సరస భారతి 43 వ సమావేశం లో సరిగమలు

 సరస భారతి 43 వ సమావేశం లో సరిగమలు

 

సరస భారతి 43 వ సమా వేశం –విశేషాలు

సాహితీ కదంబం కార్య క్రమం-వార్తాపత్రికల్లో

వినండి , వీక్షించండి

     సుమారు ముప్ఫై మంది మహిళా కవులు రచయితలు ,,అరవై కి పైగా పురుష కవి రచయితలు ,సన్మానితులు  ,అతిధులు ,పోటీలలో పాల్గొని విజేతలైన బాల బాలికలు ,ముప్ఫై మంది పురప్రముఖులు మీడియా మిత్రులు తో సరస భారతి నిర్వహించిన 43 వ సభ కళ కళ  లాడింది .ఇంత భారీ గా ఒక సాహితీ కార్యక్రమం జరగటం అందులో వేసవిలో సమయ పాలనతో నిర్వహించటం అందరిని మెప్పించింది .దాదాపు సాయంత్రం నాలుగింటి లోపే ఎక్కువ మంది చేరుకొన్నారు .అందరికి కుర్చీలలో బెంచీల పైనా కూర్చునే ఏర్పాటు జరిగింది .వచ్చిన వారందరికీ స్పెషల్ స్వీటు ,మిక్చర్ తో కూడిన పొట్లం తో బాటు పొడవైన పెద్ద చక్ర కేళీ పండు ను ఉపాహారం గా అందజేయటం జరిగింది .వేడి చిక్కని రుచికర మైన తేనీరు అందించారు .దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు అలసట తీర్చుకోవటానికి ఇవి ఉపయోగ పడ్డాయి .అందరికి మినరల్ వాటర్ అందించారు .

                రాత్రి కవి సమ్మేళనం సమయం లో అందరికి తలా ఒక స్వీట్ బిస్కెట్ పాకెట్ అందించటం ప్రత్యెక ప్రశంసలకు కారణ మైంది .కార్యక్రమం దాదాపు నాలుగు గంటల పైనే నడిచింది .మొత్తం పూర్తీ అవటానికి రాత్రి తొమ్మిది దాటింది .అదే రోజున ఉయ్యూరు సెంటర్ లో మంత్రి గారు వారి పార్టీ అధ్యక్షులు ఒక భారీ సభ ను సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించటం వల్ల ట్రాఫిక్ జాం లో చిక్కుకొని ఇబ్బందులు పడి సాహిత్యాభిమానులు సభకు చేరుకోవటం వారికి ఉన్న ఆసక్తికి నిదర్శనం .ఉయ్యూరు బస్ స్టాండ్ నుండి బస్ లన్నిటిని దారి మళ్ళించి బై పాస్ రోడ్డు లో నడిపించటం వల్లతిరిగి వెళ్ళటానికి వీరందరూ చాలా ఇబ్బందులు పడ్డారు .అయినా మర్నాడు వారు ఫోన్ చేసి చక్కని కార్యక్రమం లో పాల్గొన్న ఆనందం పొందామని తెలియ జేశారు వారి మాటల్లో ఎంతో సంతృప్తి గోచరించింది ..

            అనుకోని అతిధిగాజర్నలిజం కాలేజి ప్రిన్సిపాల్ ఉయ్యూరు వాసి  శ్రీ గోవింద రాజు చక్రధర్ గారు రావటం తమ స్పందన తెలియ జేయటం స్థానిక విలేకరులకు గొప్ప ఆనందాన్నిచ్చింది ఇందులో ఎక్కువ మంది ఆయనకు శిష్యులవటం మర్చి పోనీ విషయం .వారందరూ కలిసి చక్రధర్ గారిని ఘనం గా సన్మా నించి తమ అభిమానాన్ని చాటుకొన్నారు .ఆయన మొదట్లో ఇదంతా ఎందుకు అని అన్నా వీరి అభిమానానికి కరిగి పోయారు .అనుకోని అతిధికి అనుకోని సన్మానం గా దీన్ని అందరు భావించారు .

             స్థానిక సంస్థల నుండి రాష్ట్ర శాసన మండలికి ఎన్నిక కాబడి ఆరేళ్ళ పదవీ కాలాన్నిసమర్ధ వంతం గా నిర్వ హించి ఎన్నో ప్రజోప కర కార్యాలతో ప్రజల మధ్యగడిపి   ఫ్లోర్ లీడర్ గా తన సమర్ధత ను నిరూపించుకొని,వాగ్దాటితో  అవతలి వారిని చిత్తు  చేసే శ్రీ యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ పదవీ కాలం మార్చి 29 తో ముగిసింది .అందుకే ఆయన్ను ‘’తాజా మాజీ ‘’అని అన్నారు సరసభారతి అధ్యక్షులు  అతనికి సరస భారతి తో చక్కని సంబందాలున్డటం ఎప్పుడు పిలిచినా హాజరవటం వల్ల ఈ సంస్థకు అతను అంటే మహా ఇష్టం అందుకే రాజేంద్ర కు సరస భారతి    ఆత్మీయం గా శ్రీ గుత్తికొండ సుబ్బారావు శ్రీ చక్రధర్ సమక్షం లో ,సభలో ఉన్న వందమంది కవి పండిత ప్రముఖుల మధ్యపదవీ  విరమణ సన్మానం చేసింది .అతను వద్దు అని అన్నా ఈ అభిమానానికి కాదన లేక పోయారు మళ్ళీ ఇంకో ఉన్నత పదవి అతన్ని త్వరలో వరించి అతని సమర్ధత కు నిర్వచనం కావాలని సుబ్బారావు గారు  కోరారు .రాజేంద్రవేలమందిలో  ఒక్కడు అని కొనియాడారు .

        ఈకార్యక్రమ రూప కల్పనా ఫిబ్రవరి చివరి వారం లో జరిగింది .దీనిలో పురస్కారం అందుకో వలసిందిగా మచిలీ పతనానికి చెందినా కవి ,సాహిత్యోప జీవి శ్రీమతి ముదిగొండ సీతా రావమ్మ గారి కి తెలియ జేయటానికి ఎన్ని సార్లు ఫోన్ లో ప్రయత్నించినా దొరకలేదు కాని కవి సమ్మేళనం లో ఆమె పేరు వేసి ఆహ్వానం పంపం.ఆమె వచ్చి నందుకు చాలా అందం వేసింది ఆమె ఒక నెల రోజులు కాశీ లో ఉండటం వాళ్ళ ఫోన్ అందుకో లేక పోయానని తెలియ జేశారు వచ్చిన అవకాశాన్ని వదలకుండా ఆమెకు శాలువా పూల హారం జ్ఞాపికా నగదు బహుమతి తో సత్కరించి అనుకొన్నది నేరవేర్చుకోన్నాం ఆమె కూడా ఎంతో ఆనందించారు .

                    సభలో పురస్కారాలు పొందిన వారందరూ అతి తక్కువ సమయం లో తమ స్పందనను తెలియ జేయటం సమయ పాలన కు బాగా తోడ్పడింది .ఎవరూ సమయాతిక్రమణ చేయక పోవటం విశేషం .సాహితీ కదంబంకార్యక్రమమో రాసిన దాన్ని బట్టి  రాత్రి ఏడున్నరకు పూర్తీ అవ్వాల్సి ఉంది కాని ప్రారంభం అయిందే ఏడింటికి .అందుకని తొమ్మిదిన్నర కు పూర్తీ అవటం ఇబ్బంది కలిగించింది .కారణం కార్యక్రమం సాయంత్రం నాలుగింటికి మొదలవ్వాల్సింది ముద్దు ముద్దుగా సుమారు అయిదింటికి ప్రారంభ మవటం .అంటే గంట లేటన్న మాట .ఏ సాహిత్య సభలో అయినా ఇది మామూలే అనుకొన్నా సరసభారాతికి ఇది నచ్చని విషయం .మహిళలకు ముందు కవిత చెప్పే అవకాశం కల్గించినా పాపం ఆలస్యం తప్పలేదు .ఇది నిర్వహణ లోపం మాత్రమె కాదు అతిధుల రాక ఆలస్యం కూడా .

          ఎక్కడా సుత్తి లేదు సుదీర్ఘ ప్రసంగం కూడా లేదు .సుబ్బారావు గారు పెడన లో వేరే కార్యక్రమం ఉన్నందున సాయంత్రం ఆరు గంటలకు అధ్యక్షులకు బాధ్యత అప్పగించి వెళ్ళారు ఇంతలో పూర్ణ చంద్ ఆ స్థానాన్ని పూరించారు .మొదట్లో ప్రసంగించాల్సిన పూర్ణ చంద్ విజయ వాడ లో అత్యవసర కార్యక్రమం లో పాల్గొని రావటం వాళ్ళ ఆలస్యం గా వచ్చారు .’’సాహితీ లతా తెన్నేటి  హేమలత సాహితీ ప్రస్తానం ‘’పై ప్రసంగించి అలరించి లతా కు నీరాజనాలన్దించటం మరో మలుపు .లతను ఉయ్యూరు లాంటి పల్లె తూల్లలో స్మరించటం ఒక గొప్ప విశేషం కూడా అయింది అందుకే పూర్ణ చంద్ గారిని ఆత్మీయం గా సరసభారతి సన్మా నించి గౌర వించింది .ఆయన తన ప్రసంగం లో నా గురించిన ప్రసంగం వచ్చినప్పుడల్లా ‘’నాన్న గారు‘’అనటం నాకు ఎంతో ఆత్మీయత ,కుటుంబ బాంధవ్యం గోచరించాయి ఎప్పుడు బందరు వెళ్ళినా మా ఇంటికి వచ్చి వెళ్ళటం ఆయన సహృదయత .,సంస్కారం .అవే ఈ మాటలను అని పించింది ..కృష్ణా జిల్లా రచయిత ళ సంఘానికే కాక సుబ్బారో ప్రేమ చంద్ లు సరసభారతికి  వారిద్దరూ రెండు కళ్ళు .దిశా నిర్దేశికులు .పదేళ్ళ మా అందరి పరిచయం మరువ లేనిది నాతో ఎంతో రచన చేయించిన వారుయా ఇద్దరు .సమావేశాల్లో నాకు భాగ స్వామ్యం కల్పించటం వారి సౌజన్యం .

                సరస భారతి ప్రచురించినవి ఆవిష్కరణ చేయటం మామూలే కానిరిటైరేడ్ ఇంజినీర్ ,ఆధ్యాత్మిక విషయాలను శాస్త్రీయ దృక్పధం తో ఆలోచించి అనేక” మహర్షి భరద్వాజ” వంటి అనేక  పుస్తకాలు రచించిన  శ్రీ బందా వెంకట రామా రావు గారి అమూల్య గ్రంధం ‘దైవం శాస్త్రీయ  పరిశోధన ”ను ,శ్రీ శృంగారపు వెంకటప్పయ్య గారి” ఆధ్యాత్మిక గీతాలు ” సి.డి . లను ఈ సమావేశం లో ఆవిష్కరించాలని వారిద్దరూ కోరటం అలా జరగటం మరో కొత్త మలుపు నవంబర్ లో శ్రీ టి.వి.సత్యనారాయణ గారి ”శ్రీ కృష్ణ లీలామృతం ”కథా సంపుటిని వారి కోరికపై సరసభారతి సభలో శ్రీమతి డాక్టర్ కే.బి.లక్ష్మి గారి చేతుల మీదుగా గా ఆవిష్కరించటం సరస భారతి పై వారందరికీ ఉన్న అపారమైన గౌరవం ,నమ్మకం లకు నిదర్శనం దాని వ్యాప్తికిఅద్దం పట్టి నట్లు అయింది 

               శాఖా గ్రంధాలయం లో ఈ కార్య క్రమం నిర్వహించటానికి అనుమతి నిచ్చిన లైబ్రరి స్టాఫ్ కు సరస భారతి కృతజ్ఞతలు తెలుపు కొంది.వారికీ ,సభలో పాల్గొన్న ,చివరి వరకు ఉన్న వారందరికీ వివేకా నంద స్వామి ఫోటో జ్ఞాపికను సరస భారతి అందజేసింది .ఆ జ్ఞాపిక సభకు హాజరైన వారందరికీ ఎంతో బాగా నచ్చింది .ఫోన్లు చేసి మరీ అభినందించారు జ్ఞాపికను .

         ఈ సభలో పురస్కారం పొందాల్సిన శ్రీ టి.శోభ నాద్రిగారు తమ అనారోగ్యం వాళ్ళ రాలేక పోతున్నానని ఆ ఉదయమే ఫోన్ చేసి చెప్పి నేను చేస్తున్న ఈ కార్యక్రమాన్నిమన సారా అభి నందించారు ..మా సన్మానం అందుకోవాల్సిన డాక్టర్  పింగళి వెంకట కృష్ణా రావు గారు వస్తాను,వస్తాను  అని నేను ఫోన్ చేసినప్పుడల్లా చెప్పివిజయ వాడ నుంచి రాక పోవటం నాకు గొప్ప నిరాశనే కల్గించింది .కాని ఎక్కడో నెల్లూరు నుండి నేను ఆహ్వానిన్చగానే వస్తానని చెప్పి వచ్చి మహదానందాన్ని పొంది మా అందరకు కల్గించిన ప్రముఖ కవి తిక్కన లలిత కళా పీఠ వ్యవస్తాపక అధ్యక్షులు శ్రీ ఆలూరు శిరోమణి శర్మ గారు‘’వినయానికి విద్వాత్తుకు ,మంచితనానికి మాట నిలబెట్టుకోనడానికి శిరో మణి’’ అని పించుకొన్నారు .

                ఈ కార్యక్రమం ‘’జన గణ మన’’గీతం తో పరి సమాప్తి చెందింది .అందరికి మధుర భావనలు మిగిల్చింది .

       ‘’సాహితీ కదంబం ‘’లో పాల్గొని కవితలు చెప్పిన వారి కవితలన్నిటిని శ్రీ విజయ ఉగాది నుండి‘’విజయ ఉగాది కవి కోకిల స్వరాలు ‘’పేర ధారావాహికం గా ‘’సరస భారతి ‘’అందిస్తోందని తెలియ జేయటానికి ఆనందం గా ఉంది

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-4-13- ఉయ్యూరు 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

1 Response to సరస భారతి 43 వ సమావేశం లో సరిగమలు

  1. వంశీ కృష్ణ అంటున్నారు:

    మాస్టారు,
    మీ సాహితీ కార్యక్రమం బాగా జరిగినందుకు మీకు అభినందనలు.
    ఇలా రచయుతలని గుర్తించటం ద్వారా మీరు సాహిత్యానికి మంచి సేవ చేస్తున్నారని అనుకొంటున్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.