మా గరుడా చలం మాస్టారు

                        మా గరుడా చలం మాస్టారు

            పొట్టిగా అటు లావూ కాకుండా ఇటు సన్నమూ కాకుండా ఉండే చామన ఛాయా శరీరం ,ఎప్పుడూ నున్నటి గుండు ,ధోవతి పైన తెల్ల లేక సాధారణ రంగు పొడవైన అరచేతుల చొక్కా బడికి వెళ్తే పైన ఖండువా వెడల్పైన నుదురు గలగలా మాట్లాడే వ్యక్తియే గరుడాచలం మాస్టారు .బోళా గా మాట్లాడినా ఆత్మవిశ్వాసం ఆత్మా గౌరవం ఉన్న వారు .మాట తూలి అనరు .ఎవరైనా పొరబాటున అంటే చురక లాంటిమ్చకుండా ఉండరు .మొండి ధైర్యం ఆయనకున్న ఆస్తి .సెకండరి గ్రేడ్ ట్రైనింగ్ పాసై జిల్లా బోర్డు లో సెకండరి ఉపాధ్యాయులు గా చేరారు ఉయ్యూరు తాడంకి,మానికొండ పామర్రు మొదలైన చోట్ల పని చేశారు .ఎక్కడపని చేసినా వృత్తికి తగిన పూర్తీ న్యాయం చేసిన ఉపాధ్యాయుల్ని పించుకొన్నారు .కాకా పట్టటం గడప పూజ తెలియని వారు .ముక్కు సూటి మనిషి .ఎస్.ఎస్.ఎల్.సి.తాడంకి హైస్కూల్ లో చదివారు . మాస్టారు నాయీ బ్రాహ్మలు వారి తండ్రి గారు కుల వృత్తి చేస్తూ వైద్యమూ చేసి ఉయ్యూరు లో మంచి పేరుపొందారు ఆ రోజుల్లో ‘’సంచి కట్టు వైద్యం ‘’కు మంచి పేరుండేది .ఆ కులం వారిలో డాక్టరీ చేసిన వారు ఆ కాలం లో ఎక్కువ మందే ఉన్నారు .మైనేని గోపాల క్రిష్నయ్య గారి కుటుంబానికి గరుడా చలం గారి తండ్రి గారే వైద్యులు అని నాకు చాలా సార్లు చెప్పారు .మాస్టారు చిన్నతనం లో ఎంత దూరమైనా కాలి నడకనే వెళ్ళే వాడి నని నాకు చాలా సార్లు చెప్పారు ఆయనకు సైకిల్ తొక్కటం రాదు నేర్చుకో లేదు .

 

           నాకు మాస్టారి తో మొదటి పరిచయం నేను ఉయ్యూరు హైస్కూల్ లో ఎనిమిదవ తరగతిలో1953 లో చేరినప్పుడు .అయన మాక్లాసుకు ఏ సబ్జక్టు కు రాలేదు అప్పుడు మా స్కూల్ లోనే పని చేసేవారు .ఆయనతో బాటు కే.ఆర్ కాంతయ్య గారు ,మహంకాళి సుబ్బరామయ్య గారు ,లింగం బసవా చారి గారు ,సూరి రామ శేషయ్య గారు ఆదిరాజు పున్నయ్యగారు సూరి కృష్ణ మూర్తిగారు ,కూనపులి సుబ్రహ్మణ్యం గారు మొదలైన వాళ్ళంతా సెకండరి టీచర్లే .ఆయన తోటి వారే కాంతయ్య గారు మాకు లెక్కలకు బసవాచారి గారు ఇంగ్లిష్ సోషల్ కు సుబ్బరామయ్య గారు తెలుగుకు వచ్చేవారు గరుడా చలం గారు ఏడవ తరగతి కి చెప్పే వారని జ్ఞాపకం .మా తమ్ముడు కృష్ణ మోహన్ కు టీచర్ గరుడా చలం గారు .ఆయన అభిమాన సబ్జెక్టులు లెక్కలు సోషల్ .రెండు బాగా చెప్పేవారని అనేవారు .అంటే గరుడాచలం గారు నాకు ప్రత్యక్ష గురువు కాదు .పరోక్ష గురువు .కాంతయ్య మాస్టారు గరుడాచలం గారు కలిస్తే బసవాచారి మాస్టార్ని ఆట పట్టించే వారు బసవా చారి గారికి ఉడుకు బోతు తనం ఎక్కువ దాన్ని అలుసుగా తీసుకొని ఆడించే వాళ్ళు .

          గరుడాచలం గారి మాటల గురించి ఆయన విద్యార్ధులు వింతగా చెప్పుకొనే వారు మా తమ్ముడి వల్లనాకా విషయం తెలిసింది .ఆయనకు ‘’ర’’అనే అక్షరం పలికేదికాదు .అటేన్దేన్సులో పేర్లు పిలిచేటప్పుడు ,పాఠం చెప్పే తప్పుడు ఈ ఇబ్బంది పడే వారట .పిల్లాడిని నీ నెంబరు ఎంత /అని అడగటానికి ‘’నీ నెంబగు ఎంత ?’’అనేవారట రు బదులు గు పలికే వారన్న మాట .నీపేరు ఏమిటి అనటానికి ‘’నీ పేగు ఏమిటి ?’’అనే వారట ఇవన్నీ కధలు గాధలుగా ఆ రోజుల్లో చెప్పుకొనే వారు కనుక ఆయనకు నిక్ నెం ‘’పేగు ,నెంబగు ‘’అయి పోయింది ఆయన పేరుతో కాకుండా ఈపెరుతోనే పిలిచేవారు పిల్లలు .

             ఆ తర్వాత నేను బి.యి.డి చేసి ఉయ్యూరు హైస్కూల్ లో సైన్సు మేస్టారు గా పనిచేసినప్పుడు మాస్టారు మాకు సోదర ఉపాధ్యాయులు .మళ్ళీ మా కాంతయ్య మేష్టారు భార్య చంద్ర లీలమ్మ గారు ,బసవాచారిగారు సుబ్బరామయ్య గారు ,ప్రేమలత అనే అమ్మాయి నాదగ్గర స్కూల్ లో చదివి సెకండరి పాసై టీచర్ గా వచ్చింది ఆ తర్వాతా .వీరందరూ సహచర ఉపాధ్యాయులు శిష్యడనైన నేను మా గురువు లతో కలిసి పని చేయటం అదృష్టం అలాగే జంధ్యాల ప్రసాద శర్మ గారు మాకు స్కూల్ ఫైనలో సైన్సు మేష్టారు .అయన ఇప్పుడూ అదేపోస్ట్ లో పని చేస్తున్నారు నేనూ వారితో సహా ఉపాధ్యాయుడిగా పని చేసిన ఆనందం .గరుడా చలం గారి అమ్మాయి రెండో అబ్బాయి నా దగ్గర ట్యూషన్ కూడా చదివారు అలా మళ్ళీ మాస్టారు తో నా పరిచయం పెరిగింది .

                    నేను ఉయ్యూరు నుండి మానికొండ స్కూల్ కు బదిలీ అయాను అప్పుడు గరుడాచలం మాస్టారు అక్కడ పని చేస్తున్నారు .ఆయన ఆత్త వారి ఊరు మానికొండ .నేను మాస్టారు రాజు గారు అనే అల్లూరి సీతా రామ రాజు గారు ,అటెండర్ రాఘవ రావు కలిసి ఉండేవాళ్ళం సాయంత్రాలు ఎవరి ఇంట్లోనో ఒకరి ఇంట్లో టిఫిన్ కాఫీలు వాహ్యాళి మా ఇంట్లో తరచుగా భోజనాలు బలేగా ఉన్న రోజులవి మేము ముగ్గురం రాజు గారింట్లో ఆతిధ్యం ఆయన మిగిలిన వారితో మ ఇంటికి రావటం .ఇవన్నీ మరిచి పోలేని రోజులు గరుడా చలం గారు ఫామిలీ పెట్టలేదు .అత్తగారింటి లోనే ఉండేవారు .

                నేనుకాటూరు  ఉయ్యూరులలో పని చేసినప్పుడు రాజుగారు రాఘవరావు ఉయ్యూరు వచ్చి గరుడాచలం గారితో కలిసి మా ఇంటికి వచ్చే వారు ఇక్కడే భోజనం టిఫిన్ సినిమా నిద్ర మా ఇంట్లోనే . గరుడాచలం మాస్టారు నేను కలిసి మానికొండ వెళ్లి అక్కడ రాజుగారింట్లోనో రాఘవ రావు ఇంట్లోనో భోజనమ చేసి సాయంకాలానికి ఉయ్యూరురు వచ్చే వాళ్ళం ఇలా ఎన్నో ఏళ్ళు గడిచాయి సుమారు 48 సంవత్సరాల బంధం .ముందు గా రాఘవ రావు ఆ త్ర్హర్వాత త అయిదేల్లక్రితం రాజు గారు మమ్మల్ని విడిచి పైకి వెళ్లి పోయారు మొన్న గరుడా చలం మాస్టారు వెళ్లి పోయారు మనుషులు దూరమైనా మనసులు కలిసిన బాంధవ్యం మాది .అందులో గరుడా చలం గారు  రాజుగారి తో ఎప్పుడు మా ఇంటికి వచ్చినా మా శ్రీమతి ఎన్నో రకాల అయిటంస్ నిమిషాల్లో చేసి అందరికి వడ్డించేది మేము మా సావిట్లో కూర్చుని హాయిగా భోజనం చేసే వాళ్ళం .మాస్టారికి ‘’దంత సిరి ‘’బాగా ఉండేది మొహమాటం లేకుండా అడిగి వడ్డించుకొని కడుపు నిండా తినే వారు .మా ఆవిడతో ‘’అమ్మాయీ ! మేము ఎప్పుడు వచ్చినా క్షాణాల మీద ఇన్ని చేసి మాతో కొసరి కొసరి తినిపిస్తావు అందుకే మీ ఇంటికి రావటం మాకు చాల ఇష్టం ‘’అనేవారు అలానే అయన ఒక్కరే వచ్చినా అలానే ఆతిధ్యమిచ్చే వాళ్ళం రాజు గారు మహా మొహమాటం మనిషి .కాని వీర్సంతా ఉదాత్తులు గొప్ప స్నేహ శీలురు .

             మేము నలుగు సార్లు అమెరికా వెళ్లాం .మూడు సార్లూ రాజు గారు గరుడా చలం గారు మా ఇంటికి వచ్చి భోజనం చేసి కూర్చుని మాట్లాడి మాకు వీడ్కోలు చెప్పే వారు అంత గా కలిసి పోయిన స్నేహం మాది నేను మానికొండ లో పని చేసింది ఒక్క ఏడాదే కాని అది ఇన్నేళ్ళ అస్నేహ బంధాన్ని సృష్టించింది ఇది మా గొప్ప కాదు వారందరి హృదయ విశాలయం,ఆత్మీయతాను .లేక పోతే ఎందుకు గుర్తుంచుకొంటారు ?ఎందుకు ప్రేమగా వచ్చి పలకరిస్తారు ?అదొక గొప్ప సౌజన్యం .మాటలకు అందనిది .

             రాజు గారు కురుమద్దాలి పిచ్చమ్మ గారి ఆశ్రమానికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి గరుడా చలం గారితో తప్పక వచ్చి వెళ్ళే వారు యోగ క్షేమాలు తెలియ బరచే వారు తెలుసుకొనే వారు అలా జీవికా జీవులం గా ఉన్నాం .ఉయ్యూరు సాహితీ మండలి సమావేశాలకు మాస్టారిని ఇంటికి వెళ్లి ఆహ్వానం అందించేవాడిని తప్పక వచ్చి వెళ్ళేవారు ,సరసభారతి సభలకు కూడా స్వయం గా వెళ్లి ఆహ్వానిన్చేవాడిని కొంచెం నడక ఇబ్బంది గా ఉన్నా వచ్చే వారు .ఉయ్యూరు ఏ’సి.లైబ్రరి ప్రారంభోత్సస్వానికి ప్రేమ చంద్ గారి సన్మానానికి వచ్చి వారిని పలకరించి మాట్లాడారు వారు వీరిని గుర్తుంచుకొని గౌరవం చూపారు .ఎప్పుడైనా బజారు లో కనపడితే ‘’మాస్టారు బజారు తిరిగే తీరిక ఉంది కాని మా ఇంటికి వచ్చే ఒపిక . లేదా ?’’అనే వాడిని అంతే మర్నాడు మా ఇంటిలో ప్రత్యక్షం .ఫోన్ లో తరచు మాట్లాడుకొనే వారం అక్టోబర్ లో అమెరికా నుంచి వచ్చిన తర్వాతా రెండు సార్లు ఆయన ఇంటికి వెళ్లి పలకరించాను అప్పటికే భార్య గారి ఆరోగ్యమూ దెబ్బతింది ఇద్దరు వ్యాధి గ్రస్తులే అయారు చిన్నబ్బాయి వీరిని కంటికి రెప్పలా చూసుకొన్నాడు .మాస్టారు గారి భార్య గారు నాతో అరమరిక లు లేకుండా కుటుంబ విషయాలన్నీ చెప్పేవారు బాగా ఆదరించే వారు .నేను రాకపోతే ఆయనతో ఫోన్ చేసి మాట్లాడించే వారు .

               నేను 200-2002 మధ్య ఫ్లోరా స్కూల్ వారి ఆహ్వానం పై అడ్మిని స్త్రేటర్ గా పని చేసినప్పుడు మాస్టరు గారి మనవలిద్దరు అక్కడ చదివే వారు .వారికోసం స్కూల్ కు వచ్చి కనపడే వారు .అందులో చిన్నకుర్రాడు నాగార్జున కొంచెం అల్లరి చేస్తూ చదువు మీద ద్రుష్టి పెట్టె వాడు కాదు మాస్టారు వాడి బాధ్యత నాకు అప్పగించారు తమ మాట వినటం లేదని నేనే శ్రద్ధ తీసుకోవాలని కోరారు వాడిని విపరీతం గా కొట్టేవాడిని అల్లరి చేస్తే .వాడు పైకి ఏమీ అల్లరి పిల్లడు గా ఉండే వాడు కాదు నవ్వుతు ఉండే’’సైలెంట్ కిల్లర్‘’పదవ తరగతికి వచ్చాడు అక్కడా అదే తీరు ఒక సారి వాడిని ఇంటికి పిలిచి ‘’ఒరరే !మీ తాతగారు నాకు గురువు గారు .కనుక నువ్వు నాకు మనవాడి వరుస .అల్లరి మంచిదే కాని అది చదువుకు అడ్డు అవుతుంది ఇప్పటికైనా మించింది లేదు ఇప్పటి నుంచి చదివితే ముప్ఫై అయిదు మార్కులు లు తెచ్చుకోవటం పెద్ద కష్టమేమీ కాదు . జాగ్రత్త భవిస్యత్తు పై ద్రుష్టి పెట్టు ‘’అని లాలన గా చెప్పాను అంతే మర్నాడు నుంచి వాడి ప్రవర్తన లో గొప్ప మార్పు వచ్చింది మాస్టారు కూడా గమనించి నాకు థాంక్స్ చెప్పారు వాడు టెన్త్ పాసై పాలిటెక్నిక్ చదివి బి.టెక్ పాస్ అయి ఉద్యోగం చేస్తున్నాడు .నాకు గర్వం గా ఉంటుంది వాడిని చూస్తె .

                    గరుడాచలం గారి ఆరోగ్యం బాగాలేదని హైదరాబాద్ తీసుకొని వెళ్ళారని తెలిసింది రోజు వాకబు చేస్తూనే ఉన్నాను .నిన్న ఉదయం వారి మనవడు ఇందాక దాకా చెప్పుకొన్న నాగార్జున వచ్చి‘’తాత గారు రాత్రి చని పోయారండి ‘’అని దీనం గా చెప్పాడు .నేనువారింటికి వెళ్లి  శివమైనవారి పార్ధివ దేహానికి నమస్సులు అర్పించి వారి భార్య పిల్లలను పలకరించి వచ్చాను 86 ఏళ్ళు నిండుగా జీవించి పెద్దగా ఇబ్బంది పడకుండా, ఇబ్బంది పెట్టకుండా తనువు చాలించిన ధన్య మూర్తి గరుడా చలం మాస్టారు వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను .

              మీ—గబ్బిట  దుర్గా ప్రసాద్ -5-4-13-ఉయ్యూరు 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.