నా దారి తీరు -33 ఉయ్యూరు వచ్చిన నాలుగు నెలలకే బదిలీ –సంతానం గారి ట్రాన్స్ఫర్లు

 నా దారి తీరు -33

                        ఉయ్యూరు వచ్చిన నాలుగు నెలలకే బదిలీ  –సంతానం గారి ట్రాన్స్ఫర్లు

            ఏడవ సారి బదిలీ అయి ఉయ్యూరు వచ్చిన సంతోషం నాలుగు నెలలకే ఆవిరయింది . అప్పుడే జిల్లా పరిషత్తుల చైర్మన్ అధికారాలు పోయి స్పెషల్ ఆఫీసర్ అధికారి అయ్యాడు అప్పుడు కలెక్టర్ అరవాయన .సంతానం గారు .చాల ముక్కు సూటి మనిషిగా పేరు పరిషద్ ఆఫీసర్ గా ఒక పశువుల డాక్టర్ గారొచ్చారు వీరిద్దరూ జిల్లా పరిషద్ స్కూల్స్ పోస్టింగులు ట్రాన్స్ఫర్లు చేయాలి .అప్పుడు ఏ జిల్లాలోను లేని విధం గా కృష్ణా జిల్లాలో ‘’నేటివిటి ‘’జీ.వో .ను ముందే అమలు చేశారు అంటే స్వగ్రామం లో ఎవరూ పని చేయరాదు దూరం గా పని చేయాలి స్వంత మండలం లో కూడా ఉండరాదు అనే నియమం అమలు చేశారు .దీనితో బదిలీలు స్కూళ్ళు తెరిచిన నాలుగైదు రోజుల్లోనే అత్యంత రహస్యం గా వచ్చాయి వీటినే మేము ‘’సంతానం  గారి ట్రాన్స్ ఫర్లు’’ అన్నాం .ఈ బదిలీల సమయం లో హెడ్ మాస్టర్ గా రేగుల పాటి  సీతా పతి  రావు గారున్నారు .ఆయన బ్రాహ్మణులు వారబ్బాయి ఉపనయనం ఉయ్యూరు లోనే చేశారు .మమ్మల్ని ముఖ్యం గా బ్రాహ్మణులనే పిలిచినజ్ఞాపకం .ఆయన కు కావలసిన సహాయం అంతా అందించాను .సరదా మనిషి .చేతిలో చిన్న బాగ్ తో వచ్చే వారు .కుది మట్టం గా పొట్టిగా ఉండేవారు ..పెద్ద స్కూళ్ళలో చేసిన అనుభవం ఉంది .ఆయన స్కూల్ తెరవగానే రోజూ మమ్మల్ని ఉడికిన్చేవారు. రెండు మూడు రోజుల్లో మీరంతా ట్రాన్స్ ఫర్ అయి పోవటం ఖాయం .కలెక్టర్ గారు చాలా స్ట్రిక్ట్ .బి .యి.డి.మేస్టార్లు ముందు వెళ్లి పోతారు ..తర్వాత తెలుగు మేస్టార్లు ఆ తర్వాతా సేకడరీలు చివరికి క్రాఫ్ట్ ,డ్రిల్ మేస్టార్లు. చివరికి హెడ్ మాస్టర్లు బదిలీ అవుతారు ‘’అనే వారు మేమూ దీన్ని ఎప్పటి నుంచో ఊహిస్తున్నాం .మనసులో సిద్ధపడే ఉన్నాం .

                       ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వచ్చిన రోజున ప్రహసనం

           స్కూల్ కు స్పెషల్ మేసేన్జేర్ తో కలెక్టర్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లు సీల్డ్ కవర్ లో పంపారు .ఎక్కడా లీక్ కాలేదు .అందరూ దూర తీరాలకే వెళ్లి పోతాం అనుకొన్నాం .అప్పటికి ఇంకా పాఠాల హడా విడి లేదు కనుక అందరిని తన రూమ్ కు రమ్మని పిలిపించారు ..వెళ్లాం ఒక్కొక్కరి ట్రాన్స్ఫర్ ను చదువుతున్నప్పుడు అయన ముఖం ‘’వెయ్యి కాండిల్ బల్బ్’’ లా గా వెలిగి పోతోంది .నన్ను విస్సన్న పేట కు ట్రాన్స్ఫర్ చేశారు .బి.యి.డి టీచర్ల పేర్లన్నీ అయిపోయాయి అందరు బదిలీ అయిన వాళ్ళే .ఒక ఏడాది సర్వీస్ ఉన్న వారిని భార్యా భర్తలను మార్చలేదు .తెలుగు పండిట్ల ఆర్డర్లు చదివారు ..అప్పుడూ ఆయన ముఖం వెలిగి పోతూనే ఉంది .చివరికి ‘’seethaa pati rao transferred to bhava devarapalli ‘’అని చదివి కూలి పోయాడు .వెయ్యి ఏనుగులను తిన్న రాబందు ఒక్క గాలి వానకు కూలినట్లు అయింది .ముఖం లో నెత్తురు చుక్క లేదు .తనకు బదిలీ రాదుఅని ధీమాగా  అనుకోన్నాడాయన .కానీ ఆయనకూ తప్పలేదు హెడ్ మాస్టర్ల బదిలీలు కూడా జరిగాయన్న మాట .అందుకే అంతసీక్రెట్ గా జరిగింది అని చెప్పాను ..మనుష్యులు   ప్రవర్తన తీరు ఎలా ఉంటుందో తెలిపేందుకే దీన్ని చెప్పాను .తనదాకా వస్తే కాని ఎవరికి తెలిసి రాదు .

                        ఎనిమిదో బదిలీ –విస్సన్న పేట లో చేరిక

                ఆర్డర్లు అందుకొన్న వెంటనే ఉపాధ్యాయులను బదిలీ చేయాలని ,అలాస్యం  చేయ వద్దని స్ట్రిక్ట్ ఇంస్త్రక్షన్లు .అందుకొనే ఆర్డర్లు వచ్చిన రోజునే అంటే 21-6-1976 సాయంత్రమే మమ్మల్ని ఉయ్యూరు స్కూల్ నుంచి విడుదల చేశారు .జిల్లా పరిషత్తు చేసిన బదిలీలు కనుక ట్రాన్సిట్ వాడుకొనే అవకాశం ఉంది ..ట్రావెలింగ్ అలవెన్స్ వస్తుంది .అందుకని నేను 22-6-76 నుండి 29-6-76 వరకు ట్రాన్సిట్ వాడుకొని 30-6-76 ఉదయం విస్సన్న పేట హైస్కూల్ లో చేరాను .హెడ్ మాస్టారు గాడే పల్లి దక్షిణా మూర్తి శాస్త్రి శర్మ గారు .ఆయన మాకు దూరపు బంధువే .మా రెండో బావ వివేకానందం గారి పెద్ద బావ గారు కృష్ణ శాస్త్రి గారికి తమ్ముడు .ఈయన పెంపకానికి వెళ్ళాడు .ఇదివరకు ఉయ్యూరు లో పని చేసి ఇక్కడికి వచ్చారు నూజి వీడు నివాసి మాంచి స్తితి పరులు పొలం ,మామిడి తోటలు స్వంత ఇల్లు ఉన్నాయి .అక్కడ .ఆయన భార్య వెంకమాంబ హిందీ పండిట్ .మా కోలచల చలపతికి స్వయానా అక్క .ఆవిడ అక్క కూడా సూరి శ్రీ రామ మూర్తి అనే మా దూరపు బంధువు కు భార్య .ఇంకో అక్క విధవరాలు రాయప్రోలు వెంకాయమ్మ.సూరి వారి బజార్లో వారికి స్వంత ఇల్లు కూడా ఉంది ..ఆకుటుంబం మా ఇంట్లో జరిగిన అన్ని శుభకార్యాలకు వచ్చే వారు ..అనుకోకుండా ఇలా బంధువు దగ్గర పని చెసె అవకాశమ్ వచ్చింది .శాస్త్రి గారు  ఉత్తర ప్రత్యుత్తరాలు ,అటెండేన్సు రిజిస్టర్ తో సహా అన్నీ తెలుగు లోనే నిర్వహించేవారు .విస్సన్న పేట ఎక్కడో అప్పటి దాకా నాకు తెలీదు నెమ్మది గా తెలుసుకొన్నాను నూజి వీడు స్టేట్ బాంక్ లో మా రెండవ తోడల్లుడు చతుర్వేదుల సదా శివ మూర్తి గారు అనే ఫేమస్ హెడ్ మాస్టర్ గారి అబ్బాయి శ్రీరామ మూర్తి పని చేస్తున్నారు ఇది వరకు ఒకటి రెండు సార్లు నూజి వీడు లో వాళ్ళ ఇంటికి వెళ్లాం .వాళ్ళ అమ్మగారు అక్కడే లక్ష వత్తుల నోము  సూరి వారి రామ మందిరం లో నోచుకొంటే వెళ్లాం .కనుక ఇబ్బంది లేదని పించింది .

                       విస్సన్న పేట లో కాపురం

          కొన్ని రోజులు నూజివీడు లో మా వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడి నుండి విస్సన్న పేట కు రోజూ వెళ్లి వచ్చేవాడిని శనివారం సాయంత్రం ఉయ్యూరు కు వెళ్ళే వాడిని ..ఆ తర్వాత విస్సన్న పేట ఊరిలో ఆయుర్వేద డాక్టర్, బ్రాహ్మణులూ అయిన మల్లయ్య గారింట్లో ఒక గది అద్దెకు తీసుకొని ఉన్నాను .యాభై రూపాయలు అద్దె ..స్వంతం గా వంట చేసుకొనే వాడిని మల్లయ్య గారికి పాడి ఉండేది పొద్దున్నే పాలు పోసే వారు అప్పటికే ఆయన ముసలి వారు చాల మంచి కుటుంబం నన్ను ఎంతో ఆదరించారు భార్యా భర్త లిద్దరూ స్కూల్ కు దూరమే వీరిల్లు నాకు మంచం కుర్చీ వారే ఏర్పాటు చేశారు .ఆందుకు తింటూ కాల క్షేపం చేశా .కాని ధ్యాస అంతా మళ్ళీ ఉయ్యూరు మీదకు మళ్ళింది .అప్పటికే కొందరు ట్రాన్స్ ఫర్లను మార్చుకొని దగ్గర గ్రామాలకు చేరుతున్నట్లు సమాచారం రాజకీయ ప్రభావం డబ్బుల ప్రభావం బాగానే నే పని చేస్తున్నాయని క్రమం గా తెలిసింది చీమ బొక్క దొరికితే పాము అందులో చేరి నట్లు క్లూ దొరుకుతుందేమో నని నా చిన్ని చిన్ని ఆశ .మల్లయ్య గారింటి పక్కనే తూటుపల్లి వారి కుటుంబం ఒకటి ఉండేది .ముసలి ద్సస్మ్పతులు ,పెళ్లి కాని ఆడపిల్లలు ముసలావిడ మా ఉయ్యూరు లో సూరి కృష్ణ మూర్తి అనే సెకండరి మేస్టారి భార్యకు సోదరి అని విన్నాను .వాళ్ళో పలకరించలేదు నేనూ మాట్లాడలేదు .

                       స్కూల్ జీవితం

        పెద్ద స్కూలు .హెడ్ గారు చాలా నిక్కచ్చి మనిషి .ఈ చుటట్టు పక్కల ప్రాంతాలలో ఆయన కు మంచి పేరుంది మంచి లెక్కల మేసస్టరిగా ప్రాచుర్యం పొందారు ఇంగ్లీష్ లోను డ్రాఫ్ట్ రాయటం లోను దిట్ట .అప్పుడు స్కూల్ లో పత్రీ రామ మోహన రావు అనే తెలుగు పండిట్ ఉండేవాడు .నాకు క్రమంగా మిత్రుడయ్యాడు ఇంకొక ఆచార్యుల వారు కూడా తెలుగు చెప్పేవారు ఈయన పంచాలాల్చీ ధరిస్తే రావు ప్యాంటు వేసే వాడు కుర్రాడే .మంచి కవిత్వం రాసే వాడు ఇంఫ్లుఎంస్ బానే ఉంది .అక్కడే సెకండరీ టీచర్ గా కోట సోమయాజులు గారు చాలా కాలం నుండి పని చేస్తున్నారు ఆయనా మంచి స్నేహశీలి .వారింటికి వెళ్ళే వాడిని .ఈయనది శాయపురం ఆ ప్రాంతం లో పని చేస్తుండగా చూశాను ఇంకో సెకండరి టీచర్ ఆ స్కూల్ లోనే చేరి అక్కడే రిటైర్ ఆయినా అయన మాతో పని చేశాడు పేరు గుర్తు లేదు .కోటి మేస్తారో ఏదో .ఆయన అంటే అందరికి గౌరవం .సుదర్శన రావు అనే సోషల్ మేష్టారు ఉండేవాడు క్లాస్ కు వెళ్ళాలంటే భయం .అందులో పదో క్లాస్ కు మరీను ..డ్రిల్ మేస్టార్లు కుర్రాళ్ళే .సత్యనారాయణ అని ఉయ్యూరు లో లైబ్రరీ ప్రారంభామైనప్పుడున్న లైబ్రేరియన్ ఇక్కడే ఇప్పుడు పని చేస్తున్నాడు .ఒక డ్రాయింగ్ మాస్టారు బారుగా తమాషా గా ఉండేవాడు మంచి ఆర్తిస్త్న్ అని పేరు .పుల్లయ్య అనే కోమటి ఆయన నా ముందు సైన్సు మేష్టారు గా పని చేసి ఇప్పుడు ఉయ్యూరు బదిలీ అయ్యాడు .లాబ్ ఆయనే నాకు అప్పగించాడు ఆయన మా ఉయ్యూరులో వెటప్రగడ సాంబయ్య గారి చెల్లెలు కు అల్లుడు ..ఆ చెల్లెలు వాళ్ళది ఆకిరి పల్లి ఆమె భర్త కూడా మాకు బాగా పరిచయం .సంకా .పుల్లయ్య గారు టీచర్స్ కోఆపరేటివ్ బాంక్ ప్రెసిడెంట్ .  .నిర్దుష్టం గా నిర్వహించేవాడని చెప్పే వారు అక్కడి వాడే .కనుక ప్రాబల్యం ఎక్కువ .

               అటెండేన్సు లో పేర్లు తెలుగు లో రాసి వారు బోధించే సబ్జక్ట్ కింద రాసేవారు .అక్కడ అవ్వారు శ్రీనివాస రావు అనే క్రాఫ్ట్ మేస్తారుండే వాడు ఉయ్యూరు లో కొడాలి రామా రావు గారనే హిందీ మేస్తారికి దగ్గరి బంధువు .. ఆయన పేరు కింద ఆవ్వారు  శ్రీనివాస రావు –‘’నవ్వారు నేత ‘’అని రాసేవారు దీన్ని ఎవరూ గమనించలేదు .ఒక సారి నేనే చూసి అతనితో చెబితే భలేగా నవ్వు కొన్నాడు .‘’రైం’’బాగా కుదిరింది అతనిపేరుకు ..

            సుదర్శన రావు గారికి టెన్త్ ఇంగ్లీష్ అదీ చివరి సెక్షన్ ఇచ్చి నాకు తొమ్మిది ఇంగ్లీష్ ఇచ్చారు .ఆయన క్లాస్ కు వెడితే ఒకటే గోల .హెడ్ గారోస్తే కాసేపు ఊరుకొనే వారు .ఆ తర్వాతా మామూలే .ఆయనే ఒక సారి నా దగ్గర కొచ్చి’’ నేను ఆక్లాస్ కు వెల్ల లేనండీ .మీరే చెప్పండి .మీ క్లాసుల్లో ఎవరూ అల్లరి చేయరు నేను వెళ్తే చేపల బజారు ‘’అని వాపోయాడు .క్రమం గా హెడ్ గారికి పరిస్తితి అర్ధమయ్యింది నన్ను పిలిచి‘’మీరు ఆక్లాస్ తీసుకొంటారా ?’’అని అడిగారు .’’మీరిస్తే తీసుకొంటాను ‘’అన్నాను’’ మీకూ కష్టమేనేమో ?’’అన్నారు .ప్రయత్నిస్తాను అన్నాను .అప్పుడు విద్యార్ధులలో ఆక్లాస్  లో తెలివి గల పిల్లలు లేరు అంతా’’బిలో ఆవేరేజ్ ‘’వాళ్ళే .నేనే ఆ క్లాస్ కు ఫిజికల్ సైన్సు చెప్పే వాడిని .అన్ని సేక్షన్లకు భిన్నం గా వీరికి అతి తక్కువ కాలం బోధించి నోట్సు ను సంక్షిప్తం గా చెప్పి మర్నాడు క్లాస్ లో వాటిని నోటికి వచ్చేట్లు చేసి వారందరి మన్ననలు పొందాను హెడ్ గారికీ నా బోధనా  విధానం అర్ధమయింది మిగిలిన క్లాసుల్లో పకడ్బందీ గా బోధించే వాడిని అన్ని క్లాసుల్లోనూ సబ్జెక్ట్ నోటికి రావలసిందే .ఇంటి దగ్గర చదువుకొని రావాల్సిందే ..రోజూ రెండు మూడు ప్రశ్నలకు జవాబులు  చూచి రాత గా రాసి చూపించాల్సిందే .అన్నీ నేను చూడాల్సిందే సంతకం పెట్టాల్సిందే .అదీ పధ్ధతి బాగా క్లిక్ అయింది నాకిచ్చిన ఇంగ్లీష్ క్లాసులను ఇదే పద్ధతిలో చేశా .మంచి ఉత్సాహం వచ్చింది రెండు నెలల్లో గొప్ప మార్పు .ఏ మాత్రం క్రమ శిక్షణా రాహిత్య మైనా సహించే వాడిని కాను ..ఇలా జరిగి పోయింది కొద్దికాలం

               సశేషం –మీ –గబ్బిట.దుర్గా ప్రసాద్ -24-6-13- ఉయ్యూరు 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

1 Response to నా దారి తీరు -33 ఉయ్యూరు వచ్చిన నాలుగు నెలలకే బదిలీ –సంతానం గారి ట్రాన్స్ఫర్లు

  1. ప్రధానోపాధ్యాయులవారు టపా తెరచి అందరి బదిలీలూ మహదానందంగా sadistic pleasure తో ఇచ్చి టపాలో తన బదిలీ కూడా ఉండడం చూసి ముఖం మాడ్చుకొని కుప్పకూలడం నవ్వు తెప్పించింది!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.