జానకీ జాని గారి అరుంధతి -2
‘’యదా కాష్టం చ ‘’కదా సంగతి మన రాజ మండ్రిబారతీయ సాహిత్య పరిషత్ సభలో మీ నుంచే విన్నాను .ఇందులోనూ అరుంధతి యే..ఈ అరుంధతిని అందుకోవాలన్న ఆరాటమే కాని ప్రయత్నం చేయని అసమర్ధుడు ఆనంద రావు .ఆనందం మనసులోనే క్రియలో లేనివాడు . అతను కలల్ని తిని బతికే గొంగళి పురుగు .అందులోంచి బయట పడలేడు .స్పందించలేడు .చేతకాని వాడు .కళ్ళ ముందు అంతా జరిగి పోతున్నా ,కలల వల లోంచి తప్పుకో లేదు .మనసులో అనుకొన్నా క్రియలో సాధించలేని వాడు .కదల లేడు కదిలించలేడు .ఆలోచనల సుడి లో చిక్కు కొంటాడు .బయట పడటం రాదు .అందుకే చివరగా మీరు ‘’రైలు ఎక్కే వాళ్ళు ,దిగే వాళ్ళు కూడా అటు ఎక్కటానికి ,ఇటు దిగటానికి అంతరాయం కల్గిస్తూనే ఉన్నారు ‘’అని ముగించటం బాగుంది .
‘’కాలోహి ‘’లో పాత్రలపేర్లు బాగున్నాయి .చిదానందం ,నిజం గా చిదానందమే .కామేశం లో కామం అంతర్గతం .పైకిఎన్ని చెప్పినా దాన్ని జయించలేక పోయాడు .ఆధ్యాత్మిక విషయాలు ఎన్ని చదివినా అతని లో దాని ప్రభావం పుస్తకం మూసే దాకానే .ఆ తర్వాత అంతర్గతం గా ఉన్న కోర్కె బలీయమై ,దాన్ని బహిర్గతం చేసి ,ఆధ్యాత్మిక భావాల్ని అణగించేస్తోంది .చివరికి కోరికే జయించింది .చిదానందం చైతన్య స్వామి ప్రబోధం విని పూర్తిగా ప్రభావితుడై భవ బంధ విమోచనకు పరుగు దీస్తే కామేశం లో స్వామి ప్రభావం తాత్కాలికమే అయింది .కామ వాంఛ పెరిగి మళ్ళీ గృహస్తాశ్రమం తీసుకోవటానికి నిర్ణయించాడు .ఒకే చోట మెదిలే ఇద్దరు వ్యక్తుల భిన్న ప్రవృత్తుల కు అద్దం పట్టిన కద ఇది .వర్ధనమ్మ పేరు బాగా సరిపోయింది .ఆమె లో కామ దాహం వర్ధిల్ల జేయటానికి ప్రోద్బలం చేసింది కనుక పేరు బాగా నప్పింది .’’బాబు గారూ ‘’సంబోధించే ఆమె, ముగింపు లో ‘’ఏమండీ “’అనటం ఆమె లో వచ్చిన పెద్ద మార్పును ఒకే ఒక్క మాటతో అద్భుతం గా చెప్పారండీ మీరు .అతను తల దిన్చుకోటమూ ,నాటకీయమే .’’బలవానిన్ద్రియానపి ‘’అన్న సత్యం వ్యక్త మైన కద .
‘’ వ్యత్యాసం ‘’కదా లో సుశీల ,సత్య మూర్తి దాంపత్యం కూడా ఒడిదుడుకులకు తట్టుకొని నిలబడి సవ్యం గా ముగిసింది .పట్టుదలలు ,పంతాలు భార్యా భర్తల మధ్య ఉండటం సహజం .అంత మాత్రాన కాపురం లో నీళ్ళు పోసుకో రాదు .అధిగమించి ,అర్ధం చేసుకొని దాంపత్య రధాన్ని లాక్కు రావాలి .అందుకనే ‘’ఈ బుద్ధి పెద్ద వాళ్ళక్కూడా ఉంటె ఎంత బాగుండును ?’’అని అతని మనసు లో మీరు అని పించి మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు .ఆమె సుశీల కనుక దారి తప్పలేదు .అతను సత్య మూర్తి కనుక రుజు మార్గం వదలలేదు .’’సెకండ్ థాట్స్ ‘’ఇద్దర్నీ కలిపాయి .జీవితం లో ఈ రకమైన సంయమనం అవసరమని ఈ కాలం వారికి మెత్తగా చెప్పిన కద .చాల నచ్చింది .’’
‘’దరిద్రం ‘’పేరూ తమాషాగానే సరిపోయింది కధకు ..శేషగిరి పేరు రామ మూర్తికి రామ మూర్తి పేరు శేషగిరికి మారిస్తే బాగుండేది అని పించింది .వాడికి శేషం గా మిగిలింది ‘’గిరి అంతటి దరిద్రం ‘’అని పించేది .అని నా అభిప్రాయం సుమండీ .’’we can eradicate poverty but we cannot eradicate the feeing of poverty ‘’అన్నదాన్ని రుజువు చేసిన కద ఇది .
‘’ఆల్కెమీ ‘’ఒక ఊహ .ఆచార్య నాగార్జునుడు ప్రయత్నించాడని ప్రతీతి .అది అందరికి సాధ్యమయ్యేది కాదు .ఆ ప్రయోగాలలో కొట్టు మిట్టాడుకు పోవటమే కాని బయట పడేది శూన్యం .ఈ కద లో పాత్రలు అన్ని అలాంటి స్వభావం కలవే .ఊహల అంచులలో ప్రయాణం చేస్తూ వాస్తవికత ను మార్చే వాళ్ళే .అందుకే ఎవరూ ఆ ప్రయత్నం లో కృత క్రుత్యులు కాలేదు శ్రమే తప్ప ఫలితం దక్కని నిర్భాగ్య జీవులే తండ్రి కూతురూ కూతురు చుట్టూ తిరిగే షోకిల్లా .
సశేషం
మీ –గబ్బట దుర్గా ప్రసాద్ -.27-3-13-ఉయ్యూరు