శ్రీ విజయ ఉగాది కవికోకిల కలస్వనాలు -10 (చివరి భాగం )
31-తెలుగును మరువను –విడువను –చి బి.గాయత్రి –ఎనిమిదవ తరగతి –వి.ఆర్.కే.యం
.హైస్కూల్ –ఉయ్యూరు
అ ఆకాశం చూడలేనంత పెద్దదే అయితే –నా తెలుగు సాహిత్యం చెప్పలేనంత గొప్పది
అమ్మ ప్రేమ ఆకాశమంత గొప్పది –అమ్మే ప్రేమకు సమానం
నా తెలుగు భాష విన్నప్పుడు నా మనసుకు తియ్యగా ,కమ్మగా ఉండి ఉల్లాసం ఇస్తుంది
నా మనసు పులకరిస్తుంది –ఎంత సేపు మాటాడినా విన్నా నాకు తనివి తీరని తృప్తి
నా తెలుగు మాట గొప్పదనం తియ్యదనం తెలుసుకొన్న వారిదే మూలధనం
చెప్పటానికి నాకు మాటలు రావటం లేదు –నేను తెలుగు మాట్లాడకుండా ఉండలేను
గాలిని కట్టి బంధించలేను రేయిని ఆపలేను పగటిని ఆపలేను ,మరణాన్ని ఆపలేను
అలాగే నేను తెలుగును మర్చి పోలేను –దాన్ని గురించి తెలిస్తే అందరికీ మహా నందం
జన్మ నిచ్చిన తల్లిని ,దేశాన్ని ,మాతృభాష ను మరచి పోలేను -పోను కూడా
‘’దేశ భాష లందు తెలుగు లెస్స ‘’అన్న సత్యాన్ని నేను మర్చి పోలేను .
32-కాళ రాత్రి – శ్రీ చక్రవర్తి ఎ..ఎస్.ర్. –కూచిపూడి
ఒక దేహం కాలి పోయింది –ఒక బతుకు నీరైంది
ఒక కుటుంబం కూలి పోయింది –ఆశల సౌదాలన్నీ పేక మేడల్లానేల రాలాయి
విని పించింది బాంబు పేలుడే –దాని వెనుక తెగిన పేగు బందాలేన్నెన్నో
ఒక్క క్షణం లో దిల్ షుక్ నగర్ దిల్ దుఃఖ నగర్ గా మారిపోయింది .
శ్రీ విజయ ఉగాది కవికోకిల సవనాలు ఇంతటి తో సమాప్తం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-4-13- ఉయ్యూరు