లాఫింగ్ బాయ్

  లాఫింగ్ బాయ్

          Oliver La Farge రాసిన laughing boy నవల పులిట్జర్ ప్రైజ్ తెచ్చుకోంది .ఇదంతా’’ పోయేటిక్ ప్రోజ్’’గా ఉంటుంది .ప్రతి వాక్యం భావ గర్భితమే .నిండుగా అందం గా ఉంటుంది .సంభాషణలు చాలా క్లుప్త గా లోతుగా ఆలోచనాత్మకం గా ఉంటాయి .వర్ణన అద్భుతం అని పిస్తుంది .మరో లోకం లో విహరించిన అనుభూతి పొందుతాం .అడవి బాపి రాజు గారి నవలల్లా గా మెత్తగా  కత్తిలా ఉంది .

 images (9)

 

 

            కథ అంతా Nava Jo అనే  ఇండియన్ అమెరికన్ల జీవితమే .వారు ఆటవిక తెగ వారు అమెరికా అసలు వాళ్ళదే .ఆ తర్వాత్ ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారు మొదలైన వారొచ్చి ఆక్రమించుకొన్నారు .ఒక ప్రేమ జంట కథ ను ఇతి వృత్తం గా తీసుకొని వాళ్ళ ఫ్లాష్ బాక్ లు ,ఒడిదుడుకులు ,అనుకొన్నది సాధించటాలు ,పాశ్చాశ్చ  వ్యామోహం నుండి కాపాడుకోవటం ,తమఅస్తిత్వాన్ని   తెల్సుకొని మార్చుకోవటం బ్రహ్మాండం గా వర్ణించాడు రచయిత .An American classic ,the greatest novel yet written about the original Americans ‘’అని కితాబు పొందిన నవల .ఇదొక సాహస ప్రయత్నం అని విజయవంతమైన ప్రయోగమని అందరు భావించారు .మంచి ఊహా ఆచరణ ఉన్న రచయిత అని అతన్ని కొనియాడారు .’’I do not recall a single other long story of primitive life in which the story is so completely kept within its native colour and tone ‘’అని ‘’సాటర్ డే రివ్యు ‘’మెచ్చింది .ఇందులో వచనం కవిత్వ స్థాయిని చేరింది అంది న్యు యార్క్ టెలిగ్రాం పత్రిక .’’it is a prose poem of rare beauty ,depth of feeling and emotional power .it is the finest American novel this reviewer has read in 10 years ‘’అన్నాడు ఫిలడెల్ఫియా కు చెందిన విమర్శక ప్రముఖుడు .

                  ఈ నవలలో పేర్లు తమాషా గా ఉంటాయి .అబ్బాయి పేరు’’లాఫింగ్ బాయ్’’ .అమ్మాయి పేరు‘’స్లిమ్ గరల్ ‘’ఇవన్నీ వీళ్ళ నేటివ్ భాష లోని పేర్లే .పిలిగ్రిం ప్రోగ్రెస్ లో పేర్లు లా ,మన పంచతంత్రం లో పేర్లు లా ఉంటాయి .రెడ మాన్  ,టాకింగ్ గాడ్ మొదలైన పేర్లు పాత్రల స్వభావాన్నీ తెలియ జేస్తాయి .వీరంతా మెక్సికన్ ఆక్సేంట్ తో మాట్లాడతారు .ఇందులో అమ్మాయి స్లిమ్ గర్ల్ అమెరికన్ లాగా పెరిగింది .చాలా ప్రేమ కధలు నడిచాయి .చివరికి లాఫింగ్ బాయ్ తో ఉంది .ఇంకా పెళ్లి పూర్తీ కాలేదు .ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు .ఆ అమ్మాయికి అల్లిక ,కుట్టుపని నేర్పడతను .గొర్రెల పెంపకం ,గుర్రాలను కొని అమ్మటం అతను చేస్తుంటాడు ఆమెను చదివించి అమెరికన్ లా చేయాలని అతని ఆరాటం .నవ జో గా మారాలని ఆమె తపన .ఇద్దరు ప్రేమను వెల్లడించుకో లేదు .సిస్టర్ గా చూడాలని వీడి తపన .చెప్పలేడు .ఆమెను ఒక సుపీరియర్ అమెరికన్ చేయాలని వాడి మనో నిశ్చయం .ఆమె ఉన్నత పదవిలో ఉంటె తనకీ గౌరవం అని అనుకొంటాడు .గాఢ ప్రేమికుడు స్నేహితుడు సహాయకుడు ఆమెకు .

             ఆమె నిత్యం నవ జో జీవిత విధానాలను అనుసరిస్తూ మెచ్చుకొంటూ ఉంటుంది .to acquire nava jo gesture completely ‘’అని ఆమె గాఢ వాంచ అతనికి తమ గూడెం లోకి చేరాలని కోరిక .అలా వచ్చేస్తే అతన్ని ‘’went away ‘’,’’blind eyes ‘’అంటారని అర్ధ వంతం గా చెబుతుంది .అతను చాలా బాధ పడుతుంటాడు .తనేదో కోల్పోయి నట్లు బాధ .ఆమెతో ఉంటె తన అస్తిత్వం దెబ్బ తింటుందేమో నని భయం తాను మగాడినని యోదుడినని భావిస్తాడు .ఆమెను మర్చి పోక పోతే తాను ఏమై పోతానో నని లోపల జంకు .ఇలా వీళ్ళిద్దరూ గుంజాటన పడుతూ ఉంటారు .

    ఒక రోజు ఎవరి మీదో వేస్తున్న బాణం ఆ అమ్మాయికి తగులు తుంది .అలా రక్తం కారుకుంటూ ఇల్లు చేరుతుంది .అప్పుడు అతనిలో ప్రేమ వెల్లువ గా బయట పడుతుంది .బాణం తీసి సపర్యలు చేస్తాడు .కొంత నయం అవగానే నిజ మైన భార్యా భార్తల్లా జీవిస్తారు .అప్పుడామే తన పాత జీవిత కథఅంతా ఆవిష్కరిస్తుంది .వీడు పశ్చాత్తాప పడతాడు .ఇద్దరు కలిసి నవ జో వెళ్లాలని నిర్నయిన్చుకొని బయల్దేరారు  .దారిలో ఆమె చని పోతు  .’’చెడిన ఆడ వాళ్ళను ‘’squa ‘’అంటారు .’’squa is a word Americans use to mean Indian women .’’అని తన కద చెబుతూ ‘’నేను ణనీ వల్ల నా ఆత్మను కాపాడుకోన్నాను .నీతో ఉండటం పరమ సంతోషం .నీతో సత్యం చెప్పాలనే నా కోరిక ‘’అని తన గుండె లోతుల్లోని ప్రేమను వెల్లడి చేస్తుంది .కొత్త జీవితం ప్రారంభించాలన్న తపన ఆమెది ..చని పోతుంది అతని చేతుల్లో .ఒక గొయ్యి తీసి ,ఆమె నగలన్నీ ఆమెకే అలంకరించి ,తనకు ఆమె ఇచ్చినవీ అందులోనే ఉంచేసి ఖననం చేస్తాడు .ఒంటరి వాడుగా మిగిలి పోతాడు .అమర ప్రేమికుడని పించుకొంటాడు లాఫింగ్ బాయ్ .

        చివరగా రచయిత ‘’Now he was not a nav Jo terrified of the dead ,not an Indian ,not an individual of any race ,but a man who had buried his own heart ‘’అంటాడు అద్భుత మైన కవితా ధారతో కృష్ణ శాస్త్రి గారి కవితా పంక్తులు  జ్ఞాపకం వస్తాయి .తను కావాలనుకొన్నది కావాలని తీర్మానించుకొన్నాడు .దీనినే కవితాత్మకం గా రచయిత ఇలా చెబుతాడు ‘’the reminder of his life would be a monument to her .all this could not be changed or taken from him ,he would never lose its mark .that was a comfort ‘’దేవ దాసులా తాగుడుకు బానిస కాకుండా ఆమె కోసం కొత్త జీవితం ఆరంభిస్తాడు .అది ఆమెకు అంకితం చేయాలని భావిస్తాడు .నిజమైన ప్రేమకు ఆ ఆటవిక జాతుల వాళ్ళు ఆదర్శం గా నిలిచారు జంటగా .కళ్ళు చేమరిస్తాయి .చివరి అధ్యాయాలు కుదిపేస్తాయి .శ్వాస అడ కుండా చేస్తాయి .వాళ్ళ హృదయపు లోతుల్లోకి మనల్ని తీసుకొని వెళ్లి ఆనందాన్ని పొందింప జేస్తాడు రచయిత .అంతటా పాత్రలే దర్శన మిస్తాయి .అన్నీ జీవం ఉన్న పాత్రలే .వ్యక్తిత్వం తోణికిస లాడేవే .సహజం గా స్వభావ సిద్ధం గా ప్రవర్తిస్తాయి .ఒక గొప్ప నవలా రాజాన్ని చదివిన అను భూతి పొందాను .బరువైన హృదయం తో ఆ అమర ప్రేమైక జంట లాఫింగ్ బాయ్ ,స్లిమ్ గర్ల్ కు అక్షరామ్జలే ఈ జ్ఞాపకాలు .చివరికి అతడు ఇలా అనుకొంటాడు ‘’we shall never be fear from each other always alone ,but never lonely –in beauty it is finished ‘’అని వాళ్ళ భాష లో ఒక పాట పాడుకొంటాడు .ఆ పాట ‘’ for ever alone ,for ever in sorrow I wander –for ever empty for ever hungry I wander –with the sorrow of great beauty I wander –with the emptiness of great beauty I wander –never alone ,never weeping ,never empty –now on the old age trail ,now on the path of beauty I wander –Ahlam beautiful ‘’

           నిరాశ కంటే ఆశ కు పెద్దపీట వేస్తాడు రచయిత .ఏడుస్తూ కూర్చోవటం కంటే మళ్ళీ ఆ జ్ఞాప కాలతో కొత్త జీవితం సాగించాలి అని హితవు చెబుతాడు .లాఫింగ్ బాయ్ కి గొప్ప ప్రశాంతి కలిగింది ఎదురు దెబ్బల నుండి పెద్ద గుణ పాఠం నేర్చుకొన్నాడు .తమ ఇద్దరి ప్రేమ అజరామరం అని తెలుసుకొన్నాడు అందుకే అంత శాంతి ఏర్పడింది .’’త్వమేవాహం ‘’లోకి సుదీర్ఘ ప్రయాణం సాగిస్తాడు .  1920 వరకు25,000 మంది నవ జో లు మాత్రమె ఉన్నారట .’’their generala condition and mode of life ,with all its hardships ,simplicity and riches could continue indefinitely if only they were not interrupted ‘’అని రచయిత తేలుస్తాడు .అనవసరం గా వాళ్ళ ఆచార వ్యవహారాల జోలికి,కట్టుబాట్ల వైపుకి  వెల్ల వద్దని వారి మానాన వారిని ప్రశాంతం గా జీవిన్చేట్లు చేయమని ప్రభుత్వానికి ,నాగరకులకు హెచ్చరిక చేస్తాడు .అందువల్లనే మరో ముప్ఫై ఏళ్ళకు అంటే 1950 నాటికి నవ జో లసంఖ్య  85,000అయింది .ఆధునిక ప్రభుత్వాలతో ,ఆధునిక సదుపాయాలతో పాత వి అన్నీ కోల్పోయారు .ఇప్పుడు వారంతా ఆనందం హసించని జీవులు గా బతుకులు ఈడుస్తున్నారు .వారిని ఆదరించే వారితో స్నేహం చేసే వారే కరువైపోయారు .తాగుడుకు బానిసలై పోయారు .అయినా కొంత మంది ఇంకా వారి మతాన్ని ,వారి పరిసరాల అందాలను ,హాస్యాన్ని కాపాడుకొంటూ మందు కు బానిసలు కాకుండా నే వారి వినోదాలు ఉత్సవాలను ఘనం గా నిర్వహించుకొంటున్నారు .ఈ రచయిత కూడా అదే తెగ కు చెందినా వాడే .అందుకే అంత గొప్ప గా వారి జీవితాన్ని చిత్రీకరించాడు .ఆఫ్రికన్ అమెరికన్లు అంటే నీగ్రోల పుట్టు పూర్వోత్తరాలను తెలియ జేసే ‘’the roots ‘’నవల జ్ఞాపకం వస్తుంది

 మొదటి సారి అమెరికా వెళ్ళినప్పుడు చదివిన ఈ నవల ను గురించి 19-7-2002 శుక్రవారం నా డైరీలో రాసుకొన్న విషయాలు మీ కోసం అందించాను .

            మీ  –గబ్బిటదుర్గా ప్రసాద్ –22-4-13- ఉయ్యూరు 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.