జేమ్స్ జాయిస్

జేమ్స్ జాయిస్

        ఈ పేరు వినగానే యులిసిస్ తో  బాటు  ,చైతన్య స్రవంతి ప్రక్రియ జ్ఞాపకం వస్తుంది .ఇదే  stream of consciousness .దీన్ని ప్రవేశ పెట్టి ఆధునిక సాహిత్యానికి కొత్త రూపునిచ్చాడు .ఐరిష్ దేశ మేధావి రచయిత జాయిస్ .పేరు లోనే ‘’joy ‘’  కాని జీవితాంతం ‘’sorrow ‘’లోనే బతికాడు పాపం .   

 

 

జాయిస్ ఐర్లాండ్ దేశం లో డబ్లిన్ దగ్గర 1882 ఫిబ్రవరి 2 న పుట్టాడు .డబ్లిన్ కు మేధావి నగరం అని పేరు .తండ్రికి పది మంది సంతానం .పుట్టగానే చని పోయారు పై ముగ్గురు .తండ్రి జాన్ తల్లి ‘’మే’’ .ఇందులో పెద్ద వాడె జేమ్స్ .తండ్రి గవర్న మెంట్ ఉద్యోగి .తాగుడు కు బానిస .దీనికి తోడు ఒళ్లంతా అసూయ తో నిండి పోయిన వాడు .వీటి వల్ల ఉద్యోగం ఊడిపోయిండది .అప్పుల బాధలు భరించలేక ఊళ్లు మారాడు .ఐర్లాండ్ లో ఉన్నది అంతా అమ్మేసి దానితోనే బతికారు .జాయిస్ కు తోడేలు తెలివి తటలున్దేవని అంటారు .తండ్రి రోజూ ఇంటికి వచ్చి పోట్లాడటం జీవితం నరక ప్రాయమై పోయింది .లాటిన్, ఫ్రెంచ్ భాషలు నేర్చాడు ఇంట్లో పని కత్తేతో ,వేశ్యలతో శృంగారం వెలగ బెట్టాడు .తర్వాతా మతం తీర్ధం పుచ్చుకొన్నాడు .అదీ అచ్చి రాక ఆర్ట్ లో ప్రవేశించాడు .1898 లో గ్రాడ్యుయేషన్ పూర్తీ చేశాడు .డబ్లిన్ యూని వెర్సిటి లో చేరాడు .ఎన్నో రాశాడు కాని అవేవీ ప్రచురణకు నోచుకోలేదు .తండ్రి మరణం కుటుంబాన్ని పెద్ద దెబ్బే తీసింది .

           జాయిస్ రచన లన్నిటిని స్నేహితులు మెచ్చి డబ్బు సాయం చేసి ప్రచురించినవే .దీనితో అప్పులు కూడా కుప్పలు తెప్పలు గా పెరిగి పోయాయి .నారా అనే అమ్మాయితో 27 ఏళ్ళు గడిపి అన్నీ అనుభవించి పిల్లల్ని కన్నాడు కాని సంతానాన్ని పట్టించుకో లేదు .ఆమె మీద ఎవరో సాడీలు చెబితే ఈసడిస్తూ ఉత్తరం రాశాడు ఆమెకు .ఆమె ను అపార్ధం చేసుకోన్నాడని ఇంకోడు చెబితే దీన్నీ నమ్మి ఆమెకు సారీ చెప్పాడు .తాగటం ,క్లబ్  లవెంట తిరగటమే పని .డబ్బు లేక పోవటం ఎవరిని బడితే వాళ్ళను అడుక్కొని జీవించటం అనే స్తితి లోకి జారిపోయాడు .జార్జి అనే కొడుకు లూసియా అనే కూతురు ఉన్నారు జాయిస్ కు..త్త్రిస్టీఅనే చోట ఇంగ్లీష్ పాఠాలు చెప్పి కొంత డబ్బు సంపాదించుకొన్నాడు .అయినా పొట్ట గడవటం కష్టం గా ఉండేది .చాలా ఊళ్లు తిరిగాడు .నరాల బలహీనత వచ్చింది .ఇంట్లో భార్య అతని రచనలు చదవక పోగా ఈసడించుకోనేది దీనితో మహా బాధ పడే వాడు .ఆమెకు కోపం వస్తే అతని రచనల్ని చింపి పోగులు పెట్టేది .కొడుకూ పోరంబోకు గా తయారయ్యాడు . schijopherma జబ్బుతో కూతురు బాధ పడింది .1914ఫిబ్రవరి 2 న 32 వ పుట్టిన రోజున ఎజ్రా పౌండ్ సహాయం తో ‘’portrait of the  young artist as ayoung man ‘’ప్రచురించాడు .ఇందులో స్ట్రీం ఆఫ్ కాన్షస్ నేస్ ప్రవేశ పెట్టాడు .దీన్ని అందరూ స్వాగతించారు .’’joyce introduced a new style ,new subject matter into Irish literature .This is the evidence of a man of genius ‘’అని కీర్తించాదు పౌండ్ .కుటుంబాన్ని జూరిచ్ ,స్విస్స్ దేశాలకు మార్చాడు .మళ్ళీ మామూలే .‘’ఈట్స్,పౌండ్ లు కలిసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి నెల నేలా కొంత డబ్బు వచ్చేట్లు చేశారు కుటుంబం విషయం లో తాను చాలా పొరబాట్లు చేసి నట్లు తెలుసుకొని పశ్చాత్తాప పడ్డాడు .జాయిస్ కు పది సార్లు కంటి జబ్బు వచ్చింది .ఎన్నో ఆపరేషన్లూ జరిగాయి .గ్లుకోమా వచ్చింది .క్రమంగా రచనలు వెలుగులోకి రావటం తో ప్రశసలూ దక్కాయి 27 ఏళ్ళు కలిసి ఉన్న నోరాను ఇప్పుడు వివాహం చేసుకొన్నాడు చట్ట బద్ధం గా ..’’you are a martyr to a man’s genius ‘’అన్నది ఆమెను ఒక జాపాన్ చిత్రకారిణి .

                 జేమ్స్ జాయిస్ ‘’యులిసిస్ ‘’రాయటానికి రోజుకు ఎనిమిది గంటల చొప్పున ఏడేళ్ళు పట్టింది .దీని ప్రచురణ తో ప్రాచుర్యం పెరిగి పోయింది .’’joyce had ended 19 th century style and started something new ‘’అన్నది ప్రముఖ ఇంగ్లాండ్ రచయిత్రి వర్జీనియా ఉల్ఫ్ .’’ఇదేం కంగాళీ రచన రా బాబోయ్ ‘’అని ముక్కూ మూతి విరుచుకొన్న వారూ ఉన్నారు .ఈట్స్ దీన్నిమొదట  ‘’మాడ్ బుక్ ‘’అన్నాడు .తర్వాతా ‘’it is a work of genius ‘’అని కీర్తించాడు .జాయిస్ మాత్రం యులిసెస్ ను డే బుక్ అనీ ఫిన్నేగార్స్ ను నైట్ బుక్ అనీ అన్నాడు .జాయిస్ కోడలు ఆస్పత్రి పాలైంది .ఆయనకు ‘’deuo denal ulcer  ‘’వచ్చింది .చివరికి 1941లో జనవరి 13 న 59 వ ఏట మరణించాడు .

             చైతన్య స్రవంతి ప్రక్రియ ను ‘’is the flow of ideas ,perceptions ,sensations and recollections that characteristic human thought .it has subsequently been adopted by literary critics and authors to describe the representation f this flow  in writing ‘’అని‘’principles of psychology ‘’లో ఉందన్న విషయం  ,ఈ విధానానికి బాసట గా ఉందని అనుకూలురు భావిస్తారు .’’however unlike interior monologue ,stream of consciousness writing is governed by basic rules of grammar and syntax  ‘’అయితే దీన్ని చదివి అర్ధం చేసుకోవాలంటే ఓపికా సహనం కావాలి దీని నిండా ఇమేజరీ, సింబల్స్, ఉంటాయి కనెక్షన్ పట్టుకోవటం కష్టం .అన్నీ తెలుసుకొని చదివితే అదో అద్భుత లోకమే నని పిస్తుంది .మన తెలుగు లో ఈ ప్రక్రియను అద్భుతం గా’ఉపయోగించి ‘’ఆంప శయ్య ‘’నవల రాశాడు  వాసిరెడ్డి నవీన్  .దీనితో ఆయన ‘’అంపశయ్య నవీన్‘’అయ్యాడు .

                     16-8-2002 శుక్రవారం నాటి అమెరికా డైరీ నుండి మీ కోసం

             మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –6-5-13- ఉయ్యూరు 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.