శ్రీ విజయ ఉగాది కవి కోకిల కలకూజితాలు -6
11- ఒకే ఒక్కడు –చి.మాదిరాజు బిందు వెంకట దత్తశ్రీ (భగవద్గీత ఫేం )
ఆనంద మా నంద మాయనే
ఉయ్యూరు పురములో కవికోకిలల సందడి
ఊహలకు రెక్క లొచ్చి –కలాలకు పదును పెట్టగ
నిజాల పట్టిక విజయ దుందుభి మొగించేనే
సరసభారతికి మరో మకుటం
ఈ సాహితీ కదంబం
హేమ కాంతిలో వెలుగుకే వెలుగు వచ్చే
జ్ఞాన కాంతులు వెదజల్లెనే
సువర్చాలాదీశుని ఆశీస్సులు మెండుగ నుండగా
మండుటెండలలోకవిత వికశించే వసంత రాగాలతో
‘’ ఊసుల్లో ఉయ్యూరు ‘’తో ,’’మా అక్కయ్య ‘’కవితలతో
ఒకటా రెండా, విభిన్న కార్యక్రమాలతో
సరసభారాతికి వన్నె తెచ్చింది
సాహితీ వనం లో మహా కల్ప వృక్షం
ఉయ్యూరు నే ప్రపంచానికి చేరువ చేసిన
అంతర్జాల విన్యాసకులు
నిజ సాహితీ వేత్త
మనందరికీ హితులు, సన్నిహితులు
ఆయనే మన దుర్గా ప్రసాద్ గారు
ఆయనే ఒకే ఒక్కడు .
12-ముప్పదం—గబ్బిట దుర్గా ప్రసాద్
వివరణ –ముప్పదం అంటే నా భావనలో మూడు పాదాలు ఉన్నది అని అంతేకాని ముప్ఫై పాదాలున్నదికాదు .దీనికి కోడి గుడ్డు మీద ఈకలు లాగే వాళ్ళు ‘’ముప్పు ఉన్నది ‘’అని అర్ధం చెప్పినా నాకేమీ అభ్యంతరం లేదు పైగా స్వాగతిస్తాను .
‘’అప్పటి దాకా అది ‘’దిల్ షుక్ నగర్ ‘’
ఆ రోజు ‘’ మాత్రం వాళ్లకు’’ దిల్ ఖుష్ నగర్ ‘’
ఆ నాటి నుంచి మనకు అయింది ‘’దిల్ దుఃఖ్ నగర్ ‘’.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12-4-13- ఉయ్యూరు