందని అన్నాను .అవునని తాను నిత్యం తాంబూలం వేసుకొంటా నని అందుకే పెంచుతున్నానని చెప్పారు .మా శ్రీమతి ”మిమ్మల్ని రేడియో విద్వాంశులు కుటుంబ శాస్త్రి గారింట్లో విజయవాడ లో మా అమ్మ తీసుకొని  వెళ్లి చూపిస్తే చూశాను .అప్పటికే మీరు మహా విద్వాంశులని పేరొచ్చే సింది ”అంటే నవ్వారు .నేను మళ్ళీ ”అమెరికా లో మా అమ్మాయి విజయ లక్ష్మి మిమ్మల్ని హూస్తన్  నగరం లో మొదటి సారి చూసింది .మీ  సంగీతం అన్నా మీరన్నా మహా అభిమానం .మీ కీర్తనలన్నీ నోటితో ఎప్పుడు పాడుకొంటూ ఉంటుంది .మీరు రికార్డు చేసిన ”శ్రీ వెంకటేశ్వర సహస్ర నామ స్తోత్రాన్ని కార్ లో పెట్టుకొని వింటూ పులకించి పోతుంది .అంతా నోటికి వచ్చి పాడుతూనే ఉంటుంది .మేము బృహదీశ్వరాలయం చూసి వచ్చిన రోజున ఫోన్ చేసింది స్వామిని చూశాం అనగానే  మీ కీర్తన ”బృహ దీశ్వరా ” హం చేసి విని పించింది .మీరు అమెరికాలో నార్త్ కరోలిన వెళ్తే  షార్లెట్లో వాళ్ళ ఇంట్లో ఆతిధ్యానికి ఆహ్వానించామని మా అల్లుని తరఫున తెలియ జేయ మంది ”అని చెప్పాను .దానికీ నవ్వే సమాధానం .దాదాపు అర గంట సేపు వారి  సమక్షం లో మధురం గా గడిపి ,ఆ క్షణాలను గుర్తుంచుకొంటు వారిదగ్గర సెలవు తీసుకొని రూం కు తిరిగి వచ్చాం .
                 మధ్యాహ్నం రెండు గంటలకు వేద వల్లి దంపతులు తిరుపతికి, అయిదింటికి మోహన్ దంపతులు కూతురు మా అన్నయ్య గారి మనవడు కళ్యాన్ హైదరా బాద్ కు బయల్దేరి వెళ్ళారు .ప్రతిభను రాత్రి ఏడు గంటలకు వాళ్ళ ఆయన వచ్చి కోడంబాకం తీసుకొని వెళ్ళాడు మాకు టిఫిన్ పాక్ చేయించి తెచ్చి ఇచ్చాడు మేనల్లుడు శ్రీనివాస్ .నాలుగు రోజులుగా వాడికి రోజు తెల్ల వారు ఝామున రెండికి రైల్వే స్టేషన్ కో బస్ స్టేషన్ కో వెళ్లి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని కార్ లో ఇంటికి చేరుస్తూ మహా శ్రమ పడ్డాడు .అక్కయ్య  కొడుకు అంటే మేనల్లుడి ఉపనయనానికి  దగ్గరుండి అన్నీ చూసుకొన్నాడు .మా అక్కయ్య లోపాముద్ర బావ కృపానిధి లేని లోపాన్ని పూరించాడు .
            15 వ తేదీ శుక్ర వారం ఉదయం మామూలు కార్య క్రమం ,అరుణ పారాయణ తర్వాతా హోటల్ గదులు ఖాళీ చేసి కళా వాళ్ళింటికి చేరాం .టిఫిన్లు చేసి ఇదంతా రాశాను .సాయంత్రం వీలుని బట్టి షాపింగ్ చేయాలని ఉంది రాత్రి తొమ్మిది గంటలకు భువ నేశ్వర్ ఎక్స్ప్రెస్ లో విజయ వాడ  కు బయల్దేరి పదహారు ఉదయం నాలుగింటికి చేరి , అక్కడి నుండి ఉయ్యూరు వెళ్తాము .
              మేము చూసిన క్షేత్రాల  విశేషాలన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటి తరువాత మీకు రాసి తెలియ జేస్తాను .
          మీ –గబ్బిట  దుర్గా ప్రసాద్ –15-2-13-కాంప్–చెన్నై 
             

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.