నా దారి తీరు -2
ఇంగ్లీష్ సబ్జెక్ట్
ఇంటర్ లో మాకు ఇంగ్లీష్ పోయిట్రీ కి సుబ్రహ్మణ్యం గారు అనే అరవ ఆయన వచ్చే వారు .చాలా బాగా చెప్పే వారు .ఆర్ దయా నిధి గారు ప్రోస్ చెప్పే వారు ఈయన ఎప్పుడు నల్ల పాంటు కోటు తోఉండే వారు నాండి టటైల్డ్ కు కే.హిరయన్నయ్య అనే ఎర్రటి ,పొట్టి కోటు బూటు వేసే కన్నడం ఆయన వచ్చే వారు .ఆయనకు తెలుగు రాదు .ఈయ నే మాకు డికెన్స్ రాసిన ‘’A taale of two cities ‘’బోధించారు ఆయన ప్రారంభ వాక్యాలను అద్భుతం గా చదివి చెప్పటం ఇప్పటికి గుర్తుంది “’it was the good of time it was the bad of time ‘’ అన్న మాటలు ఇంకా చెవుల్లో రింగు మంటున్నాయి అందులో పాత్రలు వాటి స్వభావాలు త్యాగం ,ప్రేమా అన్నీ గొప్ప గా ఆవిష్కరించి డికెన్స్ అంటే వీరాభి మానాన్ని కల్గించారు .అందుకే అమెరికా వెళ్లి నప్పుడల్లా డికెన్స్ పుస్తకాలు ,ఆయన పై ఆధునికులు రాసిన విశ్లేషణ చదవటం మహా ఇష్టం గా ఉండేది .విలియం బ్లేక్ రాసిన the tiger పద్యాన్ని సుబ్రహ్మణ్యం గారు విరగ దీసి చెప్పి ఆయనంటే అభిరుచి కల్గించారు .ప్రోజు లో బైరన్ రాసిన వ్యాసాలున్దేవి చదువు మీద పుస్తకం మీద స్నేహితుల మీద ,రాయటం మీద గొప్ప ఎస్సేలు చదువుకొన్నాం .జూలియస్ సీసర్ నాటకం కూడా హిరణ్నయ్య గారే చెప్పిన జ్ఞాపకం .
గణితం
లెక్కల్లో ఆల్జీబ్రా, కాల్క్యులస్, జామెట్రీ,ఎనలిటికల్ జామెట్రీ వగైరాలున్దేవి .ప్యూర్ జమేత్రిని నోరి రాదా కృష్ణ మూర్తి గారు (n.r.k.),ఆల్జీబ్రా ను అనుముల కృష్ణ మూర్తి గారు (a.k.),ఎనలిటికల్ ను రామ కోటేశ్వర రావు గారు బోధించారు .ముడుంబై రాఘవా చారి గారు హెడ్ .ఆయన కూడా ఆల్జీబ్రా చెప్పారు .ఇందులో నోరి వారి బోధన పరవశం కలిగించెడి .ప్రతి స్టెప్ బోర్డ్ మీద వేసే వారు అనుమానాలు తీర్చే వారు .ఏ.కే .గారు చాలా స్టైల్ గా ఉండే వారు .ఆయనతో చనువుండేది కాదు .రాఘ వా చారి గారు కోపం తెలీని మనిషి కోపం వస్తే యెర్ర కణాలు పాడై పోతాయని ఎవ్వర్నీ కోపగించే వారు కాదని ఆయనే చెప్పారు . ఆర్.ఎస్.ఎస్.మనిషి మంచి పద్ధతులున్న వారు .సిల్కు పంచె ,సిల్కు లాల్చి తో నుదుట నిలువు బొట్టుతో దబ్బ పండు లా ఉండే వారు ..
కేమిస్ట్రి
ఇనార్గానిక్ చేమిస్త్రి కి వింజమూరి భాస్కర రావు గారు వచ్చే వారు .వారే మొదటి గంట కు వచ్చి క్లాస్ టీచర్ గా ఉండే వారు .ఇన్ షర్ట్ర్ట్ వేసుకొని ఉండే వారు నల్లటి పొట్టి మనిషి .అయినా గొప్పా ఆకర్శన ఉండేది గాయకురాలు విజమూరి లక్ష్మి గారికి అన్న గారు .భాస్కర రావు గారు నాకు రోల్ మోడల్ .పా ఠాన్ని చెప్పిrecapitulation చేసి మర్నాడు క్లాస్ కు రాగానే నిన్నటి రోజు లెసన్ పై ప్రశ్నలు వేసి సబ్జెక్ట్ మీద నా కు మంచి అభిమానాన్నిఅభిని వేశాన్ని కల్గించారు .దీనినే నేనూ స్కూల్ లో బోధనకు ఉపయోగించి విజయం సాధించాను .భాస్కర పణిక్కర్ అనే ఆయన రాసిన నిక్ కు చపుస్తకం ఇనార్గాదివాను .చాలా సింపుల్ గా ఉండేది పాత పుస్తకాల షాపు లు అలంకార్ టాకీస్ దగ్గర ఉండేవి అక్కడ రెండున్నర రూపాయలకు దాన్ని కొన్నాను ..అలాగే ఇంగ్లీష్ గైడ్ రూపాయిన్నరకు ఫిజిక్స్ రెండు కు కొన్న గుర్తు .ఆర్గానిక్ కేమిస్త్రి కి సోమయాజులు గారు అనే హెడ్ వచ్చే వారు .పంచా లాల్చీ తో శుద్ధ వైదికుని లా నల్ల బొట్టు తో ఉండే వారు .అద్భుత బోధన వారిది .ఇంటికి వెళ్లి చదవక్కర్లేక పోయేది అంతా క్లాస్ లోనే వచ్చేసేది ..ప్రాక్టికల్స్ కు లాబ్ ఉండేది .అందులో మూర్తి గారు అనే ఎప్పుడు కారా కిళ్ళీ నవిలే ఆయన ఇంచార్జి గా ఉండే వారు .ఏదో దూరపు బంధుత్వం ఉంది మాకు.ఆయన్ను అందరు ‘’కారా కిల్లి ‘అనే వారు .నన్ను బాగా చూసుకొనే వారు .నాకు ప్రాక్టికల్స్ చెయ్యటం వచ్చేది కాదు .ఎప్పుడూ రిజల్ట్ కోసం ‘’కుకింగ్ ‘’చేసే వాడిని
ఫిజిక్స్
ఫిజిక్స్ కు గుర్రాజు గారు వచ్చే వారు .ఆయనే హెడ్.ఎప్పుడు పాంట్ కోట్ వేసుకొని బూట్ లతో వచ్చే వారు .ఆయనంటే భయం .బాగా బోధించే వారు .ఆయన కు ఒక కాలు కొంచెం పొట్టి .ఫిజిక్స్ పై మంచి అభిమానం రావటానికి కారకులయ్యారు .ఫిజిక్స్ లాబ్ కు వెంకటేశ్వర్లు అనే అసిస్టెంట్ ఉండే వాడు నల్లగా నిక్కర్ లో ఉండేవాడు అతనే అందరికి ప్రాక్టికల్స్ కు సాయం చేసే వాడు .పరీక్షల్లో కూడా ..ఫిజిక్స్ లాబ్ పైన కేమిస్త్రి ది కింద ఉండేవి .లైట్ ఎలేక్త్రిసిటి ,మాగ్నేటిజం ,డైనమిక్స్ వగైరాలున్దేవి బుద్ధి రాజు రామ మోహన శర్మ గారు స్తాటిక్స్ చెప్పేవారని జ్ఞాపకం .అయన పంచ మీద బుష్ షార్ట్ వేసుకొని కోటు తొడుక్కొని వచ్చే వారు .ఆయన్ను ‘’బెజవాడరామవరప్పాడు మోటార్ సర్విస్‘’(b.r.m.s.)అనే వాళ్ళం ఆయన యూని వెర్సిటి గోల్డ్ మెడలిశ్టే కాని మాకేమీ అర్ధమయ్యేది కాదు .రెండో ఏడు కొత్తగా ప్రజాపతి రావు గారు వచ్చారు కష్ట పడి చెప్పేవారు ఆయనే తర్వాతా శారదా కాలేజి ప్రిన్సిపాల్ అయి అవినీతి ఆరోపణ లేదుర్కొని ఉద్యోగం కోల్పోయారు
కొందరు ప్రముఖులు .
ఇంగ్లీష్ హెడ్ గా జొన్నల గడ్డ సత్య నారాయణ మూర్తి గారుండే వారు .ఆయన క్లాసులు R4 అని ప్లే గ్రౌండ్ దగ్గర పెద్ద రేకుల షెడ్ లో జరిగేవి .మాకూ ఒకటి రెండు సార్లు క్లాస్ కు వచ్చి బోధించారు .ఆయన డ్రామాకు స్పెషల్ .అంతా అభి నయించి చెప్పేవారు ఆ ఉచ్చారణ ,పాత్రల స్వభావం కళ్ళకు కట్టించే వారు .అందుకే ఆయన క్లాస్ అంటే అందరు ఎగ బడి వెళ్లి వినే వారు ఇతర సబ్జెక్టుల వారూ .వచ్చే వారు .హాలంతా నిండి పోయేది ఆయన ఏడెనిమిది భాషల్లో అపూర్వమైన పాండిత్యం ,ప్రజ్ఞా ఉన్న వారు .హిందూ పూర్ లో మా నాన్న గారు మునిసిపల్ హై స్కూల్ లో పని చేస్తున్నప్పుడు వీరు ఉపన్యాసాలకోసం మా ఇంట్లో ఉండే వారట మా నాన్నా గారు అమ్మా గుర్తు చేశారు మహా గంగా ఝరి తో ఆయన ఉపన్యాసాలు సాగేవి అందులో తెలుగు ఇంగ్లీష్ సంస్కృతం వేదాలు శాస్త్రాలు పురాణాలు అలా దొరలు కొంటు వచ్చేవి ఒక మాటకు ఎన్నెన్ని అర్ధాలున్నాయో ఆయన ఇంగ్లీష్ బోధించే టప్పుడు చెప్పే వారు మా రెండవ ఏడాది ఆయన కు రష్యా ఆహ్వానం వస్తే వెళ్ళారు అనువాదం చేయటానికి .వెళ్ళే ముందు మేము ఆయనకు గొప్ప సన్మానం, వీడ్కోలు సభా చేశాము .అప్పుడు మాట్లాడుతూ ఆయన ‘’ఆ మంచు గడ్డ లో ఈ జొన్నల గడ్డ ఏమై పోతాడో ?’’అని చమత్కరించిన మాట ఇప్పటికీ గుర్తుంది .అలాగే ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో ఒకాయన హిందీ నటుడు దిలీప్ కుమార్ లా జుట్టు, వేషం తో ఉండే వారు ఆయన్ను అందరు దిలీప్ కుమార్ అనే పిలిచే వారు .ఆయనా అస్సాం ప్రభుత్వ ఆహ్వానం పై గౌహతి వెళ్ళారు ఇద్దరూ ఎక్కువ కాలం లేరు .మూడేళ్లకే తిరిగి వచ్చారని జ్ఞాపకం .
లెక్కల ప్రైవేటు
నా చదువు ఏదో వానాకాలం చదువు లా సాగింది పెద్ద గా లెక్కలు అర్ధమయ్యేవి కావు .ఎవరికి చెప్పలేదు .కాని మొదటి ఏడాది అవగానే ప్రోగ్రెస్ కార్డు ఇంటికి వచ్చింది .అందులో మార్కులు చూసి మా నాన్న ‘’ఏమిట్రా ఈ అత్తిసరు మార్కులు .యెట్లా రెండో ఏడు లాగిస్తావ్ ?’’అని అడిగారు .లెక్కల్లో ట్యూషన్ పెట్టాలి అని అడిగాను .సరే నని రెండో ఏడాది మొదటి నుంచీ నోరి రాదా కృష్ణ మూర్తి గారి దగ్గర ట్యూషన్లు కు చేరాను .మేమున్న ఇంటికి ప్రక్క బజారు లోనే ఉన్నారాయాన .ఒక డాబా ఇల్లు కింద రూమ్ లో సుమారు ఇరవై మంది కూర్చునే వీలు అక్కడే బోర్డు .చాప మీద కూర్చుని బోధించే వారు .అసలు లెక్క లంటే హై స్కూల్ లోనే భయం .ఎట్లాగో తప్పకుండా పాస్ మార్కులోచ్చాయి మేస్టారి బోధన అద్వితీయం ఎంతో ఓర్పు వారిది ఆయన బాచీలు బాచీలు గా చెప్పే వారు .తెల్ల వారు ఝామున నాలుగున్నర గంటల నుండి గంట కోక బాచి వచ్చేది డిగ్రీ ,ఇంటర్ వాళ్లకు చెప్పేవారు తొమ్మిదింటి దాకా క్లాసులు .మళ్ళీ పదింటి కల్లా కాలేజి కి తయారు .ఇక్కడ చెప్పాం కదా అని అక్కడేమీ బద్ధ కించే వారు కాదు .అక్కడా ఇంతకంటే బాగా చెప్పే వారు .నాకు గొప్ప ఆదర్శం నోరి వారు .రెండో సంవత్సరం అంటే మొదటి ఏడాది లెక్కలన్నీ మళ్ళీ నేర్చుకోవాల్సిందే .అన్నీ చెప్పేవారు .మంచి మార్కులు వచ్చాయి లెక్క లంటే గొప్ప అభిమానం ,ఆపేక్ష కల్పించింది నోరి మేస్టారే .ట్యూషన్ ఫీజు స్సంవత్సరానికి రెండు వందల యాభై .ముందు నూట యాభై కట్టాలి .ఫస్ట్ క్లాస్ లో ఇంటర్ పాస్ అయాను అన్నిటికన్నా లెక్కల్లో ఎక్కువ మార్కులోచ్చాయి .మిగిలిన సబ్జెక్టు లన్ని నేనే చదువు కొన్నాను .లెక్కల్లో వచ్చిన ఇంట్రెస్ట్ మిగిలిన వాటిని చదవటానికి బాగా ఉప యోగ పడింది .రిజల్ట్ రాగానే నేనూ మా నాన్నా వెళ్లి నోరి వారికి కృతజ్ఞతలు చెప్పాము అప్పటికే నేను ఇన్ లాండ్ లెటర్ రాసి నా కృతజ్ఞతలు తెలియ జేశాను ..ఆయనా సంతోషించారు .లెక్కలకు నాకు ఆదర్శం నోరి రాదా కృష్ణ మూర్తి గారే ఆప్పుడు ఇప్పుటికీ , ఎప్పుడూ కూడా .అందుకే నేను హైస్కూల్లో బోధించేటప్పుడు లెక్కలు కూడా చెప్పి మెప్పించే వాడిని .లెక్కల మేస్తార్లతో పోటీ గా బోధించి విద్యార్ధుల మనసు ఆకట్టు కొనే వాడిని దీనికి భిక్ష పెట్టింది యెన్.ఆర్.కే.గారే .
నేను చూసిన పెద్దలు
మా కాలేజి కి సాంస్కృతిక శాఖ చాల కార్య క్రమాలు చే బట్టేది .బాలాంత్రపు రజనీ కాంత రావు గారు ఆకాశ వాణి లో ఉండే వారు .వారు వచ్చి ఆర్ ఫోర్ లో సంగీత విభావరి నిర్వహించటం బాగా గుర్తు .వింజమూరి లక్ష్మి గారు కూడా పాడారు రజని తెల్లని అపైజమా ,లాల్చీతో వచ్చారు .అల్లాగే బందా కనక లింగేశ్వర రావు గారు నాటకం మీద ప్రసంగించి పద్యాలు పాడటం జ్ఞాపకం .జి.సి.కొండయ్య గారు తన రష్యా అను భావాలు వివరించటం మనసు లో నిలిచే ఉంది .పి.డి.గారు జానకి రామయ్య గారు పంచా లాల్చీ త్హో ఉండే వారు .ఆయన సోమయాజుల గారి తమ్ముడని గుర్తు ఈయన అంటే హడలు గా ఉండేది .నేనేమీ పెద్ద గా ఆడిందేమీ లేదు .వీలు చిక్కి నప్పుడల్లా సినిమాలు చూసే వాడిని హిందీ సినిమాలు నవ రాగ్ ఝనక్ ఝనక్ పాయల్ బాజే వంటివి చూసి శాంతా రాం అంటే అభిమానం పెరిగింది .అప్పుడు వినాయక చవితి సినిమా జైహింద్ టాకీస్ లో నేల మీద కూర్చుని పావలా టికెట్ తో చూసాం వేసవి .చెమటలు కక్కి నేలంతా చెమటతో తడిస్తే చెప్పులు ముడ్డి కింద పెట్టుకోన్నాం నేనూ రాదా కృష్ణ మూర్తి శోభనాద్రి, రాముడు .
సాయంత్రాలు
రోజు సాయంత్రం హోటల్ కు వెళ్ళే వాళ్ళు రాధుడు ,దిగ వల్లి శివ రావు గారి అబ్బాయి సూర్య నారాయణ ఇంకో సూర్య నారాయణ శివ రావు గారి పెద్ద బ్బాయి ఒక రోజు నన్నూ వాళ్ళతో రమ్మంటే వెళ్లాను ,మర్నాటి నుంచి వాళ్ళు రమ్మనక పోయినాఎగేసుకొని వెంట వెళ్లాను డబ్బులన్నీ దిగ వల్లి వారే పెట్టె వారు .నన్నేమీ తక్కువ గా చూసే వారు కాదు .నాకే చివరికి సిగ్గు అని పించి అని పించింది ‘’ఈ బేవార్సు తిండియేమిటి ‘?/అని తర్వాతవెళ్ళటం మానె శాను .అజంతా హోటల్ లో మిన పట్టు బాగుండేది .వెల్కం హోటల్ లో కాఫే బాగుండేది మోడరన్ హోటల్ లో బొండా బాగా నచ్చేది .ఇలా ఎక్కడ వీలైతే అక్కడ తినే వాడిని ఒక టిఫిన్ ఒక కాఫీ .అప్పుడు మెట్రిక్ పద్ధతి వచ్చేసింది .పావలాకు ప్లేట్ ఇడ్లి పన్నెండు పైసలకు కాఫీ ఉవాచ్చేదని జ్ఞాపకం .కాలేజి దగ్గర హోటల్ ఉన్నా ఎప్పుడైనా టీ తాగే వాడిని టిఫి చేసే వాడిని కాదు .ఆకలితో అలానే గడిపాను .
నడిచి దుర్గ కొండ కు వెళ్ళే వాడిని బారేజ్ నడిచి వెళ్లి చూసే వాడిని .హనుమంత రాయ గ్రంధాలయానికి వెళ్లి పేపర్లు చదివే వాడిని అక్కడి మీటింగులు నాటకాలు చూసే వాడిని దారిలో స్దినిమా ఆఫీసుల్లో కొత్త సినిమా బోర్డులు చూసుకొనే వాడిని శర్మా ఆర్ట్స్ అనేది ఆ రోజుల్లో బానర్లు తయారు చేసేది’’ లితో వర్కు’’ బాగా ఉండేది .నెహ్రు ను రెండు సార్లు విజయ వాడ పి.డబ్ల్యు గ్రౌండ్ మీటింగ్ లో చూశాను .ఎర్రగా కోతి ముడ్డి మామిడి పండు రంగులో ఉండే వాడు చాలా చలాకీ గా వేదిక ఎక్కే వాడు .ఏలూరు అమ్మాయిమోతే వేద కుమారి .వందే మాతరం పాడేది ఆమె తర్వాతా ఏం ఎల్. ఏ .అయింది .చాలా హుషారు గా మాట్లాడే వాడు నెహ్రు .
మామ్మా వాళ్ళింటి ప్రక్కన రుక్మిణమ్మ అనే విధవ రాలుండేది ఆమె ఒక పురోహితుని కూతురు వచ్చీ రాని ఇంగ్లీష్ మాట్లాడేది ‘’దానికో పెద్ద స్టోరు (స్టోరీ )ఉంది అనేది స్టోరీ కి బదులు .రిక్షా బదులు ‘’రిష్కా ‘’అనేది కావాలని నేను ఆవిడ తో ఆమా టలు అని పిన్చి నవ్వుకొనే వాడిని ఆమె తండ్రి పున్నయ్య గారు మంచి కుటుంబం చాలా ఆప్యాయం గా ఉండే వారు .
చెరుకు పల్లి పట్టాభి రామయ్య గారు
ప్రక్క వీధిలో చెరుకు పల్లి పట్టాభి రామయ్య గారు అనే గొప్ప ప్లీడర్ ఉండే వారు మా బుల్లి మామ్మ మనవరాలు శారదక్కయ్యకు మామ గారు .ఆమె భర్త శ్రీ రామ మూర్తి గారు బి.ఎల్.చదివినా ప్రాక్టీస్ చేయ లేదు ఆయన తమ్ముడు శాస్త్రి ని మేము ఏడి పించే వాళ్ళంఅతను అమాయకం గా ఉండే వాడు మేతక మనిషి . పట్టాభి రామయ్య గారు నన్ను బాగా ఆదరించే వారు కాని శారదక్కయ్య స్వంత తమ్ముల్లైన శోభనాద్రి రాముడంటే ఆయన కెందుకో కొంచెం కోపం .అలానే రాధ కృష్ణ మూర్తి అన్నా అంతే .లీడింగ్ లాయర్ ఆయన భార్య కూడా మాపై ఆప్యాయత కన పరచేది వాళ్ళమ్మాయి భారతి మాకు కాలేజి లో సీనియర్ రోజు రిక్షా లో వెళ్లి వచ్చేది .ఆమె అక్క పిచ్చిది ఇంట్లోనే ఉండేది .శారదక్కయ్య భర్త ‘’స్కాట్ నవల ‘’టాలిస్మన్ ‘’కు’’గీటు రాయి ‘’పేరు తో మంచి అనువాదం చేసి ప్రచురించారు .బాగా జ్ఞానం ఉన్నా ఉత్త బద్ధ కిష్టు..రాత్రిళ్ళు పట్టాభి రామయ్య గారు కుంపటి దగ్గర పెట్టుకొని చలి కాచుకొంటూ భోజనం చేసే వారు మమ్మల్నీ పక్కన కూర్చో పెట్టుకొనే వారు మాటలు బాగా మాట్లాడే వారు ఉదయం సాయం సంధ్యా వందనం చేసే వారు .ఆమె కు చక్కని ని పూజ గది ఉండేది మడి వంట చేయటానికి వంటా విడ ఉండేది ఒక రకం గా దివాణం వారి ఇల్లు .ఎంతో మంది సాహితీ వేత్తలు సంగీతజ్ఞులు ఆయన కోసం వచ్చే వారు మంచి ఆతిధ్యం ఇచ్చే వారు ఆయన తమ్ముడు కోదండ రామయ్య గారు కూడా లాయరు ప్రక్క వీధి లో ఉండే వారు ఆయనకు ఒక కాలు కుంటి సంతానం లేదు మరదలి కొడుకును దత్తత చేసుకొన్నాడు పెద్ద గా ప్రాక్టీస్ ఉండేది కాదు అయితేనేం మంచి ఆస్తి ఉంది .ఇప్పుడు ఆ వీధికి ”చెరుకు పల్లి వారి వీధి ”అని పేరొచ్చింది .వాళ్ళింటి ప్రక్కనే మా ఓడిన కమలమ్మ గారి బాబాయి వాళ్ళ ఇల్లు ఉంది .
బుల్లి మామ్మ కు ఉయ్యూరు నుండి బియ్యం తెచ్చి ఇచ్చే వాడిని వీలైతే కాళేశ్వర రావు మార్కెట్ కు వెళ్లి కూరలు తెచ్చే వాడిని .శోభనాద్రి వాళ్ళు శోభనాద్రి గూడెం నుండి బియ్యం పప్పులు మిర్చి వగైరా వాళ్ళ చేలో పండినవి బస్ లో తెచ్చి పడేసే వాళ్ళు .లేక పోతే వాళ్ళ నిఖామాన్ మస్తాన్ తెచ్చి పడేసే వాడు ,చెరుకు పల్లి రామ శర్మ అని శారదక్కయ్య పిన్ని కొడుకు రామ మోహన ఆయుర్వేద శాలలో ఆయుర్వేదం నేర్చుకొంటూ మాతో ఆది వారాలు వచ్చి మాట్లాడి వెళ్తుండే వాడు .అతన్ని వీళ్ళు ‘’సాయిబూ ‘’అని సరదా గా పిలిచే వారు నవ్వే వాడు .గొప్ప ఆహితాగ్ని ఆయన .వాళ్ళ అబ్బాయి గణేష్ శర్మ ఇప్పుడు మా ఇంట్లో అద్దెకు ఉండి మధునా పురం లో వేదం నేర్చుకొంటూ కూతుర్ని ఫ్లోరా లో చదివిస్తున్నాడు .సెలవలు దగ్గర కొస్తే ఇంటికి ఎప్పుడెప్పుడా వెళ్ళేది అని రోజులు లెక్క వేసే వాడిని ‘’ఇంకా నాలుగు రోజులు ఎనిమిది భోజనాలు ‘అనే వాడిని శోభనాద్రి, రాముడు నవ్వే వాళ్ళు వీళ్ళు నన్ను ‘’దుర్గా పతీ ‘’అని పిలిచే వారు .నేను శోభనాద్రిని ,రాదా కృష్ణ ను ‘’గురూ ‘’అనే వాడిని రాముడు మాత్రం నన్ను ‘’పతీ ‘’అని షార్ట్ కట్ గా పిలిచే వాడు .బలే సరదాగా రెండేళ్ళు గడిచాయి జామెట్రీ లెక్కలు ‘’nine point theorem ‘’ను కింద గచ్చు మీద ఫిగర్ వేసి మొత్తం చూడ కుండా రాయటం అల వాటు చేసుకొన్నాను .దిగ వల్లి శివ రావు గారు కూడా పెద్ద లాయర్ చారిత్రిక పరిశోధకులు ఎన్నో పుస్తకాలు రాశారు వారిల్లు మామ్మ వాళ్ళింటికి ఎదురిల్లె .రామ మందిరానికి వెళ్లి వచ్చే వాడిని రహిమాన్ పార్కుకు, అక్కడే ఉన్న లైబ్రరీకి ఆది వారాలలో వెళ్ళే వాడిని .మామ్మ వాళ్ళు సరుకులులను రామ మందిరం దగ్గర ఉన్న కోమటి కోట్టులో పద్దు పెట్టి తెచ్చే వాళ్ళు.అతను నవ్వుతు పలకరించే వాడు .డబ్బుకు ఒత్తిడి చేసే వాడు కాదు .’
మరి కొందరు ప్రముఖ లెక్చరర్లు
జటావల్లభుల పురుషోత్తం గారు సంకృత అధ్యాపకు లూ, హెడ్డు కూడా మంచి వక్త .ఎన్నో పుస్తకాలు రాశారు పంచ లాల్చీ మ వల్లే వాటు తో ఉండే వారు నుదుట పెద్ద కుంకుమ బొట్టు వారంటే విపరీత మైన గౌరవం అందరికి .వారూ విశ్వనాధ వారు హిందూ పూర్ వచ్చి నప్పుడు మా ఇంట్లో నే ఉండే వారట .అన్నే రాదా కృష్ణ మూర్తి గారు లాజిక్ కు మోనార్క్ .తెల్లటి దుస్తులు ధరించి నల్లటి చెప్పులతో వచ్చే వారు .వారు లాజిక్ చెబుతుంటే నోళ్ళు వెల్ల బెట్టి వినే వారు ఎన్నో గ్రంధాలు చదివి అవలోడనం చేసుకొన్నారని చెప్పే వారు .ఒక రకం గా ఈ కాలేజీ కి ‘’ప్లేటో ‘’లాంటి వారు చాలా నిదానం గా ఉండే వారు .
ఎస్వీ ప్రభావం
సుమారు నల భై ఏళ్ళ వయసున్న ఎస్.వెంకటేశ్వర్లు గారనే ఎకనామిక్స్ లెక్చరర్ అంటే కుర్రకారుకు మహా క్రేఇజీ గా ఉండేది .బక్క పలుచని మనిషి .కొటూ బూటు టై తో చాలా స్టైలిష్ గా వచ్చే వారు .స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే లకు ఆయన మాట్లాడుతుంటే అలా నిశ్చేష్టులై వినే వాళ్ళం అనర్గళమైన వాగ్దోరణి .ఇంగ్లీష్ లోనే మాట్లాడే వారు .ఖచ్చితం గా పది నిమిషాలు లేక పావు గంట మాత్రమె మాట్లాడే వారు ఎంతో గొప్ప గా ప్రారంభించే వారో అంత గొప్ప గా ముగించే వారు .ఉపన్యాసం అంటే ఇలా ఉండాలి అన్న ధోరణి వారిది ఆ సమయం లోనే వారు కర్తవ్య బోధనా చేసే వారు ..న భూతో అని పించేది నాకు మాత్రం .
నా ప్రిన్సి పాల్స్ మరియు కొందరు ముఖ్య ఉపన్యాసకులు
నేను కాలేజి లో చేరి నప్పుడు మాగంటి సూర్య నారాయణ గారు ప్రిన్సిపాల్ ఒక ఏడాదికే రిటైర్ అయారు ఆయన వస్తుంటే అంత భయ పడి పోయే వారు ,కోటు బూటు తో గంభీరం గా ఉండే వారు .తర్వాతఎస్.త్యాగ రాజు ,ఎఫ్ త్యాగ రాజులు ప్రిన్సిపాల్స్ .డి.వి.క్రిష్నయ్య గారు తర్వాతా అయారు .రాఘవా చార్లు గారు కూడా అయ్యారు .కామర్స్ లో కృష్ణా రావు గారికి మంచి పేరుండేది .ఈయనా తర్వాతా అయారు .సూరి రామ నరసింహం గారు పాలిటిక్స్ లెక్చరర్ అని జ్ఞాపకం .ఆయన మాకు దూరపు బంధువు బాహు బలేంద్ర గూడెం అగ్రహారీకులు ..ఆయన తమ్ముడు మాతో పాటు జిల్లా పరిషత్ లో ఉపాధ్యాయులు .రామ నరసింహం గారు ‘’వోరోశషియస్ రీడర్ ‘’అనే వారు బల్ల మీద బాసిం పట్టు వేసి కూర్చుని లెక్చర్ ప్రారంభించే వారు .అలా అలవోకగా ధోరణి సాగి పోయేది ఎవ్వరు కదిలే వారు కాదు ఆయన ఆకారం వికృతం గా ముక్కు పొడవుగా ఉండేది పంచే లాల్చీ తెల్లనివి .వింత గా కనీ పించే వారు .సరస్వతి ఆయన ముఖం లో ప్రత్యక్ష మయి నట్లుండేది .ఒక సారి ఇంటికి వెళ్లి కలిశాం ఉయ్యాల బల్ల మీద ఊగుతూ కనీ పించారు చాలా ఆప్యాయం గా మాట్లాడారు .ప్రముఖ శాస్త్ర వేత్త ,నెహ్రు కు సైంటిఫిక్ సలహా దారు, సత్య సాయి శిష్యుడు అయిన సూరి భగ వంతం గారు బాహుబలేంద్ర గూడెం అగ్రహారీకులే .
దిగవల్లి శివ రావు గారు
దిగ వల్లి శివ రావు గారు చొక్కా మీద పంచ కట్టి బెల్టు పెట్టి కోటు వేసే వారు .వారింటి నిండా పుస్తకాలే. లా పుస్తకాలతో బాటు సాహిత్యం కూడా అనంతం గా ఉండేది .చూస్తె కడుపు నిండి పోయేది .వీరి పెద్ద బ్బాయి కాలేజీ లో ఒక డిబేట్ లో పాల్గొని పరీక్షా విధానం మీద మాట్లాడుతూ ‘’examinations are botheration for Indian nation ‘’అన్న మాట నాకు ఇప్పటికీ గుర్తుంది .అతన్ని అందరు అభి నందిన్చారప్పుడు .చాలా కాలం రాదా కృష్ణ మూర్తి వాళ్ళింటికి వెళ్లి నప్పుడల్లా వీరిని తమ్ముడు సూర్యాన్ని కలిసే వాడిని ..చెరుకు పల్లి పట్టాభి రామయ్య గారు లేత తమల పాకు లా ముసలి తనం లొనోఉండే వారు చలం, ఆయుర్వేద వైద్యులు ,గూడూరి నమశ్శివాయ ,పౌరాణిక నటుడు అబ్బూరి వర ప్రసాద రావు ,లతా ,మొదలైన సాహితీ వేత్తలు వీరింటికి వచ్చే వారని పట్టాభి రామయ్య గారు నాతో ఎప్పుడో అన్నారు .శారదక్కయ్య పిన్ని రాజేశ్వరి కొడుకులు ప్రభాకర్ అతని అన్న ఇక్కడే చదివారు వేరే రూమ్ లో ఉండే వారు .నెల కోసారి కలిసే వాళ్ళం .వాళ్ళ గది దగ్గరే ఆర్ .ఎస్.ఎస్.ఆఫీస్ ఉండేది నాకున్న పరిచయం తో అక్కడికి వెళ్ళే వాడిని వరుసకు నాకు మేన మామ అయిన బాచ్చి (గుండు భాస్కర్ ) ఈ ఆఫీసులో ఉండిలయోలా కాలేజి లో చదివే వాడు శాఖలకు కూడా తీసుకొనే వాడు ఇక్కడే ఆర్ ఎస్ ఎస్ నాయకులు ఠాకూర్ గారు గోపాల్ రావు గారు వగైరాలను చూశాను ఠాకూర్ గారు ఉయ్యూరు వచ్చి నప్పుడు మా ఇంటికి వచ్చే వారు అలానే సంగమేశ్వర శాస్త్రి గారు కూడా .నేనంటే చాలా అభిమానం బాచ్చికి పుయ్యురు లో శారదా త్యుటోరియాల్ కాలేజి పెట్టి బాగానే నడిపాడు వాళ్ళ ఆవిడ రామ లక్ష్మి రాజ మంద్రిలో నాకు ట్రయినింగ్ మేట్ .గవర్నమెంట్ హైస్కూల్ లో పని చేసి హెడ్ మిస్త్రేస్ చేసి రిటైర్ అయింది బాచ్చి పదేళ్ళ క్రితం బాల్చీ తన్నేయటం తో ఆమె ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ వదిలేసితిరుపతి లో ఉన్న అన్నగారి దగ్గరకు వెళ్ళింది శారదా లో నేను కొంతకాలం లెక్కలు ,ఫిజిక్సు చెప్పా మా రెండో వాడు శర్మ అక్కడే ట్యూషన్ చదివాడు టెన్త్ క్లాస్ కు
ఇలా రెండేళ్ళు ఇంటర్ చదివి పూర్తీ చేసి 1958లో పాస్ అయాను .రెండేళ్ళు బుల్లి మామ్మ ఇంట్లోనే ఉన్నాను మామ్మ కోడలు సీతమ్మ పిన్ని కూడా రమా రెండో ఏడు వీళ్ళింట్లో ఉంది మామ్మకు సాయం చేసింది . కాలేజీ లో విద్యార్ధి ఎన్నికల హడా విడి బాగా ఉండేది అన్గారీకుల వెంకటేశ్వర రావు అనే అతను ప్రెసిడెంట్ కు నిల బడి గెలిచి నట్లు జ్ఞాపకం సేక్రేతరిగా చొక్కాకి గుండీలు పెట్టని డి.సురేష్బాబు అనే రాజ కేయ నాయకుడి కొడుకు గెలిచాడు .సైన్సు సెక్రెటరి గా మా బంధువు ,రేపల్లె లక్ష్మీ కాంతం పిన్ని అన్న కొడుకు సూర్య నారాయణ ఎన్నికయ్యాడు రెండో ఏడు చివరలో గ్రూప్ ఫోటో, పార్టీ చేశాడు .డబ్బులు బాగానే సంపాదించి మిగుల్చు కొన్నాడని అందరు అనుకొన్నారు .అతడిని నిజమేనా అని అడిగితే ‘’తప్పదు బ్రదర్’’అన్నాడు ఇతని తమ్ముడే దక్షిణా మూర్తి మా మరదలు భారతి ని వివాహం చేసుకొన్నాడు . దీని తర్వాత డిగ్రీ చదువు గురించి రాస్తాను . సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -18-2-13-ఉయ్యూరు