క్వయట్ లైఫ్ (ప్రశాంత జీవితం )
‘’కంజబూరో ఓయీ ‘’అనే జపాన్ రచయిత రాసిన ననవల ‘’quiet life ‘.1994 లో నోబెల్ ప్రైజ్ పొందిన రచయిత .టోక్యో నగర నివాసి .ఫ్రెంచ్ సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేశాడు .నవలలు కధలు ,విమర్శలు రాశాడు ఈయన రాసిన ‘’I ‘’అనే కధకు మొదటి సారిగా బహుమతి వచ్చింది .personal matter ,the secret story, nip and bads ‘’మొదలైన రచనలు చేశాడు .భార్యా ముగ్గురు పిల్లలతో టోక్యో లో కాపురం .అమెరికా కు విజిటింగ్ ప్రొఫెసర్ గా వెళ్లి వస్తూంటాడు
ఓయీ ను చాలా ఉన్నత భావాలున్న ఉత్తమ రచయిత గా పేర్కొంటారు .తన జీవితం లోని అతి ముఖ్య సంఘటనలను కల్పనా సామర్ధ్యం తో అద్భుతం గా ఆవిష్కరిస్తాడు .అతని రచనలు మిగిలిన వారిపై గోప్పప్రభావాన్ని కల్గించాయి .ఈ నవల అంతా ఆయన కుటుంబ గాధయే .కాని అత్యద్భుత నారేషన్ గా దీన్ని అందరు గుర్తించారు .ఆయన కూతురు ‘’మాచాన్ ‘’ఇరవై ఏళ్ళ అమ్మాయి .తండ్రి గొప్ప నవలా కారుడు కాని అన్న’’ మెంటల్లి హాండి కేపేడ్ ‘’.అయినా అతనికి సంగీతం లో మంచి ప్రవేశం ఉంది .తల్లి మాత్రం భర్త ,కొడుకు ల జీవితాల చుట్టూ అల్లుకు పోయి ఉంటుంది .తమ్ముడు ,ఈమె ఆ బంధాన్ని అర్ధం చేసుకో గలరు .తండ్రి కాలి ఫోర్నియా కు విజిటింగ్ ప్రొఫెసర్ గా వెళ్లి ఆరు నెలలు ఉండాల్సి వస్తుంది .తండ్రి మనస్తత్వం తెలిసిన తల్లి అతని తో వెళ్తుంది .ఇక ఈమె ఇంటిని చక్క్క దిద్దాలి .జపాన్ భాషలో తండ్రిని కేచాన్ అని తల్లిని ఓ చాన్ అని అంటారు .
ఈ పరిస్తితులలలో ఆ పిల్ల తండ్రి డిప్రెషన్ కు లోనవటం అన్నగా ఉండాల్సిన అన్న తమ్ముడిగా ప్రవర్తించటం వాళ్ళ మనస్తత్వాలను అర్ధం చేసుకొని తను రోజూ చేసే పనిని ‘’హోమ్ డైరీ’’ గా రాస్తుంది .అదే ఈ నవల .దానికే రచయిత ‘’క్వయట్ లైఫ్ అని పేరు పెట్టాడు .కధను రచయిత రాసినా ,ఒక ఆడపిల్ల చెబుతున్నట్లు రాయటం వల్ల ఎడ్క్కడా రచయిత మనకు కని పించడు .ఆమె మనసులోంచే కదా భావాలు ,కధనం అన్నీ గొప్ప గా వస్తాయి .ఈ నేర్పు అంతా కుంజ బోరో గొప్పతనమే మానసిక స్తితిని అన్ని కోణాల్లోనూ ,సామాజిక ,ఆర్ధిక పరంగాను విశ్లేషణ చేశాడు రచయిత .మానసిక ప్రవ్రుత్తులే క్రియా జనకాలుగా పని చేస్తాయి .ఒకరి నుండి ఇంకొకరు ప్రేరణ పొందటం ,కుటుంబ బంధాలు ,ఆప్యాయతలు ,అనురాగాలు ,ఆదరణలు ,నాయనమ్మ ,అత్తయ్యల ప్రేమాను రాగాలు అన్నీ గొప్పగా దర్శన మిస్తాయి .అత్త భర్త మరణాన్ని అతి సహజం గా చూపాడు .ఎవరికి వారు తమ పరిధిలో ఎలా కర్తవ్య పాలన చేయాలో ఆచరణాత్మకం గా చూపించిన ఒక కుటుంబ కదా నవల .స్వీయమే అయినా సామాజిక చిత్రణ పరమ రమణీయం .గొప్ప మనసున్న రచయితలు ఒక దేశానికే పరిమితం కారు .అన్నది అసలైన సత్యం .ఓయీ కి నోబెల్ రావటం అందరు హర్షించ దగిన విషయం .ఇప్పటికి నేను నలుగురు నోబెల్ విన్నర్ల రచనలు చదివే అదృష్ట వంతుడినయ్యాను .ఈ నవల ను ఎక్కడా ఒక్క వాక్యం ,పదం అక్షరం కూడా వదలకుండా అత్యంత శ్రద్ధ తో చదివాను కాదు నవల చదివించింది అదీ కాదు రచయిత అలా రాసి చదివించాడు .
ఈ అమ్మాయి తండ్రి ఊరిలోలేనప్పుడు అన్నను స్విమ్మింగ్ కోర్సు లో చేర్పిస్తుంది .వాడు అందులో గొప్ప గా రాణిస్తాడు .ఎందుకు చేర్పించింది అంటే ‘’to kill the body ‘’.తమ్ముడినిప్రోత్సహించి యూని వెర్సిటి లో అడ్మిషన్ పొందేట్లుచేస్తుంది .తాను చేస్తున్న ప్రతి విషయాన్ని తలిదండ్రులకు తెలియ జేస్తూ ఉంటుంది .వాళ్ళు సమాధానాలు రాస్తూంటారు .అంటే ఎక్కడా ఎవరూ ఎవరిని విడిచి ఉండనట్లే కని పిస్తారు .తాను ఫ్రెంచ్ రచయిత celine ‘’పై పరిశోధన చేస్తూ ఉంటుంది .వీళ్ళకు వీళ్ళ నాన్న స్నేహితుడు‘’షిజేతో’’,ఆతని భార్య కుటుంబ స్నేహితులు గా తరచూ వచ్చి అజ కనుక్కొంటారు అన్నకు ఆయన సంగీత గురువు కూడా .వీళ్ళ కస్టసుఖాల్లో చేదోడు వాదోడు గా ఉంటారు .తండ్రికి ఉన్న ‘’insomnia ‘’ను అర్ధం చేసుకొన్నది .అతనికి ఏ ఇబ్బందీ రాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తుంది .
మానసికం గా కున్గిపోయే వారికి ,మానసిక వికలాంగులకు వాళ్ళ ఇళ్ళల్లో ప్రశాంత జీవితం ఉంటె ఎంత పరమ ప్రశాంత జీవితం అనుభ వించ గలరో ,ఆ దిశలో మనమంతా ఎలా స్పందించాలో తెలియ జెప్పే మానవీయ కోణం ఉన్న ప్రయోగాత్మక నవల క్వయట్ లైఫ్ .అంతా ‘’అండర్ కరెంటు ‘’గా ఉంటుంది. అదీ ప్రత్యేకత .ఎక్కడా సందేశం ఉండదు .అర్ధం చేసుకోవాలి అంతే .ఇందులో abandoned children ‘’గురించిన చర్చ ఉంది ఈమె అన్న ఆ చర్చలో బాగా పాల్గొంటాడు .తన తీర్పును చాలా సహజం గా ఇస్తాడు .’’the intellect of man is forced to choose –perfection of life or of the work and if it take the second must refuse –a heavenly mansion ragging in the dark ‘’అన్న బైబిల్ వాక్యం పై జరిగిన చర్చలో ఈమె అన్న పాల్గొన్నాడు
ఒక సారి తల్లి ‘’ our marriage was a mistake and that is why an accused child was born ‘’ అని బాధ పడుతుంది పెద్ద కొడుకు ను చూసి .జపాన్ భాష లో ‘’ eeyore ‘’అంటే ‘’.pesimistic donkey ‘’అని పేరు తండ్రి కొడుకుని ఇదే పేరుతో పిలిచే వాడు వాడికిస్టం లేక పోయినా అదే అలవాటై పోయింది పాపం ‘’.ma chan ‘’అంటే గుండ్రని చిన్న తలకాయ ఉన్న అమ్మాయి .celine అనే ఫ్రెంచ్ రచయిత ‘’అబాన్దనేడ్ చిల్ద్రెన్ ‘’ని ‘’our little idiots ‘’అనే వాడట .ఇందులో అమ్మాయిని అందరు ‘’మా చాన్ ‘’అనే పిలుస్తారు మన భాషలో చిట్టి తల్లి లాంటి పేరు .సెలైన్ ను చదివిన ఈమెకు ‘’I have some idea of what it takes to enter the world of children with handicapped ‘’అని పించి కార్య రంగం లోకి దూకింది .సెలైన్ చాలా సీరియస్ గా ఉండే ఈ సబ్జెక్ట్ ను చాలా సులభం గా సూటిగా రాశాడని ఆమె భావించింది .
ఈ నవల చదివితే మన గోపీచంద్ ,బుచ్చి బాబు నవలలు గుర్తుకొస్తాయి .మానవ మనస్తత్వానికి అద్దం పట్టి అర్ధం చెప్పిన మనో జిజ్ఞాన శాస్త్రపు విశ్లేషణాత్మక నవల క్వయట్ లైఫ్ అని పిస్తుంది .రచయిత ‘’ కంజ బూరోఓయీ ని ‘’ఎంత గొప్ప నవలా కారుడ వోయీ ‘’అన బుద్ధి వేస్తుంది .
11-8-2002 ఆదివారం డైరీ లోని విశేషాలు మీకోసం
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –2-5-13- ఉయ్యూరు