ఆంథోని ట్రాలోప్
ట్రాలోప్ 1815 లో ఇంగ్లాండ్ లో పుట్టాడు .తలిదండ్రులకు దూరమై ఒంటరి జీవితం తో ఇబ్బంది పడ్డాడు .దానినే ‘’I had no friend to whom I could pour out my sorrows .i was big awkward and ugly and I have no doubt skulled about a most unattractive manner ‘’అని రాసుకొన్నాడు .1830 లో తండ్రి అమెరికా నుంచి నష్టపోయి వచ్చాడు .లండన్ లోని జెనరల్ పోస్టాఫీస్ లో ఉద్యోగం .ఏడాదికి 90 పౌండ్ల జీతం .తర్వాతా పోస్టల్ సర్వేయర్ అయాడు ట్రాలోప్ .1843 లో మొదటి నవల ‘’the macdermot’s of ballyclorn ‘’రాశాడు .గ్రామీణ ఇంగ్లాండ్ లోని పై మధ్యతరగతి గురించి రాశాడు .1867 లో 14 పుస్తకాలు రాశాడు .రాజకీయ నవలలూ రాశాడు .స్వీయ జీవిత చరిత్రనూ రాసుకొన్నాడు .అందులో తను ఒంటరి జీవితం లో కోల్పోయిన వన్నీ గుర్తుకు చేసుకొన్నాడు .తన పేదరికాన్ని స్నేహితులు ఆదరించిన తీరును నవలాకారునిగా పొందిన కేర్తిని ఆర్ధిక పరం గా ఉన్నతుడైన తీరును అందులో రాసుకొన్నాడు .అతనికి ప్రేమ కావాలి .ట్రాలోప్ ను మొదట అసహ్యించుకొన్న వారే అతనికి తర్వాత బ్రహ్మ రధం పట్టారు .ఆయన గురించి అందరు ‘’no man in London society was more generally liked than Anthony Trallope ‘’అంటారు .1882 లో 67 ఏళ్ళ వయసులో చని పోయాడు .
ఆయన రచనలలో సామ్ప్రదాయిక సమాజం సాంఘిక ఆర్ధిక మార్పుల వల్ల ఎలా భయపడి ఒణికి పోయిందో చర్చించాడు .అయన రచనల్లో వాస్తవం ఉంది .’’in this world no good is un alloyed ,and that there is but little evil that has not in it some seed of what is goodly ‘’అని అంటాడు .ఆయన ‘’లంప్ప్ ఆఫ్ ఎర్త్ ‘’గురించి రాశాడు .అతని రచనలు నిజజీవితానికి ఫోటో కాపీ లా ఉంటాయని దేప్పే వారు .అందుకే జనం పట్టించుకోలేదు .రచనల్లో సంప్రదాయ శృంగారం ఉంటుంది .అందమూ ,ఆకర్షణా లేని ముసలి పని కత్తే ను హీరోయిన్ చేసి ‘’మిస్ మెకెంజీ ‘’నవల రాశాడు .దిక్లావేరింగ్స్ లో స్త్రీ అమాయకత్వాన్ని చర్చించాడు .ఇందులో ఎన్నో ఐరనీలు వాడాడు .సేక్సువాలిటిని చాలా సీరియస్ గా తీసుకొని రాశాడు .సైకాలజీ కి మంచి ప్రాముఖ్యతనిచ్చి రాశాడు .నిజమైన మానవత్వం కోసం తపించి రాసిన రచయిత త్రాలోప్ .ప్రత్యెక పరిస్తితులలో పాత్రల నిజాయితీ ని పరీక్షించాడు .వారి అనుమానాలు వారేదుర్కొన్న సామాజికాంశాల పై ఆధార పడి ఉంటాయనిరుజువు చేశాడు .
‘’he is farless of a novelist than a good diner out ‘’అని’’ లైట్ ‘’గా తీసుకొన్నారు ట్రాలోప్ ను .’’ఏదో లోపం ఉంది ఆయన నవలలో ‘’అన్నారు మరి కొందరు .అయితే ఆయన రచనల్లో ఆంగ్లీయుల గృహ జీవితాలు ప్రతి బిమ్బించాయి .ఆయన్ను పాతకాలపు భావాలున్న రచయిత అన్నారు ఆ రోజుల్లో ప్రముఖ రచయిత ఆస్కార్ వైల్డ్ ప్రభావం సమాజం మీద ఎక్కువ గా ఉండేది .వైల్డ్ కు కొత్త తరహా నవలా రచనా చాతుర్యం ఉండటం తో ఆయన పై క్రేజ్ పెరిగింది .అసలైన సంప్రదాయాన్ని తిరస్కరించటం త్రాలోప్ కు ఎదురు దెబ్బ తీసింది .అయితే ఇటీ వలి కాలం లో ఆయన పై మోజు బాగా పెరిగింది . .
మొత్తం మీద ట్రాలోప్ 47 నవలలు రాశాడు .యాత్రా కధనాలు రాశాడు వ్యాసాలూ ,కధలు అనేక రచించాడు .ఇన్ని చేసినా చార్లెస్ డికెన్స్ కు వచ్చిన పేరు మాత్రం రాలేదు .డికెన్స్ పదిహేను .టి.ఎస్.ఇలియట్ ఏడు మాత్రమె రాసినా వీళ్ళ నే జనం మెచ్చారు ఒక రకం గా మన కొవ్వలి నరసింహా రావు రచనలలాంటివే ట్రాలోప్ చేశాడు కాలక్షేపం బఠానీలు గా అవి పేరొందాయి .కాని కాల పరీక్షలో నిలవ లేక పోయాయి .ట్రాలోప్ పరిస్తితీ అంతే అయింది ..
28-8-2002 సోమవారం నాటి అమెరికా డైరీ నుండి మీ కోసం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –7-5-13-ఉయ్యూరు