రిడెంప్షన్ సాంగ్(విముక్తి గీతం )

    రిడెంప్షన్ సాంగ్(విముక్తి గీతం )

      Bertice Berry అనే ఆఫ్రికన్ అమెరికన్ అమ్మాయి రాసిన నవలే రిడెంప్షన్  సాంగ్ .నల్ల జాతి  వారు ,వారి పిల్లలు పడే బాధలు ,తెల్ల వాళ్ళు వీళ్ళ కన్నేత్వాన్ని ఎలా పాడు చేసేదీ ,మొదలైన వాటి నన్నిటిని ఇందులో మనసు ద్రవిన్చేట్లు రాసింది .అయితే ఎవరి పైనా ద్వేషం వద్దని ,ప్రేమ తోనే అంతా జయించాలని యేసు క్రీస్తు మాటలనే ఆమె చెప్పింది .

              ఇందులో Fina అనే అమ్మాయి ,Ross అనే అబ్బాయి ఒక పుస్తకాల షాప్ ‘’బ్లాక్ ఇమేజెస్ ‘’కు వెళ్తారు .ఆ షాపు యజమాని miss Cojy అనే నల్ల జాతి స్త్రీ .నల్ల జాతి వాళ్ళ అరుదైన పుస్తకాలన్నీ ఈమె వద్ద ఉన్నాయి .అందులో తన తల్లి వాళ్ళు ఇచ్చిన children of grace ‘’అనే‘’మెమరి బుక్ ‘’ఆమె వద్ద ఉంది .ఆ పుస్తకం ఆమెను ఎంతో మార్చింది .జరుగ బోయేదాన్ని వివరిస్తుంది ఆ గ్రంధం .సమస్య లతో వచ్చిన వాళ్లకు ఏ పుస్తకం కావాలో సూచిస్తుంది ఆమె. అది చదివి వాళ్ళు తమ మార్గాన్ని తెలుసుకొంటారు సమస్యకు పరిష్కారం పొందుతారు .రాస్ ఒక anthro pologist ‘’(మానవ శాస్త్ర వేత్త ) .ఆమె ఒక విద్యార్ధిని .ఇద్దరు చిల్ద్రెన్ ఆఫ్ గ్రేస్ చదవాలని అక్కడికి వస్తారు .ఇద్దరినీ సమాధాన పరచి తానే ఆ పుస్తకం చదివి వినిపిస్తుంది కోజీ .కోజీ తో బాటు ,వీళ్ళిద్దరూ కూడా జీవితం లో పెళ్ళిళ్ళ దెబ్బలు తిన్న వాళ్ళే .అందరి పూర్వ జీవితాలు తెలుసుకోవాలనే తాపత్రయం ఈ ఇద్దరినీ కలుపుతుంది .వాళ్ళ జీవితాలకొక సార్ధకత కల్పిస్తుంది కోజి ఆఫ్రికన్ అమెరికన్లు ఎలా సంభాషించుకొంటారో అచ్చం గా అలానే సంభాషణలు రాసింది రచయిత .

              ఈ నవలలో రచయిత్రి ఎన్నో జీవిత సత్యాలను చెబుతుంది అన్నిటిని పాత్రలతోనే చెప్పించింది .ఒక చోట ఒక స్లేవ్ ఓనర్ తన దగ్గర పని చేసే ‘’బెన్ ‘’అనే వాడు తన నల్ల జాతి వారి తిరుగు బాటు ను ముందే తెలుసుకొని యజమానికి తెలియ జేస్తాడు .వాడు దాన్ని అణచి వేసి ,వీడినీ వీడి పెళ్ళాలను ,పిల్లల్ని కూడా నిర్దాక్షిణ్యం గా చంపేస్తాడు అప్పుడు వాడు ‘’any body who will turn on their own is lower than a dog .some day that dog is gonna turn on you too ‘’అని జీవిత సత్యాన్ని చెప్పిస్తుంది రచయిత .రాస్ అంటాడు తమ స్వాతంత్రం భౌతికతకు మారి పోయింది దైవానికి ఆయన భావానికి దూరమై పోయింది అని .కోసినా ఈ ప్రేమికులతో ‘’you have been charged to set these families right .you have to teach the recipe of life .the key ingredient is love ‘’.’’అయోనా ,అనే అమ్మాయి’’ ,joe ‘’అనే అబ్బాయిల ప్రేమ కధే ఇది .ఈ కధయే వాళ్ళ తరతరాల గాధ.గా భావించి ఆదర్శవంతం గా భావిస్తారు .

             ఈ నవలలో రాస్ ఫీనా ల విడి విడి ప్రేమలు వాటి వైఫల్యాలు ,కోజీ ప్రేమ కద, అయోనా జోల ప్రేమ కద నాలుగు పేటలతో అల్లిన నవల .ఎక్కడా విసుగు అని పించదు .ప్రతి పాత్ర తన జీవితాన్ని తెరచిన పుస్తకం లా ఆవిష్కరించటం ఇందులో విశేషం .రచయిత్రి చిన్న అమ్మాయే . .కాని చాలా అనుభవం ఉన్న ప్రౌఢ లా రాసింది .తన జాతి ఋణం తీర్చుకోంది’’ a sparkling heart felt debut and a compelling read ‘’అన్న కొన్నీ బ్రిస్కో మాట నిజం .’’the story is about love ,the importance of understanding one’s history and the power of books ,and how they can influence your life ‘’అని పుస్తకం కవర్ పేజి మీద ఉన్న మాట సత్యమే .

             ఈ నవలలో కోజీ పాత్ర చాలా విశిష్టమైంది .అబ్బూరి రామ కృష్ణా రావు గారు ఆంద్ర విశ్వ విద్యాలయం లో లైబ్రేరియన్ గా ఉన్నప్పుడు శ్రీ శ్రీ,బూదరాజు ,ఆరుద్రా వగైరా రచయితలకు ఏ పుస్తకాలు చదవాలో ఏవి కొత్తగా విడుదల యాయో తెలియ జేసి చదివించే వారని వారి  మాటల వల్ల తెలుస్తుంది అలాగే కోజీ కూడా చేయటం మెచ్చ దగిన విషయం .ఇందులో సంభాణలే చాలా తమాషా గా ఉంటాయి .మనకు అంతా ‘’గ్రమాటికల్ మిస్టేక్స్ ‘’లా అని పిస్తాయి కాని అదే వాళ్ళ వాడుక భాష అని తెలిస్తే ఆశ్చర్య పడం .ఉదాహరణకు ‘’he say I his freedom .cause when he think of me he free in his head ‘’

                         కోజీ అనే షాప్ యజమానురాలు ఆ జంటకు అయోనా కదచెబుతూ ‘’her love and her love of her people needed were connected to a revolution that was already happening .it crossed generations and found its way to her.but this was not about her .it was about generations of people who needed to be set free ‘’She and Ross were simply a part of a large picture ‘’అన్న గొప్ప సందేశాన్నిచ్చి స్పూర్తి కలిగించటం విశేషం .

           అయోనా తన కద లో చివరికి తన సందేశాన్ని చాలా గొప్ప గా అంద జేస్తుంది తన జాతి వారంతా తరతరాలుగా బానిసలు గా బతుకు తున్నారని వాల్లన్దరికితీరని అన్యాయం జరిగి పోతూనే ఉందని అది అర్ధం చేసుకోవాలని ,పిల్లలను తీర్చి దిద్దుకొమ్మని ,సత్యాన్ని దర్శించమని యజమానులను అసహ్యించుకొని వారి లాగా అధికారాన్ని సంపాదించుకొని తల ఎత్తుకు తిరగాలని ,తమ కోసమే కాక ఇతరుల గురించి ఆలోచించి ముందుకు వెళ్లాలని తమ చరిత్రను ,మూలాలను అధ్యయనం చేయాలని ప్రేమతో ,క్షమా తో ఉండమని కాని దేన్నీ మర్చి పోవద్దని (forgive never forget )సందేశం ఇస్తుంది ‘’this is the Recipe of life ,,the road to freedom .Freedom just is not as strong as the ones on our mind.The only thing that can win over evil is love ..learn to love because we donot get time for nothing else .’’అదీఆమే ప్రేమ సందేశం త్యాగ సందేశం ఆదర్శ గీతం విముక్తి గీతం .

       అయోనా ను హాన్ బాయ్ అనే యజమాని కొడుకు మళ్ళీ మళ్ళీ ‘’రేప్’’ చేస్తాడు .ఈమెను జో ప్రేమిస్తాడు .డబ్బు కట్టి ఈమెను బానిసత్వం నుండి విముక్తి చేస్తాడు .హన్ ,వాడి మనుషులు గేలి చేస్తూ నవ్వుతో నుంటారు .అప్పుడు జో బిగ్గరగా ‘’iona I own her ‘’అంటూ పదే పదే సంతృప్తిగా సంతోషం గా అంటాడు .అంతటి ప్రేమ అతనిది .ఆ అమర ప్రేమ నే కద గా తీసుకొని ఆద్యంతం ప్రేరణ నిచ్చే నవల గా మార్చింది రచయిత బెర్సి’’రిడెంప్షన్ సాంగ్’’ నిజం గా నే కమ్మని పాటలా సాగింది .కర్తవ్య బోధ చేసింది జాతి విముక్తికి మార్గం చూపింది .నల్ల జాతి వారికి ‘’విముక్తి గీతం‘’అయి తర తరాలను ప్రభావితం చేసింది .

    రచయిత గురించి పరిచయం -బెర్తిస్ బెర్రీ 1906 లో అమెరికాలో జన్మించింది .దిల్వారే లోని విల్లింగ్ తన లో పెరిగింది ..ఫ్లారిడా లోని జాక్సన్ యూని వర్సిటి లో గ్రాడ్యుయేషన్ చేసింది .ఒహాయో లోని కెంట్ వర్సిటి నుండి సోషియాలజీ లో పి.హెచ్.డి ని 26 ఏళ్ళకే సాధించింది  ”i am on my way .But yout foot is on my head ” వంటి నవలలు రాసింది .ప్రస్తుతం జార్జియా లోని సవన్నా లో భర్త తో ఉంటోంది” .రిడెంప్షన్  సాంగ్” తో గొప్ప పేరొచ్చింది .

              మొదటి సారి అమెరికా వెళ్ళినప్పుడు చదివిన ఈ నవల గురించి 28-7-2002 సోమ వారం నా డైరీ లో రాసుకొన్న విషయాలు మీ కోసం అందించాను .

                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24-4-13- ఉయ్యూరు 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.