నా దారి తీరు -21

          నా దారి తీరు -21

             మళ్ళీ బదిలీకి కారణం లాబ్ గొడవ

           ఉయ్యూరు హైస్కూల్ లో నేను, కాంతా రావు ,గిరి రెడ్డి ఫిజికల్ సైన్సు ను నారాయణ రావు చంద్ర లీలమ్మ లు నేచురల్ సైన్సు లను బోధించే వాళ్ళం .ఉన్న వారిలో నేను సీనియర్ ని అవటం వల్ల లాబరేటరి ఇంచార్జి గా నేనే ఉన్నాను .వంగల కృష్ణ దత్తు గారుతమ సోదరి స్వర్గీయ  ప్రయాగ కృష్ణ వేణి పేర నిర్మించిన బ్లా గ్ లో లాబ్ ఉండేది.దీనికి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసుకోన్నాము .ఇది మంచి బిల్డింగ్ .ల్యాబ్ లో నే ప్రయోగాలు చేయటం ,విద్యార్ధులతో ప్రయోగాలు చేయించటం జరిగేది ఇది కొందరికి కళ్ళు కుట్టయేమో ?కొంత మంది మేస్టార్లు ఊర్లోని చోటా నాయకుల దగ్గరకు మూటలు మోసే వాళ్ళు .అందులో మా సైన్సు మేష్టర్లూ ఉన్నారు .వారి మాటలు నమ్మిన ఆ చోటాలు స్కూల్ కు వచ్చి లాబ్ ను రేకుల షెడ్ లోకి మార్చమని సైన్సు రూమ్ ఆఫీసుకు కావాలని వచ్చి చెప్పారు ముందు హెడ్ మాస్టర్ తో చెబితే ఆయన నాకు చెబితే నేను ఏ పరిస్తితి లోను పకడ్బందీ గా ఉన్న బిల్డింగ్ నుంచి ఏ రక్షణా లేని రేకుల షెడ్ లోకి మార్చటం క్షేమం కాదని ముందు చెప్పాను .కాదు మార్చాలి అంటే మార్చను మీ ఇష్టం ఏం చేసుకొన్నా సరే అని రెచ్చి పోయాను .లేదంటే లాబ్ ఇన్చార్జిని నేను వదులు కొంటానని ఎవరికి ఇవ్వమంటే వారికి తాళాలు అప్పగిస్తానని అప్పుడు ఎక్కడికి మార్చుకొన్నా నాకు అభ్యంతరం లేదనీ తెగేసి చెప్పాను ఇది వాళ్లకు కారం రాచి నట్లుంది ఇందులో తల దూర్చిన వాడు ప్రెసిడెంట్ రామా రావు అనబడే వెంట్రప్రగడ రామా రావు .హెడ్ మాస్టారు సూర్య నారాయణ గారు’’ ఉపాయం మేష్టారు ‘’అని ముందే చెప్పాను .ఆయన తన చేతికి మట్టి కాకూడదని దూరం గా ఉన్నారు .నేను దీన్ని ప్రిస్టేజ్ విషయం గా భావించాను .దేనికీ వేరవటం అప్పటికే కాదు ఎప్పటికి లేదు .దీనితో నా బదిలీ ప్రయత్నాలు ముమ్మర మైనాయి .ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు .

                   ఇదంతా 1970 లోని విషయం .అప్పుడు నా జీతం rs 15-10-300 స్కేలులో నెలకు 200 బేసిక్ పే .దీని పై ఐదో ఆరో డి.ఏ.ఉండేది . ఏడాదికి ఇంక్రిమెంట్ పది రూపాయలు .అప్పటికి మా అబ్బాయిలు ఇద్దరు హైస్కూల్ లో చేరారు బానే చదువుతున్నారు .మా శ్రీమతి కడుపుతో ఉంది .అప్పటికే నలుగురు అబ్బాయిలు మాకు .నాల్గోవాడు వెంకట రమణ 1969 లో పుట్టాడు .మూడవ వాడికి మా మామ్మ పేరు కలిసి వచ్చేట్లు నాగ గోపాల కృష్ణ మూర్తి అని పేరు పెట్టాం అంటే ముగ్గురు అబ్బాయిలకు పెద్దవాడికి మా నాన్న పేరు, రెండో వాడికి మా అన్నయ్య,పేరూ మూడో వాడికి మా మామ్మ పేరు పెట్టామన్న మాట .నాల్గో వాడికే వెంకటేశ్వర స్వామి పేరు మీదుగా వెంకట రమణ అని పేరు పెట్టాం .మళ్ళీ ఈ సారి ఆడా /మగా /అని అందరు ఎదురు చూస్తున్నారు .మా అమ్మకు ఆడపిల్ల పుడితే బాగుండును అని ఉన్నా పైకి చెప్పదు మా అక్కయ్యలు వాళ్ళ మరదల్ని అంత ప్రేమగా చూడటం తక్కువే .నేను ఎటూ తేల్చుకోలేని పరిస్తితి .అన్నిటికి ‘’ఊపర్ మే అల్లా హై ‘’అనే తత్త్వం .

                ముప్పాళ్ళ కు బదిలీ

          మా శ్రీమతి విజయ 1971 లో విజయ దశమి నాడు ఆడపిల్లను కన్నది .విజయ లక్ష్మి అని పేరు పెట్టాము .అమ్మాయి పుట్టిన నెలకే నాకు నందిగామ దగ్గర ముప్పాళ్ళ కు బదిలీ అయింది అమ్మాయి పుట్టి నాన్నను దూరం పంపింది అని కొందరు అనుకొన్నారు .. మా అమ్మకూడా యిదేమి శాపం అనుకోంది 1964 లో మొదలు పెట్టి 1971కి అంటే ఏడేళ్ళలో అయిదుగురు సంతానాన్ని కన్నాం . .అంటే పెద్ద గాప్ లేకుండా నే పిల్లల కోడి అయింది మా ఆవిడ పాపం .పురుడు పోసిన డాక్టర్ పండా అరుణా ద్విజేంద్ర బాబులు .చాలా ఆప్యాయం గా ఉండే వాళ్ళు అప్పటి నుండి మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ఆహ్వ్వనిస్తే వచ్చేది డాక్టర్ అరుణ .ద్విజేంద్ర బాబు స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ గా ఉండేవారు .ఆపరేషన్  ఎవరు చేయించుకోవాలని అనుకుంటే ప్రభావతే ఆపరేషన్ చేయించుకోంది మళ్ళీ పిల్లలు పుట్టకుండా .నల్గురు మగపిల్లల తర్వాతా ఆడపిల్ల పుడితే అంతా అదృష్టం అనే వారు అందరు .అదృష్టం ఏమో కాని ట్రాన్స్ఫర్ జరిగింది .ఇది ఊహిస్తున్నదే కనుక నేనీమీ అనుకోలేదు .ఉయ్యూరు లో 10-11-71 న ఉయ్యూరు లో రిలీవ్ అయాను .కొన్ని రోజులు ట్రాన్సిట్ వాడుకొని ముప్పాళ్ళ లో చేరాను .

                               ముప్పాళ స్కూల్

         ఉయ్యూరు  నుంచి నందిగామ వెళ్లి అక్కడ చందర్ల పాడు బస్ ఎక్కి ముప్పాళ్ళ లో దిగాలి .ఈ ప్రాంతాన్ని పశ్చిమ కృష్ణా లేక’’ అప్ లాండ్  ‘’ అంటారు .మెట్ట ప్రాంతం .కాలువల ద్వారా నీటి పారుదల ఉండదు .వర్షాదార పంటలు .వరి పండటం గగనం .జొన్న ,వేరుసెనగ ,పత్తి ,పొగాకు ,కంది ,పెసర దోస బాగా పండుతాయి పశువులకు తాగు నీరు కూడా దొరకదు .కనుక వాటిని రోజు కడగటం అనేది ఉండదు .జొన్న చొప్పె ఆహారం .కానీ ఇక్కడి పాలు మహా రుచి కరం గా ఉంటాయి వెన్న పూసా బాగుంటుంది .నెయ్యి పేరుకొని భలే కమ్మగా ఉంటుంది .ఇక్కడి నుంచి ఇంటికి వీటిని తీసుకొని వెళ్ళేవాడిని .ఉల్లి పాయలు తెల్లవి, ఎర్రవి బాగా పండుతాయి .

                                  నందిగామ లో రోజమ్మ పిన్ని ఇంట్లో మకాం

         నాకు ఆ ప్రాంతం అంతా కొత్త .అందుకని మా పద్మావతమ్మ అమ్మమ్మ గారి అమ్మాయి యడవల్లి సరోజినీ అనే రోజమ్మ పిన్ని వాళ్ళింటికి ముందు వెళ్లాను .వాళ్ళది పెద్ద వరండా ఇల్లు ఆవిడ ఆడపిల్లలు ఇద్దరు ఉయ్యూరు లో చదివినప్పుడు నా దగ్గర ట్యూషన్ చదివారు పిన్ని నేను అంటే విపరీతమైన అభిమానం చూపించేది వీల్లదీపిన్ని భర్తను కోల్పోయి చాలా కాలమైంది . సంపన్న కుటుంబం ..నన్ను బాగా ఆదరించింది .భోజనం ,పడక అక్కడే ఉదయమే కాఫీ ఇచ్చేది తొమ్మిదింటి కల్లా భోజనం వండి పెట్టేది .బస్ స్టాండ్ వీళ్ళ ఇంటికి దగ్గరే .నడిచి వెళ్లి బస్ ఎక్కి వెళ్ళే వాడిని స్కూల్ దగ్గరే బస్ ఆగేది .స్కూల్ చాలా చిన్నదే రెండొందలు ఉండేది స్త్రెంగ్థ్ .అన్నీ సింగిల్ సేక్షన్లె .హెడ్ మాస్టర్ ఎస్.ఖాసిం గారు .కుంటి వారు చేతికింద కర్రతో వచ్చే వారు నందిగామ లో ఆయన కాపురం .బహు సంతానం .మంచి లెక్కల మేష్టారు గా ఆప్రాంతం లో పేరు .నాకు అంత ఫెయిర్ అని పించే వారు కాదు .పున్నయ్య గారు లెక్కలు నేను సైన్సు ముక్కు పొడుం పీల్చే సోషల్ మేష్టారు వెంకటేశ్వర్లు అనే తెలుగు పండిట్ ,కుటుంబ రావు అనే ఇంకో తెలుగుపందిట్ రామా రావు అనే హిందీ పండిట్ ,ఒక విశ్వబ్రాహ్మిన్ సెకండరి మాస్టారు ఒక డ్రిల్ మేష్టారు ,ఒక డ్రాయింగ్ మేష్టారు ఉండేవారు నేను ఎనిమిది తోమ్మిదిలకు జెనెరల్ లెక్కలు చెప్పే వాడిని మిగిలిన రెండు సైన్సులన్నీ చెప్పేవాడిని .ఒక వారమో పది రోజులో రోజమ్మ పిన్ని ఇంట్లో ఉన్నాను వీరింటి ప్రక్కనే యడవల్లి రామ మూర్తి యడవల్లి దీక్షితులు ఇళ్ళు ఉండేవి .వీరిద్దరూ ఉయ్యూరు లో మా అమ్మ పినతండ్రి గుండు నరసింహం గారి బావ మరదులు .వీరి సోదరే మా పాపాయి పిన్ని .ఆవడనూ, వారినీ ఇక్కడే చాలా కాలానికి చూశాను .దీక్షితులు కొంచెం రిసేర్వేడ్ .రామ మూర్తిగారు పెద్దమనిషి నల్లగా ఉండేవాడు .వ్యవసాయం ఉండేది సంపన్న కుటుంబం పిల్లా జెల్లా ఉండేవారు దీక్షితుల ఇంట్లో పాపాయి పిన్ని ఉండేది .నన్ను చూసి నందుకు చాలా  సంతోషించింది అప్పటికే వృద్ధాప్యం వచ్చేసింది ఆవిడకు .దాదాపు లేవలేని స్తితియే .  మా చిన్నప్పుడు యడవల్లి వారిలల నుండే మాకు మిర్చి ,కండి ,పెసర వచ్చేవి వాళ్ళు వీటిని మా మామయ్యా గారింటికి పంపితే మేమూ మామయ్యా పంచుకొనే వాళ్ళం .తర్వాతా డబ్బు పంపే వాళ్ళం వాళ్లకు ఇక్కడి నుంచి మినుములు పంపేవాడు మామయ్యా నాకొక గది ని ముప్పాళ్ళ లో చూడమని తోటి టీచర్లకు చెప్పాను .వారు ప్రయత్నం చేశారు .అక్కడ ఒక కరణం కుటుంబం ఉంది బండారు సుబ్బా రావు గారు అనే ఆయన అక్కడ కరణం .అయన స్తితి పరుడేమీ కాదు వారింట్లో ఒక గది ఖాళీ చేసి ఇస్తామని చెప్పారు మంచి కుటుంబం .మట్టి నేల మట్టి గోడలు కరెంటు లేదు .లాంతర్లె ఆధారం వరండా ఉంది బయటికి చెంబు తీసుకొని వెళ్ళాల్సిందే ఆడా మగా అందరు.తప్పదిక్కడ .సరే ఇంకేమీ చేయలేం కదా .దాన్నే ఓ.కే.చేశాం .ఇక కాపురం పెట్టాలి .ఆ ముచ్చట్లు ఈ సారి

           సశేషం

                 మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -8-5-13- ఉయ్యూరు 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.