చినుకు నవమ సంతానం –1

 చినుకు నవమ సంతానం –1

              శ్రీ నండూరి రాజ గోపాల్ గారి మానస పు( ప)త్రిక ‘’చినుకు’’ ఎనిమిది ఏళ్ళు పూర్తీ చేసుకొని తొమ్మిదవ ఏట ప్రవేశించిన సందర్భం గా తొమ్మిదవ జన్మ దిన ప్రత్యెక సంచికను ఎంతో అందం గా , ఆకర్షణీయం గా ,సర్వాంగ సుందరం గా తీర్చిదిద్ది ,చందాదారులకు ప్రత్యేకం గా కొరియర్ లో పంపే జాగ్రత్త తీసుకొని అందజేశారు. అభినంద నీయం .’’అష్ట వర్షా భవేత్ కన్యా’’అన్న దానికి తగినట్లు పత్రిక కన్య రూపం దాల్చింది .అదే ముఖ చిత్రం గా శ్రీ ఉదయ్ వేసినట్లుంది .వసంతం లో శృంగార భావాల జల్లుగా కురిసినట్లనని పించింది .200 పేజీల బృహత్ ఉగాది వసంత కానుక అందర్నీ అలరిస్తుంది సంపాదకీయం కాక 21  కధలు ,ఎనిమిది వ్యాసాలూ ,ఆరు సమీక్షలు ,17  ,కవితలు ,తో బాటు సాహిత్య విహారం ,ఆలోచన ,ఆవేదనా ,వేషం ,సమాచారం ,పరిచయం పొరుగు సాహిత్యం ,వినబడని రాగం ,సందర్భం ,ప్రశ్న ,ఆట విడుపు ,నివాళి శీర్షికలు ,మధ్యలో 16  కొంటె బొమ్మల బాపు కళాత్మకాలు అయిదు చిత్త్రాల విచిత్రాలు , శ్రీ పినాక పాణి గారితో ‘’పన్నాల భట్టీయం ‘’అనే ముఖాముఖం దేనికదే ఒక విందు భోజనం .కమ్మగా రుచి కరం గా ,ఆరోగ్య వంతం గా భాషా సాంస్కృతిక నేపధ్యం గా ,రూపు కట్టిన ప్రత్యెక సంచిక ఇది .నేను అమెరికా నుంచి కిందటేడాది అక్టోబర్ లో వచ్చాను .అప్పటి నుండి చినుకు ను తిరగేయతమే కాని పూర్తిగా చదవలేదు చదవాలనీ అని పించలేదు .కారణం పీఠాదిపతుల చేతుల్లో గిల గిల లాది నట్లు అని పించటమే .ఈ విషయం ఆ మధ్య ఎప్పుడో అసోసియేట్ ఎడిటర్ శ్రీ లంకె జనార్దన్ కు చెప్పినట్లు జ్ఞాపకం ..ఈ సారి నిన్నల్లా కూర్చుని పట్టు బట్టి చదివాను .మహదానందం గా ఉంది అందుకే ఈ అభినందన .

             సంపాదకీయం లో నండూరి ‘’మంచి పత్రికలు మనదైన ప్రత్యేకతలను పదిల పరుస్తాయని ,మనదైన చిరునామాని కాలం పై నమోదు చేస్తాయని ,మన ఆశలని ,ఆకాంక్షలని ఆనందాలని ఆవేదనలని ఎప్పటి కప్పుడు స్వీకరించి విశద పరిచి ఒదారుస్తాయని మరీ కదల లేని నిస్సహాయత లో ఉన్నప్పుడు మన గతం లోని అమృత క్షణాలను మోసుకొచ్చి మనపై పన్నీరు లా చిలకరిస్తాయని ,వర్తమానం లోను ఏదో ఒక మెలకువ తో మన భుజం తడతాయని మనం జీవంతో ఉండటానికి ,జీవించి ఉండటానికి కాణమౌతాయని మన ఆలోచనలు వికశించటానికి ,అడుగులు విస్తరిం చ టానికి దోహదపడి మనకో మంచి ‘’రేపు ‘’ని అందించటానికి ప్రయత్నిస్తాయని’’ కవితా ధోరణి లో తన మనో భావాలను ఆవిష్కరించి ,ఈ పత్రికను ఆ గాడిలో నడిపిస్తున్నారు .నడిపిస్తూనే ఉండాలని మనమందరం కోరుకొందాం .

                  ఈ సంచిక లో నాకు అత్యంత ఆకర్షణీయం గా,మానసును కుదిపేసి నట్లున్న రచన శ్రీమతి జగద్దాత్రి రాసిన ‘’మౌనించిన వసంతం ‘’.ఆమె రచన ఒక కవితా సెలయేరులా ప్రవహించింది పండిట్ రవి శంకర్ మొదటి భార్య శ్రీ మతి అన్నపూర్ణ  గారి ‘’వినబడని రాగం ‘’ను అద్భుతం గా ఆవిష్కరించటం .అన్నీ ఉన్నా సంగీత సరస్వతి అని పించుకొన్నా ఎంతో మంది ఉత్త్తమ కళాకారులను తయారు చేసి అందించినా ఆమె మౌనించిన  సంగీత సరస్వతి గానే ఉండి పోవటం ఆమెకు ఆమె వేసుకొన్న శిక్ష .ఈ లోకాన్ని త్యజించిన తాపసి అంటుంది జగద్ధాత్రి .

          అన్నపూర్ణ భారత దేశం గర్వించే ‘’సుర్ బహార్ ‘’విద్వాం శురాలు బాబాఆలుద్దీన్ ఖాన్ గారాల పట్టి .రోషనార అని లాంచనం గా ముస్లిం పేరు పెట్టినా కాశీ అన్నపూర్ణఅనే పేరుతోనే ప్రసిద్ధి చెందింది . పెట్టాడు తండ్రి ఆమెకు ఆమె పద్నాలుగో ఏట ఒక దుర్ముహుర్తన రవి శంకర్ ఆమె జీవితం లో ప్రవేశించాడు .తండ్రికి శిష్యుడై తన మనసు దోచాడు వివాహం అయింది కొడుకు పుట్టాడు .ఆమెకు ప్రాచీన వాయిద్యం ‘’సుర్ బహార్ ‘’అంటే ‘’స్వర వసంతం ‘’.కస్టమైనదీ ఆమెకిస్టమైనదీ .. రవి లాంటి ‘’భ్రమర ప్రేమికుడి’’ దెబ్బకు తట్టుకోలేక పోయింది .ఆమె ను అవమాన పరచాడు దొరికిన ప్రతి వారితోను కులికాడు .సితార్ పండిట్ .ఏమీ చేయలేక ‘’మౌన ప్రతిఘట’’నే ఆమె చేసింది .అది ఆమె బలహీనత గా భావించాడు .కొడుకును సంగీతం లో తీర్చి దిద్దదామనుకొంటే అతడు తండ్రి చాటు చేరి చిత్రకళనేర్చి తండ్రికి దూరమై ఒంటరి జీవితం తో విఫల వివాహం తో డిప్రెషన్ పాలై రాలిపోయాడు .భర్త తో ఎడబాటు, కొడుకు తప్పటడుగులు ఆమెను  కుంగదీసినా ఆమె సంగీతాన్ని సుర్ బహార్ ను మాత్రం శ్వాస గా చేసుకొని జీవించింది

           ప్రముఖ ఫ్లూట్ విద్వాంశుడు   పండిట్ హరిప్రసాద్ చౌరాశియా అన్నపూర్ణ విద్వత్ ను విని ఆమె సాధనకు అబ్బుర పడ్డాడు .తానామే వద్ద ఎంతో నేర్చుకోన్నానని ,ఆమె ‘’మౌన సాధిక ‘’అని చెప్పాడు శిష్యుడై పోయాడు రుషి అనే మరో శిష్యుడిని తీర్చి దిద్ది  అతన్ని వివాహం చేసు కొంది అన్నపూర్ణ .అయినా ఆమె లో ‘’వసంతం హసించలేదు ‘’.ఎవరితోనూ మాట్లాడదు .తానూ తన సంగీత సాధనకే పరిమిత మై పోయిన యోగిని అయింది .’’మనుషులతో కలవడం కన్నా ఒంటరితనం శాంతి గా ఉంటుంది ‘’అని చెప్పుతుంది .మనుషులు ద్వంద్వ స్వభావం తో ఉంటారని తనముందు మాట్లాడేది ఒకటి బయట కొచ్చి చెప్పేదొకటి అని తెలుసుకోన్నానని  అంటుంది

             గురు పౌర్ణమి రోజున ఆమె శిక్షణ పొందిన శిష్యులంతా వచ్చి చేరుతారు అందరిని ఆప్యాయం గా పలకరిస్తుంది కాని బయటికి రాదు అన్నపూర్ణ .ఆమె మనసులో బడబాగ్నిని అర్ధం చేసుకొన్న వారు లేరు ఆమె ఒక దుఃఖ సాగరం .సంగీతానికి ఎంతో శక్తి ఉందని తాను వివశమై రాత్రిళ్ళు పాడుతు సాధన చేస్తుంటే కమ్మని వాసనలు వేస్తాయని ,ఎవరో తన చుట్టూ ఉండి విన్నట్లుఅనుభూతికి లోనౌతానని  చెబుతుంది అది ఆమెకే అనుభవైక వేద్యం అన్న పూర్ణ ఒక స్త్రీ మూర్తికాదు .ఒక కళా సాగరం .అందులో రవిశంకర్, కొడుకు సుఖేంద్ర ,అతని కొడుకు, రవి శంకర్ పెళ్ళాడిన కమల ,తండ్రిబాబా ,అన్న ఆలీ ,రుషీ అందరు నదులై ప్రవహించి కాలం లో కలిసి పోయిన వారే ‘’అంటుంది రచయిత్రి జగద్ధాత్రి ..అన్నపూర్ణ జీవితం లోని అవతలి కోణాన్ని ఆవిష్కరించిన వాడు ‘’స్వపన్ కుమార్ బంద్యో పాధ్యాయ ‘’ఆమె పై కస్టపడి ఇంటర్వ్యు చేసి ‘’’’An un heard melody Annapurna ‘’పుస్తకాన్ని 2005 లో ప్రచురించాడు .అతనికి మనం రుణ పడి ఉన్నాం అంటుంది రచయిత్రి .70 ఏళ్ళు దాటినా అన్నపూర్ణ  దిన చర్యలో మార్పు లేదు .ఆమె చిన్న ఇల్లు ,సుర్ బహార్ ,ఆమె వేసే గింజలకోసం వచ్చే వందలాది పావురాలు అదే ఆమె జీవిత సర్వస్వం అదే ఆమె కు శాంతినిచ్చే జీవనం .

               జగద్దాత్రికి అన్నపూర్ణ పేరెత్తితే పరవశం .ఆమె లో కవితా ఝారి ఒడ్లు తెంచుక ప్రవహిస్తుంది .అందుకే అన్నపూర్ణను ‘’అనంత రాగ మేఘం ,వసంత గర్జన ,నిశ్శబ్ద ఘీంకారం ,మౌన ఓంకారం .జీవనపు పలు రాగాలను అత్యంత రమణీయం గా ,కర్ణ పేయం గా పలికించగల అపర సరస్వతి .ఆమె అనంత రాగాల మాలిక .సాగరుడే శృతి వేయగా ,ప్రకృతియే విశ్వ శ్రోతగా ,ఆమె దివ్య గానం ఒక తపస్సుగా ,ఒక యోగం లా ,ఒక యజ్ఞం లా అలా  అనంతం గా  సాగిపోతూనే ఉంటుంది ‘’అని తానూ రాగ ఝరి గా ,ఆరాధనా లహరిగా పొంగిపోతుంది .అన్నపూర్ణ ను పరిచయం చేసిన స్వపన్ ,ను, దాని ఆధారం గా ‘’చినుకు ‘’లో చిలికించిన జగద్ధాత్రి ని ,దాన్ని ఆనందం తో ముద్రించిన నండూరి రాజ గోపాల్ అందరు ప్రత్యేకం గా అభినందనీయులు .

                ఈ సంచిక లోని మరిన్ని వివరాలు మళ్ళీ అందిస్తాను

                 మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –25-4-13- ఉయ్యూరు

    

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

One Response to చినుకు నవమ సంతానం –1

  1. TVS SASTRY అంటున్నారు:

    రచయితలే పాఠకులుగా మిగిలిపోతున్న ఈ రోజుల్లో పత్రికాధిపతులు రచయితల ఉత్తరాలకు సమాధానాలు చెప్పరు. ఈమధ్యనే ‘ఆశ’ అనే చిన్న పత్రిక మూసివేసారు. దానికి ముఖ్య కారణం,పత్రికలవారి నిర్లక్ష వైఖరే ! మిగిలిన పత్రికల వారు దీనినొక గుణపాఠంగా తీసుకొని రచయితలను సముచితరీతిలో గౌరవిస్తే,పదికాలాలపాటు చిన్న పత్రికలు బతుకుతాయి!

    టీవీయస్.శాస్త్రి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.