అగాతా క్రిస్టీ
ఈ పేరు వినగానే డిటెక్టివ్ నవలా రాణి జ్ఞాపకం వస్తుంది అగాతా క్రిస్టీ రాసిన అపరాధ పరిశోధక నవలలు బైబుల్ ,షేక్స్ పియర్ రచనల తర్వాత అంతగా బిల్లియన్ల సంఖ్యలో అమ్ముడయ్యాయి .ఆమె మొదట నర్సు గా పని చేసింది .పద్యాలూ రాసింది .మామూలు నవలలూ రాసింది .ఆమె తన లాబరేటరి లోఉన్న మందుల గురించి ఈ కింది పంక్తులను రాసుకొన్నది ‘’’’beware of the power that never die through men may go their way –the power of the drug for good or evil shall it ever pass away ‘’1926 లో ‘’amnesisia ‘’జబ్బు వచ్చి నిద్రలోనే లేచి వెళ్లి పోయేది.మొదట క్రిస్టీ అనే అతన్ని పెళ్ళాడి 14 ఏళ్ళ తర్వాత విడాకులు పొంది ,మేల్లాన్ అనే వాడిని పెళ్లి చేసుకొని జీవితాంతం కాపురం చేసింది .నిత్య జీవితం లోని ప్రతి విషయాన్నీ పరిశీలనా దృష్టితో చూడటం ఆమెకు వెన్న తో బెట్టిన విద్యే అయింది .తన జీవిత చరిత్రనూ రాసుకోంది .అయితే తనను గురించి మాత్రం ప్రచారం చేసుకోలేదు .చాలా మర్యాదగా బిడియం గా ఉండేది .’’the older you get ,the more interesting you become to an Archeologist ‘’అంటుంది క్రిస్టీ .ఏ నవల అయినా ఆమె టైప్ చేసి ఆరు వారాల్లో ఇచ్చేసేది ప్రచురణ కోసం .అంత స్పీడ్ ఉన్న రచయిత్రి .తన జీవితం పై తానే జోక్ వేసుకొంటూ ‘ a sausage machine ,a perfect sausage machine ‘’అనుకోవటం ఆమెకే చెల్లింది .(మాంసం కూర తయారు చేసే యంత్రం ).కనీసం ఏడాదికి రెండు పుస్తకాలు రాసి ప్రచురించేది .ఆమెను ‘’ఆఫీసర్స్ క్లాస్ ‘’రచయిత్రి గా గుర్తించారు .తన చిన్న తనాన్ని గూర్చి ఆమె ఒక పద్యం రాసుకోంది ‘’agatha pagatha may black hen –she lays eggs for gentlemen –she laid six and she laid seven –and one day she laid eleven ‘’అని రాసి తండ్రికీ అక్క చెల్లెళ్ళకు చదివి విని పించి అందర్నీ నవ్వించేది .నిజంగానే ‘’అగాతా కోడి అనేక నవలా గుడ్లు పెట్టింది’’ .’’85 ఏళ్ళ నిండు జీవితం గడిపి 1976 జనవరి12 న మరణించింది .
అసలు పేరు ‘’డెం ఆగతా మేరీ క్లారిస్సా క్రిస్టీ’’ .15-9-1890 l లో జన్మించింది .డిటెక్టివ్ నవలలతో బాటు అనేక కధలూ ,నాటకాలు రాసింది .’’మేరీ వేస్త్మా కాట్’’ అనే మారు పేరుతో ఆరు రొమాంటిక్ నవలలూ రాసిన నవలా మణి ఆమె ..66డిటెక్టివ్ నవలలు 15 చిన్నకదా సంపుటులు ఆమె రా వెలువరించింది .ఆమె రాసిన ”మర్డర్ ఆన్ ది ఓరియంటల్ ఎక్స్ప్రెస్స్ ,”డెత్ ఆన్ ది నైల్ ”మంచి పేరు తెచ్చుకోన్నాయి . ప్రపంచం లోనే దీర్ఘ కాలం ఆడుతున్న నాటకం .’’మౌస్ ట్రాప్ ‘’రాసిన ఘనత క్రిస్తీది .ఎగువ మధ్యతరగతి సంపన్న కుటుంబం లో జన్మించింది మొదటి ప్రపంచ యుద్ధం లో నర్సుగా పని చేసింది .అన్ని కాలాల లోను ఆమె నవలలు హాట్ కేక్స్ గా అమ్ముడయ్యాయని గిన్నీస్ బుక్ రికార్డు లో ఉంది .ఆమె రచనలు 103 భాషల్లోకి అనువదింప బడ్డాయి అంటే ఆమె ప్రభావం ఎంత విస్తృతమో తెలుస్తోంది .ఆమె నవల ‘’And there were none ‘’ఇప్పటికి 100 మిలియన్ల కాపీలు అమ్మడయి రికార్డ్ సృష్టించింది .1971 లో ఎలిజబెత్ మహా రాణి ఆమెను ‘’dane ‘’గా ప్రకటించి రాజ భవనం బకింగ్ హాం పాలస్ లో సన్మా నించింది .క్రిస్టీ రాసిన ‘’మౌస్ ట్రాప్ ‘’నాటకం లండన్ లోని ‘అంబాసిడర్ థియేటర్ ‘’లో 1952 నవంబర్ 25 న ప్రదర్శన ప్రారంభమై ఈ నాటి వరకు అంటే 60 ఏళ్ళ పాటు నిరంతరం నాన్ స్టాప్ గా ప్రదర్శింప బడుతోంది .25,000ప్రదర్శనలు దాటింది .1955 లో ‘’మిస్టరి రైటర్స్ ఆఫ్ అమెరికా ‘’అవార్డును పొందిన మొదటి రచయిత అని పించుకోన్నది . ఇది చాలా అత్యున్నత గౌరవం ..గ్రాండ్ స్టార్అవార్డును ‘’,witness for prosecution ‘’ , అవార్డులను అందుకొన్నది .ఆమె రాసిన ఎన్నో నవలలు ,కధలు సినిమాలుగా టి.వి.షో లుగా వచ్చాయి రేడియో లలో వీడియో గేమ్స్ లోను ప్రదర్శిమప బడ్డాయి .యెనలేని కీర్తి ,ప్రతిష్ట ,గౌరవం ధనంసంపాదించిన బంగారు బాతు,అపరాధ నవలా రాణి ఆగతా క్రిస్టీ .
26-8-2002 సోమవారం నాటి డైరీ నుండి మీ కోసం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-5-13-ఉయ్యూరు