నా దారి తీరు –23- ఏం.ఏ.తెలుగు

  నా దారి తీరు –23-

             ఏం.ఏ.తెలుగు

 ఉయ్యూరు లో ఉండగానే నేనూ ,కాంతా రావు కలిసి తెలుగు లో ఏం .ఏ.చెయ్యాలని అనుకొన్నాం .ఫీజులు కట్టాం ఆంద్ర విశ్వ విద్యాలయం వారి పరీక్షలు రాయాలి పుస్తకాలూ నోట్సు సంగతి ఏమిటి అని విచారించాం .అప్పుడు కాంతా రావు ఒక ఉపాయం చెప్పాడు తరుణీ రావు గారు అనే జిల్లా పరిషద్ హెడ్ మాస్టారు(కే.వి.ఎస్.ఎల్ నరసింహారావు గారి తోడల్లుడు ) గారబ్బాయి గుంటూరు నాగార్జున యూని వర్సిటి లో ఏం ఏ.ఫైనల్ లో ఉన్నాడని అతని దగ్గర నోట్సులు సంపాదిద్దామని చెప్పాడు మేమిద్దరం ఒక రోజు వెళ్లి కలిశాం .అతనికి కాంతా రావు తో పరిచయం బానే ఉంది వెంటనే తన దగ్గరున్న నోట్సులు లు మాకు ఇచ్చేశాడు .తన దగ్గర లేనివి స్నేహితుల నడిగి ఇచ్చాడు .అందులో పింగళి లక్ష్మీ కాంతం గారి నోట్లు చాలా విలువైనది .వాటిని తెచ్చి నేను కాపీ రాసుకోన్నాను కాంతా రావు కు అలా రాసుకోవక్కర్లేదు అతను ఒక సారి చదివితే అంతా బుర్రలో రికార్డ్ అయి పోతుంది నాకు అలా కుదరదు దెబ్బమీద దెబ్బ వేస్తూ నలగ్గోట్టాల్సిందే .నోట్సు రాయటానికి మా అన్నయ్య గారమ్మాయి వేద వల్లి సహక రించింది కొంత రాసిచ్చింది లాంగ్ బుక్స్ లో ఇవన్నీ రాసుకొన్నాను వీటిని మా తర్వాత చాలా మంది తీసుకొని వెళ్లి ఏం ఏ రాసి పాస్ అయ్యారు అదీ మాకు ఆనందమే .దీనికంతటికి కారణమైన తరుణీ రావు గారి అబ్బాయికి మేమేన్నతికి కృతజ్ఞులమే .మాతో బాటు చెంచారావు కూడా ఉయ్యూరు హైస్కూల్ లో నేచురల్ సైన్సు మాస్టర్ గా పని చేస్తున్నాడు అతనూ మాతో పాటే రాస్తానని ఫీజు కట్టాడు .రోజూ రాత్రిళ్ళు మా ఇంటి దగ్గర ముగ్గురం చేరే వాళ్ళం .కాంతా రావు ఇల్లు మా ఇంటి ప్రక్కనే చెంచా రావుదికాపుల వీధి రామాలయం దగ్గర .రాత్రి రెండింటి దాకా చదువు కొనే వాళ్ళం స్మస్క్రుతం కూడా ఉండేది ఒక పేపర్ .అందులో కుమార సంభవంఅభిజ్ఞాన శాకుంతలం  ఉంది .గ్రామర్ ఉండేది ఇవన్నీ మేమే చదివి నేర్చుకోన్న్నాం భద్రిరాజు గారిది చేకూరు రామా రావు ది నోట్సు సంపాదించాం వ్యాసాలూ చదివాం . .లింగ్విస్టిక్స్ ,అయిదు పేపర్లు రాయాలి మొత్తం కస్టపడి చదివాం .గుంటూరు ఏ.సి కాలేజి లో సెంటర్ .ఉండటానికి చెంచారావు బంధువుల ఇల్లు చూసి పెట్టాడు అక్కడే ఉందడి హోటల్ భోజనం చేస్తూ మొదటి ఏడాది పరీక్షలు రాశాం నాకూ కాంతా రావు కు అరవై పెర్సెంట్ వచ్చింది రెండేళ్ళ మార్కుల సరాసరే నిర్ణయిస్తుంది క్లాస్ .

       అప్పుడే ఉయ్యూరు నుంచి వల్లభనేని రామ కృష్ణా రావు గారు మాతో పని చేస్తూ ఆంధ్రా యూని వెర్సిటి లో ఇంగ్లీష్ ఏం .ఏ.చదవటానికి వెళ్ళాడు ఆయన మాతో ఎంతో సన్నిహితం గా ఉండేవాడు ఆయన కు ఘన మైన వీడ్కోలు పార్టి ఇచ్చాం .అప్పుడు నేను ఆయన గురించి మంచి ఉపన్యాసం ఇచ్చాను అదే మొదటి సారి వేదిక మీద ఎక్కువ సేపు  మాట్లాడటం దానితో అలవాటై పోయింది .ఒక కవిత రాసి వినిపించాను అందరు మెచ్చారు .ఆ తర్వాత జ్ఞాన సుందరం అనే తెలుగు మేష్టారు కూడా తెలుగు ఏం.ఏ.రాసి పాసయ్యాడు ఇవి మాకు మంచి స్పూర్తినిచ్చాయి మొదటి ఏడాది  పరీక్షల తర్వాతే నాకు ముప్పళ ట్రాన్స్ఫర్ అయిందన్నమాట రెండో ఏడాదికి చదువు ప్రారంభించాం .నేను ఉయ్యూరు వచ్చినప్పుడు మళ్ళీ రాత్రుళ్ళు వాళ్ళిద్దరూ చేరే వారు .మా ఆవిడ టీలు టిఫిన్లు తయారు చేసేది తింటూ తాగుతూ చదువుకొన్నాం .కాంతా రావు అప్పటికే భారతి మాస పత్రిక లో విమర్శ్శనా వ్యాసాలూ శ్రీ శ్రీ తిలక్ పై వ్యాసాలూ రాస్తూండే వాడు .మేము మొదటేడాది పరీక్షలు రాస్తున్నప్పుడు కొందరు విద్యార్ధులు ఆయన వ్యాసాలూ చదువుతూ ప్రిపేర్ అవుతుంటే ‘’ఈయనే కాంతా రావు ‘’అని వాళ్లకు పరిచయం చేస్తే వాళ్ళు ఆశ్చర్యం గా చూశారు ఇంత సాహితీ సంపన్నుడు ఏం.ఏ.రాస్తున్నాడా అని అనుకొన్నారు .

     రెండో ఏడాది కూడా ఏ.సి కాలేజి ఏ సెంటర్ ఈ సారి మేమిద్దరం ఒక లాడ్జి  గదిలో అద్దేకుంది చదువుకొన్నాం హోటల్ లో భోజనం .చెంచారావు వచ్చి మాతో రాత్రిళ్ళు చదివే వాడు .రెండో ఏడాది మోడరన్ పోయిట్రీ ఉంది .బాగా రాశాం .కాంతా రావు కు కొట్టిన పిండి .నాకు అరణ్యం లో దారి చూసుకొని నడవటం ఆయనకే అందులో నా కంటే మార్కులు ఎక్కువ వస్తాయి అని ఆయనా అనుకొన్నాడు నేనూ అనుకొన్నాను .కాని నాకే ఆయన కంటే రెండో మూడో మార్కులు ఎక్కువ వచ్చాయి ఇది ఆయనకూ నాకూ ఆశ్చర్యం గానే ఉంది బహుశా తీసుకొని రాసిన విషయం లో భేదం వల్ల నాకు మార్కులు ఎక్కువ వచ్చి ఉండచ్చు అంత మాత్రం చేత అతని ముందు నేను దేని లోనూ సరికాను అది నాకు పూర్తిగా తెలుసు .అతను ఏక సందా గ్రాహి. నేను అనేక సార్లు రుబ్బితే గాని అవగతం కానీ వాడిని అతనిది ఒరిజి నాలిటి .నాది ప్రయత్నం తో సాధించేది. బేసిక్ గా ఇంత భేదం మా ఇద్దరికీ ఉంది .చెంచారావు మార్కులు మాకు చెప్ప లేదు తప్పాడని తెలిసింది అతనికి ఇంఫీరియారిటి కాంప్లెక్స్ ఉంది .తాను నాయీ బ్రాహ్మణుడు కనుక తనను అందరు అగౌరవం గా చూస్తారని మాతో చాలా సార్లు అనే వాడు మేము అలా అతన్ని ఎప్పుడూ చూడలేదు ఒక రక మైన ఈగో ఉన్న మనిషి అతను .ఫెయిర్ గా ఉండడు

      రెండో ఏడు పరీక్ష రాసిన తర్వాత ఒక సారెప్పుడో తూమాటి దోణప్ప గారు గుంటూరు నుండి విశాఖ రైల్లో  వెళ్తుంటే నన్నూ కాంతారావు ను చేమ్చారావు ను ,జ్ఞాన సుందరాన్ని బెజవాడ స్టేషన్ కు తీసుకొని వెళ్లి ఆయనకు పరిచయం చేశాడు ఆయన బానే మాట్లాడారు ఇందులో ఏదో మర్మం ఉందని నాకు అని పించింది అప్పుడు రామకృష్ణా రావు యూని వెర్సిటి లో ఇంగ్లీష్ లెక్చరర్ అయ్యాడు దోణప్ప తెలుగు హెడ్ గా ఉన్నాడు .మమ్మల్ని ఎందుకు పరిచయం చేశాడా అని నేను చాలా సార్లు ఆలోచించాను .మా వాళ్ళే వీళ్ళు వీళ్ళని జాగ్రత్త గా చూడండి అని చెప్పటానికి అని పించింది ఎందుకో ఇలా పరిచయం చేసుకోవటం నచ్చలేదు ఒక రకం గా అదొక పైరవీ అనుకొంటాను ఇప్పటికి .సరే ఏమైనా నేనూ, కాంతారావు సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాం .మా ఇంటి దగ్గర గ్రాండ్ టీ పార్టీ ఇచ్చాము ఇద్దరం కలిసి మిత్రులంతా వచ్చారు .ఇదొక విజయం జీవితం లో తెలుగు మేస్టారి అబ్బాయిని తెలుగు లో ఏం ఏ చేయటం నాకు ఎంతో  ఆనందం గా ఉంది .ఎంతో శ్రమించాల్సి వచ్చింది .లైబ్రరి నుండి ఎన్సైక్లో పీడియాలు తెచ్చుకొని స్పెషల్ నోట్సు తయారు చేసుకొనే వాడిని ఇవి చదివి జీర్ణించుకొని మనసులో పెట్టుకొని పరీక్ష రాయటం చాలా శ్రమ అని పించింది ఇంకా ఈ పరీక్షలు వద్దు బాబోయ్ అనుకొన్నాను .మొదటి ఏడాదిలో పెద్దన గారి ‘’మనుచరిత్ర ‘’లో మొదటి చాప్టర్  ఉంది ఎంతో ఇష్టపడి చదివాను ‘’అట జనీ కంచె భూమిసురు డంబర చుంబి ‘’అనే పద్యం నేను తొమ్మిదో తరగతి లోనే చదివాను దీని పై ఎందరో ఎన్నెన్నో కామెంటరీలు రాశారు అవన్నీ సంపాదించి ఫుల్ నోట్సు రాసుకోన్నాను ఈ పద్యం విశ్లేషణ కు తప్పక ఇస్తారు అని పించింది అలానే ఇచ్చారు దానికి మార్కులు పది మాత్రమె అంటే పావు గంట రాస్తే సరిపోతుంది కాని నేను నా పైత్యం అంతా ప్రకోపించి నలభై అయిదు నిమిషాలు నేను చదివింది అంతా కక్కేశాను .అప్పుడు టై చూసుకొంటే గుండె గుభేల్ మంది ఇంకా జవాబు రాయాల్సిన ప్రశ్నలు ముఖ్యమైనవి చాలా నే ఉన్నాయి మూడు గంటల పేపరు .అన్నీ కుదించి రాశాను సమయానికి. అప్పుడు సంతృప్తి కలిగింది ఈవిషయాన్ని జీవితం లో మర్చి పోలేను .

        ముప్పాళ్ళ లో ఉండగా రెండో ఏడు పరీక్షలకు చదివాను నేను స్కూల్ కు పుస్తకాలు తీసుకొని వెళ్ళే వాడిని కాను .ఉదయం బడికి రాక ముందు రాత్రి లాంతరు వెలుగులో ఇంటి దగ్గర చదువుకొనే వాడిని కాని మా తెలుగు మేష్టారు బెటర్ మెంట్ కోసం రాస్తూ ఖాళీ పీరియడ్ వస్తే పుస్తకాలు తీసి చదివే వాడు నేను కొంచెం ఏది పించే వాడిని.అయన ఉలుక్కొనే వాడు .మొత్తం మీద ఆయనా సెకండ్ క్లాస్ స్దాధించాడు .

              పబ్లిక్ పరీక్షల్లో వాచర్ పని

   పబ్లిక్ పరీక్షలకు మమ్మల్ని వాచర్లు గా నియమించేవారు డి.యి.వో నుండి ఆర్డర్లు వస్తాయి ఇదొక ప్రహసనం .డబ్బు ఇచ్చిన వాళ్లకు కావలసిన చోట్ల వేస్తారని అనుకొనే వారు నాకు దాని గురించి ఆలోచన ఉండేది కాదు .వస్తే వెళ్ళటం లేక పోతే లేదు .మొదటి సారి ఉయ్యురులో పని చేస్తున్నప్పుడు బెజవాడ సుందరమ్మ స్కూల్ అనే ప్రైవేట్ స్కూల్ లో వాచర్ గా వేశారు అప్పుడు బేజ వాడలో మా కజిన్ సూరి రాదా కృష్ణ మూర్తి ఇంట్లో ఉండి వెళ్ళే వాడిని అక్కడే కాఫీ భోజనం పడకా అన్నీ .మా ఓదిన కామేశ్వరి నన్ను చాలా ఆదరం గా చూసు కొంది కారణం కూడా ఉంది విచ్చిన్నం అవుతుందను కొన్న వాళ్ళిద్దరి కాపురాన్ని సరి చేసిన వాడిని నేను .ఆ కృతజ్ఞత కూడా ఉంది .సుందరమ్మ స్కూల్ అంటే కాపీలకు నిలయం .అందరు ప్రైవేట్ విద్యార్ధులే దున్నల్లా ఉండే వారు మంచీ మర్యాదా కూడా ఉండేవికావు .పుస్తకాలు తెచ్చి హాయిగా రూమ్ లో ఉంచుకొని కాపీలు రాయటం ఆ స్కూల్ చరిత్ర ఈ విషయం నాకు ముందే తెలిసింది నేను ఎవర్నీ కాపీ కొట్టనివ్వకుండా చేశాను .గింగిర్లు ఎత్తి పోయారు . ఇన్స్పెక్టర్లు డియి వో లు వస్తారు వాళ్ళూ మనకేం పట్టిందని ఏదో చూసి చూడనట్లు వెళ్లి పోతారు వచ్చినా అదీ పరిస్తితి నాకు మాత్రం ఈ విధానం ఇష్టం లేదు చాలా స్ట్రిక్ట్ గా ఉండే వాడిని తల కదిలిస్తే అయి పోయి నట్లే పాపం నా వల్ల చాలా ఇబ్బంది పడి ఉంటారు నా డ్యూటీ నేను చేసే వాడిని రోజుకు పది రూపాయలో ఎంతో ఇచ్చేవారు రానూ పోను బస్ చార్జీలున్దేవి అంతే. ఇదో తిరణాల

        అంతకు ముందోసారి నాకు బందరు నోబుల్ హైస్కూల్ లో వాచర్ గా పడింది మా బావవివేకానందాం గారు  ఇక్కడే ఉన్నాడు రోజూ బందరు వెళ్లి రావటం కష్టం అందుకని ఆయన నన్ను బందర్లో వాళ్ళ పెద్దమ్మ అంటే‘’నరసక్కాయ్ ‘’వాళ్ళింట్లో దింపాడు వాళ్ళు నన్ను అపురూపం గా చూసుకొన్నారు బాగా ఉన్న కుటుంబం టిఫిన్ కాఫీ భోజనం అన్నీ అక్కడే రాజ భోగం అనుభ వించాను మంచి అంతహ్కరుణాఆప్యాయతా ఉన్న కుటుంబం యడవల్లి వారిది .నోబుల్ స్కూల్ లో గోపాల కృష్ణ అనే ఘంట సాల మేష్టారు దిపార్త్మేన్తల్ ఆఫీసర్ మహా కంగారు మనిషి ఇక్కడా కాపీలకేమీ కొదవ లేదు నా డ్యూటీ నేను చేసి సంతృప్తి చెందాను చోడవరపు బిందు మాధవ రావు గారు హెడ్ మాస్టారు అయన లెక్కల పుస్తకాలు రాశాడు ఆయన తమ్ముడు రామా రావు మా నాన్న గారు ఉన్గుటూర్ లో పని చేసి నప్పుడు లెక్కల మేస్టారు ఆ తర్వాతా ఆయన పెనమకూరు హెడ్ మాస్టర్ గా చేశాడు ఇంగ్లీష్ లో దిట్ట.ఆ స్కూల్ వాళ్ళు పబ్లిక్ పరీక్షలకు ఉయ్యూరు సెంటర్ కు వచ్చారు అప్పుడు పూజార్ల సందులో ఒక పెంకుటింట్లో వీరందరూ ఉండి పిల్లల తో పరీక్షలు రాయించారు అప్పుడే నేనూ ఎస్ ఎస్.ఎల్ సి రాశాను శిష్ట్లా సుబ్రహ్మణ్యం అనే వాడు అప్పుడే పరిచయం అయ్యాడు అతను బేజా వాడ లక్ష్మీ జెనరల్ స్టోర్సు వారికి బంధువు కొంత కాలం అక్కడ పని చేశాడు తర్వాతా అక్కడికి వెళ్లి నప్పుడు కలిసే వాడు ఆ స్తోర్సులో వెంకట రత్నం గారు అనే కోమటాయన మంచి ఎనేజర్ .మాటకారి మేము బట్టలు అక్కడే కొనే వాళ్ళం .పెళ్లిళ్లకు వేలకు వేలు అప్పు చేసి బట్టలు కొని పంటలు రాగానే తీర్చే వాళ్ళం మా మామయ్యా అక్కడే కొని మాకూ అలవాటు చేశాడు నాన్యమై వస్త్రాలు దొరికేవి అప్పుడు తర్వాత పడిపోయింది ఎంతో మంది గుమాస్తాలు .చివరికి షాప్ దివాలా తీసి ఓనర్ శిష్ట్లా లక్ష్మీ పతి శాస్త్రి ఆత్మహత్య చేసుకొన్నాడు బెజవాడ కృష్ణా నదిలోకి దూకి .

         ఆ తర్వాత ఇప్పుడు ముప్పాళ్ళ లో పని చేస్తున్నాను కనుక నన్ను నందిగామ డాన్ బాస్కో స్కూల్ లో వాచర్ గా వేశారు ప్రైవేట్ స్కూల్ .కాని ఘోరమైన కాపీల స్కూల్ డిపార్త్మెటల్ ఆఫీసర్ నల్లటి ఇన్స్పెక్టర్ మొదటి రీండు రోజులు యమా స్ట్రిక్ట్ గా ఉన్నాడు మూడో రోజు నుంచి పట్టించుకోవటం మానేశాడు ఏమిటి అని విచారిస్తే రెండో రోజు రాత్రి ఆయనకు ‘’పెద్ద బహుమానం ‘’అందించారనితెలిసింది నేను మొదటి రోజున ఎలా ఉన్నానో చివరి రోజూ అలానే ఉండి నా మనసుకు సంతృప్తి కలిగించాను .రోజమ్మ పిన్ని ఇంట్లో ఉండే వాడిని అక్కడే కాఫీ టిఫిన్ భోజనం పడకా .ఇక్కడా నాది రాజ భోగమే .పిన్ని మహా ఆప్యాయం గా చూసింది ఒక పూటే పరీక్ష కనుక సాయంత్రం సినిమాలకో ఎక్కడికో వెళ్లి వచ్చే వాడిని ఇదీ వాచర్ ప్రహసనం

      సశేషం –  మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –10-5-13-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.