నా దారి తీరు -22 ముప్పాళ్ళ లో కాపురం

 

      నా దారి తీరు -22   ముప్పాళ్ళ లో కాపురం 

  తుండు ,తుపాకీ తీసుకొని ముప్పాల్లలో కాపురం నేనొక్కడినే పెట్టాను .ఫామిలీ అంతా ఉయ్యూర్లోనే .భండారు సుబ్బారావు గారి ఇంట్లో హాలులో కొంత భాగం అద్దెకు ఇచ్చారు .పది రూపాయలో పదిహేనో అద్దె .అంతే .కిరసనాయిల్ స్టవ్ ,వంట గిన్నెలు ,తిరగమూత సామాను పప్పూ అన్నీ తెచ్చుకొన్నాను ఒక మడత మంచం తెచ్చుకొన్నాను పడకకు దిండు దుప్పటి .ఉదయం కాఫీ పెట్టుకొని తాగే వాడిని లేక పోతే ఇంటావిడే అన్నపూర్ణమ్మ గారు పెట్టి ఇచ్చేది అన్నం వండుకొనే వాడిని అదీ బద్ధకిస్తే ఆవిడే వండి పెట్టేది .మహా దొడ్డ ఇల్లాలు ఆ సంసారం లో ఎన్నో కస్టాలు అనుభవించింది ఆ తల్లి పెద్ద కొడుకు తొమ్మిదో క్లాస్ .పేరు వీరభద్ర రావు అందరం భద్రం అని పిలిచే వాళ్ళం రెండో వాడు ఏడో క్లాస్ .మిగిలిన ఇద్దరు మొగ పిల్లలు ,ఒక అమ్మాయి వీళ్ళందరి కంటే పెద్దది .లక్ష్మి. ఆమె మేన బావకిచ్చి వివాహం చేయాలను కొంటున్నారు .కట్నం ఇచ్చే శక్తి లేదు సుబ్బారావు గారికి .ఎదోకొద్ది  తప్ప నికరాదాయం లేదు .బహు సంతానం పాపం పళ్ళ బిగిమ్పుతో సంసారం లాగుతున్నారు అన్నపూర్ణమ్మ గారు మహా కలివిడి గల మనిషి ఊరందరికీ తలలో నాలుక గా ఉండేది. మాట సాయం ,చేత సాయం చేసేది .ఆవిడ మాటకు ఆ ఊళ్ళో విలువ ఎక్కువ .ఆయన భిడియస్తుడు ఎవరినీ యాచించటం తెలీదు ఆ పనేదో ఆవిడే చేసి పిల్లల ఆకలి తీరుస్తోంది .కంది కంప ,తోనో పొగాకు చెట్లు లేక సీమ తుమ్మ కట్టేలతోనో వంట ..పొయ్యి మీద ..సామాను కూడా ఏమీ ఉండేది కాదు కాని మహా నేర్పున్న మనిషి ఆవిడ .రోజూ జొన్నలు దంచుకొని వండి తినే వాళ్ళు వాకిట్లో పెద్ద రోలుండేది ఇంటి చుట్టూ కోమట్లున్దేవారు .శీతాకాలం లో నాకు వేడి నీళ్ళు కాచి ఇచ్చేవారు తాము తిన్నారో లేదో కాని నన్ను కంటికి రెప్పలాగా ఆయనా ఆవిడా పిల్లలూ చూసుకొనే వారు దూరాన ఉన్నానన్న వెలితి కనపడ నిచ్చే వారు కాదు బావిలో నీళ్ళు తోడి భద్రం రెడీ చేసేవాడు ఏ పని చెప్పినా చేసే వాడు బియ్యం కడగి పెట్టటం స్టవ్ వెలిగించాతమూ చేసే వాడు .పిల్లలూ అంతే రాత్రి అందరికి పాఠాలు చెప్పే వాడిని ఇంకెవరైనా వస్తే చదువు చెప్పే వాడిని .

     నేను చేరిన కొద్ది రోజులకే మోటూరు నుండి ట్రాన్స్ ఫర్ అయి కుటుంబరావు అనే తెలుగు మేష్టారు వచ్చి చేరాడు .ఆయన వచ్చాడే కాని మళ్ళీ ప్రయత్నాలు చేసుకొంటున్నాడు వెళ్లి పోవటానికి .నేనూ అదే తీరు మనిద్దరం కలిసి ఉందాం అన్నాడు చెరో పదీ అద్దె ఇచ్చేట్లు మాట్లాడాం సరే నన్నాను .ఇద్దరం అదే హాల్లో సర్దుకొనే వాళ్ళం .అయన ఏమీ తెచ్చుకోలేదు నా గిన్నేలతోనే వంట వంట బాగా చేసే వాడు నేను కాఫీ మాత్రం పెట్టె వాడిని ఇద్దరం తాగే వాళ్ళం మిగిలితే సుబ్బారావు గారికో అన్న పూర్ణమ్మ గారికో ఇచ్చే వాళ్ళం .కుటుంబరావు గారు మోటూరు లో హెడ్ మాస్టార్ తో తగాదా పడితే బదిలీ చేశారు నాదీ ఇంచు మించు అదే పనికదా .ఆయన ఎప్పుడూ తలకు పాగా చుట్టుకొనే వాడు రాత్రిళ్ళూ తీసే వాడు కాదు ఈ రహస్యం ఏమిటో చాలా రోజులకు కాని తెలియ లేదు .ఒక రోజు రాత్రి ఆయన నిద్రలో తల పాగా జారింది అప్పుడు చూశాను ‘’పేను కొరుకుడు ‘’తల .అందుకే ఆ జాగ్రత్త .నేనెవరికి చెప్పా లేదు ఆయనకు నాకు తెలిసి నట్లు తెలియలేదుకూడా .సాయంత్రాల వళ ఆయన ఊళ్లోకి వెళ్లి అందరని మంచి చేసుకొని కూరలు తెచ్చే వాడు వాటి తో వంట .ఇదీ బానే ఉందని పించింది ..స్కూల్ లో కాలక్షేపం బానే ఉంది .

    రోశయ్య అనే డ్రిల్ మేష్టారు సబ్బతి వెంకటేశ్వరరావు అనే డ్రాయింగ్ మాస్టారు నందిగామ నుండి వచ్చే వారు .ఇద్దరూ ఎప్పుడూ డబ్బు విషయాలే చర్చించుకొనే వారు డ్రాయిన్గాయన డబ్బు అప్పు ఇచ్చి వడ్డీ వసూలు చేసుకొనే వాడు హెడ్ మాస్టారికి కూడా ఆయనే అప్పు పెట్టె వాడు సెకండరి మాస్టారు మల్లికార్జున రావు ఆవూరి వాడే స్కూల్ లో బిల్లులన్నీ ఆయనే చేసే వాడు .క్లాసుకెళ్ళి బోధించటం తక్కువే ఇదే సరి పోయేది .పున్నయ్య అనే ఆయనదీ అదే వూరు నందిగామలో చేసేవాడు రోజూ కలిసే వాడు సాయంత్రాలలో .జక్రయ్య అనే సెకండరి మేష్టారు ఎర్రగా ఉండేవాడు వాళ్ళ అమ్మాయి తొమ్మిది చదువుతోంది అప్పటికే ఫాషన్ గా ఉండేది స్కూల్ ఎస్ పి.ఎల్ లైన్ లో  పడేసి అల్లరి చేశాడు దీన్ని సర్ద లేక చాలా ఇబ్బంది అయింది .

    ముప్పాల్లకు దగ్గరలో చతుర్వేదుల వారికి ఒక చిన్న ఊరుమునగాల పల్లి  ఉంది .అక్కడ ఆ ఇంటి అమ్మాయి దేవత గా వెలసింది ఆమెకు దేవాలయం కట్టించి పూజాదికాలు నిర్వహిస్తారు వాళ్ళబ్బాయి ఒకడు హైస్కూల్ లో తొమ్మిదిలో ఉన్నాడు ఏదో బంధుత్వం కలిసింది మా తోదల్లుడిది చతుర్వేదులే ఇంటి పేరు .వీళ్ళ బంధువులే .రామ కృష్ణ శాస్త్రి ఆ పిల్లాడి పేరు నన్ను ఆవూరు తీసుకొని వెళ్ళాడు ఒక సారి .వాళ్ళంతా ఎంతో సంతోషించారు .ఇక్కడా బంధుగణం ఏర్పడింది అలాగే నందిగామలో రోజమ్మ పిన్ని ఇంటి దగ్గర చతుర్వేదుల మార్కండేయులు అనే ఒక కామ్పౌడర్ మా వాళ్లకు బంధువు .ఆయనా పరిచయ మయ్యాడు .దాదాపు శని వారం సాయంత్రం ఉయ్యూరు బయల్దేరి వెళ్లి పోయేవాడిని .మళ్ళీ సోమవారం ఉదయం వచ్చేవాడిని .ఎప్పుడైనా వెళ్ళక పోతే నందిగామ వెళ్లి సినిమా చూసి పిన్ని గారింట్లో ఉండి మర్నాడు వచ్చే వాడిని ..నందిగామ ఏటూరు నందిగామ చందర్ల పాడు బస్సులు అప్పుడు ప్రైవేట్ వాళ్ళ సర్వీసులో ఉండేవి చిన ఒగిరాలకు చెందినా కే.వి.ఆర్.సర్వీసులు .నా శిష్యుడు అన్నా వజ్జలసుబ్బారావు  గారబ్బాయి పూలమ్మ గారి కొడుకు నరసింహా రావు ఆ బస్సుల్లో కండక్టర్ గా ఉండేవాడు వాడు ఉంటె టికెట్టు తీసుకొనే వాడు కాదు .మహా మాటకారి వాడే బెల్లం కొండ హనుమంత రావు కూతురు సుశీలను ఆతర్వాత పెళ్లి చేసుకొన్నాడు .ఆ అమ్మాయి నా దగ్గర ఉయ్యూరులో ట్యూషన్ చదివింది మా అన్నయ్య గారి అమ్మాయి వేద వల్లికి క్లాస్ మేట్ .నరసింహా రావు తర్వాతా ఆర్.టి.సి లో చేరాడు .బానే సంపాదించి అక్కడే ఇల్లుకొని ఫాన్సీ షాప్ ఏర్పాటు చేసుకొన్నాడు అందరితోను పరిచయాలు ఎక్కువ వాడికి .అప్పుడే కాళీ ప్రసాద్ చెల్లెలు రాజా కామేశ్వరీ మా దగ్గర చదివింది ఈ ఇద్దరు మా కు కుటుంబ స్నేహితులు .

         మా కుటుంబ రావు మాస్టారు కబుర్ల పోచి కోలు .మోటూరు సంగతులన్నీ కధలూ,గాదల్లా చెప్పే వాడు .ఆసక్తి గా వినే వాడిని .తాను మళ్ళీ మోటూరు వెళ్ళటం ఖాయం అనే వాడు అలానే వెళ్లి పోయాడు కూడా .ఆడా మగ విచక్షణ, తన పర భేదం లేకుండా తన అమ్మాయిల విషయాలైనా చెప్పేసే వాడు బూతులు బాగా మాట్లాడే వాడు చదువు చెప్పటం లో అంత నేర్పున్నట్లు కని పించదు హెడ్ గార్ని బుట్టలో పెట్టేశాడు ..ఏది ఏమైనా కొన్ని నెలలు మంచి స్నేహం తో గడిపాం .నాకు మంచి వంట మేట్ వెళ్లి పోయాడు అయన బదులు నందిగామ నుంచి వచ్చే గరిక పాటి వెంకటేశ్వర రావు అనే ఆయన చేరాడు ఈయన ఏం .ఏ.తెలుగు థర్డ్ క్లాస్ లో పాసై బెటర్ మెంట్ కోసం కట్టాడు స్కూల్లో ఖాళీ వస్తే చదువు కొంటూ ఉండేవాడు .స్టాఫ్ రూమ్ అంటే చిన్న రేకుల షెడ్ లో ఒక రూమ్ . .నేల మీద చాపలున్దేవి అక్కడే కూర్చోవటం కబుర్లూ. .ఈయనా మాటకారే ..కాని అహం భావం ఎక్కువ కాసా వాళ్ళు అనే వారాయన్ను మిగిలిన వారు ఎప్పటికైనా నందిగామ యెన్.టి.ఆర్ కాలేజి లో లెక్చరర్ అవాలని ఆరాట పడే వాడు తర్వాత అయ్యాడు కూడా .ఆయనతో బాటు చిదంబర శాస్త్రి అనే జూనియర్ తెలుగాయనా నందిగామ నుంచే వచ్చే వాడు బాగా చదువుకొన్న కుర్రాడు మంచి స్నేహశీలి .ముప్పాళ్ళ లో ఉండగానే నందిగామ వెళ్లి ‘’అన్నదాత ‘’అనే నాగేశ్వర రావు డబల్ పోర్షన్ సినిమా చూశాం నేనూ హిందీ రామా రావు కుటుంబరావు గారు .మధ్యాహనం పూట ఇంటర్ వల్ లో హిందీ పండిట్ గారు తన ఇంటికి తీసుకొని వెళ్లి రోజు  ఏదో టిఫిన్ చేయించి నాకు పెట్టి తానూతినేవారు .ఆయన ముతరాసి ఆయనే .అయినా గొప్ప సంస్కారం ఉన్న వారు కులం బట్టి సంస్కారం రాదు అని తెలుస్తుంది .మా స్నేహం చాలా బాగా ఉండేది .సాయం కాలం ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఇంటికి తీసుకొని వెళ్లి భార్యతో టీ చేయించి ఇద్దరం తాగేవాళ్ళం ఆ తర్వాతా ఇంటికి చేరి పొలాల మీదకు షికారు వెళ్ళే వాళ్ళంవాళ్ళబ్బాయి తొమ్మిదిలో ఉన్నాడు మంచి తెలివి తేటలున్న కుర్రాడు చాలా రోజులు రామా రావు గారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను అక్కడి నుండి వక్చెఇన తర్వాతా కూడా స్పాట్ వాల్యుయేషన్ లో బందరు లో కలిస్తే ఉయ్యూరు తీసుకొని వచ్చాను ఒక సారి .మానికొండ మిత్ర బృందం తర్వాతా మళ్ళీ రామా రావు గారితో ఆ తరహా స్నేహం నల్లగా ఉండేవారు తెల్లటి పంచా తెల్లని చొక్కా వేసేవారు

      నందిగామలో ఇనుము ,సత్తు, ఇత్తడి, కంచు వ్యాపారం బాగా ఉండేది ఉయ్యూరు లో నాతో పాటు చదువుకొన్న, మా ఇంట్లో ఉండిమాకు మంచి స్నేహితుడైన చిట్టూరి పూర్ణ చంద్ర రావుఅనే వైశ్యమిత్రునికి  కు నందిగామ లో ఇత్తడి కొట్టు ఉంది ఒక సారి అక్కడ కలిశాం. బానే సంపాదించాడు భలే మాటకారి అతని మాతస్ల్లో సాయిబుల భాష వస్తుంది ఎందుకో తెలీదు .ఉయ్యుర్లో పాత ఆంధ్రా బాంక్ ఎదురుగ్గా వీళ్ళకో డాబా ఉండేది తండ్రి చని పోవటం తో పట్టించుకొనే వాడు లేక శిధిలా వస్తలో ఉంది .వీడు అక్కడి నుంచి కాపురం ఉయ్యూరు వచ్చి దాన్ని కొంత రిపైర్ చేయించి ఉన్నాడు అది ఎవరికి కలిసి రాని బిల్ల్దింగ్ అని పేరు .’’హాఫ్ సుందరయ్య’’ అనే కమ్యూనిస్ట్ నాయకుడునరసింహా రావు  దానిలో అద్దె కుండి హత్యా ప్రయత్నం లో జైలు కు  వెళ్ళాడు వాళ్ళబ్బాయి వెంకటేశ్వర రావు  నా దగ్గర ట్యూషన్ చదివాడు .గురు దక్షిణ గా ఒక టేకు మంచం ,ఒక టేబుల్ ,ఒక రాసుకొనే పాడ్ చేసిచ్చాడు చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇప్పటికీ పని చేస్తున్నాయి .

          నందిగామ లో ఆరోజుల్లో ఒక బ్రాహ్మణ డాక్టర్ కాకుళేశ్వర రావు గారికి మంచి పేరుండేది హస్త వాసి మంచిదనే వారు .ఆయన దగ్గరే మార్కండేయులు గారు కామ్పౌడర్ .అలాగే క్రాఫ్ట్ మాస్టారు గా నందిగామ హైస్కూల్ లో పని చేసి క్రమమగా హోమియో పతి నేర్చుకొని ,ఎన్నో వేల మందికి వ్యాధులు నయం చేసిన వెంకట పతి గారు అక్కడే ఉన్నారు ఆయన ఉద్యోగం మానేసి హోమియోకే అంకిత మయ్యారు కామెర్లు వంటి వ్యాధులకు ఆయన ఇచ్చే మందు బాగా పని చేసేదట  తర్వాత బెజవాడ లో పడమట లో ఆంధ్రా బాంక్ దగ్గర ఒక క్లినిక్ పెట్టి విపరీతం గా ఆర్జించారు వాళ్ళబ్బాయి డాక్టర్ అయ్యాడు .అక్కడే నాకొక సారి వెంకట పతి గారితో పరిచయమయింది .నందిగామ రాజకీయాలు ఆ రోజుల్లో అడుసుమిల్లి సూర్య నారాయణ ,మొక్క పాటి వెంకటేశ్వరరావు వసంత నాగేశ్వర రావుల మధ్య జోరుగా నడిచేవి ఇందులో వయసులో వసంత అందరికంటే చిన్న వాడు .పై వాళ్లకు శిష్యుడు .ముఖ్యం గా మొక్క పాటికి .రామా రావు పార్టీ పెట్టి నప్పుడు తెలుగు దేశం లో చేరి ఏం ఎల్ ఏ అయి హోమ్ మినిస్టర్ కూడా అయ్యాడు .

    ఈ సారి నా తెలుగు ఏం.ఏ.,పబ్లిక్  పరీక్షల్లోవాచర్ పని గురించి –

 సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –9-5-13- ఉయ్యూరు

    

 

 
 
 
 
 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.