ఏబ్ లింకన్ గురించి కొన్ని విశేషాలు

             ఏబ్ లింకన్ గురించి కొన్ని విశేషాలు

           అబ్రహాం లింకన్ ను అందరు ఏబ్ లింకన్ అని ఆప్యాయం గా పిలుచు కొంటారు .ఆయన భావాలు తరతరాలకు ఆదర్శ ప్రాయాలు .ప్రభుత్వం నడిపే వారికి, ప్రజలకు లింకన్ ఎన్నో మంచి మాటలు చెప్పాడు .ఏ ప్రభుత్వానికైనా మొదటి విధి తనను తాను రక్షించుకోవటం తర్వాత దాని ఉనికి ని కాపాడుకోవటం అవసరం అన్నాడు లింకన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేబట్టే నాటికి ప్రభుత్వ నిధులన్నీ నైవేద్యం అయి పోయాయి .అంతకు ముందున్న ఏ ప్రెసిడెంట్ కు ఇంతటి ఆర్ధిక విపత్కర పరిస్తితి ఎదురు కాలేదు .ధైర్యాన్ని ,సాహసాన్ని ప్రదర్శించి మనసు దిటవు చేసుకొని అవగాహనా చాతుర్యం తో ,ప్రజల్లో విశ్వాసం కల్పించాడు ,ఉత్తేజం, ప్రేరణ కలిగించాడు .ప్రజా హృదయాలను గెలవటమే కాదు తనను తాను గెలిపించుకొన్నాడు అదీ లింకన్ అసమాన ప్రతిభ .

      ప్రెసిడెంట్ వాషింగ్ టన్ తర్వాత ప్రజల్లో ఇంత విశ్వాసం, నమ్మకం కలిగించిన వారెవరూ లేరు .లింకన్ మళ్ళీ అలాంటి విశ్వాసాన్ని ప్రజలకు కలిపించాడు స్తిర చిత్తం తో నిల బడ్డాడు .మూడేళ్ళ అస్తవ్యస్త స్తితి నుంచి గట్టెక్కించాడు .ఒక విశ్లేషకుడు చెప్పినట్లు ‘’కాలమే లింకన్ ప్రధాని మరియు సైన్యాధికారి ‘’.లింకన్ అటార్నీ గా ఉండి ప్రెసిడెంట్ పదవికి ఎదిగిన లాయర్. .ఆయన ఆకారాన్ని ‘’సామ్కోపాంజా‘’తో పోల్చి వినోదించిన వారూ ఉన్నారు .

           ఇంగ్లాండ్ రాజు హెన్రి ఫోర్త్ ను లింకన్ ను పోలుస్తూ Henry fourth ‘’went over the nation ‘-Lincoln steadily down the nation over to him .Henry left a united France  –LINCOLN RE UNITED America ‘’అని గొప్ప గా చెప్పారు .ఇంకొకరు విక్టోరియా రాణి తో పోలుస్తూ లింకన్ కూడా విక్టోరియా లా అందగాడు కాదన్నారు .అయితే అమెరికనిజం ఉన్న గొప్ప నాయకుడు అని కీర్తించారు .ఆయన్ను ‘’స్వయం సిద్ధ నాయకుడు’’ –ready made leader అన్నారు .    

        లింకన్ గొప్ప మేధావితనం, విషయావగాహనలోనే కాక ప్రజలను అర్ధం చేసుకోవటం లో కూడా కనీ పిస్తుంది .ఆయన ఆదర్శ నీయ మైన ,యదార్ధ రాజకీయ దురంధరుడు –స్టేట్స్ మాన్ ..ఉన్నదానిలో అత్యున్నత మైనదిఆశించటం ,కాకపోతే అంతకు దగ్గరలో ఉన్న దానిని పొందటం ఆయన లక్ష్యం ,లక్షణం . అయన లో విచక్షణ తో కూడిన అనుభవం పుష్కలం గా ఉంది .

         లింకన్ తాను ఎక్కడికి వెళ్ళినా తనతో బాటు అమెరికాను తీసుకొని వెళ్ళాడు .ఆయన పొందినదాన్నే అనుభ వించాడు .ఆయన్ను ప్రజల సాధారణ జ్ఞానానికి ప్రతి నిధి గా, అవతార స్వరూపుడిగా భావిస్తారు .ఆయన వాగ్దోరణి లో‘’సెంటి మెంట్ ‘’అనేది ఉండక పోవటం ప్రత్యేకత ఇది రాజ కీయ నాయకులందరూ గమనించాల్సిన విషయం ..సందర్భం సంఘటనల నేపధ్యం లో వాటిని తనకు, దేశానికి అనుకూలం గా మార్చుకొని రాజకీయాలు నడిపాడు సంఘటనలే ఆయనకు దారి చూపాయి కాలనీ ప్రజల దీర్ఘ ప్రయోజనాలనే దృష్టిలో పెట్టు కొని పని చేసిన మహోన్నత నాయకుడు లింకంన్ .లింకన్ కు ఆదర్శం ఫ్రెంచ్ తత్వ వేత్త ,దార్శనికుడు ‘’వోల్టైర్ ‘’చెప్పిన సూక్తి ‘’A consideration of petty circumstances is the tomb of great things ‘’అనేదే .

        ఏ విషయం వచ్చినా ‘’రండి కలిసి ఆలోచించి చర్చిద్దాం ‘’అనే వాడు ప్రజల ప్రేమను ,వారి తీర్పును అంత గొప్ప గా పొందిన ప్రెసిడెంట్ లేనే లేడు.మనిషి లోనుంచే ఉన్నత భావాలు రావాలి కనుక మనుష్యుల తో చర్చించి నిర్ణయాలు తీసుకోవటం లింకన్ కు ఇష్టం .నిర్ణయం తాను తీసుకొని ప్రజల మీద రుద్దటం భావ్యం కాదని భావించేవాడు ..ఆయన మాటల్లోకాని ,ప్రసారాల్లో కాని చాలా నిజాయితీగా ‘’this is the conclusion to which in my judjement ,the time has come and to which accordingly ,the sooner we come the better for us ‘’అనే వాడు .ఎక్కడైనా ‘’I’’అని ఉపయోగించినా అందులో ఈగోయిజం ఉండేది కాదు

         అయన మాట్లాడుతూ ఉంటె ప్రజలు తమ మనో భావాలను తాము బయట పెట్టుకొంటున్నట్లు గా ఉండటం లింకన్ తో ప్రజల మమైక్యానికి నిదర్శనం .ప్రజలకున్న తెలివి తేటల ను ప్రశంసించే వాడు .దానినే ప్రస్తావిన్చేవాడు .వారి అజ్ఞానాన్ని ,అమాయకత్వాన్ని గురించి ఎప్పుడూ మాట్లాడే  కాదు అదీ ప్రెసిడెంట్ లింకన్ వ్యక్తిత్వం . .ఎన్నికలలో మెజారిటీ సంపాదించటమే కాదు తన దేశ ప్రజలను తన దగ్గరకు తెచ్చుకొనే వాడు అంత నిజాయితీ నిర్భీకత ,శక్తి ఉన్న నాయకుడు ఏబ్ లింకన్ .

           ప్రెసిడెంట్ లింకన్ హత్య గావింప బడి చని పోతే ప్రజలు ‘’సామాన్య మాన వీయత ‘’ను కోల్పోయి నట్లు దుఖించారు .తమ   ఆరాధ్య  దైవం మరణించి నట్లు విలపించారు తమ మార్గ దర్శి ,సంక్షేమ కామి చని పోయినట్లు బాధ పడ్డారు .ఇంత గా ఏ ప్రెసిడెంట్ చని పోయినప్పుడూ ప్రజలు స్పందించలేదు .అదే ఆయన ప్రజల్లో కలిగించిన చైతన్యం . .ప్రజల్లో ఉన్న వీర ఆరాధన .ప్రజలకు, ఆయనకు భేదమే లేని అద్వైతం ఆయన సాధించాడు .మహోన్నతా మానవతా మూర్తి అబ్రహాం లింకన్ అమర్ రహే .

            9-8-2002 నా అమెరికా డైరీ నుండి మీ కోసం జేమ్స్ రస్సెల్ రాసిన వ్యాసం చదివిస్పూర్తి పొంది రాసుకొన్న విషయాలివి

           మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-6-13- ఉయ్యూరు .

 
 
 


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.