నా దారి తీరు -14 ఇన్స్పెక్షన్ –నాకు అప్పుడే హెచ్ .ఏం.గా ప్రొమోషన్ ?

నా దారి తీరు -14

     ఇన్స్పెక్షన్ –నాకు అప్పుడే హెచ్ .ఏం.గా ప్రొమోషన్ ?

మానికొండ స్కూల్ ఇన్స్పెక్షన్ ప్రారంభమైంది .పేరు జ్ఞాపకం లేదు కాని ఒక ఆచార్యులు గారు ఇన్స్పెక్షన్ చేయటానికి వచ్చారు .ఆయన బ్రాహ్మల ఇంట్లోనే భోజనం చేస్తారట .హెడ్ మాస్టారు వెంకటేశ్వర రావు గారు నన్ను పిలిచి ‘’ఆయనకు మీ ఇంట్లో భోజనం ఏర్పాటు చేయగలరా ?బహుశా రెండు రోజులుంటారు ఏమీ మొహమాటం పడద్దు .ఇదంతా స్కూల్ ఖర్చు లోనే చేస్తాం ./కావలసిన సరుకులన్నీలిస్టు రాసిస్తే ప్యూన్ రాఘవరావు తీసుకొని వచ్చి మీ ఇంట్లో ఇస్తాడు .వీలు కాక పోతే చెప్పేయండి వేరే ప్రయత్నం చేస్తా’’అన్నారు .నేను వెంటనే ‘’భోజనం పెట్ట టానికి నాకేమీ ఇబ్బంది లేదు .అయితే ఈ సరుకులు అవీ మీరు తెప్పించి పంపటం నాకు ఇష్టం లేదు మాతో పాటే వారికి భోజనం పెడతాం అతిధి కనుక ఇంకాస్త గౌరవ పూర్వక ఆతిధ్యం ఇస్తాం .నాకు డబ్బు రూపం లో కాని మరే రూపం లో కాని మీరేమీ ఇవ్వద్దు నా ధర్మం గా అతిధి కి ఆతిధ్యమిస్తాను ‘’అన్నాను .ఆయన సంతోషించి అలానే చేద్దాం .అన్నారు. నేను ఇంటికి వెళ్లి మా శ్రీమతికి ఈ విషయం చెప్పాను నేను తీసుకొన్న నిర్ణయం ఆవిడకూ నచ్చింది .

              ఇన్స్పెక్షన్ కు అధికారి గారు వచ్చారు .నా టెన్త్ క్లాస్ సైన్సు క్లాస్ చూశారు .పుష్పం లోని భాగాలు పాఠంచెప్పాను బాగా వచ్చింది .మందార పువ్వు తెప్పించి వివరించాను బాగా ప్లీజ్ అయ్యారు .అప్పుడు ఎనిమిది తొమ్మిది క్లాసులకు రసాయన శాస్త్రం లో balancing of equations  ఉండేవి .ఇది తెలియాలంటే వాలేన్సి ,సింబల్స్ అన్నీ తెలిసి ఉండాలి చాలా మంది సైన్సు మేస్టార్లు దీని జోలికి పోయే వారు కాదు .నేను మాత్రం సింబల్స్ అన్నీ బట్టీ పట్టించి బాలన్స్ చేయటం ఎలాగో తర్ఫీదు బాగా ఇచ్చాను .మంచి తెలివిగల విద్యార్దులుండేవారు .నేను బోర్డు జోలికి వెల్ల కుండా వాళ్ళతోనే ఎక్వేషన్లు రాయించి బాలన్స్ చేయటం నేర్పాను .అది బాగా క్లిక్ అయింది అందరికి మంచిహుషారు కలిగేది ఏదో సాధించామనే ఆనందం వాళ్ళ లో కనిపించేది నాకు అంతకంటే కావాల్సిందేముంది ?ఏ మేస్టారికైనా ఇంతకంటే ఆనందం ఏముంటుంది .ఇన్స్పెక్టర్ గారు నన్ను తొమ్మిదో తరగతి సైన్సు క్లాస్ లో బాలన్సింగ్ చూపించమని కోరారు .నేను వారితో వినయం గా ‘’సార్ ! వాళ్లకు ఎనిమిదో క్లాస్ లో దీన్ని గురించి చెప్పిన దాఖలాలు నాకు కనీ పించలేదు నేను ఈ ఏడాదే ఇక్కడికి వచ్చాను ..నేనే ఇప్పుడు అన్నీ మొదటి నుంచి చెప్పి నేర్పించాను. కనుక యా క్లాస్ లో అది అంతగా రాణిందని పిస్తోంది .మీరు ఎనిమిదో క్లాస్ కు రండి వారికి మొదటి నుంచి నేనే బోధించాను కనుక బాలన్సింగ్ అవలీలగా చేస్తారు చూడండి ‘’అన్నాను వారు ‘’వెరీ గుడ్ మాస్టారు .నేను కోరిన క్లాస్ కంటే కింది క్లాస్ లో విద్యార్ధులే బాలన్సింగ్ చేస్తారంటున్నారంటే నాకు మహదానందం గా ఉంది అలాగే కానివ్వండి ‘’అన్నారు .ఎనిమిదో క్లాస్ కు ఇన్స్పెక్షన్ కు వచ్చారు .ఒక్క మాట కూడా నేను మాట్లాడకుండా విద్యార్ధులతో సమీకరణాలు బోర్డు మీద రాయించి వాళ్ళతోనే బాలన్స్  చేయించాను .ఏదో ఒకరిద్దరు విద్యార్దులైతే నేను ఏదో మేనేజ్ చేశాననే అనుమానం రావచ్చు .కనుక క్లాస్ లో అందరి తోను చేయించాను .ఒక్కరు కూడా తప్పు చేయ లేదు.ఆచార్యుల వారు మహాదానంద  పడ్డారు .అదీ సరైన ,అవగాహన ఉన్న అధికారి వ్యవహరించే తీరు .నా క్లాస్ ఇన్స్పెక్షన్ అంటే నేను సర్వీస్ లో చేరిన దగ్గర్నుంచి రిటైర్ అయ్యేదాకా ఇన్స్పెక్షన్ రోజున ఏ పాఠంచెబుతానో నా విద్యార్ధులకు ముందు తెలియ జెప్పే వాడిని కాదు ఆ రోజు ఏదిబోధిస్తే బాగా క్లిక్ అవుతుందో, ఏది కష్టమైన విషయమో, ఏది దురవగాహనమో దాన్నే చెప్పే వాడిని ‘’లీకేజీ ఉండేది కాదు ‘’చాలా మంది మేస్టార్లు ఇన్స్పెక్షన్ రోజు చెప్పే పాఠాన్ని అనేక సార్లు క్లాస్ లో ట్రయల్ వేసి అప్పుడు దాన్నే బోధించే వారు .నేను దీనికి భిన్నం

       ఇన్స్పెక్టర్ గారిని మధ్యాహ్నంనాతో పాటు ఇంటికి తీసుకొని వెళ్ళేవాడిని .నా పంచె ఇచ్చి కట్టు కోమనే వాడిని. భోజనం ఇద్దరం కలిసి చేసే వాళ్ళం .మా ఆవిడ అన్ని రకాల పదార్ధాలు స్వీటు హాటు ,పాయసం గారెలు వగైరా లన్నీ చక్కగా చేసేది ఆయన కూడా చాలా ఆప్యాయం గా ఒక బంధువు ఇంట్లో ఉన్నంత చనువు గా ఉండి తృప్తి గా భోజనం చేశారు .రాత్రిళ్ళు కూడా వచ్చి భోజనం చేసే వారు .రెండో రోజు సాయంత్రం తో తనిఖీ పూర్తీ అయింది ఆ రోజు మధ్యాహ్న భోజనానికి వచ్చి భోజనం అయిన తర్వాతా ‘’దుర్గా ప్రసాద్ గారూ !.మీ క్లాసుల నిర్వహణా, మీరు బోధించే విధానం, పిల్లలకు ఏది ఎంత చెప్పాలో అలా చేసే పద్ధతి ,పిల్లల అవగాహన కై మీరు పడుతున్న శ్రమా ,మీ డిసిప్లిన్ మైంటైన్ చేసే తీరు నాకు చాలా బాగా నచ్చాయి ఒక హెడ్ మాస్టరుకు ఉండాల్సిన అన్ని మంచి లక్షణాలు మీలో నాకు కనీ పించాయి .మీకు వెంటనే ప్రమోషన్ వచ్చేట్లు పై అధికార్లకు నేను రికమెండ్ చేస్తున్నాను ‘’అన్నారు నేను అవాక్కయ్యాను .’’సార్! నా సర్వీస్ ఇంకా నాలుగేళ్ళు కూడా కాలేదండి .నాకు ఇప్పుడప్పుడే ప్రమోషన్ రాదు .మీ కు నా మీద ఉన్న సహృదయత కు కృతజ్ఞతలు మీ ప్రోత్సాహాన్ని నా జీవితాంతం గుర్తుంచుకొంటాను ఆ స్థాయి ఎప్పుడూ తగ్గకుండా చూసుకొంటాను .మీ ఆశీర్వాదాలుంటే చాలు ‘’అని వినయం గా చెప్పాను ఆయన మరీ ఆనంద పడ్డారు ‘’ఇంత తక్కువ సర్వీస్ లో ఇంత అద్భుత బోధనా పటిమ ఉండటం అరుదైనది .నేనెన్నో స్కూళ్ళు చూశాను ఎందరో సైన్సు మేస్టార్లు చెప్పిన పాఠాలు అబ్సర్వ్ చేశాను .మీ లాంటి వారు నాకెవ్వరు కన్పించలేదు .కీప్ ఇట్ అప్ ‘’అన్నారు అంతే నేను దాన్ని ఆ పూటకు మర్చి పోయాను .ఇన్స్పెక్షన్ అవగానే స్టాఫ్ మెంబర్లసమావెశం లో హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యం లో మీటింగు ఉంటుంది .ఆ మీటింగ్ లో ఇన్స్పెక్టర్ గారు మధ్యాహ్నం జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పారు .నా టీచింగ్ గురించి మరీ ముచ్చటించారు హెడ్ మాస్టారు కూడా ఎంతో ఆనందించారు .ఇలా అతి తక్కువ వయసులో అతి తక్కువ సర్వీస్ లో నాకు హెడ్ మాస్టర్ ఆయె అన్ని అర్హతలు ఉన్నాయని నేను ఎంత త్వరగా హెడ్ మాస్టర్ అయితే అంత బాగా విద్యార్ధులకు స్కూల్ కు లాభం అన్న వారి ఆంతర్యానికిర్యానికి నేను సదా కృతజ్ఞతలు చెప్పుకొంటాను .సమర్ధతను గుర్తించే అధికారి దొరకటం దుర్లభం .అదంతా వారి సౌజన్యం, నా మీద ఉన్న అభిమానం .అంతే కాని నేను పోడిచేసిన్దేమీ లేదని అప్పుడూ ఇప్పుడు ఎప్పుడూ నా నమ్మకం ..నేను పెట్టిన భోజనం,చూపిన ఆతిధ్యమూ కారణాలు కావు ..

                బాడ్  మింటన్ వాలీ బాల్ ఆటల్లో నైపుణ్యం

     హెడ్ మాస్టర్ వెంకటేశ్వర రావు గారు మంచి బాడ్మింటన్ ప్లేయర్ ..ఫ్రంట్ లో బాగా ఆడేవారు లాబ్ అసిస్టంట్ వెంకటేశ్వర రావు బాక్ బాగా ఆడేవాడు సెంటర్ కు డ్రిల్ మాస్టర్ సుబ్బారావు నేను లెఫ్ట్ ఫ్రంట్ ఆడే వాళ్ళం .రోజు స్కూల్ అవగానే పిల్లలోక వైపు మేమొక వైపు ఆడేవాళ్ళం పోటా పోటీగా ఆడే వాళ్ళం హెడ్ గారు బాగా ఎంకరేజ్ చేసే వారు .చుట్టుప్రక్కల స్కూళ్ళ వాళ్ళు అంటే కోలవెన్ను ,పునాది పాడు లలో కూడా టీచర్లు బాగా ఆడే వారు ఫ్రెండ్లీ మాచ్ లకు వచ్చేవారు మేమూ వెళ్లి ఆడేవాళ్ళం .వాలీ బాల్ లో పాండురంగారావు తో బాటు మేము ఆడేవాళ్ళం వెంకటేశ్వర రావు మంచి సర్వీస్ హాండ్ .అఫెన్స్ అండ్ డిఫెన్స్ బాగా ఆడేవాడు అలాగే గుమాస్తా వీరయ్య గారు బానే ఆడేవారు క్రాఫ్ట్ మేష్టారు కూడా ఆడేవాడు .యెమ్.విఽఅర్ .లాబ్ వెంకటేశ్వర రావు ,వీరయ్య గారు పంచె కట్టుతోనే ఆడే వారు హెచ్ ఏం గారు ఎడమకాలు కొంచెం ముందుకు వేసి సర్వీస్ భలేగా చేసేవారు ఎప్పుడూ నల్లద్దాలు పెట్టుకొనే ఆడేవారు ఇలా ఈరెండు ఆటలలో నాకు మంచి అభిరుచి కలిగింది బానే ఆడతాననే పేరూ వచ్చింది .ఆదివారాలలో సాయంత్రం స్కూల్ కు వచ్చి ఆడేవాళ్ళం హెడ్ గారి పుషింగ్ మర్చి పోలేను .ఆ రోజుల్లో రుద్రపాక లో ఉన్న టీచర్లు బాగా ఆడతారనే పేరు ఉండేది .రత్తయ్య గారు డ్రిల్ మేస్టారు .ఈడుపుగంటి వెంకటేశ్వర రావు హెడ్ మాస్టారు మంచి ప్లేయర్ . వీరిద్దరూ అన్నదమ్ములే .మా హెడ్ మాస్టారు ఈయన మంచి దోస్తులు శ్రీరామ మూర్తి గారి వర్గం .అక్కడ ‘’సన్యాసి రావు ‘’గారనే సైన్సు మేస్టారు సీనియార్ ఉపాధ్యాయులు గా నే కాకుండా సెంటర్ ప్లేయర్ గా మంచి పేరుండేది .రెండు చేతులతో రెండు బాట్లు పట్టుకొని ఏ షాట్ అయినా దిమ్మ తిరిగేట్లు కొట్టగలవారు అఫెన్సు డిఫెన్సు లో అందే వేసిన చెయ్యి .చాలా నిదానస్తులు హడా విడి, ఆర్భాటం ఉండదు ఆటలో బరిలోకి దిగిన దగ్గర్నుంచి ఆట అయ్యే దాకా చిరు నవ్వు చిందిస్తూ అందర్నీ ప్రోత్సాహ పరుస్తూ ఆడే వారు ఈ.వి.ఆర్ కొంచెం ఉద్రేకి .రత్తయ్య గారు బానే ఆడేవాడు విష్ణు దాస్ గారు కూడా బానే ఆడేవారు .ఇదంతా నీ కెట్లా తెలుసు అంటారా ఆ కధా వినండి

           మా హెడ్ మాస్టారు రెండు రోజులు సెలవులోస్తే మనం అందరం రుద్ర పాక వెళ్లి ఆడుదాం అని మాతో అన్నారు అందరం ఓ.కే.అన్నాం .అందరం కలిసి రుద్ర పాక చేరుకొన్నాం అదెక్కడుందో అప్పటిదాకా నాకు తెలియదు .చైర్మన్ శ్రీ పిన్నమ నేని కోటేశ్వర రావు గారి అన్నగారు కుటుంబ రావు గారింట్లో మాకు భోజనం టిఫిన్ పడక ఏర్పాట్లు ఆ రెండు రోజులు చైర్మన్ గారు వచ్చి మేము ఆడుతున్నంత సేపు చూసి వెళ్ళేవారు .మాకు ఆరగా ఆరగా  కాఫీలు, ఫలహారాలు అన్నీ పర్య వేక్షించే వారు .ఏ లోపం రానివ్వలేదు తమ స్వంత బంధువుల్లా ఆదరించారు చైర్మన్ గారువారి కుటుంబం, హెడ్ మాస్టారు ,వారి బోధనా ,బోధనేతర సిబ్బంది. నా జీవితం లో మరుపు రానిసంఘటన ఇది ఆ రెండు రోజులు ఎలా గడిచి పోయాయో తెలీదు అంత హుషారు గా గడిచాయి ఈ.విఽఅర్ సోదరులు పంచె కట్టుతో ఆడేవారు రత్తయ్య గారు డ్రిల్ మేష్టారు కనుక ఒక్కోసారి నిక్కర్ వేసుకొని ఆడేవారు సన్యాసి రావు గారి ఆట కూడా కల కాలం గుర్తుండే ఆట ఆటలో ఆయనే అందరికి ఆదర్శం .నేను హెడ్ మేష్టారు గా ప్రమోషన్ పొందన తర్వాతా  చాల సార్లు ప్రధానోపాధ్యాయుల సమావేశాలలో కలుసుకొన్నాం .నేనంటే ఆపేక్ష బాగా ఉండేది .రుద్ర పాక స్కూల్ లో బాడ్మింటన్ వాలీ బాల్ఆడటం నా కు మధురాను భూతి చైర్మన్ గారితో సన్నిహితం కావటం మాటలు కాదు .నిజం చెప్పా లంటే ఈడుపు గంటి ,మిక్కిలినేని చైర్మన్ గారు బల పరచిన కొల్లూరికి ఏం.ఎల్.సి ఎన్నికలో వ్యతిరేకం గా పని చేసిన వారే .కాని వీటిని ఆయన దృష్టిలో పెట్టుకోలేదు సమర్ధతకు సమర్ధన తెలిపారు అదీ పిన్నమనేని అంటే అందుకే జిల్లా అంతా పిన్నమనేని అంటే జిల్లా పరిషత్ చైర్మన్ చైర్మన్ అంటే పిన్నమ నేని అని గౌరవం గా చూశారు ఈ.వి.ఆర్ .పిన్నమనేని అంతరంగికులు ట్రాన్స్ ఫర్ల విషయం లో చైర్మన్ గారికి సల్హలిచే వారని ప్రతీతి .ఈవిఆర్ కు తెలీకుండా ఏ బదిలీ జరిగేది కాదు .ఈయనకు నేనంటే మహా ప్రేం నన్ను ముప్పాళ్ళ నుంచి పామర్రు బదిలీ చేయించటానికి తేరా వెనుక గొప్ప కృషి చేశారు సమర్ధత ఉన్న తీచార్లంటే బాగా ఇష్టపడే వారు .

         సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15-3-13- ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.