ముందుగా అందరికి ”మాతృభాషా దినోత్సవ శుభా కాంక్షలు ”-
ఇవాళ ఉదయం కార్ లో బయల్దేరి మన ఆంజనేయస్వామి ని దర్శించి ,శ్రీకాకుళం వెళ్లి అక్కడ శ్రీ ఆంద్ర మహావిష్ణు దర్శనం చేసుకొని మోపిదేవి చేరి శ్రీ సుబ్రహ్మన్యేశ్వర స్వామి ని దర్శించి,అభిషేకం జరిపించాము మా ఇద్దరి తో పాటు ప్రక్కింటి మేస్టారి భార్య సీతా రావమ్మ గారు కూడా వచ్చారు . అక్కడి నుండి పులిగడ్డ లో, 94ఏళ్ళ స్వాతంత్ర సమార యోధులు శ్రీ మండలి రాజ గోపాల రావు గారిని,దివిసీమ గాంధి వారి శ్రీమతి గారిని వారింటి వద్ద దర్షించాము వారి ఆశీస్సులు పొందాము ఆయన నాకు గొప్ప వీరాభిమాని .ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు . ఆయన శ్రీమతి గారికి జాకెట్ ,ఆయనకు పండ్లు బృహదీశ్వరాలయ ప్రసాదం కుంభమేళా జలం అందజేస్తే వీరిద్దరికీ ఆమె జాకెట్ లు పెట్టారు . అక్కడి నుండిపెనుమూడి వద్ద ఉన్న శ్రీ మండలి వెంకట కృష్ణా రావు గారి వారధి మీదుగా రేపల్లె వెళ్లి పేటేరు లో అక్కడి పేటేరు నేత చీరలను కొన్నాం . అక్కడి నుండి సరాసరి బయల్దేరి నాలుగింటికి ఉయ్యూరు చేరాం వచ్చిన తర్వాతే భోజనం పొద్దున్న టిఫిన్ తిని వెళ్లాం వెళ్ళేటప్పుడు కృష్ణ కర కట్ట మీదు గా వెళ్లి, వచ్చేటప్పుడు చల్లపల్లి ,పామర్రు మీదు గా వచ్చాం .
గురుతుల్యులు ప్రసాద్ గారికీ , సతీ మణి గారికీ అభినందనలు !