నా దారి తీరు -16 గుంటూరులో సైన్సు ప్రదర్శన

 నా దారి తీరు -16

 గుంటూరులో సైన్సు ప్రదర్శన

  గుంటూర్ మెడికల్ కాలేజి లో సైన్సుఎక్సి బిషన్ భారీగా జరుగుతోంది .అందరికి వెళ్లి చూడాలనే ఉంది. మా హెడ్ మాస్టారి పెద్ద్దమ్మాయి అక్కడ డాక్టర్ కోర్సు చదువుతోంది .ఆయన ఒక రోజు నాతో ‘మాస్టారూ !మన విద్యార్ధులను తీసుకొని గుంటూర్ వెళ్లి ఎక్షిబిషన్ చూస్తె బాగుంటుంది ‘’అన్నారు .సరే నన్నాను .విద్యార్ధికి పది రూపాయలో ఎంతో వసూలు చేశాం .సుమారు యాభై మంది ఆడ ,మగ పిల్లలు సిద్ధ పడ్డారు రావటానికి .మాని కొండ నుంచి మానేడు మాక నడిచి వెళ్లి అక్కడ పాసెంజర్ రైల్ ఎక్కి బెజవాడ లో దిగి అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ లో గుటూరు వెళ్ళాలి .ఇదీ ప్లాన్ .ఉదయం పది గంటలకే అందరం భోజనాలు చేసి స్కూల్ దగ్గరకు చేరుకొన్నాము .హెడ్ గారు డ్రిల్ మాస్టారు నేను ,సైన్సు సుబ్బారావు పిల్లల వెంట ఉన్నాం .నడిచి మానెడు మాక చేరి అక్కడ పాసెంజర్ ఎక్కి విజయవాడ చేరాం .అక్కడ మళ్ళీ పాసెంజర్ ఎక్కి గుంటూరు చేరుకొన్నాము .మేము చేరే సరికి మధ్యాహ్నం రెండు అయింది .హెడ్ మాస్టారు అక్కడ తన శిష్యులతో ముందే చెప్పి ఉన్చారను కొంటాను .మాకు వెంటనే లోపలి ప్రవేశం కలిగింది .

        మెడికల్ విద్యార్ధులు నిర్వహించిన ప్రదర్శన అది .అనేక రకాల ప్రయోగాలు వర్కింగ్ నాన్ వర్కింగ్ మోడల్స్ ఉన్నాయి అందరం బాగా తిరిగి చూశాం .ద్రవాల్లో నిలవ ఉంచిన జంతువులు  ఉంచారు .అక్కడ స్టూడెంట్స్ కూడా చక్కగా వివరించి చెప్పారు నేను నాకు నచ్చినవన్నీ నోట్ బుక్ లో రాసుకోన్నాను వివరం గా .ఇంకెక్కడైనా వీటిని పెట్టచ్చననేది నా ఆలోచన .అలాగే నేను కొన్ని స్కూళ్ళ లో వీటిని ప్రదర్శన లో పెట్టించాను డబ్బు ఖర్చు ఆయె వాటికి జోలికి పోలేదు బాగా ఆట్రాక్షన్ తో ఉన్నవాటినే సేకరించి తర్వాతా అమలు చేశాను .ఎవరి టిఫిన్లు వాళ్ళే కొని తిన్న జ్ఞాపకం .పిల్లలూ అంతే .అంతా చూసే సరికి రాత్ర్తి తొమ్మిదయింది నడుచు కొంటు రైల్వే స్టేషన్ కు చేరుకొన్నాం .అక్కడినుంచి బెజవాడకు అక్కడి నుంచి అర్ధ రాత్రి పన్నెండు కు మానెడు మక మీదుగా మాని కొండ చేరుకొని ఎవరింటికి వాళ్ళం వెళ్లాం .గొప్ప అను భూతి కింద గుర్తుండి పోయింది .అందరు తప్పక చూడదగిందని చెబుతూ ఉండేవాడిని .శ్రమ అయినా విద్యార్ధులు బాగా ఎంజాయ్ చేశారు బుర్రల్లోకి విషయాలు ఎక్కిన్చుకొన్నారు ఆడ ,మగా పిల్లలున్నా ఎక్కడా ఏ హడావిడి లేదు హెడ్ గారి డిసిప్లిన్ అలాంటిది కంటి చూపు తో శాసించే నేర్పు ఆయనది .

                           తెన్నేరు నాంచారమ్మ సంబరాలు

    మా మిత్రులు అల్లూరి సీతారామ రాజు గారికి మాని కొండ దగ్గర తెన్నేరు లో కొంత పొలం ఉంది .ఏప్రిల్ నెలలో తెన్నేరు లో నాంచారమ్మ తిరుణాల జరుగుతుంది ఆయన ఎప్పటి నుంచో మమ్మల్ని ఆ తిరునాలకు తీసుకొని వెళ్లి చూపించాలని ఉబలాట పడుతున్నారు నేను గరుడాచలం మాస్టారు రాఘవ రావు సిద్ధ పడ్డాము రాత్రి పూట హరికధలు బుర్రకధలు డప్పులూ కోలాటాలు సందడే సందడి గా ఉంది నడిచే వెళ్ళాము నడిచే వచ్చాం అని గుర్తు .ఆయన సరదాగా అన్నీ వివరించి చెప్పారు .అక్కడేదో కొని తిన్నామనుకొంటాను రాజు గారికి దైవ భక్తీ చాలా ఎక్కువ .పామర్రు దగ్గర కురుమద్దాలి లో  అవధూత పిచ్చమ్మ ఆశ్రమానికి తరచు వెళ్లి వస్తూండే వారు .తిరిగి వచ్చేటప్పుడు మా ఇంటికో గరుడా చలం గారింతికో ఉయ్యూరు వచ్చే వారు అ ముగ్గురం మా ఇంట్లో కలిసి భోజనం చేసేవాళ్ళం .టిఫిన్లు తినే వాళ్ళం .రాఘవ రావు కూడా వచ్చేవాడు .రాత్రి రెండో ఆటకు సినిమాకు వెళ్ళే వారం .ఇలా చాలా ఏళ్ళు జరిగాయి .రాజు గారి అబ్బాయి ఉపనయనం మానికొండ లో చేస్తే నేను గరుడాచలం మేష్టారు వెళ్లాం .మాకు రాజ మర్యాదలే జరిపించారు రాజు గారు. రాజు గారంటే మా ఆవిడకు గొప్ప గౌరవం .ఆయన వస్తే పండగ లానే ఉండేది .మెం నలుగురం చాలా అన్యోన్యం గా ఉండేవాళ్ళం నేను అక్కడి నుంచి వచ్చేసినా రెండు నెలలకోసారి మానికొండ గరుడాచలం గారితో కలిసి వెళ్ళటమో లేక ఆరాజు గారు ఇక్కడికి రావటమో జరిగేది .వచ్చినప్పుడల్లా కబుర్లే కబుర్లు రాజు గారు ఆర్.ఎస్.ఎస్.అభిమానులు వాజపేయియి ,ఆద్వానీ లంటే అమిత ఆరాధనా భావం ఆయనకు .మీటింగు లకు తప్పక వెళ్ళే వారు .రామ కృష్ణ పరమహంస అన్నా వివేకానందులన్నా వీరాధనా భావం .ఒక సారి నేను హైదరాబాద్ దోమల గూడా లోరామకృష్ణాశ్రమం లో జరుగుతున్నా సమావేశానికి వెళ్లాను అక్కడ రాజు గారు మూడు రోజుల ట్రెయినింగ్ కాంప్ లో కనీ పించారు

                                   బి.యె. లిట్ 

              ఆయనా నేను బి.ఏ.ఇంగ్లిష్ పరీక్ష ప్రైవేట్ గా రాశాం ..అప్పుడు హైస్కూల్ లో ఆంగ్ల బోధనా చేయాలంటే ఇంగ్లిష్ డిగ్రీ తప్పకుండా ఉండాలనే వారు .నేను చదివిన బి.ఎస్.సి.లో ఒక టెక్స్ట్ ఒక నాన్డిటైల్డ్ మాత్రమె ఉన్నాయి కనుక మా గురువు ప్రసాద శర్మ గారు నన్ను ఇంగ్లీష్ లో బి ఏ.డిగ్రీ చేయమని సలహా ఇచ్చారు అందుకని కట్టాను .నేను రాస్తున్నానని తెలిసి రాజు గారు కూడా సరదాగా కట్టారు రెండేళ్ళు చదవి ప్రతి ఏడాది పరీక్ష రాయాలి ఇంగ్లిష్ తెలుగు  ప్రోజు ,పోయిట్రీ ,నాన్దిటైలేడ్ డ్రామాలు అన్నీ ఉండేవి. ఇద్దరం పరీక్షల రోజుల్లో బెజవాడ ఆర్ ఎస్ ఎస్ కార్యాలయం లో ఉండే వాళ్ళం పైన మెడ మీద చదువుకొని హోటల్ లో భోజనం చేసే వాళ్ళం మాకు ఒక రూమ్ ఇచ్చారు ఇది రాజు గారి చొరవే ..నేను సబ్జేక్తులన్ని పాస్ అయాను రాజు గారు తప్పారు .ఆయనకు చదివితే గుర్తుండేది కాదు .నేనూ అంతే కాని నాకు విజువల్ మెమరి ఉండేది .దాన్ని బాగా ఉపయోగించుకోన్నాను .మెక్బెత్ నాటకం అభిమన్యు వధ అంటే విపరీత మైన అభిమానం కలిగింది అందులో ప్రతి వాక్యం మీద ఎంతైనా రాయచ్చునని పిస్తుంది అంత గా నచ్చింది .ఒకటి రెండు సార్లు రాజు గారు పరీక్షకు కట్టి పాస్ కాలేక విసుగొచ్చి మానేశారు .ఎలాగో బి.ఎస్.సి డిగ్రీ ఉంది కనుక బి .ఏ.త్రెలుగు ఇంగ్లిష్ పాసైతే బి.ఏ.డిగ్రీ ఇస్తారు అలానే నాకు ఇఇచ్చారు .అంటే ఒకరకం గా బి.ఏ.లిట్ అన్నమాట .

                   చెదరిన స్నేహ బంధం 

  రాఘవ రావు కూడా చాలా సరదా మనిషే ఉయ్యూరు లో కలిస్తే అన్నీ మర్చి పోఏ వాళ్ళం . అతను ఒక ప్యూన్ అనే భావంమాకేన్నడూ రాలేదు .ఒక స్నేహితుడి గానే భావించాం  .అతను దాదాపు అందర్నీ ‘’నువ్వు ‘’అనే చొరవ ఉన్న వాడు .గరుడాచలం గారిని, రాజు గారిని అలానే పిలిచేవాడు కాని నన్ను మాత్రం ఎందుకో ‘మీరు ‘అనే అనేవాడు .ఎప్పుడైనా డబ్బులు కావాల్సి వస్తే వచ్చి అడిగి తీసుకొని వెళ్లి అనుకున్న సమయానికి తిరిగి ఇచ్చే వాడు చే బదుల్లెఇవి .ఒక సారి నేను పామర్రు లో పని చేస్తుంటే వాళ్ళ ఆమ్మాయి పెళ్లి నిశ్చయమైందని డబ్బు కావాల్సి వస్తుందని వచ్చి చెప్పాడు అప్పుడు నా పరిస్తితి అంతంత మాత్రమె రెండు వేలు కావాలి .ప్రావిడెంట్ ఫండ్ లో లోన్ తీసుకొని ఇస్తానానని ఆశ పెట్టాను పాపం నేనిస్తాననే నమ్మకం తో ఉన్నాడు .నాలో కొద్ది స్వార్ధం పెరిగింది అతనికిస్తే డబ్బులు రావేమో నని చెడ్డ ఆలోచన వచ్చింది .అంతే లోన్ తీసుకోలేదు నేను అతను వచ్చాడు .కాని నేను లోన్ తీసుకోలేదని ,ఇప్పుడు తీసుకోవటం కుదరదని చెప్పి పంపాను పాపం హతాశుడయ్యాడు. అలా ఎందుకు ప్రవర్తిన్చానో నాకు ఇప్పటికి అర్ధం కాలేదు నన్ను నేను క్షమించుకోలేక పోయాను ఒక రకం గా ఇది మిత్ర ద్రోహమే నని నా అంత రాత్మ ఘోషిస్తూనే ఉంది కాని ఆ అవకాశం మళ్ళీ రాదు కదా అన్న ఇంగితం లేకుండా ప్రవర్తించాను ఇప్పటికి గుండెల్లో కెలుకుతూనే ఉంది ఆ విషయం అతను మరిచే పోయాడు ఎక్కడో తంటాలు పడి పిల్ల పెళ్లి చేసి మమ్మల్ని పిలిచాడు నేను గరుడా చలం మాస్టారు వెళ్లి వచ్చాం .సిగ్గు లేకుండా వెళ్లి అక్షింతలేసి వచ్చాను .ఆ తర్వాతా కొన్నేలళ్ళకే రాఘవ రావు చని పోయాడు గన్నవరం చేరాడు రిటైర్ అయిన తర్వాతా. వాళ్ళమ్మాయి సీతమ్మ నా దగ్గరట్యూషన్ చదివింది. చిన్నమ్మాయి కూడా .

            రాజు గారు కూడా సుమారు అయిదేళ్ళ క్రితం మరణించారు వాళ్ళబ్బాయిలు ఫోన్ చేసి చెప్పారు పన్నెండో రోజు కార్యక్రమానికిమాని కొండ వెళ్లి కుటుంబాన్ని పలకరించి వచ్చాను .అప్పుడు గరుడా చలం మాస్టారు విశాఖ పట్నం లో అబ్బాయి దగ్గర ఉన్నారు .ఇలా మామానికొండ  స్నేహ బృందం లో ముఖ్యులు రాఘవ రావు ,రాజు గారు వెళ్లి పోయారు .గరుడా చలం గారు తరుచు కలుస్తూనే ఉన్నారు. లేక పోతే నేనే వాళ్ళింటికి వెళ్లి వస్తూంటాను వాలళ్ళబ్బాయిలు అమ్మాయిలూ నా శిష్యులే .చాలా జాగ్రత్త ఉన్న మనిషి. స్నేహశీలి మేష్టారు .భార్య గారు కూడా నేనంటే గౌరవం మా ఇంటికి రావటం గరుడాచలం గారికి మహా ఇష్టం .వాళ్ళింట్లో పెళ్ళికి మేము మా ఇంట్లో పెళ్ళికి ఆయన రావటం మానలేదు ఆయన మనుమలు నాగార్జున అతని అన్నయ్యా కూడా ఫ్లోరా స్కూల్ లో నా శిష్యులే ..

               సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ 19-3-13-ఉయ్యూరు 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.