చైతన్య స్రవంతిని పోషించిన ఫాక్నర్ –1

               చైతన్య స్రవంతిని పోషించిన ఫాక్నర్ –1

               అమెరికా దేశానికి చెందిన విలియం ఫాక్నర్ మిసిసిపీ లో 25-9-1897 లో పుట్టాడుrపేరురు గల వంశమే ఆయనది .బాల్యం అంతా  మిసిసిపి  లోనే గడిచింది .తల్లితోను మిగిలిన కుటుంబ సభ్యులతోను జీవితాంతం బాంధవ్యాన్ని కోన సాగించాడు .తల్లి చనిపోతే  తండ్రి ఒక నీగ్రో స్త్రీని వివాహం చేసుకొంటే ,మారుటి తల్లి నీ తల్లిలాగా గౌరవించిన సంస్కారి .చిన్నప్పటి నుంచే కధలు చెప్పటం అలవాటయింది తల్లికి అతనితో క్లాసిక్ లిటరేచర్ ను చదివించాలని ఆరాటం ఉండేది .ఆమె చాలా మొండిది .వంటింట్లో ‘’do not complain ,’’do not explain’’ అని రాసి పెట్టుకోంది తండ్రి తాగుబోతు .

 

 

 

          ఫాక్నర్ చిన్నప్పటి నుంచే బొమ్మలు వేసే వాడు .అప్పటికే లా ,మెడికల్ పుస్తకాలు చదివేశాడు .కాని గ్రాడ్యుయేట్ కాలేక పోయాడు .అందరికంటే తెలివి తేటలలో ఆధిక్యం గా ఉండేవాడు .ఎస్తేల్లా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు .ఆ ప్రేమ విఫలమైంది .ఫైల్ స్టన్ అనే అతను ఫాక్నర్ కు మంచి పుస్తకాలు ఇచ్చి చదమని ప్రేరేపించాడు .అప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది ..కెనడా వెళ్లి ఎయిర్ ఫోర్స్ లో చేరాడు . ఆం హీర్స్ట్లోని యాంగ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని యూరప్ వెళ్లి అక్కడి మేధావులతో కాలక్షేపం చేశాడు .బాల భట సంఘానికి నాయకుడు గా పని చేశాడు .తాగుడు విపరీతం అయి నందు వల్ల  పీకేశారు

         నెమ్మదిగా ఫ్రెంచ్ భాష నేర్వటం మొదలు పెట్టాడు .కార్టూన్లు గీసే వాడు ఇన్ని తెలివి తేటలున్నా అందరు అతన్ని ‘’ఫూల్ ‘’అనే వారు ..1919 లో కవిత్వం రాయటం మొదలు పెట్టాడు .1920 లో Falkner గా ఉన్న తన పేరును తానే Faulkner గా మార్చుకొన్నాడు ‘’The lilacs ‘’ .అనే కవితా సంపుటిని రాసి విడుదల చేశాడు .తరువాత ‘’విజన్స్ ఇన్ స్ప్రింగ్ ‘’రాశాడు .అతని కవిత్వం లోని సింబాలిక్ ఇమేజేరి అందరికి నచ్చింది .దీని తర్వాతా‘’మార్బుల్ పాం ‘’అనేది కవితా సంపుటి రచించాడు .తర్వాత ఫాక్నర్ ధ్యాస అంతా నవలల మీదే పడింది.mosquitoes ,soldier’s pay నవలలు రాశాడు .1927 లో ‘’ఫ్లాగ్స్ ఇన్ ది డస్ట్ ‘’ రాశాడు .ఫాల్క్నర్ రచనలను విశ్లేషకులు జేమ్స్ జాయిస్ ,డాస్తో విస్కీ రచనల తో పోల్చారు .మంచి ప్రోత్సాహం లభించింది .అతను రాసిన సౌండ్ అండ్ ఫ్యూరీ నవలను”’Greek tragedy in North Msisipi ‘’ అన్నారు

              ఫాక్నర్ చిన్న కధలు కూడా రాశాడు .పవర్ ప్లాంట్ లో రాత్రి డ్యూటీలు చేశాడు ఆ సమయం లో ఎన్నో చదివాడు ఎంతో రాశాడు .1929-32 మధ్య ‘’As I lay dying ‘’నవల రాశాడు .దీనికేమీ విశేష ప్రాచుర్యం రాలేదు పెద్దగా అమ్ముడు కూడా పోలేదు .దీని తర్వాత ‘’sanctuary ‘’రచించాడు .దాన్ని ‘’one of the terrifying books ‘’అని జనం మెచ్చారు .ఎంతో అరుదైన గొప్ప పుస్తకం గా దానికి పేరొచ్చింది .ఫాక్నర్ మేధో విలసితం అని కీర్తించారు .ఆ పుస్తకాన్ని మన’’ గుడి పాటి వెంకట చలం ‘’పుస్తకాలను ఆకాలం లో ఎలా రహస్యం గా కొని ఎవరికీ కనపడ కుండా దాచుకొని రహస్యం గా చదివే వారో అలా చదివారు ‘’these 13 ‘’అనే కధలు.’’డార్క్ హౌస్ ‘’అనే నవలా రాశాడు .భార్య కోరిక పై దాని పేరు ను ‘’light in August ‘’గా మార్చాడు .ప్రాచుర్యం పెరిగి పోయింది ఫాక్నర్ ఏది రాసినా ప్రచురించే స్తితి లోకి పబ్లిషర్లు తయారయ్యారు .అంతకు ముందు తన పుస్తకాలను ప్రచురించమంటే తిరస్కరించిన పబ్లిషర్లు ఇప్పుడు ఫాక్నర్ ఇంటి మూడు ‘’క్యూ కట్టారు ‘’ఆయన దయా దాక్షిన్యాలకోసం ఎదురు చూశారు .పిచ్చ డబ్బు రావటం ప్రారంభమైంది దీని తో తాగుడూ పెంచేశాడు అతనికి ప్రైవేట్ జీవితమే ఎక్కువ .ఇంకేముంది సినిమా వాళ్ళు వెంట బడ్డారు .సినిమాలకూ పని చేశాడు

            Sanctuary నవలను పారామౌంట్ దియేటర్ వాళ్ళు’’ క్లార్క్ గేబుల్ ‘’ను హీరో గా పెట్టి సినిమా తీశారు .తరచూ యూరప్ పర్యటన చేసే వాడు ‘’ In Europe people asked what he thought ,but in California people asked where he had bought his hat ‘’అని తానే చెప్పుకొన్నాడు ఆ దేశాలకు ,అమెరికా కు ఉన్న తేడాను దీనితో ఆవిష్కరించాడు .1932 లో తండ్రి చనిపోయాడు ఫాక్నర్ కుటుంబ బాధ్యతలను మీద వేసుకొన్నాడు మారుటి తల్లి చనిపోతే దగ్గరుండి అంత్య క్రియలు చేశాడు .’’mammy  her white children bless her ‘’అని సమాధి మీద కృతజ్ఞతా పూర్వకం గా రాయించాడు .1933 లో ‘’Absalom ,Absalom ‘’నవల రాశాడు .తాను రాసిన‘’the un vanquished ‘’నవలను m.g.m.స్టూడియో వారికి అమ్మేశాడు .1935 ఫాక్నర్ కు జాతీయ గౌరవం లభించింది .ఆయన్ను ‘’లిరిక్ పోయేట్ ‘’అని కొని యాడారు .అంతే కాక most impressive novelist ‘’అని ప్రశంసించారు ‘

        భార్య ఎస్తేల్లా తాగుడుకు బానిస అయింది .చికిత్స చేయించాడు .విడాకులు మాత్రం ఇవ్వలేదు .నౌకాయానం వేట గుర్రపు స్వారీ అన్నీ నేర్చాడు 1940 లో మూడు నవలలు ‘’the wild palms ,the hamlet godown moses ‘’నవలలు రాసి ప్రచురించాడు .అతని సాహితీ వ్యాసంగానికి అబ్బుర పడి న్యూ యార్క్ టైమ్స్ బుక్ రివ్యు లో‘’declared that no living American author could match Faulkner ‘’అని మహోన్నతం గా కీర్తించింది .ఆయన తో జరిపిన ఇంటర్వ్యు ను m.g.m. సంస్థ సినిమా తీసిందంటే ఫాక్నర్ ప్రాభవం ఎంత ఉత్కృష్ట స్తాయి లో ఉందొ తెలుస్తోంది .

     1949 సంవత్సరానికి విలియం ఫాక్నర్ కు సాహిత్యం లో నోబుల్ బహుమతిని 1950 నవంబర్ పది న ప్రకటించి గౌరవించారు .తత్వ వేత్త బెర్ట్రాండ్ రసెల్ తో పక్కన కూర్చుని ఈ నోబెల్ ను గ్రహించాడు ఫాక్నర్ మరుసటి ఏడాది  రసెల్ కు ఆ బహుమతి దక్కింది .బహుమతి ప్రదానోత్సవం లో మాట్లాడమంటే ఫాక్నర్ అతని అమెరికా దక్షిణ ప్రాంత భాషలో చాల ఉద్వేగ భరితం గా మిసిసిపి నదీ వేగం గా మాట్లాడాడు .అక్కడున్న వారు అర్ధం చేసుకోలేక పోయారట మర్నాడు అదే పేపర్లలో వస్తే ‘’బాగు బాగు సేభాష్ ‘’ అని మెచ్చుకోన్నారట .దానిని ‘’best speech given at a Nobel dinner అని ఆశ్చర్యం తో ఆనందం ప్రకటించారు .తనకు వచ్చిన ముప్ఫై వేల డాలర్ల నగదు బహుమానాన్నిLafayetteకౌంటీ  లో ఉన్న ox fold నల్ల జాతీయుల జీవితాలు బాగు చేసే సేవాకార్య క్రమాలకు అందజేశాడు .చివరగా రాసిన పుస్తకం the river ‘’దీనిని ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వేన్ రచన తో విశ్లేషకులు పోల్చారు .చాలా సంస్థలు ఫాక్నర్ ను గౌరవించి సత్కరించాయి అతని కూతురు జిల్ అనే అమ్మాయి పాల్ అనే అతడిని పెళ్లి చేసుకొంటున్నాను వచ్చి చూడమని కోరింది సరేనన్నాడు వెళ్ళాడు తండ్రిని పరిచయం చేస్తే ‘’who is faulkner ?అన్నాడట ఆ మొగుదు .అప్పుడు తండ్రి గొప్పతనాన్ని స్వయం గా తెలియ జెప్పింది .

            ఫాక్నర్ కున్న భావాల వల్ల ఆయన్ను కమ్యూనిస్ట్ అనుకొన్నారు సాంస్కృతిక రాయబారిగా గ్రీస్ ,జపాన్ దేశాలు పర్య టించి అమెరికా పై గౌరవం కల్గించాడు ఫాక్నర్ .తన ఫారం హౌస్ లో గుర్రాలను పెంచాడు 1962 జూన్17న ఒక అడవి గుర్రం పై స్వారి చేస్తుంటే అది కింద పడేస్తే వెన్నెముక దెబ్బ తిండి రక్తం గడ్డకట్టి ‘’Rowan oak ‘’అనే స్వంత వ్యవసాయ క్షేత్రం లో జూలీ ఏడున మరణించాడు తన చావు సంగతి అతనికి ముందే తెలుసు .ఇలా రాసుకొన్నాడు ‘’the moment ,instant ,night ,dark ,sleep ,when I would put it all away forever that I anguished and sweated over and it would never trouble me any more ‘’

           మరిన్ని విశేషాలు ఇంకో సారి

2-9-2002 సోమ వారం నాటి నా అమెరికా డైరీ నుండి

           సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –24-6-13- ఉయ్యూ


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.