శ్రీ విజయ ఉగాది కవి కోకిల కల కూజితాలు -4
(10) కోకిల మానసం –శ్రీ మతి ముదిగొండ సీతా రావమ్మ –మచిలీ పట్నం- 8520891585
మత్తకోకిల –కొమ్మ చాటున దాగి యుంటివి కోపమేలనే తెల్పవే
కమ్మగా నొక పాట పాడవే కానివారము కాములే
సమ్మదంబున తెల్గు సీమకు సాగిరమ్మని పిల్చినన్
గుమ్ము గుమ్మున జూతువేలనే కొంటె తన మేమాయేనే ?
ఉత్పల మాల –ఊరక భీతి చెందేదవు ఊసుల బల్కవదేమి కోకిలా
మారెన నీదు బుద్ధి మరు మల్లెల వాసన చూడ వేమిటే
కారణమేమి పల్కుమన ,కాన్చితి కాంతల మాన భంగముల్
మారణ కాండ సల్పటలు ,మత్సర భావము రేగిపోవుటల్
మత్త కోకిల –భీతి పెర్గెను ఆంద్ర చేరగ ప్రేమ దూరమే ఆయేగా
‘’నాతి ‘’నేనని నన్ను పట్టేడి నవ్యతల్ కని పించగా
చేత లన్నియు క్రూరమాయెను చిత్తమే వికటించగా
రీతి మారిన తెల్గు వారల లీలలన్ని ఎరింగితిన్ .
ఆట వెలది –తెలుగు దేశ మందు తెగువ పెర్గెను చూడ
దోచువారే కాదు దాచు వారు
నిజము పల్క నట్టి నిక్రుస్టులును పెర్గే
బయట తిరుగ నాకు భయము కలిగే .
ఆట వెలది- ఏమి చేయ లేను ,చింత మిగిలే నాకు
భ్రాంతి తోడ వస్థి,బాధ మిగిలే
పలుక కుంట మేలు ,పలు పాట్లు పడకుండ
ఏగ దలచినాను ,వేగలేక .