చినుకు నవ వసంత సంచిక– 2 కధా విషయం

    చినుకు నవ వసంత సంచిక— 2

                            కధా విషయం

         చినుకు పత్రిక అనగానే కధలకు అగ్ర తాంబూలం అని అందరికి తెలుసు .ఇందులో కేంద్ర సాహిత్య బహుమతిని ఇటీవలే పొందిన శ్రీ పెద్ది భొట్ల సుబ్బరామయ్య గారి కదతో ప్రారంభించారు .ఆంగ్లో ఇండియన్ల దయనీయ స్తితిని ఇంగ్లీష్ సరిగ్గా రాక వారు పడే ఇబ్బందుల్ని ,ఏదో ఒక కళా శాలలో ఆంగ్లో పాద్యాయిని గా చేరితే అక్కడి .పి.డి.పిడికిట్లో నలిగిన ఆమె జీవితాన్ని ‘’చీకటి లో కరగిన బొమ్మ ‘’కద లో అద్భుతం గా ఆవిష్కరించారు .ఆ వ్యాయామం వాడు ‘’శిష్నోదర పరాయణుడు ‘’అని తేల్చారు .ఆమె ఈ దీన గాధను రచయితకు చెప్పుకొనిఆయన ఉండమన్నా ఉండకుండా ‘’కాశీకి వెళ్లాలని అక్కడి దేవుణ్ణి కొన్ని ప్రశ్నలు అడగాలని ‘’చెప్పి వెళ్లి పోతుంది .సుబ్బరామయ్య గారు   సాంఘిక అంశాలను  ఆధ్యాత్మికామ్శాలను  భలే గా ముడేస్తారని మరో సారి రుజువు చేశారు .వీరి కధతో బోణీ చేయటం చాలా సముచితం గా ఉంది .

          జి.లక్ష్మి కద ‘’ఓ అనామక డైరీ ‘’లో భార్య మన వంక చూపుకు ఒక అర్ధం ఉంటుందని అది అప్పుడు తెలియదని చెబుతుంది .భార్య స్వంత ఆస్తి అనుకోటం పొరబాటని అంటుంది ‘’బయట మిమ్మల్ని అందరు దేవుడని జెంటిల్మన్ అని అంటారు .మీ భార్య మాత్రం అనలేదు . ఒకళ్ళకు మంచి అయింది వేరొకరికి మంచి ఎందుకు కాక పోయిందో మీకు తెలియదు ‘’అని రచయిత్రి మెత్తని చీపురు తో మగాళ్ళని వాయిస్తుంది .న్యూటన్ మూడో చలన సూత్రం అన్నిటికి అన్వయిస్తుందని ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుందని దాన్ని జీవితానికి ఎలా అన్వ యించుకోవాలావు తెలియాలని తెలియని నిర్లక్షం భార్య ఎక్కడికీ పోదు అనే మొండితన జీవితాలను, దాంపత్యాన్ని అఘాధం లోకి నెడుతాయని మంచి సూచన ఉందీ కద లో ..చిలీ దేశపు కధకు పి సత్య వతి ‘’చెట్టు ‘’పేర అనువదించిన కధ లో భార్య కు అనురాగం ప్రేమ ,విహారాలు కావాలని లేట్ గా తెలుసుకోంది.అట్టాడ అప్పలనాయుడు కద ‘’అండ గత్తేలు ‘’ఉత్తరాంధ్ర లో సెజ్ల భాగోతం పల్లె వదిలి పట్నాలు చేరటం .’’అపుడు బతుకు మమ్మల్ని తగిలీసింది . .ఇప్పుడు అందంమమ్మల్ని పట్నం నుండి తగిలేస్తది మా మేనత్త మాత్రం ఊరొదిలి రానంది .అక్కడే సావో రేవో అనీసింది ‘’ఇలాంటి ఎన్నో కధలు ఎన్నో నాయుడు రాసి మెప్పించారని మనకు తెలుసు .పసుమర్తి పద్మజా రాణి కద ‘’ఒక ఆకు పచ్చదనం కోసం ‘’లో పల్లె టూరి సౌభాగ్య గరిమ కనీ పిస్తుంది ‘’ఇంత మంచి పల్లెల్ని కోల్పోతే మన మొహాల్ని మనం కోల్పోయిన వాళ్ళమే అవుతాం ‘’అని చెప్పిస్తుంది .రేపటి తరానికి మనం ఇవ్వాల్సింది కాలుష్యం ,కేన్సరు  కాదు పల్లెల్లాంటి ఒక ఆకూ పచ్చ ని బహుమతి ని అని ప్రబోధం కద లో ఉంది .పాపినేని కధలో ‘’జీవితం ఒక సుదీర్ఘ అన్వేషణ ,ప్రపంచం తో ఏ విధం గ సంబంధం పెట్టుకొవాలో ,అనంత విశ్వాత్మ తో ఎలా సంభాషించాలో దానికోసం ఏ దారి లో ప్రయానిన్చాలో తెలుసుకో గోరె యువకుని గమనం .

          ప్రముఖ కధకుడు కాటూరి రవీంద్ర త్రివిక్రమ్’’అరణ్యం ‘’కద లో మానవత్వ పరిమళం కనీ పిస్తుంది .’’మంచితనం మల్లె చెట్టు కొమ్మలు విరిచినా మళ్ళీ ఆశగా కొమ్మలు వేస్తుంది మల్లెలు పూయించి పరిమళాలు వేదజల్లుతుండి అనే సామాజిక స్పృహ ఉంది .’’సంధ్య ‘’అనే కధలోగంటేల గౌరు నాయుడు ఉద్యోగం చేసే మహిళ సర్టి ఫికెట్లు లాగేసి ఆమెను లోబరచుకోవాలనే మ్రుగాడు వాడి ఆటవిక చేష్టలు వాడి నుండి తప్పించుకు పోదామని ప్రయత్నిస్తే ఎదురు చూసిన మనిషే తిరిగి వచ్చి నట్టయింది ‘’ఆమె తొలి సంధ్యయే .ఇక ముందు అంతా వెలుగే ‘’అంటాడు సాయం సంధ్య ప్రయాణం చీకట్లో అయినా తోలి సంధ్య అయిన్దామెకు చివరికి .ప్రముఖ కధకుడు, విశ్లేషకుడు విహారి రాసిన ‘’అటు చూస్తె వెలుగు ‘’లో కర్తవ్య బోధ ఉంది ‘’వారం లో మిగిలిన రోజులన్నీ వారాంతానికి సహకార హస్తాలవుతాయి ‘’అన్న నిజం కని పిస్తుంది .

          మొగులు కమలా కాంత్ ‘’చైతన్యం ‘’లో సత్సంప్రదాయాలను .విశ్వాసాలనుగౌరవించాలని చెప్పిన‘’చైతన్య ‘’ను సంప్రాదాయ పద్ధతిలో పెళ్లి చేసుకొని అందరి కి తమ తో బాటు ఆనందాన్ని పంచిన జంట కద బాగుంది ‘’జంతు నీతి ‘’కధలో చిలుకూరి దేవపుత్ర మనుషులకంటే ఆటవిక జంతువులకే సంస్కారం, మర్యాదా, మన్ననలు ఎక్కువ ఉన్నట్లు చెప్పాడు స్కై బాబా రాసిన ‘’జమీలా ‘’’’అడుగు ముందుకు వెయ్యి .దారి అదే విచ్చుకొంటుంది ‘’అన్నీ కోల్పోయినప్పుడు కూడా జీరో బెసేడ్ స్థాయి నుంచి మళ్ళీ  జిందగీని శురూ చేయచ్చు ‘’అనే ఆత్మ స్స్థైర్యం ఉంది .ఈ సంచికలో చివరి కద సుంకోజి దేవేంద్రా చారి రాసిన ‘’చిట్ట చివరి కద ‘’ఇందులో ‘’ఆకలి విశ్వవ్యాప్తం గురించి అన్ని రంగాల్లో దాని విషకోరల గురించి ప్రస్తావన ఉంది .’’ఆకలి కోరల్లో చిక్కుకొని విప్పదీసుకొనే ప్రయత్నం లో మరిన్ని చిక్కు ముడులు వేసుకొంటూ తమకు తామే బందీలుగా మనుష్యులు మారుతున్నారు .అందుకే ఇంకోర్ని గురించి పట్టించుకోలేక పోతున్నారు ఉచ్వాస నిస్శ్వాసాలు కూడా పక్కవాడికి తెలియని స్తితి .ఎవడి బాధ వాడిదే ఎవడి గధ వాడిదే ..ప్రతి గొప్ప పనికి ఒక ప్రారంభం ఉంటుంది .దానికే చరిత్రలో స్తానం .ముగింపు ఎప్పుడూ విషాదమే నా కధే చివరిది .నేనే ముగింపు కాకూడదు ‘’అనే తాత్విక భావ వ్యాప్తి .

              21 కధలకు స్థానం కల్పించి  ,కొత్త వారికి ,పాత వారికి అవకాశం కల్పించింది చినుకు ..

                    చిత్ర విచిత్రాలు

          కే.ఏం.వి.చూపించిన సినీ చిత్ర విచిత్రాలు అయిదు .ఇందులో కొన్ని ఇదివరకు ఏదో ఒక పత్రికలో వచ్చినవే లేక రావి కొండల రావు వ్యాఖ్యనిన్చినవే అందులో ముఖ్యం గా ‘’మల్లీశ్వరి ‘’సినిమా కదగురించి అది బుచ్చి బాబు రాసిన నాటకం ‘’రాయల వారి కరుణా కృత్యం ‘’బి.యెన్.రెడ్డి గారికి ఇది నచ్చి కధను అందం గా రాసుకొని కృష్ణ శాస్త్రీయం చేయించి న భూతో గా తీర్చి దిద్దితే రసాలూరు సాలూరు బాణీలు ఘంట సాల మేస్టారి గాన లహరి భానుమతి కల కూజితాలు విరహ పరాకాష్ట  గా నిలిచి క్లాసిక్ ని చేసి నిత్య నూతనం చేశారు .

              విజయా వారి మాటల మాంత్రికుడు పాటల సృష్టికర్త పింగళి నాగేంద్ర రావు గారు ఆఖరి దశలో కేన్సర్ బారి పడి మందులకు డబ్బులు లేక ఆరుద్రను తన దగ్గరున్న అమూల్యమైన పుస్తకాలను అమ్మి పెట్టమని కోరటం మనకు తెలిసి నప్పుడు మనసు గిల గిల లాడిపోతుంది నవ్వులు పూయించిన మహా రచయితకు ఇన్ని కష్టాలా అని పిస్తుంది విధి అంతే .

      ‘’మనిషి రోడ్డున పడ్డాడు ‘’సినిమా తీసిన పుణ్య మూర్తుల రాజ బాబు చేయని దానం లేదు ధర్మ లేదు తన పుట్టిన రోజు నాడు తను ఇంత ఎదగ టానికి కారణమైన వారికి సన్మానం చేసి తృప్తి చెందేవాడు విపరీతమైన తాగుడుతో జీవితాన్ని నరక ప్రాయం చేసుకొన్నాడు అయితేనేం అతని ఇంటి పేరు పుణ్య మూర్తులు కావటం చేసిన వన్నీ పుణ్య కార్యాలు కావటం వాళ్ళ భార్య ఇద్దరు కొడుకులు మంచి పొజిషన్ లో అమెరికా లో ఉన్నారన్న సంగతి తెలిసి మహదానందం కలుగుతుంది మనకు .

              సకల కళా సరస్వతి భానుమతి తన మొదటి కద కు ఆంద్ర పత్రిక ఇరవై , రూపాయలు పారితోషికం గా పంపితే మహద్భాగ్యం గా స్వీకరించి అత్తగారికి సైను పంచ ,తాను జాకెట్టు కొనుక్కొని భర్తకు కర్చీఫ్ ,కొడుకు భరణికి పిప్పరమెంట్లు కొని సంతృప్తి చెందానని ఆంద్ర పత్రిక ఆఫీసుకు ఫోన్ చేసి మరీ చెప్పిందట ఆమె తీసుకొంటుందో తిడుతుందో అని భయ పడ్డ వాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకోన్నారట .దటీజ్ పద్మశ్రీ అంటారు కే.ఏం.వి.

      తెలుగులో వచ్చిన ‘’చంటి ‘’సినిమా ‘’చిన్న తంబి ‘’అనే తమిళ చిత్ర కదా .అందులో ప్రభు కుష్బు జంట .తెలుగులో వెంకటేష్ మీనా .రెండు చోట్లా కనక వర్షమే కురిసింది .దాని దర్శకుడు పి.వాసు దీనికి రవి రాజా పిని శెట్టి సంగీతం లయ రాజా ఇలయ రాజా .కన్నడం లో దీన్ని’’ రామా చారి ‘’పేరుతో తీస్తే అక్కడా సూపర్ హిట్టే హంసలేఖ సంగీతం. ఇలయ రాజా బాణీల ఓణీలు వేసుకోకండా స్వీయ బాణీలతో జన రంజకం చేయటం ఇప్పటికి ఆమె స్వరపరచిన పాటలకు మంచి పేరున్డటం ఆనందించ దగ్గ విషయం .రామానాయుడు చంటి ని ‘’అనాడి ‘’గా హిందీ లో వెంకటేష్ కరిష్మా లతో తీసి హిట్ కొట్టాడు వెంకీ కి మొదటి హిందీ పిక్చరిది .ఇదంతా మనకు కాలక్షేపం బటానీలు మిర్చీ మసాలా .

              మిగిలిన కవిత్వం సమీక్షలు ఇంటర్వ్యులగురించిన  విషయాలు మళ్ళీ రాస్తాను

                మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –26-4-13- ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.