నా దారి తీరు –13 మానికొండ కాపురం

 నా దారి తీరు –13

 మానికొండ కాపురం

  నేను ,మా ఆవిడ ఇద్దరు పిల్లలతో మాని కొండ లో కాపురం పెట్టాను .కమ్మ వారి ఇంట్లో .స్కూల్ కు దగ్గర ఆ కుటుంబం లో ముసలి ఆయనా ,మామ్మ గారు ,ఇద్దరు మనవళ్ళు ఉండేవారు వాళ్ళ ఇల్లు పెద్దది .మాది వారింటి పక్క చిన్న డాబా ,ముందు పెంకు సావడి .పెద్ద గేటు లో నుంచి లోపలి రావాలి ఆవరణ అంతా వాళ్ళ గేదెలు ఎడ్ల బందీ పాలేళ్ళు .మామ్మ గారు మంచిదే తాతగారు ఎక్కువ గా మాట్లాడే వాడు కాదు .పెద్ద మనవడుఅంటే కొడుకు కొడుకు అంజి బాబు ఎప్పుడూ లున్గీచోక్కా తో ఉండి పై పెత్తనం చేసే వాడు రెండో మనవడు,అమ్మాయి కొడుకు  తొమ్మిది చదువుతున్నాడు .వంటకు ఒక గది.హాలు స్నాల గది ఉండేవి బోర్ లెట్రిన్ .ఆ ఇంట్లో అంతకు ముందు నా బి.యి.డి ట్రెయింగ్ మట్ తాతినేని చెన్నా రావు అనే లెక్కల మేష్టారు .అతన్ని బదిలీ చేస్తే, వెళ్లి పోతే నేను చేరాను .అద్దె యాభై రూపాయలని గుర్తు .పాలు మామ్మ గారే పోసే వారు వెన్న కావాలన్నా అమ్మేది .ఖచ్చిత మైన మనిషి ఊళ్ళో మంచి పేరున్న ఆసాములు ..అఆవిడ పొడుగ్గా నడుం కొంచెం ఒంగి ఉండేది ఆయన ఎర్రగా లావుగా పంచె బనీను తో ఉండేవాడు .మా సామాను ను మా మామయ్యాగారి రెండెడ్ల బండీ మీద మానికొండ కు చేర్చారు .

             మానికొండలో నాకు ముందు సైన్సు మేస్టర్ గా పని చేసిన సురేంద్ర నాద్ చౌ దరి నాకు ట్రెయినింగ్ మేట్(g.s.n.choudari ) .అతన్ని కలవ పాముల వేశారు .చెన్నా రావు, చౌదరి లంటే హెడ్ మాస్టారు వెంకటేశ్వర రావు గారికి పడేది కాదట..చెన్నా- రెక్లెస్ ఫెలో. ట్రెయినింగ్ లోనే ఎవరి మాటా వినే వాడు కాదు చొక్కా కి గుండీలు పెట్టె వాడు కాదు .చాతీ మీద బొచ్చు అంత కనీ పిస్తూ ఉండేది చదువు చెప్పాలనే శ్రద్ధ ఏ మాత్రం లేని వాడు కబుర్ల పోచికోలు ..పెనమకూరు స్వగ్రామం .బేఫరవా రకం అందుకే భరించలేక పంపించేశారు .చౌదరి మాటకారి .లౌక్యం తెలిసిన వాడు ఊళ్ళో అందర్నీ మంచి చేసుకొనే రకం .అంతకు ముందు వరకు ఏం.వి.ఆర్ .గారితో( హెచ్ .ఏం.)బానే ఉండే వాడట .ఏదో తేడా వచ్చి తోసేశారు .ఇతను ట్యూషన్ బాగా మెయింటైన్ చేసే వాడట .చెన్నా కి ఆ గొడవే లేదు అప్పుడు ఇంకా మార్కులకు విలువ ఉంది .అందుకని తప్పకుండా ప్రైవేట్ చదివే వాళ్ళు.నన్ను కూడా ట్యూషన్ చెప్పమని అడిగే వారు .సరే నని ఒప్పుకొన్నాను వి.పాండు రంగా రావు అనే లెక్కల మేష్టారు పెద్ద’’దుకాణమే ‘’నడిపే వాడు .ఎస్ ఎస్.ఎల్సి పిల్ల లంతా ఆయన దగ్గరే చదివే వారు నన్ను తొమ్మది ఎనిమిది క్లాసులకు చెప్పా మన్నారు ఆ రోజుల్లోనే ట్యూషన్ ఫీజు ఏడాదికి రెండు వందల యాభై .చాలా ఎక్కువ డబ్బే నాలెక్కలో .మాని కొండ ను ‘’మనీ కొండ ‘’అనే వారు .పున్నయ్య గారు అనే ఆయన సీనియర్ టీచర్ ఆయనే ఇంచార్జి హెడ్ .సోషల్ మేష్టారు చాలా సౌమ్యుడు .హెచ్ .ఏం.గారి కిచెన్ కేబినేట్ లో ఒకరు .అట్లాగే నరసింహా రావు అనే సెకండరి మేష్టారు కింది క్లాసులన్నీ కుదరేసుకొనే వాడు .హెడ్ గారికి‘’చెంచా ‘’అనేవారు .ఉదయం సాయంత్రం పిల్లలకు ట్యూషన్ లతో బిజీ బిజీ .నాదగ్గర లాయర్ గారి అమ్మాయి సూర్య కుమారి ,అమ్మాజీ అనే అమ్మాయి ,డ్రిల్ మేస్టర్ పిచ్చయ్య గారి అమ్మాయి ,రాఘవరావు కూతురు ,ఊళ్ళో పురోహితులు గారి అమ్మాయి సూర్య కుమారి చదివారు .మగ పిల్లలలో గోగినేని విష్ణూ రావు గారనే పెద్ద లాండ్ లార్డ్ నవయుగా డిస్ట్రిబ్యూటరు గారి అబ్బాయి శ్రీనివాస్ ,గాంధి అనే మానెడు మాక కుర్రాడు అక్కడి వాడే గబ్బిట దుర్గా ప్రసాద్ అని నా పేరే ఉన్న ఇంకో కుర్రాడు మామ్మ గారి రెండో మనవడు మొదలైన వాళ్ళు చదివారు .స్కూల్ లోను ఇంట్లో ను బానే కస్టపడి చెప్పే వాడిని .మామ్మ గారి పెద్ద మనవడికి మాట సరిగా వచ్చేది కాదు .రెండో మనవడు చదువూ అంతే ..అవధాని గారు అనే తెలుగు పండితులుండే వారు మంచి నియమ నిస్టా పరులు .మడి ఆచారం .కానీ డ్యూటీ విషయం లో ఎక్కడా రాజీ లేదు .స్పాట్ వాల్యుయేషన్ కు వెళ్ళినా ఒక గది తీసుకొని వంట చేసుకొనే వారు రెండు పూటలా అనుస్టానముండేది పిలకా పంచె చొక్కా చాలా శ్రోత్రీయం గా ఉండేవారు నేనంటే మంచి గౌరవం వారింటికి తీసుకొని వెళ్ళే వారు మా ఇంటికీ వచ్చేవారు .వారబ్బాయి నా దగ్గరే ప్రైవేట్ చదివాడు ఆబ్బాయి ఒడుగు చేసి మమ్మల్నందర్నీ భోజనానికి పిలిచారు ..

            ఆ మధ్యదాకా తెలుగు దేశం పార్టీ లో ఉన్న ఉప్పులేటి కల్పన మాని కొండ స్కూల్ లోనే మా దగ్గర చదివింది .ఆమె తండ్రి సెకండరి మేస్టారు బసవేశ్వర రావు అనిజ్ఞాపకం తల్లి కూడా టీచరే .అప్పల స్వామి గారు అనే డ్రాయింగ్ మేస్టారుండే వారు చంకలో ఎప్పుడూ ఇంగ్లిష్ పేపరో ,విశాలాంధ్ర పత్రికో ఉండేది మిత భాషి .గొప్ప చిత్రకారులు గా ప్రసిద్ధి. స్కూల్ గదుల లోపల చరిత్ర ,సైన్సు లకు సంబంధించిన మాపులు అత్యద్భుతం గా చిత్రించారు. భారత దేశ పటంలో హమాలయాల ఉన్నతం లోయలు, నదులు కళ్ళకు కట్టి నట్లు చిత్రించారు వీటిని చూడ టానికి చాలా మంది వచ్చేవారు .గ్లాస్కో పంచె ,లాల్చీ తో ఉండేవారు .బాగా రాజకీయ అవగాహన ఉన్న వారు .అప్పటికే తీవ్ర వామ భావాలు వ్యాపించి ఉన్నాయి ఆయనకు అవన్నీ కొట్టిన పిండే .ఏ విషయమైనా ధారాళం గా సవివరం గా చెప్పే వారు .నాకు ఆయన అంటే గౌరవం ఉండేది. ఆయనా నన్ను ఇష్టపడే వారు .ఇంకో పెద్ద తెలుగు మేష్టారు ఆచార్లు గారుండే వారు ఒకే నిలువు బొట్టు పెద్ద మనిషి తరహా .మంచి పండితులు చిన్న తెలుగు మేష్టారు కూడా ఆచార్యుల వారే .పంగనామాలతో ఉండేవారు కోపం జాస్తి బి.పి.కూడా ఉండేదేమో /చిర్రు బుర్రులాడే వారు .ఈ ఆచార్యులలో ఒకరి కొకరికి పడేది కాదు కాని నాతో ఇద్దరు ఆప్యాయం గానేఉండే వారు .చిన్నాయన అందరి మీదా చాడీలు చెప్పేవారు ఉక్రోషం ఎక్కువే .సైన్సు మేస్టర్ గా కొత్తగా ట్రెయింగ్ పాసైన అతనొకడు చేరాడు నేచురల్ సైన్సు చెప్పే వాడు ఇంటి పేరు కొడాలి పేరుసుబ్బారావు . .నాతో మంచి స్నేహం చేసే వాడు అతని భార్య లెక్కల టీచర్ గా పటమట లో చేసేది .ఆమె భారీ మనిషి అతను పొట్టి .వీరిద్దరి పెళ్లి నేను అక్కడ ఉండగానే అయింది పెళ్ళికి వెళ్లి వచ్చాం ఇద్దరు హెడ్ మాస్టర్లు అయి రిటైర్ అయ్యారు .ఇంకొక క్రిస్టియన్ పెద్దాయనసామ్యూలు అనే ఆయన  సెకండరి మేష్టారు గా ఉండేవారు చాలా పెద్ద మనిషి సౌమ్యులు నవ్వు ముఖం తో పలకరించేవారు .ఆయన అంటే ఊళ్లోనూ అభిమానం ఎక్కువ ..ఆయన భార్య కూడా టీచరే .డ్రిల్ మేస్టార్లు గోగినేని పిచ్చయ్య ,గోగినేని సుబ్బారావు  .ఇద్దరిది ఆ ఊరే అందులో పిచ్చయ్య ఆటలేమీ రాని రకం రెండో అతను మంచి యాక్టివ్ .పిల్లలకు ఇతనంటే మహా ప్రేమ గౌరవం ఆడతాడు ఆడిస్తాడు .అక్కడ నేను పని చేసింది ఒక్క ఏడాదే అయినా ఎప్పుడు ఎక్కడ కానీ పించినా భలే మర్యాదగా నవ్వుతు ఆప్యాయం గా పలకరించేవాడు .భలే సరదా మనిషి .ఊరి లోని పెద్ద షావుకార్లు గోగినేని వారే మైకా గనుల యజమానులు .పిచ్చగా సంపాదించారు స్కూల్ కూడా గోగినేని పిచ్చయ్య అనే పెద్ద మనిషి పేర కట్టించారు .

                   ఉయ్యూరు నుంచే పాలు పెరుగు

      రోజూ సైకిల్ మీద మాకు ఉయ్యూరు నుంచి పాలు ,పెరుగు లను కారియర్లలో మా అమ్మపాలేరు నల్ల కిస్టిగాడి  తో పంపించేది .ఖచ్చితం గా వాళ్ళు వచ్చి ఇచ్చి వెళ్తూ ఉండేవారు .కూరలు కూడా ఇంటి నుంచే వచ్చేవి .మానికొండ దొడ్లో అవిసె చెట్టు ఉండేది ఆ కాయలు కూర చేసుకొనే వాళ్ళం .ములగ చెట్టు బాగా కాసేది .మామ్మ గారే కోసి ఇచ్చేది .మా అబ్బాయి శాస్త్రి సాయంకాలం మాతో షికారు వచ్చేవాడు .అప్పటికి ఇంకా జుట్టు తీయించలేదు అందుకని ఆడపిల్లలు జడ వేసి వాడికి పూలు కూడా పెట్టె వారు .అప్పటికే వాడు మన దేశ రాష్ట్రపతులు ,ప్రధానులు ,రాజధానులు అన్నీ గడ గడ చెప్పే వాడు వాడి చిన్నతనం లో నీల్ ఆర్మస్త్రాండ్ చంద్రుని పై కాలు పెట్టాడు అదంతా రేడియో పెట్టి విని పించేవాడిని అ పేర్లు బాగా జ్ఞాపకం వాడికి .మాతో నడిచి వచ్చేవాడు .శర్మ ఇంకా నెలల పిల్లాడు .కట్టెల ,బొగ్గు పొయ్యి మీద వంట కొద్ది సామనే తెచ్చుకోన్నాం .ఒకే మంచం ఉయ్యాల ..చాప లేసుకొని కింద పాడుకొనే వాళ్ళం బయట వసారా లో ట్యూషన్ .విష్ణూరావు గారబ్బాయి నైంత్ చదివే వాడు మంచి బాడ్ మింటన్ ప్లేయర్ కూడా .తెలివి తేటలున్న వాడు అతని అక్క మా ఉయ్యూరు లో బొబ్బా సత్యనారాయణ డాక్టర్ గారి అబ్బాయి ప్రేమ చంద్ భార్య .ఉయ్యూరు లో వాళ్ళ ఇల్లు మా సువర్చలాన్జనేయ స్వామి ఆలయం ప్రక్కనే .డాక్టర్ గారు కమ్యూనిస్టు ,కోడలు ఆధ్యాత్మిక భావాలున్న అమ్మాయి ఆయన కూతురు ఉయ్యూరు స్కూల్ లో చదివి డాక్టరీ పాసైంది ..

                మానికొండ బెజవాడ గుడివాడ రోడ్డులో ఉంది కాలవ గట్టు ప్రక్క ఊరు .ముందుకు వెడితే విశ్వనాధ సత్యనారాయణ గారి స్వంత ఊరు ‘’నంద మూరు ‘’వస్తుంది ఇది తేలప్రోలు వెళ్ళే దారిలో ఉంది .వెనక్కి వస్తే కోమటి గుంట లాకు .అది దాటితే కంకి పాడు .ఆ రోజుల్లో బెజవాడ గుడివాడ బస్సుల ఫ్రీక్వెంసి తక్కువ .అందుకని కంకి పాడు వచ్చి అక్కడి నుంచి రిక్షా లో చేరుకొనే వాళ్ళం .లేక పోతే తేలప్రోలు బస్ లో నందమూరు మలుపు దగ్గర దిగి నడిచో, రిక్షా లోనో వచ్చేవాళ్ళం లేకపోతే కాటూరు మీదుగా వచ్చేవాళ్ళం  ఇప్పుడు బస్సులు సిటీ బస్సులు వచ్చాయి .ఆటోలు సరే సరి .రోడ్డు కూడా బాగా ఉండేవి కావు .హీను రోజులకోసారి ఉయ్యూరు వెళ్లి వచ్చేవాళ్ళం .అప్పుడు టెలిఫోన్ సౌకర్యాలు లేవు ఉత్తరాలే గతి .కమ్యూనికేషన్ ఇబ్బంది గా ఉండేది .సాయంత్రం నడిచి నందమూరు మలుపు దాకానో లేక పోతే ఊళ్ళో నుంచి మానెడు మక రోడ్డులోనో ,లేకపోతే కోమటి గుంత లాకు దాకానో నడిచి వెళ్ళే వాళ్ళం .ఎక్కువ భాగం కాలువ మీద ఉన్న వంతెన మీద కూర్చొనే వాళ్ళం .ఒక టెంట్ దియేటర్ ఉండేది .రాత్రి రెండో ఆటకు ఆక్కడ సినిమా చూసే వాళ్ళం .లేకపోతే గుడివాడ వెళ్లి సినిమా చూసే వాళ్ళం .అలా చూసిన సినిమా చిక్కడు దొరకదు అని గుర్తు .నేను ఉయ్యూరు హైస్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు హిందీ మేష్టారు గా ఉన్నమాకినేని .గోపాల క్రిష్నయ్య గారు మానికొండ వారే .మేమున్న ఇంటి బజారు లో ఆయన స్వంత ఇల్లు ఉండేది నేను తరచూ కలిసే వాడిని మేస్తారివి తేనె కళ్ళు .సంస్కారం మూర్తీభవించిన మనిషి పంచె రంగు చొక్కా నవ్వుతు పలకరించేవారు .ఊళ్ళో ఒక చిన్న హోటల్ ఉండేది అయ్యర్ హోటల్ అని పేరు .ఇడ్లీ ,కాఫీ బానే ఉండేవి .ఫామిలీ ఉయ్యూరు వెళితే అయ్యర్ హోటల్ లోనే టిఫిన్ కాఫీలు లాగించేవాళ్ళం .రాజు గారు నాతో డబ్బు ఖర్చు చేయించే వారు కాదు ఆయనే మూడుగా పద్దు రాయించేవారు .మాకూ ఖాతా ఉంది .జీతాలు రాగానే జమ చేసే వాళ్ళం .రాజు గారింటికి ఆహ్వానించే వారు .ఆవిడ చాలా మంచి మనిషి రాజు గారు నేను ,గరుడా చలం గారు ,రాఘవరావు   తరచు  గా రాజు గారి అతిధులం మాకు రాజ మర్యాదలు చేసే వారు రాజు గారు గా మరి ఆయన అప్యాయతనేన్నడు మరువలేము .అలాగే స్కూల్ లో చదువుకొనే ఒక అమ్మాయి బాపు బొమ్మ లాగే ఉండేది .ఆమె తండ్రికి ఒక హోటల్ ఉండేది .సరదాగా గడిచి పోయింది .మానికొండ లో నా సర్విస్ లో కొన్ని ముఖ్య సంఘటనలు చోటు చేసుకొన్నాయి .నాకు మంచి పేరూ సాధించి పెట్టాయి ఆ వివరాలు తరువాత తెలియ జేస్తాను .

              సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14-3-13-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.