ఆరోసారి బదిలీ –ముప్పాళ్ళకు వీడ్కోలు
ముప్పాళ్ళ లో ఉండగా రెండు మూడు సార్లు ఎరండ్ లీవ్ ను కూడా వాడుకోవలసి వచ్చింది .బదిలీ ఆర్డర్లు రాగానే 1-9-1972 సాయంత్రం హెడ్ మాస్టారు ఖాసిం సాహెబ్ గారు రిలీవ్ చేశారు .మంచి పార్టీ కూడా ఇచ్చారు .దూరం లో పని చేసినా నా డ్యూటి విషయం లో ఎన్నడూ అశ్రద్ధ వహించలేదు నా పై అధికారుల మన్ననలను పొందాను సహచరుల అభిమానాన్ని విద్యార్ధుల ఆత్మీయతను అనుభవించాను .స్ట్రిక్ట్ గా ఉండే మాట నిజమే అయినా పరీక్షలు పకడ్బందీ గా నిర్వహించటం నాకు అలవాటు దానికి భిన్నం గా ఎప్పుడూ నడవలేదు విద్యార్ధులు నన్ను చూస్తె భయపడటం నిజం .నా పాఠం ఆత్యంత శ్రద్ధతో వినటం అంతకంటే నిజం . చూపు అటూ ఇటూ తిప్పటం జరిగేదికాదు .జరిగితే రాం భజనే . .నాకు క్లాస్ లో కోపం ఎక్కువే ఉండేది అదీ బద్ధకిస్తులను చూస్తె నే .మిగిలిన వారిపై సాఫ్ట్ కార్నర్ తోనే ఉండేవాడిని .డిసిప్లిన్ కు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే వాడిని బహుశా ఇవే నా విజయానికి సపానలయ్యయేమో ?
పామర్రు లో చేరిక
మర్నాడు ఉదయమే అంటే 2-9-72ఉదయమే పామర్రు హైస్కూల్ లో చేరాను హెడ్ మాస్టారు జిల్లాలోనే గొప్ప పేరు మోసిన వి.రామ క్రిష్నయ్య గారు .పంచె కట్టే వారు చొక్కా, మెడలో ఖండువా ఆయన ప్రత్యేకత . ఎర్రగా బారుగా బక్క పలుచగా నవ్వు ముఖం తో ఉండేవారు ఒక రకం గా అక్కడ ఆయన్ను‘’దేవుడు మేష్టారు ‘’అనే వారు .పెద్ద స్కూలు నిర్వహణ కష్టమే అయినా చాలా ఓపికతో పని చేసేవారు‘’వర్క్ హాలిక్ ‘’ఆన్నదానికి ఉదాహరణ .వాళ్ళ అబ్బాయి హర్ష పదో తరగతిలో ఉండేవాడు .నాకు ఫిజికల్ సైన్సు క్లాసులే ఉండేవి ఇంగ్లీష్ కూడా టెన్త్ కు ఒక సెక్షన్ కు ఉండేది ఆ సెక్షన్ లోనే హెడ్ గారబ్బాయి ఉండేవాడు నేనే క్లాస్ టీచర్ని అతను మంచి బుద్ధిమంతుడు తెలివిగల వాడు వినయం ఉన్నవాడు .
రోజూ ఉయ్యూరు నుండి బస్ ఎక్కి వెళ్ళే వాడిని .తిరిగి వచ్చేటప్పుడూ అంతే .అప్పటికి చార్జీలు చాలా తక్కువే .సమయ పాలన చేసే వాడిని పాకలు, రేకుల షెడ్లు,భవనాలు అన్నీ ఉన్న స్కూలు .పూర్వం తాలూక కచేరి ఉండేది దీనిలో .మహా మహులైన హెడ్ మాస్టర్లు పని చేసిన చోటు .రామక్రిష్ణయ్యగారికి మంచి పేరుంది ఆయన టీచింగ్ చాలా ఆదర్శ వంతం గా ఉండేది .ఇంగ్లీష్ బాగా చెప్పేవారు .ఆ నాడు ఈయన ,ఈ.వి.ఆర్.,మిక్కిలినేని ,జనార్దన రావు గోపాల రావు, రామకోటేశ్వర రావు వంటి హెడ్ మాస్టర్లు అందరు లెఫ్ట్ ఆలోచన లున్న వారు వారితో ఉంటూనే వారికి భిన్నం గా ఉండేవారు రామకృష్ణయ్య గారు .స్టాఫ్ మీటింగ్ పెడితే గంట సేపు వాయించే వారు .అందులో ఏదీ తెలేదికాదు అందరు ఆదర్శంగా పని చెయ్యాలనే సిద్ధాంతం వారిది .అది చాలా మందికి చాదస్తం అని పించేది .ఆయన మంచితనాన్ని ,అలుసును కాష్ చేసుకొనే ఉపాధ్యాయులు చాలా మంది ఉండే వారు ..ఇందులో ఎక్కువ మంది క్లాస్ కు వెళ్ళినా ఏమీ బోధించాకుండా కాలక్షేపం చేసే వారేక్కువే .ఏమండీ అంటే ఆయన అలానే చెబుతాడు మన పని మనంచేస్తాం అని లైట్ గా తీసుకొనే వారు ఇది నాకు విడ్డూరం గా ఉండేది .
దీనికి తోడు స్టాఫ్ లో సఖ్యత లేదు రెండు గ్రూపులు .ఒక గ్రూప్ వారిలో ఎవరైనా బదిలీ అయితే ఆగ్రూప్ వారే టీ పార్టీ ఇచ్చేవారు .మిగిలిన వారు వ్వేల్తే వెళ్ళే వారు లేకపోతే లేదు ఇదీ పరిస్తితి అక్కడ ఘడియారం సుబ్రహ్మణ్యం అనేస్తానికుడు సెకండరి గ్రె డు గా ఉన్నాడు ఆయన ఆడింది ఆట .ఆయనకు ఎదురు చెప్పే సాహసం మిగిలిన వారికి లేదు ఆయనకు యెన్.సి.సి కూడా ఉంది ..ఇదంతా నాకు చిరాకుగా ఉండేది .నాకు సన్నిహితుఅలైన వారిలో తెలుగు మేస్టార్లు హేమాద్రి తిమ్మరుసు గారు ,గుంటూరు సత్యనారాయణ గారు సంస్కృతం మేష్టారు సూరపనేని ఆనంద రావు గారు ,ఉర్దూ మేష్టారు ,గుమాస్తా అంజి రెడ్డి ,లెక్కల మేష్టారు గండ్రం వెంకటేశ్వర రావు ,రాజి రెడ్డి మొదలైన వారుండే వారు మధ్యాహం ఇంటర్వెల్ లో రామమోహన రావు హోటల్ కి వెళ్లి నేనూ గండ్రం ఆయనా తిమ్మరుసు గారు కాఫీ తాగే వాళ్ళం లేక పోతే తిమ్మరుసు గారు తన ఇంటికి తీసుకొని వెళ్లి టిఫిన్ చేయించి కాఫీ ఇచ్చేవారు ఇంకో రోజున వెంకటేశ్వర రావు గారు. అలా గడిచి పోయేది .సెకండరి టీచర్లు నేతి శ్రీరామ మూర్తి గారు ,కానూరు చంద్ర శేఖర రావు గడియారం కామేశ్వర రావు ,పంచె కత్తే నరసయ్య గారు ,మల్లేశ్వర రావు హనుమంత రావు మొదలైన వారందరూ చాలా కలిసి ఉండే వాళ్ళం .చిన్న హిందీ మేష్టారు ప్రక్క ఊరి నుండి వచ్చేవారు.సుందరమ్మ పెద్ద హిందీ పండిట్ .కాకరాల రాధాకృష్ణ మూర్తి గారుకూడా హిందీ మేష్టారు గొల్వే పల్లి నుండి వచ్చేవారు .కంగారు మనిషి డ్రాయింగ్ మాస్టారు పెదమద్దాలి నుండి వచ్చేవారు .డ్రిల్ మేస్టార్లు సుబ్బారావు ,గంగయ్యగారు పద్మా రెడ్డి సోమి రెడ్డి వగైరాలుందే వారు మా సోషల్ మేష్టారు ఫాస్ట్ అసిస్టంట్ రంగామన్నారాచార్యులు గారు చిట్టి గూడూరు నుండి వచ్చే వారు .ఆయనకు ఇంచార్జి వస్తే అయిదు పీరియడ్ల బడే ఉండేది .ఆయన బాగా పలుకు బడి ఉన్న వాడు వరదా చారి గారి అబ్బాయి .మంచి భూస్వామి .నరసయ్య గారనే సైన్సు మేస్తారున్దేవారు రాళ్ళ బండి సాంబశివరావు సోషల్ మేష్టారు కొండూరి రాధాకృష్ణ మూర్తి గారు నాకు ఉయ్యూరు లో ఎనిమిదో క్లాస్ కు సోషల్ చెప్పిన వారు ఇక్కడ సోషల్ మేష్టారు .కే.కేశవరావు అనే స్సిన్సు మేష్టారు ,ఇంకో లెక్కల మేష్టారు ట్యూషన్లుపెట్టి బాగా సంపాదించారని చెప్పుకొనేవారు చెరొక ఇరవై ఎకరాలు ట్యూషన్ల వల్లే కొన్నారని అనుకొనే వారు .ఇంత పెద్ద స్టాఫ్ తో ఇన్ని రకాల అభిప్రాయాలున్న వారితో వేగటం కష్టమే పాపం రామకృష్ణయ్య గారు అలానే కాలికి బురద అంటకుండా లాక్కోచ్చేవారు
సశేషం –మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-6-13- ఉయ్యూరు