నా దారి తీరు -12 స్నేహ బృందం ఉయ్యూరు రాక

 నా దారి తీరు -12

 

     స్నేహ బృందం ఉయ్యూరు రాక

నా బదిలీ మీద ఊహా గానాలు చాలా జరిగాయని చెప్పాను .ఈ లోపల కొన్ని విషయాలు రాయాలి .మోపిదేవి లో నాతో పని చేసిన శ్రీ జమ్మల మడక  రామణా రావు(లెక్కల మేష్టారు ),కూచి భొట్ల సత్యనారాయణ (తెలుగు మేష్టారు –అదే వాసన మేష్టారు )కృత్తి వెంటి నరసింహా రావు (సెకండరీ గ్రేడ్ మేష్టారు ) ఒక సారి మా ఇంటికి సరదాగా గడప టానికి ఉయ్యూరు వచ్చారు .మా అమ్మా ,మేము ఎంతో సంతోషించాం .ఒక రోజంతా ఉన్నారు అందరం కలిసి సినిమా కు వెళ్లాం .ఆప్యాయంగా మా వాళ్ళంతా మంచి భోజనం పెట్టారు వాళ్ళూ ఎంతో ఆనడం పొందారు కబుర్లతో కాలక్షేపం బాగానే జరిగింది .చాల రోజుల తర్వాతా కలిశామేమో విడచి వెళ్లాలని వాళ్ళకూ అని పించలేదు .అయ్యో వెళ్లి పోతున్నారు నని నాకూ ఎంతో బాధ గా ఉండేది ఫోటోలు తీసుకొన్నాం మా డబ్బా కెమేరాతో ..సాహిత్య కాలక్షేపం చేశాము సత్యం మేమూ .అనుకో కుండా భలేగా గడిచి పోయింది కాలం .మళ్ళీ ఇలా మేమేక్కడా ఎప్పుడూ కలవలేదు .ఆ తర్వాతా కొంత కాలానికి నరసింహా రావు గారు చని పోయి నట్లు తెలిసింది మంచి ఆరోగ్య వంతుడే కాని సిగరెట్లు బాగా తాగే వాడు .లెక్కల మేష్టారు స్పాట్ వాల్యుయేషన్ లో కలిసే వారు సత్యనారాయణ కూడా .ఆ తర్వాతా లెక్కల మేష్టారు మోపిదేవి లో చాలా ఏళ్ళు పని చేసి బందరు దగ్గరకు బదిలీ చేయించు కొన్నారు కొంతకాలం అవని గడ్డలో పని చేశారు భార్య కమలమ్మ గారు టీచర్ గా చేరింది .లేడీ ఆమ్తిల్ స్కూల్ లో బందరు లో పని చేసింది .ఆమె అన్న నరసింహ మూర్తి గారు మా రెండవ తోడల్లుడు చతుర్వేదుల శ్రీ రామ మూర్తి గారికి స్టేట్ బాంక్ లో సహా ఉద్యోగి .ఆ పరిచయం మా ఆవిడకు కూడా వాళ్ళ ఫ్యామిలీ తో ఉండేది రెండు మూడు సార్లు వాళ్ళను కలుసుకొన్నాం  .రామనా రావు గారు కూడా పదిహీళ్ళ క్రితం చని పోయారు .సత్యనారాయణ కూడా ఆ తర్వాతా చని పోయినట్లు తెలిసింది .ఇలా ఒక స్నేహ బృందం గా మేమందరం  ఉండేవాళ్ళం .ఇప్పుడు ఇవన్నీ తలచుకొంటే భలేగా ఉంటుంది జననాంతర సౌహృదం అంటే ఇదేనేమో ?

                          వార్డు ఎన్నికలు

        ఉయ్యూరు లో మాది రెండవ వార్డు బ్రాహ్మణులు తూర్పు కాపులు ఎక్కువ ..ఒక సారి వార్డు ఎన్నిక జరిగింది దానికి నా స్నేహితుడు సూరి నరసింహం అన్న కృష్ణుడు (రామ కృష్ణ శాస్త్రి )నిల బడ్డాడు అతనికి పోటీ గా మా వాడే కోలాచల చలపతి నిల బడ్డాడు .మేమందరం చలపతికి సపోర్టు .కాని శాస్త్రి ఓడిపోయాడని జ్ఞాపకం .అప్పటి నుంచి నా మీద కసి వాళ్లకు .నన్ను బదిలీ చేయించటానికి ప్రయత్నాలు అతనూ నరసింహమూ చేశారు ..కనుక ఈ వైపు నుంచీ కూడా ట్రాన్స్ఫర్ ఒత్తిడి .సరే కాకాని గ్రూప్ కు కూడా లోన నా మీద మండుతోంది .

                                                                       కుటుంబ విషయాలు

          అప్పటికే మా పెద్దబ్బాయి పుట్టాడు .మా నాన్నగారి పేరు మృత్యుంజయ శాస్త్రి అని పేరు పెట్టాం బారసాల నాడు లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం .అనుకొన్న ముహూర్తం కనుక చేసేశాము మా ఇంట్లో ముహూర్తాలు పెట్టటం ,దగ్గర ఉందడి జరిపించటం అన్నీ మా మేన మామ గంగయ్య గారే చేసే వాడు .ఆయన ఏది, ఎలా చెబితే అంతే .తిరుగు లేదు ఆయన హృదయం చాలా మంచిది ..మా రెండవ అబ్బాయి పుట్టాడు .మా అన్నయ్య పేరు లక్ష్మీ నరసింహ శర్మ అని పెట్టాం .

                                                 నా మూడవ స్కూలు మాని కొండ  

    బల మైన ఊహా గానాలలో నన్ను ఎక్కడో తిరువూరికో ,ఈదరకో, నెమలి కో ట్రాన్స ఫర్ అని అందరు అనుకొంటూ ఉండే వారు .నేనేమీ ప్రయత్నాలు చెయ్య లేదు .దేనికైనా రెడీ .అనేదే అప్పుడు నా తత్త్వం సిద్ధం గా నే ఉన్నాను .అనుకో కుండా నన్ను మాని కొండ కు ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆర్డర్లు వచ్చాయి అందరికి ఆశ్చర్యం !ఎక్కడికి విసిరేస్తారోఅనుకొంటే దగ్గరలోనే మానికొండకు బదిలీ చేయటం వాళ్లకు మింగుడు డ లేదు .ఏ దేవుడు అడ్డు పడ్డాడో నాకు తెలియదు కాని ఊపిరి పీల్చుకున్నాను .పెద్ద దూరమేమీ కాదు రోజూ సైకిల్ మీద వెళ్ళినా వెళ్ళ రావచ్చు .లేక పోతే కాపురం పెట్టచ్చు మా అమ్మ కూడా చాల సంతోషించిందిదూరం వెయ్య నందుకు .కొంపకు వచ్చి వెళ్ళచ్చు నని సంతోషించింది .ఇంట్లో గోడలూ ,పాలేళ్ళు పాడి ,వ్యవసాయం కామాటం బానే ఉంది మాకు .ఎడ్లు బండీపెట్టలేదు కాని అన్నీ ఉన్నాయి ఇవి మైంటైన్ చేయటానికి అమ్మ ఉంది .ఆవిడే గేదెలకుపాలు తీసేది లేకపోతే మా ఆవిడే తీసేది .పాలేళ్ళ మీద వదిలేది కాదు .నేను ఉయ్యూరు లో పని చేస్తున్నా రోజు రెండు పూట్ల పొలం వెళ్ళేవాడిని సైకిల్ మీదే ఉదయం ట్యూషన్ అవగానే స్నానం చేయటానికి ముందు ఉయ్యూరు పొలం వెళ్ళే వాడిని ఒక రౌండ్ తిరిగి వచ్చి స్నానం ,భోజనం చేసి స్కూల్ కు వెళ్ళే వాడిని .సాయంత్రం స్కూల్ నున్చిరగానే కాటూరు పొలం వెళ్ళే వాడిని .ఇంటికి వచ్చి స్నానం చేసి ట్యూషన్ లో కూర్చునే వాడిని .రాత్రి తొమ్మిదిన్నర దాకా సాగేది .ఇదీ నిత్య కృత్యం .ఇందులో రొటీన్ కు భిన్నం లేదు ..8-8-67 న నన్ను రిలీవ్ చేశారు .నా కోరిక మీద జరిగిన బదిలీ కాదు కనుక ట్రాన్సిట్ అవైల్ చేసుకొనే వీలుంది .అందుకని ఆరు రోజులు ట్రాన్సిట్ వాడుకొని 14-8-67 న మాని కొండ హైస్కూల్ లో చేరాను .హెడ్ మాస్టారు శ్రీ మిక్కిలి నేని వెంకటేశ్వర రావు గారు వామ పక్ష భావాలున్న వారు .జిల్లాలో మంచి పేరున్న వాడు .మంచి సైన్సు మస్టర్ గా పేరు పొందారు .ఆయన చక్కగా పంచ గోచీ పోసి కట్టి లాల్చీ వేసే వారు ఆయన్ను చూస్తె ఎస్.వి.రంగా రావు లాగా కని  పిస్తారు .అందుకే ఆయన్ను ‘’మినీ ఎస్.వి.ఆర్ ‘’అనే వారు .

   మానికొండ స్కూల్ పెద్దదే .ఒక్కో క్లాస్ కు కనీసం రెండు సేక్షన్లు ఉండేవి. .మంచి బిల్డింగ్ ఉంది .నాకు తొమ్మిది ,పది ,ఎస్ ఎస్.ఎల్ సి క్లాసుల సైన్సు బోధనా ఉండేది .మంచి లాబ్ ఉన్న స్కూల్ .లాబ్ అసిస్టంట్ గా వెంకటేశ్వర రావు అనే మానేడు మాక ఊరి వాడు ఉండేవాడు పంచ కట్టి చొక్కా వేసే వాడు .సైకిల్ మీద వాళ్ళ ఊరి నుంచి వచ్చేవాడు లాబ్ లో ప్రయోగాలకు బాగా ఏర్పాటు చేసే వాడు .సైన్సుక్లాస్ ల్యాబ్ లోనే చెప్పే వాడిని .హెడ్ మాస్టారుపి..శ్రీ రామ మూర్తి గారి వర్గం వారు ,మేము కొల్లూరి కోటేశ్వర రావు వర్గం .అయినా చాలా సహృదయం తో ఉండేవారాయన .నేను అంటే మహా ఇష్టం .నా సబ్జెక్ట్ బోధన ను బయటి నుంచే గమనించేవారు .లోపలి వచ్చేవారు కాదు వాళ్ళమ్మాయి పద్మావతి అప్పుడు ఎస్.ఎస్.ఎల్.సి లో ఉండేది చిన్నమ్మాయి తొమ్మిదిలో ఉండేది పెద్దమ్మాయి బాగా చదివేది.టీచర్ అయిందని గుర్తు .

                                                అన్నీ తానే అయిన రాఘవ రావు

        స్కూల్ లో ఆనాడు ప్యూన్ అని పిలువ బడే వాడు రాఘవ రావు .’’ఇహి ఇహి ‘’అని నవ్వుతు పలకరించేవాడు .వెలమ అతను కాఖి  నిక్కర్, తెల్ల చొక్కా తో ఉండేవాడు .అందరి కంటే ముందే వచ్చే వాడు .హెడ్ మాస్టారికి తలలో నాలుక గా ఉండేవాడు అన్నీ పకడ్బందీ గా చేసే వాడు .పరీక్షా నిర్వహణ దగ్గర నుండి ఎక్స్ట్రా క్లాస్ టీం టేబిల్ వేయటం వరకు అన్నీ అతనే చూసే వాడు ..డబ్బు విషయం లోకూడా అతనికే బాధ్యత అప్ప గించే వారు హెడ్ మాస్టారు .ఎవరికైనా డబ్బు సాయం చేయాలంటే రాఘవ రావు ద్వారానే ఇప్పించే వారు. అతనే వసూలు చేసే వాడు .అన్నీ ఖచ్చితం గా లెక్కలు రాసే వాడు అంటే స్కూల్ సేక్రేసి అంతా అతనే చూసే వాడు అంత నమ్మకం మంచి కుటుంబం అతని అత్తారిల్లు గన్నవరం . మాతో మంచి స్నేహం గా ఉండేవాడు .కొంచెం వెలమ దర్జా అని పిస్తుంది కొత్త వారికి .మా గురువు గారు గరుడా చలం గారు కూడా ఆక్కడే పని చేస్తున్నారు .ఆయన ఆత్త వారిల్లు మాని కొండే .ఆల్లూరి సీతా రామ రాజు గారు అనే రాజ వంశీకులు సెకండరి ఉపాధ్యాయులు .పంచె కట్టి తెల్ల చొక్కా వేసే వారు చాలా నెమ్మదైన  చాలా పెద్ద మనిషి ఊళ్ళో మంచి గౌరవం ఉన్న వారు .నా కంటే చాలా పెద్ద వారే .కాని మంచి స్నేహం తో ఉన్నారు మాతో .ఇది అయన జీవితాంతం కొనసాగింది .కనుక మళ్ళీ ఇక్కడ మాకో బృందం ఏర్పడింది .రాఘవరావు ,నేను గరుడా చలం గారు రాజు గారు .రోజు సాయంత్రం స్కూల్ అవగానే కాటూరు రోడ్డు లో  వంతెన దగ్గర గట్ల మీద కూర్చుని కబుర్లు చెప్పుకొనే వాళ్ళం .మిగిలిన విషయాలు మళ్ళీ రాస్తాను -.

              సశేషం

              మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –13-3-13 ఉయ్యూ

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.