శ్రీ విజయ ఉగాది కవి కోకిల కూజితాలు -8
21- మాట విజయ బాట –శ్రీచిత్తజల్లు భవానీ శంకరం –ఉయ్యూరు –9292153791
మాటకు ప్రాణము సత్యము తెలిసి తెలిసి –మాటకు మాట బదులిచ్చి ,ఇచ్చిన మాట మరచినారు
బోటికి ప్రాణము మానము అని ఎరిగి ఎరిగి –తల్లి బిడ్డ తేడా లేక మాన భంగమొనర్చి హతమార్చినారు
చీటికి ప్రాణము వ్రాలు అని చదివి చదివి –చదవ కుండగానే సంతకు చేసినారు
కోటకు ప్రాణము సుభట కోటి అని ఎంచి పెంచిన –భటులు పొంచి ఉన్న పేలుళ్ళను తప్పించలేని భటులు
అక్కటా లెక్కకు మించి పెరుగుచున్న అట్టి జనులు –ఆనందముగా నందనం జరుగుచున్నాడని
అరని చిచ్చువోలె అసంతృప్తి జ్వాలలు ఎగసి పడగ–అభయమిచ్చి రక్షించవమ్మ విజయ .
22-కామాంధుల చేతుల్లో భవిత ?—శ్రీ శృంగారపు వెంకటప్పయ్య –విజయ వాడ -8985313811
సిగ్గుపడుతున్నది సిగ్గు పడుతున్నది –చెడ్డ సమాజాన్ని చూసి మానవతయే లేదని
మానవత ఇంకేక్కడిదని ?
కామాం ధులు రాబందులు గా మారుతుంటే –వనిత భవిత రక్త చరిత గా మారుతుందని
ఎన్నాళ్ళని ,ఎన్నేళ్ళనికన్నీళ్లు శోకాలు ?
క్షణమొక రణం గా బతుకు బరువై పోతోంది –ఆవేదన చెందుతూ ,మానని గాయాలతో కన్నీళ్ళ కాలాన్ని ఈదుతున్నది
మ్రుగాల్లాంటి మగాలళ్లున్న మనసులేని లోకం లో –కలలే కల్లలై ఆశయాలు అందకాకన్నోల్లకు కన్నీళ్ళే పంచి
ఒంటరిగా సాగలేని అంగడిలో ఆడతనం –చీకటి పాలౌతుంటే
తిరిగి రాని కాలం లో చితి మంటగా మారుతుంటే
గుప్పెడంత గుండెకు వేదన వెంటాడుతున్నది
23- కరువైన కన్నీటి బాట –శ్రీమతి కోనేరు కల్పన–విజయవాడ -9246493712
తేట గీతి –బొట్టు పెట్టి పిలిచినారు బుడతలిద్దరిని వదలి వేళ్ళలేనిక మీరేటును పోక
కాస్త చూసుకోండి ఇదిగో గంట లీవు –బువ్వ పెట్టగ వచ్చేద పోయిరానో ?
‘’ ఆలి ఆశ మొదమనగా అతని పోవ –అనుమతిచ్చేను అతడు
నీటి బోట్టైనఇంట లే నిన్న నల్ల –రాలేనే బిందె లోన తుర్రు మనియె బొట్టు
‘’ కోపమొచ్చి అవ్వు వచ్చి కొంత తడవు –నివ్వెర వాడి బిందెలు తీసే నీళ్ళకోసం
ఉస్సురనుచు భామా పతి తుస్సుమనేను –పంపు కాస్త చుక్క పడక పంతమనగా
‘’ పిల్లలోచ్చి నీల్లడిగిరి పేచి పెట్టి –గోలచేసిరి పోరుగునా గోడు ఇంతే
జాయమీద కోపమయిన జాలివేసే –దిక్కు తోచక దిగులాయే తిక్కరేగే .
‘’ చుక్క లేకనే చిక్కులు చుక్క వేసి –చూపుతా నా తెలివి చూసుకోండి
నీరు లేక పోతే మానె బీరు ఉంది –చుక్క ఏదయినా నేమిలె చిక్కు వీడ
‘’ ఆకలితో పిల్ల లేమాయె అనుచు అచట –వేగిరముగా తాంబూలమున్ పిలిచి పొంది
కొలము వీడ్కొని కుచ్చెళ్లు కొంచే మెత్తి-పడతి చేరెను ఇంటికి పడుతూ లేస్తూ
‘’ కంపు కొట్టు ఇంటిని నిషా కాటు పడ్డ –పతిని గాఢ మత్తున జోగు సుతుల గాంచి
మెదడు మొద్దు బారే ,మనసు మేట వేసే –నీరాజక్షికి కరువే కన్నీటి బొట్టు
24—విజయ నామం –శ్రీ కాట్రగడ్డ వెంకట రావు –పామర్రు
వందనమమ్మా విజయనామ ఉగాది –సరసభారతి సహృదయ వాహిని
కవులతో సరస సంగీత సరిగమలు –మందు టెండలో సరసభారతి ముత్యాలు మెరిసి
లేలేత పచ్చదనం ,వసంత వైరాగ్యం –షడ్రుచులు కల్గించు ఉగాది శాకంబరి
కృష్ణమ్మ ఒడిలోన కవులందరూ జత గూడిరి –విజయమ్ము కల్గించు విజయ నామం
జైత్ర యాత్ర కోన సాగు వారము లిమ్ము –విజయ నామమా ణీ కిదే స్వాగతమ్ము
25-దివ్య ఔషధం –శ్రీ వసుధ బసవేశ్వర రావు –గుడివాడ
అమ్మలారా –అమ్మపాలకు నోచుకోని బిడ్డలకు అమ్మభాష నేర్పండి
అయ్యలారా –దేశభక్తి వంట బట్టించుకొని విద్యార్ధులకు –అమ్మభాషయినా నేర్పండి
ఆచార్యులారా –మాతృభాష ,మాతృప్రేమను దేశ సేవను
పెంచేదివ్య ఔషధం అని చాటండి
కాల మహిమ
శిశిరం హరించిన పాత్ర సంతతిని—వసంతం లో చెట్టు యధావిధిగా ప్రసరిస్తుంది
అదే పత్ర హరితం అదే త్యాగ భరితం
మనిషి ఒక తరాన్ని –చరిత్ర పుటల్లోకిదూర్చి
మరో కొత్త తరానికి దారిస్తే –వారసులది ఒక్కో రీతి ,ఒక్కోనీతి
ఒకరిది స్వార్ధ ప్రవ్రుత్తి –ఇంకోరిది పశు ప్రవ్రుత్తి
కాలమా !ఏమిటీ వైపరీత్యం ?
సశేషం
మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ -15-4-13- ఉయ్యూరు