శ్రీ విజయ ఉగాది కవికోకిల కలస్వనాలు -9
26-విజయ కు స్వాగతం –శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణా చార్యులు –విజయవాడ –9703776659
స్వాగత మాంధ్రసత్కవుల వాక్జనితా రసగీతికా ,సుధా
రాగ మాశ్రయీ ! విజయ రంజిత నూతన వత్సరంబహా
రాగిలి ఏమి ఇచ్చదేవు రాగల రోజుల తెల్గు వారికిన్
రాగ విరాగ శూన్యమయి రక్తిని గోల్పడి నట్టి జాతికిన్ .
తెలుగు నేడు రేపు
తెలుగు తెలుంగు గా వెలుగు తీయని కాలము ముందు గల్గునా
పలుకుల పంచదార పోలుపై నమ్రుతంబది జాలువారగా
కులుకుచు రాగామోల్కు పద గుంఫిత గేయ కవిత్వ సంపదల్
తెలుగుల సోత్తనంగ భువి తేజరిలెం గద నేటి దంకయున్ .
తెలుగది కాదు పూర్తిగను తెరగు నాంగ్లము గాదు ఏదియో
తెలుపగరానిభాషగను తెన్నులు తీరును లేని వాక్యముల్
పలుకుచు మాత్రుభాషనిల భ్రస్టము చేయుచునున్న వారాయో
తలచుచు నూహ సేయగను తల్లదడిలున్ హృది తెల్గు భారతీ !
ఎలమావి చిగురేమో తలపగా చేదాయే –కోకిల రాగాలు మూగవోయె
మలయ మారుత వీచి –ధూళి దూసరితమ్ము –సంధ్యా విహారాల సౌఖ్యమేది ?
శీతల వాహినీ శీకర స్నానాలు –వట్టి పోయిన నది నెట్లు సాగు
ఉద్యాన వనముల నుయ్యాలలే గాని –లలితమౌ పరిమళ లహరులేవి?
పూర్ణ చంద్రుని చల్లని కిరణ హాయి –అనుభావిమ్పగలేరైరి అవని జనులు
ప్రాక్రుతంబగు సౌందర్య సుకృతి జూడ –వైక్రుతంబయ్యే మానవ దుష్క్రుతాన .
విజయకు విన్నపము
కాలమేదైన మనుజుల కర్మ లఖిల –మొక్కరీతిగానే నేడు నెగడ సాగే
స్వార్ధ చింతన బాపియు సకల జనుల –కాచి రక్షించి విజయమ్ము కలుగ జేయు
తెలుగు విద్యార్ధి విద్దెల దివ్వె యగుచు –గగన సీమల విజ్ఞాన కాంతి పరచి
దిక్తటంబుల తాకుచు దీప్తి తోడ –విజయ కేతన మెత్తుచు వెలుగు గాక
సార్ధకంబైన నీ పేరు సత్యమగును
27-అదృశ్య దృశ్యాలు –శ్రీమతి మందరపు హైమవతి –విజయ వాడ –
నడివీధిలో నడుస్తున్నప్పుడు ,నలుగురితో మాట్లాడుతున్నప్పుడు
బడిలో పాఠాలు చెబుతున్నప్పుడు –అన్నం తింటున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు
చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి –కామం ,విషం మాటల కంటకాలు గుండెల్లో గుచ్చుకొంతూనే ఉంటాయి
మనిషి వాసన తగలగానే –తనువు మరిచే దానవుల్లా –ఆడపేరు కానీ పించినా
ఫోను నెంబరు కనిపించినా –పొగరు బోతూ పొట్ల గిట్టల్లా పెట్రేగి పోతారు
చలువ చేసిన రాయంచ రెక్కల్లాంటి ఖద్దరు బట్టల ముసుగులో –
పెద్దలేప్పుడు మల్లె నవ్వులు రువ్వుతూ –మాటల సమ్మోహనాస్త్రాలు సంధిస్తారు
ఇప్పుడు ఆరు రుతువుల విభిన్న వర్గాల విచిత్ర విన్యా లు లేవు
సకల జనులను సంమోహ పరచే ఏకైక రుతువు’’ కామ రుతువే ‘’
వెండి తెరపై బుల్లి తెరపై అనవరతం ప్రదర్శించే అంగనల నగంగ అర్ధ నగ్న దృశ్యాలే చాలు
కవయిత్రి నైనా నేను –పదునైన కట్టి గాట్లను –తలిరాకు లాంటి ఎదపై
మలినపు మాటల మరకలను ప్రదర్శించలేము కదా
అంత రంగ హంతకులను –నిరూపించలేము కదా
28—తెలుగు భాష –శ్రీమతి వారణాసి సూర్య కుమారి –మచిలీ పట్నం –
ఉత్పలమాల –‘’భావ మేరున్గా జేయుటకు భాషయే ముఖ్యము మాన వాలికిన్
దేవుని వేడు చుందగాను దీనుల బాధలు తీర్చు పల్కులన్
భావిని బాధ్యతల్ తెలిపి బాలల నేర్పుగా తీర్చి దిద్దుతలన్
దీవెన లిచ్చు వేళలను తీయగా తోచు తెలుంగు భాషయే
‘’ భారత దేశ మండుగల భాషల లోన తెలుంగు లెస్సగా
ధీరుడు రాయ లప్పటికే తెచెను పేరు ప్రతిష్ట లంతతాన్
మీరును మెమతాఆఅన్చునిక మీనము మేషము లెక్క జూడకన్
కూరిమి నేడు నూ మనము కోరిన కట్టగవచ్చు పట్టమున్
‘’ పూలనుతావియున్ మధువు పుష్టిగా ణుండు విధమ్ము భాషయే
కాలము శాశ్వతంముగాను కానగ వచ్చును సుధా మయంబుగాన్
మెలగు భాషగా తెలుగు మేదిని మెప్పును పొంద మోదమున్
తేలును మానసమ్ములును తేలిక నూయల లూగు ఛందమున్ .
‘’ కేకి పికంముల సుస్వరము కీరము పాలకుల కంటే వారిధిన్
ఆ కెరటంముల ధ్వనిని ,హాయగు తుమ్మెద పాత కంటే నూ
ప్రాకిన మాధవీ లతల బంగారు ప్రకృతి శోభ కంటే నూ
లోకము నుత్తమంబాగు తెలుంగు కవిత్వము ప్రీతీ గోల్పునే
‘’ ఏ రకమైన భాషయును ఎంతగా నేర్చిన ,మాత్రుభాశానే
మారక ప్రేమతో తెలుగు మాధురి గ్రోలుచు మాటలాడు టే
పౌరుల లక్ష్యమై నపుడే భూరి భవిష్య వికాస మొండుచున్
నీరద తుల్యమై కురియు నిత్యమూ తేట తెలుంగు వర్షమై
‘’ ఆశయ సిద్ధికి మనము ఆకలి దప్పులు విస్మరించియున్
లేశము బద్దకించ కను లేదు విరామ మటంచు చెప్పకే
పాశు పతాస్త్రస్మౌ ననేడు పట్టుదలన్ కృషి చేసి నప్పుడే
ఆశలు తీరి కష్టమున కండును సత్ఫలితంబు తృప్తియున్ .
తేట గీతి – భాష పాటలను గౌరవ భావ మానక –కొందరు తెలుగు వెలుగును కోరుకోనారు
అట్టి వారికి నాభి రుచి యబ్బు నటుల –పాటు పడవలే నెల్లరు పట్టు విడక
29–.మార్పు కోసం –శ్రీ విష్ణు భొట్ల ప్రసూన రామ కృష్ణ –విజయ వాడ -9440618122
వక్చ్చింది ఉగాది –ప్రతి ఏడూ చూసిన ఉగాదే పేరు మార్చింది అంతే
అదే వేపపూత అదే చెరకు గడ ,అదే బెల్లం అదే రుచి –ఎక్కడా మార్పు కన్పించనే లేదు
మా ఊరిలో అదే శిధిల శివాలయం –అదే ఎండిన పార్కు
బీటలు వారిన బడి –మందుల్లేని దవాఖానా –పక్కనే గోడల్లేని స్మశానం
ఊరి చివర పూరి పాకలు ఊళ్ళో పెంకుటిల్లు –వీటిని ఏ కొత్త ఉగాది మార్పు తేనే లేదు
మార్పేదో వస్తుందని ప్రతి ఏడాది ఎదురు చూపులు చూసి నా జీవితమంతా మా ఇంటి ఎదురు మానులా ఎండిపోయింది
ఆ మాను చిగురించదు –ఈ మేను పులకించదు -బతుకులు మారుతాయని ఆశ మాత్రం ఎప్పుడో చచ్చి శవమైంది
విజయ నామం కదా ఏదో చిరు ఆశ ఉంది స్వాగ్సతిస్తున్నాను తప్పక .
30—తస్మాత్ జాగ్రత జాగ్రత –శ్రీమతి కోగంటి విజయ లక్ష్మి –గుడివాడ
కొప్పు నిండా పూలు పెట్టి –చిగురు వన్నెల చీర కట్టి –వేప పూవు రైక తొడిగి
పుడమి తల్లి సిన్గారించగా ,కవిత కోకిల కంఠ–మెత్తికొత్త గీతం ఆలాపించింది
మధుమాసం మంచి గంధం –మనములన్ని చిలకరించాగా
ఆరు రుచుల సమ్మేళనం –ఉగాది పచ్చడి భుజించి
కవిత కోకిల కంఠమెత్తి చైత్ర గీతి ఆల పించింది
ఓట్ల కోసం పాటుబడి –శుష్క వాగ్దనాలేవో విని పించి
పదవులతో లబ్ది పొందిన బడా బాబుల బడాయి బద్దలై న వేళ
కవిత కోకిల కీచు గొంతుతోశోక గీతం ఆ ల పించింది
విజయా! విచిత్ర శక్తులతో వచ్చావా ?లేకుంటే చెదరిన గుండెల స్వాంతన పరచలేవని తెలుసుకో .—
అందుకే తస్మాత్ జాగ్రత జాగ్రత్త అన్నాను ముందుగానే .
సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -17-4-13